Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
  • 2 weeks later...
ఎన్‌హెచ్‌ నోటీసులతో యాక్షన్‌లోకి సోమా
07-11-2017 07:23:57
 
636456362384811318.jpg
 
  •  మార్చి నాటికి అటు , ఇటుగా పనుల పూర్తికి అంతర్గత డెడ్‌లైన్‌
  •  క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉన్నత స్థాయి ప్రతినిధుల కార్యాచరణ ప్రణాళిక
  •  కొండంత పనులుమిగిలే ఉన్నాయి.. ఆచరణలో సాధ్యమేనా?
 (ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గా ఫ్లైఓవర్‌ పనులను వేగవంతం చేయడానికి విజయవాడలోని ఆ సంస్థ సిబ్బందికి కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించినట్టు సమాచారం. నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయలేని కాంట్రాక్టు సంస్థలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయరహదారుల సంస్థలు కొరడా ఝుళిపించటానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం ఆంధ్రజ్యోతి ప్రధానసంచికలో ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో, సోమా సంస్థ యాక్షన్‌లోకి రావటం విశేషం. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ఈ ఏడాది జూన్‌ నాటికే పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం యాభైశాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. బ్యాలెన్స్‌ పనులకు సంబంధించి ప్రధానంగా పిల్లర్లపై స్పాన్స్‌ బిగించటం అన్నది కాలాతీతమైనది కాబట్టి.. ఈ పనులలో వేగం పెంచటం ద్వారా అనుకున్న లక్ష్యానికి చేరువ కావచ్చని ఆ సంస్థ భావిస్తోంది. స్పాన్స్‌ పని పూర్తి చేస్తే.. వింగ్స్‌ పనులను త్వరగా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వింగ్స్‌కు సంబంధించి చూస్తే ఇంకా మూడొంతుల వరకు తయారు చేయాల్సి ఉంది. స్పాన్స్‌ను క్యాస్టింగ్‌ డిపో నుంచి పూర్తిగా తరలించి వాటి పిల్లర్ల మీద బిగించటం పూర్తి చేసే నాటికి బ్యాలెన్స్‌ వింగ్స్‌ పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగినట్టు సమాచారం. వాస్తవంగా చూస్తే.. కాంట్రాక్టు సంస్థ ఇప్పటి వరకు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిందనే చెప్పాలి. రోడ్డు పోర్షన్‌ పనులను వారం రోజులలో పూర్తి చేయవచ్చు కానీ, వింగ్స్‌ తయారు చేయటం అంటే అషామాషీ కాదు. ఇంకా 1100 కు పైగా వింగ్స్‌ను కాంట్రాక్టు సంస్థ తయారు చేయాల్సి ఉంది. వీటితో పాటు వాటర్‌ వర్క్స్‌ నుంచి బాటిల్‌ నెక్‌ మీదుగా బొడ్డురాయి వరకు వెళ్లే ఫ్లై ఓవర్‌ ప్రాంతంలో వై షేపులో వింగ్స్‌ను తయారు చేయాల్సి ఉంది. ఇటీవల వీటి డిజైన్లకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. వీటికి సంబంధించిన వింగ్స్‌ తయారు చేయటానికి షట్టర్స్‌ను తయారు చేయించాల్సి ఉంది. ఈ షట్టర్స్‌ పూర్తయ్యి చేతికి వచ్చిన తర్వాతే .. క్యాస్టింగ్‌ డిపోలో వై షేప్‌ వింగ్స్‌ తయారు చేయటానికి అవకాశం ఉంటుంది. వీటిని తయారు చేయటానికి కూడా సమయాభావం పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి పనులు పూర్తయ్యే వరకు స్కిల్డ్‌వర్కర్స్‌ అవసరం ఉంది. సోమా దగ్గర పూర్తిస్థాయిలో స్కిల్డ్‌ వర్కర్స్‌ లేరు. ఇప్పుడున్న వర్కర్స్‌ సంఖ్య కూడా మరింత పెంచాల్సి ఉంది. వీటితో పాటు ఫ్లై ఓవర్‌ బ్యాలెన్స్‌ పనులను కూడా సమాంతరంగా చేపట్టాల్సి ఉంటేనే గడువుకు కాస్త అటు, ఇటు సాధ్యమౌతుంది. బ్యాలెన్స్‌ పనులకు సంబంధించి చూస్తే కృష్ణా కెనాల్‌లో మిగిలిన రెండు పిల్లర్లు, ఆరు పిల్లర్‌ క్యాప్స్‌ , పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మునిసిపల్‌ కార్పొరేషన్‌ దగ్గర ఏర్పాటు చేసిన సబ్‌వేకు అనుసంధానంగా నిర్మించాల్సిన అప్రోచ్‌ను పూర్తి గోడగా కాకుండా... పిల్లర్లతోనే శ్లాబ్‌వేయాలని సీఎం చంద్రబాబు గతంలో సూచించారు. దీనికి అనుగుణంగా రూపొందించిన డిజైన్లకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోవాలి. ఆ పనులను కూడా సమాంతరంగా ప్రారంభించాల్సి ఉంది.
 
ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఇలా చేస్తే..
దుర్గగుడి మీదుగా ట్రాఫిక్‌ను వదలవద్దని కాంట్రాక్టు సంస్థ, వదలకుండా ఎన్నాళ్లు ఉంచగలమని పోలీసులు ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మధ్యే మార్గంగా ఒక పరిష్కారం కన పడుతోంది. ఇటీవల ప్రజలే ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చారు. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వరకు పార్‌ బ్రిడ్జి ఉంది. ఇక్కడి నుంచి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ లోపలి నుంచి ఉన్న రోడ్డు మీదుగా వాహనాలను డైవర్షన్‌ చేస్తే.. కుమ్మరిపాలెం సెంటర్‌ వరకు సమస్యే ఉండదు. ఈ ఆలోచనను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అమలు చేస్తే అటు కాంట్రాక్టు సంస్థకు, ఇటు ట్రాఫిక్‌ పోలీసులకు కూడా సమస్యే ఉండదు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అదనపు నిధులు మీరే ఇవ్వండి..! 
కేంద్రానికి మరోసారి ర.భ. లేఖ 
కనకదుర్గ పైవంతెన నిర్మాణంపై ప్రభావం 
ఈనాడు, అమరావతి 
kri-top2a.jpg

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన కనకదుర్గ పైవంతెనకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. కేంద్రం 75శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు ఖర్చు చేసింది. కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. బిల్లులు ఇవ్వడం లేదు. ఈ ప్రభావం ప్రాజెక్టు పై పడుతోంది. అదనపు నిధులు మంజూరు చేయాలని, గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం విశేషం. ముందస్తు సొమ్ములు కాదు కదా.. బిల్లులు చెల్లించేందుకు కూడా కేంద్రం జాప్యం చేస్తోంది. మరోవైపు నిర్మాణంలో మార్పులకు అయ్యే అదనపు నిధులకు సంబంధించిన దస్త్రం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, తిరిగి మళ్లీ కేంద్రానికి చక్కర్లు కొడుతోంది. కేంద్రమే భరించాలని మరోసారి దస్త్రాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపారు.

పైవంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీని వల్ల విజయవాడపై ట్రాఫిక్‌ సమస్య భారం పెరిగింది. వాహనాల మళ్లింపు సమస్యగా ఉంది. మరోవైపు బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం చేపట్టడం ఇబ్బందిగా మారింది.

* పైవంతెన నిర్మాణం పూర్తి కావాలంటే అదనంగా కార్మికులను, నైపుణ్యం ఉన్న పనివారులు, యంత్రాలు కావాలి. వీటిని దిల్లీ నుంచి తీసుకురావాల్సి ఉంది. దీనికి నిధులు కావాల్సి ఉంది. 
* ఇటీవల గుత్త సంస్థ రూ.20 కోట్లు కావాలని లేఖ రాసింది. దానికి కేంద్రం నుంచి స్పందన లేదు. ఇప్పటికి మొత్తం 15 స్పాన్‌లు పూర్తయ్యాయి. వింగ్స్‌ కూడా పూర్తి చేశారు. వచ్చే నెలాఖరుకు మొత్తం 23 స్పాన్‌లు, వింగ్స్‌ పూర్తి కావాల్సి ఉంది. ఒక్క స్పాన్‌కు రూ.2కోట్లు ఖర్చు అవుతోంది. 
* మొత్తం 23 స్పాన్‌లకు దాదాపు రూ.46 కోట్లు వరకు కావాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించాలని ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ కూడా సిఫార్సు చేసింది. పర్యవేక్షణ ఏజెన్సీ ర.భ. శాఖ లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో గుత్త సంస్థ డీలాపడింది. 
* కేంద్రానికి సంబంధించిన నిధులను బెంగళూరులో ఉన్న కేంద్ర చెల్లింపులు, గణాంక కార్యాలయం(పీఏఓ) నుంచి జరపాల్సి ఉంటుంది. విజయవాడలో ఉన్న ప్రాంతీయ ప్రతినిధి బిల్లులను బెంగళూరుకు పంపిస్తారు. అక్కడి నుంచి గుత్తేదారుకు మంజూరు కావాల్సి ఉంటుంది. కానీ సకాలంలో బిల్లులు పంపినా మంజూరు చేయకుండా నిలిపివేయడంతో గుత్తేదారు సైతం పనులు నామమాత్రంగా చేస్తున్నారు. 
* రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి పైవంతెనకు రూ.114.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్లు చెల్లింపులు జరిపింది. ఈ పైవంతెన పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ఇంత వరకు రూ.150 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లులు మంజూరు అయ్యాయి. రాష్ట్రం తన పరిధికి మించి వెచ్చించింది. 
* పైవంతెనలో కొన్ని ఆకృతులను మార్చారు. పిల్లర్లు అదనంగా నిర్మించాల్సి వచ్చింది. దీనిపై కేంద్రానికి లేఖ రాసినా తిరస్కరించింది. ఈ అదనపు వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రం పంపితే తిరస్కరించి మరోసారి కేంద్రానికి లేఖ పంపమని ఉన్నతాధికారులు సూచించడంతో మళ్లీ పంపారు. 
* వీఎంసీ అండర్‌పాస్‌లో ఆకృతులు మార్చుతూ కొత్తగా ప్రతిపాదనలను రూపొందించారు. దీనికి దాదాపు రూ.19కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వీటిని కేంద్రానికి సమర్పించగా డీవియేషన్‌కు తమకు సంబంధం లేదని తిరస్కరించారు. మళ్లీ తిరిగి కేంద్రానికి దస్త్రం పంపారు. 
* నిర్మాణంలో భాగంగా సబ్‌స్టేషన్‌ తొలగించాల్సి వచ్చింది. దీనికి రూ.4.75 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రానికి ప్రతిపాదించగా తమకు సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సూచించారు. దీంతో ఈ నిధులు ర.భ.పైనే భారం పడ్డాయి. ‌్ర కాలువల్లో, కృష్ణా నదిలో నిర్మాణం చేసే పిల్లర్ల ఆకృతులు, వయాడక్టు వద్ద నిర్మాణం చేసే పిల్లర్ల ఆకృతులను మార్చడంతో కన్సల్టెన్సీలకు అధనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ భారం రాష్ట్ర ప్రభుత్వానిదే కావడం విశేషం. 
* తొలిసారిగా నిర్మాణం చేస్తున్న ఆరువరసల పైవంతెన పటిష్టంగా ఉండాలని పలు కోణాల్లో చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రీప్యాబ్రికేటెడ్‌ తరహాలో స్పాన్లు, పైంతెన పార్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని కోసం గొల్లపూడి వద్ద ఏర్పాటు చేసిన యార్డులో తయారు చేస్తున్నారు. వీటి రవాణాకు అదనంగా ఖర్చు అవుతున్నా గుత్త సంస్థ భరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. 
* మరోవైపు కనీసం డిసెంబరు 31 నాటికి 23వ పిల్లర్‌ వరకు పైవంతెన స్లాబ్‌ పోర్షన్‌ పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి కనకదుర్గ దేవాలయం నుంచి కుమ్మరిపాలెం వరకు ట్రాఫిక్‌ విడుదల చేయాలని భావిస్తున్నారు. 
* గడువులోగా పూర్తి చేయాలని, జనవరి నుంచి ట్రాఫిక్‌ విడుదలకు పట్టుదలతో కృషి చేస్తున్నామని రహదారులు-భవనాలశాఖ ఎస్‌ఈ జాన్‌మోషే ‘ఈనాడు’తో అన్నారు.

Link to comment
Share on other sites

కొంచెం స్పీడ్‌గా..సోమా
28-11-2017 08:53:36
 
636474560172133873.jpg
సుదీర్ఘకాలం తర్వాత వేగంగా పనులు
ఇలాగైతే మార్చి నాటికి పూర్తి అనుమానమే
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు సంబంధించి సుదీర్ఘకాలం తర్వాత స్వల్పంగా పనులు స్పీడ్‌ అందుకున్నాయి. ఇదే వేగంతో పనులు జరిగినా మార్చి నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు. మార్చి నాటికి కుమ్మరిపాలెం నుంచి దుర్గగుడి మలుపు వరకు మేజర్‌ బిట్‌ పూర్తి చేసి కింద హైవే మీద ట్రాఫిక్‌ను వదలటానికి వీలుగా పనులు చేపట్టాలని సోమా సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వర్కర్ల సంఖ్యను మరో 100 పెంచింది. నెలకు నాలుగు స్పాన్స్‌ను మాత్రమే పిల్లర్‌ క్యాపుల మీద అమర్చగలుగుతోంది. ఇప్పటి వరకు చూస్తే పిల్లర్‌ క్యాప్స్‌ మీద 13 స్పాన్స్‌ను బిగించటం జరిగింది. ప్రస్తుతం పద్నాల్గవ స్పాన్‌ బిగింపు పనులు జరుగుతున్నాయి. స్పాన్స్‌ పనుల విషయంలో కాంట్రాక్టు సంస్థ ఇబ్బందులు పడకున్నా.. ఈ స్పాన్స్‌కు వింగ్స్‌ను అమర్చటంలో మాత్రం ఇబ్బందులు పడుతోంది. గతంలో మెట్రో ఫ్లైఓవర్‌కు సంబంధించి వింగ్స్‌ అమర్చిన అనుభవం ఉన్నా.. ఇక్కడ భారీ స్థాయిలో ఉండే వింగ్స్‌ను అమర్చటంలో మాత్రం ఈ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దుర్గగుడి మలుపు నుంచి కృష్ణానదిలోని పిల్లర్ల మీద స్పాన్స్‌, వింగ్స్‌ అమర్చాల్సి ఉంటుంది కాబట్టి.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉండే అవకాశం లేవు. మళ్ళీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కెనాల్‌ మీదగా కార్పొరేషన్‌ కార్యాలయం సబ్‌వేకు అనుసంధానమై కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ పనులకు పెద ్దగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చని సోమా సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.
 
కేంద్రం నుంచి నిర్ధేశిత పనుల మేరకు నిధులు
కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ధేశిత సమయంలోనే నిధులు వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక చెల్లింపుల విషయానికి వస్తే .. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ ప్రకారం రూ.280 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి రూ.140 కోట్ల మేర పనులు చేసింది. బిల్లులు సమర్పించిన ప్రకారం రూ.120 కోట్ల చెల్లింపు జరిగాయి. ఇంకా రూ. 20 కోట్ల మేర బ్యాలెన్స్‌ మిగిలి ఉంది. అయితే నిర్దేశిత క్రమంలో పనులు పూర్తి చేస్తే ఈ డబ్బులు కూడా వెంటనే మంజూరయ్యే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
23 minutes ago, sonykongara said:

స్పాన్స్‌ పనుల విషయంలో కాంట్రాక్టు సంస్థ ఇబ్బందులు పడకున్నా.. ఈ స్పాన్స్‌కు వింగ్స్‌ను అమర్చటంలో మాత్రం ఇబ్బందులు పడుతోంది. గతంలో మెట్రో ఫ్లైఓవర్‌కు సంబంధించి వింగ్స్‌ అమర్చిన అనుభవం ఉన్నా.. ఇక్కడ భారీ స్థాయిలో ఉండే వింగ్స్‌ను అమర్చటంలో మాత్రం ఈ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది

:blink:

safe ga kattura rey soma

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...