ravindras Posted July 23, 2018 Posted July 23, 2018 8 hours ago, Kondepati said: polavaram kalava lo neelu poyadiniki chintalapudi ani peru endhuku inka evaro mahaanubaavulu cbn ni mislead chestunnaru. lekapothe cbn overthinking tho ilaantivi chestunnado teliyadu. polavaram coffer dam will be ready by 2018 may/june . ie polavaram rmc and lmc will get water through gravity by june 2019. what is the necessity of lifting water from guddigudem (chintalapaudi scheme) to polavaram rmc. cbn wasted 1600 crores on purushothampatnam lift irrigation scheme 3500 cusecs to lift water to polavaram lmc for one season. if he spend same amount on polavaram lmc, by this time polavaram lmc could get completed. basically cbn wants instant gratification .
katti Posted July 23, 2018 Posted July 23, 2018 (edited) 32 minutes ago, ravindras said: evaro mahaanubaavulu cbn ni mislead chestunnaru. lekapothe cbn overthinking tho ilaantivi chestunnado teliyadu. polavaram coffer dam will be ready by 2018 may/june . ie polavaram rmc and lmc will get water through gravity by june 2019. what is the necessity of lifting water from guddigudem (chintalapaudi scheme) to polavaram rmc. cbn wasted 1600 crores on purushothampatnam lift irrigation scheme 3500 cusecs to lift water to polavaram lmc for one season. if he spend same amount on polavaram lmc, by this time polavaram lmc could get completed. basically cbn wants instant gratification . akkada lift okkadanike kaadhu spend chesutunndhi... kaluva kosam kuda... lift is a small portion of the total... at the same time, Polavaram next year ki avvalani try chestunnaru... but next year avvuddi ani guarantee ledhu.. it all depends on centre... water ivvakapothe inka edipinchevallu emo... ippudu water istunnaru kabatti... vellani inka emi cheyyalemu ani works approve chestaru emo... Edited July 23, 2018 by katti
katti Posted July 23, 2018 Posted July 23, 2018 8 hours ago, Kondepati said: polavaram kalava lo neelu poyadiniki chintalapudi ani peru endhuku inka polavaram kaluva loki poyyatamu enti... this project was initiated primarily for giving water to metta areas around mylavaram, nuzvid etc... later vykuntapuram barrage tho Guntur/prakasam district ki water teesukuvallataniki polavaram kaluva loki kuda water teesukuvastunnaru... denilo mistake emundhi
AbbaiG Posted July 23, 2018 Posted July 23, 2018 I think lifting from RMC at guddigudem is temporary. Original design vere anukunta. But not sure
AbbaiG Posted July 23, 2018 Posted July 23, 2018 13 hours ago, sonykongara said: abbayi bro ,kastam antunadu eenadu vadu, ela jarugutunnayi works Lift avutundi emo 15th ki Summer lo aite November ki teesukostam to Nuziveedu area ane vaadu gaa Uma. Chintalapudi area land acquisition - big problem
sonykongara Posted August 8, 2018 Author Posted August 8, 2018 చింతలపూడి ఫేజ్-2 మరో ముందడుగు08-08-2018 06:45:35 చింతలపూడి: మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-2కు మరో ముందడుగు పడింది. మంగళవారం 230 మంది నిర్వాసిత రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం రూ.60 కోట్లు జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వాసిత రైతులు, ఆయకట్టు రైతుల ఆనందో త్సాహాలకు అవధులు లేకుండా ఉన్నాయి. చీపురుగూడెం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు బొట్టు రామ చంద్రరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చీకటి చెన్నారావు ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ -2 కాలువ నిర్మాణం కోసం మండ లంలోని చీపురుగూడెం, కోటపాడు, చిన్నంపేట, పర్వతాపురం, పోతనపల్లి, బూరగ్గూడెం, నరసింహారావుపాలెం గ్రామాల్లో 420 మంది రైతులకు చెందిన 611 ఎకరాల భూమి సేకరించారు. ఇందుకు రూ.107 కోట్లు నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. మిగతా రైతులకు కూడా వారం, పది రోజుల్లో చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం చీపురు గూడెం గ్రామానికి చెందిన రైతులు బొట్టు విజయచౌదరి, బొట్టు ప్రసాద్‌లను జలవ నరుల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, నూజివీడు ఆర్డీవో రంగయ్య, తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఒప్పించి అడ్వాన్స్ పొజిషన్ తీసుకుని కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. పోతనపల్లి గ్రామంలో రిటైర్డ్ ఏఎస్పీ శేషగిరిరావు, బండారుపల్లి రవి, మరికొందరు రైతులను ఒప్పించి అడ్వాన్స్ పొజిషన్ తీసుకుని పనులు జరిపిస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నష్టపరి హారం ఇచ్చిన తరువాతే కాలువ తవ్వుకోవాలని స్పష్టం చేయడంతో పనులు నత్తనడక నడుస్తు న్నాయి. నెలరోజుల క్రితం పర్వతాపురానికి చెందిన ఆరుగురు రైతులకు రూ.65 లక్షలు చెల్లించారు. తరువాత చెల్లింపులు లేకపోవడం తో నిర్వాసిత రైతులు ఆందోళన చెందారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో పంటలు వేయాలో? వేయకూడదో తేల్చుకో లేక రైతులు అయోమయంతో కొట్టు మిట్టాడు తున్నారు. 60 శాతం రైతులకు చెల్లింపులు జరగడంతో కాలువ తవ్వకం పనులు ఊపు నందుకోనున్నాయి. డిసెంబర్ నాటికి కాలువ తవ్వకం పనులు పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించ టానికి అధికారులు ముమ్మర కృషి చేస్తున్నారు.
raghu6 Posted August 22, 2018 Posted August 22, 2018 Documents submit cheyyandi with in 1 week lo ani deadline Pedithe kontha mandi Kastapadi Eluru vellaru documents submit cheyyataniki then marala taruvatha rammannaru Velithe ippudu kaadu marala eppudo cheptham ani antunnaru oka process ledu anukonta nd cheppindi cheyyakapoina ok and late ayina ok but ila rammani then pommani chepthe .... poeple think that it will not happen soon
sonykongara Posted September 4, 2018 Author Posted September 4, 2018 చిరకాల స్వప్నం.. పంటకు ప్రాణంచింతలపూడి ఎత్తిపోతల పథకంతో ఫలితంజిల్లాలో భూసేకరణ పూర్తిపశ్చిమకృష్ణా (తిరువూరు), న్యూస్‌టుడే * పథకం పేరు: చింతలపూడి ఎత్తిపోతల పథకం* నిర్మాణ వ్యయం: రూ.4,909.80 కోట్లు* ప్రస్తుత పరిస్థితి: ఫేజ్-2 పనులు జరుగుతున్నాయి* చేయాల్సింది: ఏడాదిన్నర గడువు లక్ష్యంగా నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికి ఏడాది పూర్తయింది. మరో ఆరు నెలల్లో పూర్తి చేసి సాగర్ కాలువల ద్వారా నీటిని పారించాల్సి ఉంది.* ప్రయోజనం: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు* కాలువ ప్రవహించే మార్గంలో 2 లక్షల మంది ప్రజలకు తాగునీరు* పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసే వీలు* పథక నిర్మాణం గడువు: 2019 చింతలపూడి ఎత్తిపోతల పథకం.. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రెండు జిల్లాల పరిధిలో సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారమే దీని లక్ష్యం.. పంటలకు ఊపిరులందించి.. అన్నదాత ఇంట సిరులు కురిపించడమే ఆశయం.. పథకం రెండో దశ నిర్మాణ పనులకు భూసేకరణ ప్రక్రియ కొంత అవరోధంగా మారింది. కృష్ణా జిల్లాలో సేకరణ పూర్తి చేయగా, పశ్చిమగోదావరి జిల్లాలో నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పెంచాలంటూ అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడిలో మంగళవారం జరిగే గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాలువ ప్రవహించే గ్రామాలు:జిల్లా: చీపురుగూడెం, కోటపాడు, గంటిపాడు బూరుగగూడెంలబ్ధిపొందే మండలాలు:పశ్చిమగోదావరి: గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, టి.నర్సాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, పెదవేగి, దెందులూరు, పెదపాడు,జిల్లాలో : చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ గ్రామీణం లాభించే అసెంబ్లీ నియోజకవర్గాలు:పశ్చిమగోదావరి: పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరుకృష్ణా జిల్లా: తిరువూరు, మైలవరం, గన్నవరం, నూజివీడు, నందిగామ పరిహారం కోసం నిరీక్షణరాష్ట్ర విభజన అనంతరం సాగర్ జలాల విడుదలపై నీలినీడలు కమ్ముకున్న దృష్ట్యా చింతలపూడి ఎత్తిపోతల పథకంతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మెట్ట, మాగాణి పంటలు సాగుకు నోచుకోనున్నాయి. ఈ పథకం ద్వారా పశ్చిమకృష్ణాకు ఎక్కువ లబ్ధి చేకూరటానికి అవకాశం ఉంది. చిరకాలస్వప్నం సాకారం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కాలువల విస్తరణ నిమిత్తం రైతుల నుంచి భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. జిల్లాలోని చాట్రాయి మండలం పర్వతాపురం, చీపురుగూడెం, కోటపాడు, పోతనపల్లి, బూరుగగూడెంలో 450 మంది రైతుల నుంచి 610 ఎకరాలను సేకరించారు. పరిహారం రూపంలో ఇప్పటి వరకు రూ.58.8 కోట్లు చెల్లించారు. మిగిలిన పరిహారం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. పరిహారం చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల రైతులు పనులను అడ్డుకోవడటం నిలిచాయి. అధికారులు చొరవ తీసుకొని 60 శాతం మేర పంపిణీ చేయడంతో శాంతించారు. ్ర పశ్చిమగోదావరి జిల్లాలో 11,700 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గుడ్డిగూడెం నుంచి ఎర్రగుంటపల్లి వరకు 80 శాతం భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఎర్రగుంటపల్లి నుంచి చింతలపూడి వరకు భూసేకరణ నిలిచింది. భూముల విలువను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తీసుకునేందుకు అక్కడివారు నిరాకరిస్తున్నారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడే పరిష్కారానికి నోచుకునేలా కన్పించడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమకృష్ణా పరిధిలో సాగర్ ఆయకట్టుకు ‘గోదావరి’ జలాలు అందాలంటే పశ్చిమగోదావరి జిల్లాలో భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. న్యాయ వివాదాలను పరిష్కారం చేసే దిశలో చర్చలు చేస్తున్నామని పథకం పర్యవేక్షిస్తున్న ఒక ఇంజినీరు చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తాము భూములు కోల్పోతున్న నేపథ్యంలో పరిహారం మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ భూములను ఇచ్చేది లేదంటూ భీష్మించారు. పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపినప్పటికీ ఫలప్రదం కాలేదు. భూసేకరణ పూర్తి చేస్తేనే వచ్చే ఏడాదికి గోదావరి జలాలను ఉభయ జిల్లాల్లో లక్ష్యం మేరకు అందించే అవకాశాలున్నాయి. గడువులోపు పూర్తయ్యేనా..?చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయడానికి ఏడాదిన్నర గడువు నిర్దేశించుకొని గత ఏడాది సెప్టెంబరు 7న ముఖ్యమంత్రి చంద్రబాబు విస్సన్నపేట సమీపంలోని మద్దులపర్వ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ నెల 7 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. కాలువల విస్తరణ, కరకట్టల పటిష్ఠం వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం మరో ఆరు నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి పశ్చిమకృష్ణాకు గోదావరి జలాలను విడుదల చేయాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ అవరోధంగా మారిన నేపథ్యంలో గడువుకు పథకం నిర్మాణ పనులను పూర్తి చేయడం ప్రశ్నార్థకంగా మారింది. పథక రూపకల్పన ఇలారెండు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో రూపకల్పన చేసిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రెండో విడతలో 6,875 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిలో 38 శతకోటి ఘనపుటడుగు (టీఎంసీ)ల నీటిని 90 రోజుల్లో తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. జల్లేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 8 టీఎంసీల సామర్థ్యం నుంచి 20 టీఎంసీలకు పెంచారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో కాలువ ప్రవహించే మార్గంలో ఉన్న 410 గ్రామాలకు చెందిన రెండు లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 వేల ఎకరాలు స్థిరీకరిస్తారు. అదనంగా రెండు లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. 14 కిలో మీటర్ల మేర లింక్ ఛానల్ తవ్వి వేంపాడు మేజర్ ద్వారా 117వ రెగ్యులేటర్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు జోన్-3 ఆయకట్టు పరిధిలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండు జిల్లాల పరిధిలో మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందటానికి అవకాశం ఉంది. వేంపాడు మేజర్‌ను 615 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి వెడల్పు చేయటం ద్వారా 2,930 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతున్నారు. గోదావరి జలాల మళ్లింపు ఇలా..* చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద మొదటి లిఫ్టు నిర్మించి 14 పంపులు ఏర్పాటు చేసి మూడు కిలోమీటర్లు పైపులైన్ ద్వారా 28 మీటర్లు నీళ్లు ఎత్తిపోసి కాలువకు మళ్లిస్తారు. * అక్కడి నుంచి 13.22 కిలోమీటర్లు ప్రవహించి గుడ్డిగూడెం చేరుతుంది. రెండో లిఫ్టు ద్వారా 14 పంపులతో 3.3 కిలోమీటర్లు పైపులైన్ ద్వారా 86 మీటర్లు ఎత్తులో ఈ పథకం నుంచి ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. * కాలువ దిగువకు చింతలపూడి వరకు ప్రవహించాక 85.15వ కిలోమీటరు చీపురుగూడెం గ్రామం వద్ద అనుసంధాన కాలువ ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వేంపాడు మేజర్‌కు మళ్లిస్తారు. * చింతలపూడి ప్రధాన కాలువ, వేంపాడు మేజర్‌ను అనుసంధానం చేసే కాలువ కాలువ పొడవు 14 కిలోమీటర్లు. వేంపాడు మేజర్ నుంచి 21వ ఎస్‌ఎప్‌పీ ప్రధాన ఎడమ ఉపకాలువ 117వ కిలోమీటరు వద్ద రెగ్యులేటర్‌కు నీళ్లు చేరతాయి. * అక్కడి నుంచి నూజివీడు బ్రాంచి, జమలాపురం మేజర్, మాచవరం మేజర్, జక్కంపూడి మేజర్, బాపులపాడు మేజర్, రేపూడి మేజర్-1, రేపూడి మేజర్-2, గానుగపాడు మేజర్, మైలవరం బ్రాంచి కాలువ ద్వారా పశ్చిమకృష్ణా పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
sonykongara Posted September 4, 2018 Author Posted September 4, 2018 నదుల అనుసంధానంలో మరో మేలిమలుపు! రెండో దశలో చింతలపూడి ఎత్తిపోతల వర్షాలతో మందకొడిగా పనులు సీఎం దృష్టి సారిస్తే సిరుల పంటలే నేడు జిల్లాకు రాకజీలుగుమిల్లి, న్యూస్‌టుడే ప్రశాంత వాతావరణానికి, పచ్చదనానికి పేరుగాంచిన ‘పశ్చిమ’ను పునీతం చేస్తూ కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు ‘చింతలపూడి ఎత్తిపోతల’ పథకం రూపుదిద్దారు. గోదారమ్మను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ చెంతకు చేర్చి రెండు నదుల అనుసంధానంతో ప్రపంచపటంలో నవ్యాంధ్రను చిరస్థాయిగా నిలిపి చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరోసారి చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. భూగర్భజలాలు ఇంకిపోయి దాహార్తితో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పథకం ద్వారా పశ్చిమ, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమకు కూడా ప్రయోజనం కలగనుంది. మొదటి దశ పూర్తయి... రెండో దశ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అయితే ఈ పనులు ఇటీవల వర్షాలు, ఇతర కారణాలతో కాస్త మందకొడిగా నడుస్తున్నాయి. వీటిని వచ్చే జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. పోలవరం పనులను పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రి వీటిపై కూడా దృష్టి పెడితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారనడంలో సందేహం లేదు. కాలువ పూర్తికావాలంటే...గతంలో ఎత్తిపోతల పథకం కాలువలను తవ్వే పనులను వేగవంతం చేసిన కంపెనీలు ప్రస్తుతం మందకొడిగా సాగిస్తున్నాయి. గాయత్రి కంపెనీ ఆధ్వర్యంలో కాలువ పనులు జరుగుతుండగా గట్లు ఎత్తుపెంచి పనులు చేయాలన్న ప్రతిపాదనలపై ఇప్పటికీ సరైన అనుమతి లేకపోవడంతో పనులు ముందుకుసాగడంలేదు. ఎక్కడికక్కడ కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కాలువ పొడవునా గట్లు జారి గోతులతో దర్శనమిస్తున్నాయి. ఇక కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయి వరదనీటితో నిండిపోయాయి. కాలువ వెంబడి పలుచోట్ల వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్నిచోట్ల చేపట్టాల్సి ఉంది. రూపుదిద్దుకోని లిప్ట్లుచింతలపూడి ఎత్తిపోతల పథకంలో నిర్మాణం చేస్తున్న లిప్ట్‌ల నిర్మాణాలు ఇప్పటికీ రూపుదిద్దుకోలేదు. ఈ పథకం కింద మొదటిలిప్ట్ పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలోని తాటిపూడి వద్ద గోదావరి నదిపై 14 పంపులతో ఏర్పాటుచేసి 3 కిలోమీటర్ల దూరం పైపుల ద్వారా 28 మీటర్లకు నీటిని ఎత్తిపోసి కాలువకు వదలనున్నారు. అక్కడి నుంచి 13.22 కిలోమీటర్లు కాలువ ద్వారా గుడ్డిగూడెం చేరుకుని ఇక్కడ రెండో లిప్ట్ 14 పంపులతో 3.3 కిలోమీటర్లు పొడవున పైపుల ద్వారా 86 మీటర్లు ఎత్తుకు నీటిని తోడి చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి పంపిస్తారు. మూడో లిప్ట్ రౌతుగూడెం వద్ద ఏర్పాటు చేసి అక్కడి నుంచి కాలువ దిగువకు చింతలపూడి వరకు వెళ్ళాక 82.15 కిలోమీటర్లు నుంచి లింకుకాలువ ద్వారా ఎన్‌ఎస్పీ వేంపాడు మేజర్‌కు అనుసంధానం చేస్తారు. మూడు లిప్ట్‌ల నిర్మాణ పనులను రూ. 650 కోట్లతో మెగా కంపెనీ, మరో రూ. 1,600 కోట్లతో నవయుగ, ఆర్వీఆర్ కంపెనీలు చేస్తున్నాయి. లిప్ట్‌లు ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. ఇప్పటికీ ఓ రూపును దాల్చలేదు. పూర్తయితే 4.80 లక్షల ఎకరాలకు సాగునీరుచింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రెండు జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. పథకం పూర్తయితే పశ్చిమతోపాటు కృష్ణా జిల్లాలోని సాగర్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందుతుంది. పశ్చిమ్లలో 2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుండగా కొవ్వాడ కాలువ ప్రాజెక్ట్ కింద ఉన్న 17 వేల ఎకరాలు, ఎర్రకాల్వ కింద 28 వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాలోని 25 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. కృష్ణా జిల్లాలో 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుండగా అందులో 2.10 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టుతో పాటు చిన్ననీటి పారుదల కింద ఉన్న మరో 70 వేల ఎకరాలకు కూడా నీరందనుంది. ఈ పథకం పనులు వేగం పుంజుకోవాల్సి ఉంది. రానున్న జూన్‌లోగా పనులు పూర్తి..చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రానున్న జూన్‌లోగా పూర్తిచేస్తాం. ప్రస్తుతం కాలువ పనులు ఎక్కడా ఆపలేదు. గట్లు ఎత్తుపెంచాలనే ప్రతిపాదనలు పూర్తికాగానే పనులను వేగవంతం చేస్తాం. ఇక లిప్ట్‌ల నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి. లిప్ట్‌లు పూర్తిచేసి పంపుసెట్లను అమర్చేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నాము. ప్రస్తుత వరదలు కారణంగా పనులు మందగించిన మాట వాస్తవమే. రానున్న సంవత్సరాల కాలంలో పథకం పూర్తిచేసి అన్నదాతలకు సాగునీరు అందిస్తాము. - రమేష్‌బాబు, ఎస్‌ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, విస్సన్నపేట, కృష్ణాజిల్లా.
sonykongara Posted September 19, 2018 Author Posted September 19, 2018 చింతలపూడిలో మేఘాకు అదనపు పనులు19-09-2018 07:11:03 రూ.563 కోట్ల కేటాయింపు జలవనరుల శాఖ నిర్ణయం అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకంలో రూ.563.401 కోట్ల మేర అదనపు పనులను పూర్తి చేసే బాధ్యతను మేఘా కాన్సార్టియంకు అప్పగిస్తూ జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రారంభంలో రూ.1701 కోట్లతో చేపట్టాలని 2008 అక్టోబరు 28న జలవనరుల శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ప్యాకేజీ-1 పనులను మేఘా ఇంజనీరింగ్ - గాయత్రి - జెడ్‌విఎస్ - ఐటీటీ కన్సార్టియం, రెండో ప్యాకేజీ పనులను గాయత్రి ప్రాజెక్ట్సుకు అప్పగించింది. అనంతరం .. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు రూ.4909.80 కోట్ల వ్యయం అవుతుందంటూ జల వనరుల శాఖ 2016లో అంచనాలు సవరించింది, దీనికి పాలనామోదం లభించింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో రూ.188.537 కోట్ల అదనపు పనులను చేయాల్సి ఉందని సంయుక్త కమిటీ (రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ, ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ) సిఫారసును జలవనరుల శాఖ ఆమోదించింది. ఈ పనులను ఒరిజినల్ అగ్రిమెంట్ మేరకు 4.8338 శాతం ఎక్కువకు ఇచ్చేందుకు జల వనరుల శాఖ సమ్మతించింది. దీంతో ప్యాకేజీ-2లో అదనంగా 188.537 కోట్ల రూపాయల పనులు గాయత్రి ప్రాజెక్ట్సుకు అప్పగించారు. అదేవిధంగా ప్యాకేజీ-1లో మేఘా ఇంజనీరింగ్ - గాయత్రి - జెడ్‌విఎస్ - ఐటీటీ కన్సార్టియంకు రూ.374.871 కోట్ల పనులను అదనంగా అప్పగిస్తూ జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది.
Bollu Posted October 10, 2018 Posted October 10, 2018 త్వరితగతిన చింతలపూడి పథకం పనులు జలవనరుల శాఖ మంత్రి ఉమా తాడిపూడి(తాళ్లపూడి), న్యూస్‌టుడే: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, అక్టోబరు మూడోవారంలో ఈ పంపుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు విడుదల చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. తాళ్లపూడి మండలంలోని తాడిపూడి వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉమా మంగళవారం పరిశీలించారు. పథకం పనులు, పంపులు, మోటార్లు, విద్యుత్తుపరివర్తకం తదితర ప్రాంతాలను ఆయన చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రైతులంతా సహకరించారన్నారు. మరో రెండు గ్రామాల రైతులకు నచ్చచెప్పి ఈ పథకం పనులను పూర్తి చేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 7లక్షల ఎకరాలను సాగునీరు అందించేందుకు దృష్టిసారించామన్నారు.2015లో పట్టిసీమ పథకం, 2016లో పురుషోత్తమపట్నం, 2017లో పురుషోత్తమపట్నం మొదటిదశలో నీరు, 2018లో చింతలపూడిని పూర్తి చేస్తామన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసి అంతా సస్యశ్యామలం చేస్తామన్నారు. గోదావరి వృథా జలాలను సద్వినియోగం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ ఎస్‌ఈలు రమేష్‌బాబు, వీరకుమార్, ఈఈ శంకరరావు, డీఈ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted October 25, 2018 Author Posted October 25, 2018 చింతలపూడి’ ట్రయల్ రన్ సక్సెస్25-10-2018 04:02:13 తాళ్ళపూడి అక్టోబరు 24: పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. రూ.580 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి సంబంధించిన స్టేజ్-1 వద్ద 4.65 మెగావాట్ల కెపాసిటీ గల పంపులు 14, ఏడు మెగావాట్ల సామర్ధ్యం కలిగిన నాలుగు మోటార్లు అమర్చాలి. ఈ పనులను చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదిక పనులు పూర్తి చేయాలని గట్టిగా ఆదేశించారు.
sonykongara Posted November 20, 2018 Author Posted November 20, 2018 (edited) eroju eenadu news Edited November 20, 2018 by sonykongara
Yaswanth526 Posted November 20, 2018 Posted November 20, 2018 12 hours ago, sonykongara said: eroju eenadu news
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now