Jump to content

miku power isthamu maku water ivvandi

sonykongara

Recommended Posts

రెంటిస్తాం.. నీళ్లిస్తారా?
10-08-2017 03:00:43

  • మహారాష్ట్రను కోరనున్న ఏపీ
  • 90 టీఎంసీలిస్తే 700 మెగావాట్లు ఇచ్చే యోచన
 
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ‘మీ రాష్ట్రానికి 700 మెగావాట్ల కరెంటు ఇస్తాం.. మాకు 90 టీఎంసీల కృష్ణా జలాలను ఇస్తారా’ అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఏపీ భావిస్తోంది. చాలా ప్రాంతాలు నీటికి ముఖం వాచిన ప్రస్తుత పరిస్థితుల్లో జలవనరుల శాఖ ఈ దిశగా ఆలోచిస్తోంది. 1970ల్లో నీటి కంటే కరెంటు విలువైంది. విద్యుదుత్పత్తికి కోట్లకు కోట్లు ఖర్చుచేసేవి. ఇప్పుడా పరిస్థితి తారుమారైంది.. కరెంటు కంటే సాగు-తాగునీటి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ‘తిండిగింజలు పండించకపోతే బతకలేం. ప్రస్తు తం ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీటిని రప్పించడంపై ఆలోచిస్తున్నాం. దీనిలో భాగంగా 1973లో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేశాం. మహారాష్ట్రలోని కొయినా జల విద్యుత్కేంద్రానికి 67 టీఎంసీలు, టాటా జల విద్యుత్కేంద్రానికి 23 టీఎంసీల కేటాయింపును పరిశీలించాం.
 
కొయినా విద్యుత్కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయ్యాక పశ్చిమ కనుమల నుంచి 67 టీఎంసీల జలాలు వృథాగా అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. టాటా విద్యుత్కేంద్రం నుంచి కూడా 23 టీఎంసీలు వెళ్లిపోతున్నాయి. మార్గమధ్యంలో ఇవి ఒక్క ఎకరా సాగుకు కూడా ఉపయోగపడడం లేదు. ఇంత పెద్దఎత్తున జలాలు సముద్రంలోకి వృథాగా పోవడం బాధాకరం. అప్పట్లో కరెంటు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో.. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఏకంగా ఈ రెండు ప్రాజెక్టులకూ 90 టీఎంసీలు కేటాయించింది. ఇప్పుడీ 90 టీఎంసీల నీటిని రాష్ట్రానికి రప్పిస్తే.. ఏకంగా 9 లక్షల ఎకరాలను మాగాణిగా మార్చేయవచ్చు. అందుకు బదులుగా 700 టీఎంసీలను మహారాష్ట్రకు ఇవ్వాలి’ అని జల వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశారు.
 
ఇంకో ప్రత్యామ్నాయం..
కరెంటుకు నీరు ప్రతిపాదన ఫలప్రదం కాకుంటే ఏం చేయాలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కొయినా, టాటా విద్యుత్కేంద్రాల నుంచి నీరు వృథాగా పోతున్న విషయాన్ని ప్రస్తావించి.. ఆ నీటిని దిగువ రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే.. రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది.
Link to comment
Share on other sites

Oka sàri watwr release avagane mukkodu tune marchestadu... nikrushtudu vadu.. frst 2 yrs lo attage sagar lo water tg side canal nunchi full lqagesadu.. vadi mentality entha daridramainadhi ante... tg ki aa water use cheskune avakasam lekapoina.. kindaki vadilte babu gariki ekkada manchi peru vachestundo ane edupu tho water block or use chesestadu.. vadini nammithe adukkutinali..

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
వరద వస్తేనే వదులుతారా?
12-09-2017 03:26:48
 
636407836244803355.jpg
  • మీ తీరు దారుణం.. తీవ్ర అన్యాయం
  • దుర్భిక్షంలో ఉన్నా.. కిందకు నీళ్లొదలరా?
  • మీకు కరెంటిస్తాం.. మాకు నీరివ్వండి
  • మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు బాబు లేఖలు
  • దిగువకు నీరందేలా జోక్యం చేసుకోండి
  • ప్రధాని మోదీకి మరో అభ్యర్థన లేఖ
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వరదలు వచ్చినప్పుడు మాత్రమే మహారాష్ట్ర, కర్ణాటకలు నీటిని కిందకు వదులుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇవి తమ ప్రాజెక్టులన్నిటినీ నీటితో నింపుకొని దిగువ రాష్ట్రాలు దాహంతో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని వాపోతున్నారు. కృష్ణా జలాల విడుదల కోసం ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలకు లేఖలు రాస్తున్నారు. విషయంలో జోక్యంచేసుకుని..దామాషా పద్ధతిలో నీరు వదిలేలా చూడాలని దిగువ రాష్ట్రాల నీటి కష్టాలు తీర్చాలని ప్రధాని మోదీని మరో లేఖలో అభ్యర్థించనున్నారు. ‘ఎగువ రాష్ట్రాలు దామాషా మేరకు దిగువ రాష్ట్రాలకు దామాషా మేరకు నీటిని విడుదల చేయడంపై దృష్టి సారించండి. కృష్ణా పరివాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాల్లో వర్షాభావం నెలకొంది.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు అడుగంటాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటకలలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయి. దిగువ రాష్ట్రాలేమో నీరు లేక అలమటిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రాలు మానవత్వం చూపడం లేదు. తమకు వరదలు వచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతున్నాయి. ఇది అన్యాయం. దారుణం. దీనిపై స్పందించండి’ అని ప్రధానిని కోరనున్నారు.
 
మా ప్రాజెక్టులు ఎండుతున్నాయి..
‘మా రాష్ట్రం సాగు, తాగు నీటికి కటకటలాడుతోంది. వర్షాభావంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. ఎగువన మీకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నాయి. ఇక ఏమాత్రం వరద వచ్చినా తట్టుకోలేని స్థితిలో కర్ణాటకలోని సాగు నీటి పథకాలున్నాయి. ఎగువన ఇలాంటి పరిస్థితి ఉంటే .. దిగువన ఉన్న మేం నీటి కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాం. అయినా మీలో ఏమాత్రం మానవీయ కోణం కనిపించడం లేదు.
 
దిగువ రాష్ట్రాల పట్ల కాస్త కరుణ చూపండి. వరదలొచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతామనడం సరికాదు. అది అన్యాయం. నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణకు నీరిచ్చి మానవత్వాన్ని చాటుకోండి’ అంటూ కర్ణాటక సీఎంకు చంద్రబాబు లేఖ సిద్ధం చేశారు. సీఎం కార్యాలయం నేడో రేపో ఈ లేఖను సిద్ధరామయ్యకు పంపనుంది. ‘దిగువన మేం నీటి కొరతతో సతమతమవుతుంటే.. మహారాష్ట్రలోని కొయినా, టాటా విద్యుత్కేంద్రాల ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఏకంగా 94 టీఎంసీలను అరేబియా సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారు. ఇది సముచితం కాదు. కొయినా, టాటా కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ అంతా ఏపీ నుంచి మీకు అందిస్తాం. ఆ 94 టీఎంసీలను మాకివ్వండి’ అని మహారాష్ట్ర సీఎంను ఉద్దేశించి మరో లేఖను సిద్ధం చేశారు. నేడో రేపో నిర్ణయం తీసుకుని ఫడణవీ్‌సకు పంపనున్నారు. ఈ లేఖలపై ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

Vaallu ventanee Respond avvali. Maharastra aeithe double quick ga Respond avvali.

Link to comment
Share on other sites

Mundu AP control lo vunna Srisailam nunchi power peru cheppi dongathanam ga water kindaki release chesthundi TG without AP permission. Adi choodandi nidra pothunnara Srisailam lo AP officers. Same when AP trying from Sagar TG police stopped AP releasing water.

Ippudu AP kosam manam MH/KA ni water adigithe adi kooda ee TG dongathanam ga todukupothundi Jurala, Srisailam & Sagar lo.

Link to comment
Share on other sites

Oka sàri watwr release avagane mukkodu tune marchestadu... nikrushtudu vadu.. frst 2 yrs lo attage sagar lo water tg side canal nunchi full lqagesadu.. vadi mentality entha daridramainadhi ante... tg ki aa water use cheskune avakasam lekapoina.. kindaki vadilte babu gariki ekkada manchi peru vachestundo ane edupu tho water block or use chesestadu.. vadini nammithe adukkutinali..

Better, sagar dependency ni complete ha cut chesukuney plan eskovali..... Godavari water ni divert cheyyali as much as possible. Srisailam nunchi vachindi vachinattu seema ki ivvali.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...