RKumar Posted September 4, 2016 Posted September 4, 2016 Great hope with this Godavari districts lo max. uncovered areas will get water. Godavari & Krishna kinda Inka emanna cover kaani villages ki kooda irrigation & drinking water complete gaa ivvali before 2018.
sonykongara Posted May 20, 2017 Author Posted May 20, 2017 చింతలపూడి-2’కు త్వరలో టెండర్లు రూ.4,910 కోట్లతో మొత్తం పథకం విస్తరణ కృష్ణా జిల్లాలో మరింత ఆయకట్టుకు సాగునీరు అవకాశం రూ.291 కోట్ల విలువైన మూడు పనులు పాత గుత్తేదారులకే పాత పనుల్లో కలిపి ఉన్నందున ఈ నిర్ణయం ఈనాడు - అమరావతి చింతలపూడి ఎత్తిపోతల రెండో దశకు టెండర్లు పిలవాలని జలవనరులశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీరు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. తొలుత చింతలపూడి తొలిదశను రూ.1,701 కోట్లతో చేపట్టి టెండర్లు పిలిచి రెండు ప్యాకేజీలుగా సంబంధిత గుత్తేదారులకు అప్పచెప్పారు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తరించాలని, గోదావరి నీటిని సాగర్ ఎడమ కాలువతో అనుసంధానం చేసి కృష్ణా జిల్లాలోని మరింత ఆయకట్టుకు నీరందించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌లో అదనపు పనులు కూడా కలిపి రూ.4,909.80 కోట్లతో మొత్తం పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అప్పట్లో ఈ విస్తరణ పనుల్లో రూ.2500 కోట్ల వరకు పనులు నామినేషన్‌పై అప్పచెప్పేందుకు సాగిన ప్రయత్నాలను ఈనాడు వెలుగులోకి తీసుకువచ్చింది. ఆర్థికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. జలవనరులశాఖ అధికారులు అనేక పరిశీలనలు జరిపిన తర్వాత ఇందులో ఇప్పుడు కేవలం చాలా కొద్ది మొత్తం, పాత పనుల్లో కలిపి ఉన్న విస్తరణ పనుల మేరకు మాత్రమే నామినేషన్‌పై సంబంధిత గుత్తేదారుకు అప్పచెబుతూ మిగిలిన మొత్తం పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.291 కోట్ల విలువ చేసే మూడు పనులు మాత్రం పాత గుత్తేదారులకే అప్పచెబుతూ దాదాపు రూ.2900 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. * తొలిదశలో రూ.1202.618 కోట్ల విలువైన పనులు మెయిల్ గాయత్రి సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టారు. ఇందులో ఇంతవరకు రూ.374.70 కోట్ల పనులు పూర్తి చేశారు. * తొలిదశలో రూ.497.950 కోట్ల పనులు గాయత్రి ప్రాజెక్ట్సు లిమిటెడ్ చేపట్టగా అందులో రూ.97.34 కోట్ల విలువైన పని పూర్తయింది. * ప్రసుత్తం రెండో దశలో రూ.3,208.80 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నారు. * తాజా పనులను మొత్తం 11 విభాగాలుగా పేర్కొంటున్నారు. ఇందులో కేవలం 3 పనులు మాత్రమే ప్రస్తుత గుత్తేదారులకు అప్పచెప్పేందుకు వీలుగా ఉన్నాయి. మిగిలిన 8 పనులకు టెండర్లు పిలవనున్నారు. * ఇందులో పెరిగిన సామర్థ్యం మేరకు లీడింగ్ ఛానల్‌ను విస్తరించడం, ప్రస్తుతం లింకు కాలువ గట్లను విస్తరించడం, కట్టడాలు విస్తరించడం ఉన్నాయి. సున్నా నుంచి 68వ కిలోమీటరు వరకు ఈ పనులు విస్తరించాల్సి ఉంది. జల్లేరు విస్తరణకు మళ్లీ టెండర్లు చింతలపూడి తొలి దశలో 8 టీఎంసీల నిల్వతో జల్లేరు జలాశయం తవ్వకానికి రూ.196.922 కోట్లు అంచనాతో టెండర్లు పిలిచి గతంలోనే పనులు అప్పగించారు. అప్పట్లో గుత్తేదారు 4 శాతం తక్కువకే టెండర్లు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ జలాశయం సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీంతో జలాశయం నిర్మాణానికి రూ.459.94 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇంతవరకు భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ పనులకు రూ.1.94కోట్లే ఖర్చయింది. ఈ కారణంగా మొత్తం జలాశయం నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
sonykongara Posted June 1, 2017 Author Posted June 1, 2017 జూన్ మొదటి వారంలో ‘చింతలపూడి’ టెండర్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి మైలవరం, న్యూస్‌టుడే: చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశకు సంబంధించి రూ.2100 కోట్ల పనులకు జూన్ మొదటి వారంలోనే టెండర్లు పిలవనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. బుధవారం కృష్ణా జిల్లా మైలవరంలో ఆయన మాట్లాడుతూ.. 2018 జూన్ నాటికి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పథకం పూర్తయితే కృష్ణా జిల్లాలోని మైలవరం, తిరువూరు, నూజివీడు, నందిగామ, గన్నవరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగుతాయని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రూ.2300 కోట్లతో ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం అభినందిస్తున్నాయని అన్నారు. విశాఖ ప్రాంతంలోని 1.30 లక్షల ఎకరాలకు దాని ద్వారా సాగునీరందుతుందని తెలిపారు.
sonykongara Posted June 10, 2017 Author Posted June 10, 2017 చింతలపూడి రెండో దశకు టెండర్లు ఆహ్వానంఈనాడు, అమరావతి: చింతలపూడి రెండో దశకు జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించింది. ప్యాకేజి 3, ప్యాకేజి 4లుగా వీటిని విడగొట్టి టెండర్లు దాఖలు చేయాలని కోరింది. సుమారు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి నది వద్ద ప్రధాన పంపుహౌస్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ అంచనా వ్యయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలిసింది. మరో వారం తర్వాత తాజా అంచనాలు నవీకరిస్తారని సమాచారం. అలాగే రూ.1600 కోట్లతో రెండు పంపుహౌస్‌లు, 38 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణం, సివిల్ పనులు కలిపి ప్యాకేజి 4గా టెండర్లు పిలిచారు. జూన్ 20 వరకు గడువు ఇచ్చారు. 21న సాంకేతిక బిడ్ తెరుస్తారు. ఆ తర్వాత ఆర్థిక బిడ్ తెరిచి పనులు ఎవరికి దక్కేదీ ఖరారు చేస్తారు.
sonykongara Posted June 29, 2017 Author Posted June 29, 2017 చింతలపూడి రెండో దశ టెండర్లు త్వరలో ఖరారు రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ చెంతకు ప్రతిపాదనలు నాలుగో ప్యాకేజీలో పంపుహౌస్‌ల నిర్మాణం పనులు ఈనాడు - అమరావతి గోదావరి నుంచి 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన చింతలపూడి రెండో దశ టెండర్లు త్వరలో ఖరారు కానున్నాయి. ఈ పనుల్లో భాగంగా రెండు ప్యాకేజీలుగా జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్యాకేజీ-3లో రూ.675 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి వద్ద 4,800 క్యూసెక్కులు ఎత్తిపోసేలా పంపుహౌస్ నిర్మాణానికి, ప్యాకేజి-4లో పోలవరం కుడి కాలువ నుంచి ఇంతే మొత్తంలో నీటిని ఎత్తిపోసేలా రెండు పంపుహౌస్‌లతో పాటు కాలువ నిర్మాణానికి రూ.1608 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. మేఘ ఇంజినీరింగు ప్రయివేటు లిమిటెడ్, నవయుగ కంపెనీ ఈ టెండర్లలో పాల్గొన్నాయి. వాటి టెండరు ప్రతిపాదనలకు సంబంధించి జూన్ 22న సాంకేతిక బిడ్‌ను అధికారులు తెరిచారు. దాన్ని ఖరారు చేసేందుకు వాటి టెండరు ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి స్టాండింగు కమిటీకి పంపినట్లు ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్ ఈనాడుకు చెప్పారు. ఆ కమిటీ సంబంధిత గుత్తేదారు ఏజన్సీల సాంకేతిక అర్హతలను పరిశీలించాక సాంకేతిక బిడ్‌ను ఖరారు చేస్తుంది. నిజానికి తొలి ప్రతిపాదన ప్రకారం జూన్ 27న ఆర్థిక బిడ్ తెరిచి ఎవరికి పనులు అప్పగించేది తేల్చాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కమిటీ ఇంకా సాంకేతిక బిడ్‌ను ఖరారు చేయకపోవడంతో ఆర్థిక బిడ్‌ను తెరవలేదు. నాలుగో ప్యాకేజీలో పంపుహౌస్‌ల నిర్మాణంతో పాటు 68వ కిలోమీటరు నుంచి 106వ కిలోమీటరు వరకు ప్రధాన కాలువ తవ్వకం, కట్టడాల పనులు కలిపే ఉన్నాయి. పట్టిసీమ నుంచి రేపు పూర్తిస్థాయి నీటి విడుదల పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గురువారం పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. పట్టిసీమలోని మొత్తం 24 పంపులను పనిచేయించి 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నామని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం 20 పంపులతో 7,788 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా అది ప్రకాశం బ్యారేజికి చేరుతోంది. ఈ పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టా కాలువలకు నీటిని ఇవ్వగలుగుతున్నారు. పశ్చిమ కాలువ ద్వారా కూడా బుధవారం నీటిని విడుదల చేశారు. గోదావరిలో ప్రవాహాలు పెరగడంతో పాటు పూర్తిస్థాయి నీటిని ఇచ్చేందుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలకు మించి కృష్ణమ్మకు తరలించేలానే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.
RKumar Posted July 2, 2017 Posted July 2, 2017 Pattiseema laaga Polavaram, Chintalapudi, Purushottamapatnam & Uttarandhra srujala sravanthi fast gaa complete chesthe Coastal distrcits & indirect gaa rayalaseema ki benefit avuthundi. It will have huge impact in 2019 elections.
sonykongara Posted July 2, 2017 Author Posted July 2, 2017 మేఘ, నవయుగలకే చింతలపూడి-2 పనులు ఈనాడు,అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల రెండో దశ పనుల్లో రెండు ప్యాకేజీల పనులు విడివిడిగా రెండు గుత్తేదారు సంస్థలు దక్కించుకున్నాయి. మూడో ప్యాకేజి పనుల్లో మేఘ ఇంజినీరింగు కంపెనీ, నాలుగో ప్యాకేజీ పనుల్లో నవయుగ కంపెనీలు ఎల్1గా నిలిచాయి. ఆయా పనులు వారికే దక్కనున్నాయి. జూన్ నాలుగోవారంలో చింతలపూడి టెండర్లు తెరిచిన అధికారులు సాంకేతిక బిడ్ ఖరారు చేసేందుకు రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీకి నివేదించారు. బిడ్‌లో పాల్గొన్న మేఘ, నవయుగ కంపెనీలు రెండూ సాంకేతికంగా అర్హత దక్కించుకున్నాయి. దీంతో శనివారం ఆర్థిక బిడ్‌ను జలవనరులశాఖ అధికారులు తెరిచారు. రూ.652 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి వద్ద పంపుహౌస్ నిర్మాణానికి ప్యాకేజి 3గా టెండర్లు పిలిచారు. ఇందులో నవయుగ కంపెనీ 4.8శాతం అధికానికి, మేఘ ఇంజినీరింగు కంపెనీ 4.40శాతం అధికానికి టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్1గా నిలిచిన మేఘ కంపెనీకే ఈ పనులు దక్కనున్నాయి. రూ.1608 కోట్ల అంచనా వ్యయంతో పంపుహౌస్‌తో పాటు కాలువ తవ్వకం పనులకు ప్యాకేజి 4గా టెండర్లు పిలిచారు. ఇందులో మేఘ కంపెనీ 4.77 శాతం అధికానికి టెండర్లు దాఖలు చేసింది. నవయుగ కంపెనీ 4.49శాతం అధికానికి టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో నవయుగ ఎల్1గా నిలిచింది. దీంతో ఈ పనులు వీరికే దక్కనున్నాయి. త్వరలో అధికారులు ఒప్పందం కుదుర్చుకుని పనులు చేపట్టనున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now