Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

Guest Urban Legend

Varni,emayyindhi soma ki

Anni eppati nuncho telling ga SOMA financial position very bad

Link to comment
Share on other sites

  • Replies 685
  • Created
  • Last Reply
Guest Urban Legend

vadiki 10crores extra ichina complete cheyyadu

vadini nammi 10cr istham complete it ani mundhuku velthey avvadhu pani

scrap him

Link to comment
Share on other sites

Y can't govt cancel there contract as they are unable to meet deadlines nd give contract to another company with fixed deadlines

in theory this is the best thing. but in reality... new contractor ni teesuku ravatam ante it costs money and time..

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఆటంకం! 

కనకదుర్గ పైవంతెన స్తంభాల నిర్మాణానికి... సాగునీరు ఆపితేనే పునాదులు 

ఈనాడు, అమరావతి 

kri-top1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కనకదుర్గ పైవంతెన నిర్మాణం తీవ్ర జాప్యం అవుతోంది. ఇంకా పలు నిర్మాణాల ఆకృతులు ఖరారు కాలేదని తెలిసింది. దీనిపై మల్లాగుల్లాలు పడుతున్నారు. మరికొన్ని నిధులు అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు గుత్త సంస్థ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో లక్ష్యం మేరకు పురోగతి సాధించడం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గడువుల మీద గడువులు కోరుతూ గుత్త సంస్థ వాయిదాలు వేస్తోంది.

గతేడాది ఆగస్టు నాటికే పైవంతెన అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుత్త సంస్థకు అప్పగించారు. కనీసం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. గత కలెక్టరు బాబు.ఎ ప్రారంభ ముహూర్తం అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుత కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సమీక్షించి ఎట్టకేలకు అక్టోబరు 2న మహ్మాత గాంధీ జయంతి రోజును ముహూర్తంగా నిర్ణయించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఆర్వీ అసోసియేట్స్‌ కన్సల్టెంట్‌గా ఉంది. రహదారులు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. 15 రోజులకు ఒకసారి కలెక్టర్‌, తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై సమీక్షిస్తున్నారు. అయినా పురోగతి లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో కాలువలకు నీరు విడుదల చేశారు. దీంతో కాలువల్లో నిర్మాణం చేయాల్సిన పైవంతెన పిల్లర్లకు పునాదులు నిలిచిపోయినట్లేనని అధికారులు తేటతెల్లం చేశారు. మరోవైపు వయాడక్టు ఆకృతులు ఖరారు కాలేదు. అదనపు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పైవంతెన పూర్తయితేనే నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది. ఈ రహదారి నిర్మాణం కోసం ఆక్రమణల తొలగింపు, భూసేకరణ ఎంత వేగంగా జరిగిందో.. నిర్మాణం అంతగా జాప్యం అవుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి ‘ఈనాడు’ సేకరించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంత నెమ్మదిగానా..? 

రాష్ట్రంలో తొలిసారిగా కనకదుర్గ పైవంతెన ఐకానిక్‌గా ఆరు వరసలతో నిర్మాణం చేయాలని తలపెట్టారు. చెన్నై-హైదరాబాద్‌-ఛత్తీస్‌గడ్‌ జాతీయ రహదారులను అనుసంధానం చేసే ప్రధాన రహదారి ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి దుర్గగుడి మీదుగా వెళ్తుంది. గతంలో ఈ రహదారి ఇరుకుగా ఉండేది. దీంతో భద్రాచలం, హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకునేవి. దీంతో ఇక్కడ నాలుగు వరసల రోడ్డును నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. భారీ వాహనాలకు ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా నేరుగా వెళ్లేందుకు పైవంతెన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్యాకేజీల మొత్తం రూ.430 కోట్లు. రోడ్డు ఐదు కి.మీ నాలుగు వరసలు, 2.5 కి.మీ పైవంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. వాస్తవానికి గత పుష్కరాల నాటికే నాలుగు వరసల రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. పైవంతెన స్తంభాలు 47 నిర్మాణం చేయాల్సి ఉండగా 35 పూర్తయ్యాయి. 12 పునాదుల దశలో ఉన్నాయి. పైవంతెన స్లాబ్‌ సెగ్మెంట్‌లను ముందుగానే గొల్లపూడిలో ప్రీకాస్టింగ్‌ చేసి బిగించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు సెగ్మెంటు పూర్తయ్యాయి. అండర్‌పాస్‌లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద, దుర్గగుడి వద్ద, కృష్ణలంక వద్ద నిర్మాణం చేయాలి. కృష్ణలంక వద్ద అండర్‌ పాస్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఒకవైపు నుంచి ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు. అప్రోచ్‌ రోడ్డు ఎత్తు పెంచుతున్నారు. దీని కోసం ఇసుక మట్టి నింపుతున్నారు. మరోవైపు రోడ్డు వేయాల్సి ఉంది.

ఆకృతులు రావాల్సి ఉంది..! 

జాతీయ రహదారికి మొత్తం మూడు ప్రాంతాల్లో అండర్‌ పాస్‌ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఒకటి కృష్ణలంక వద్ద, రెండు మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నిర్మాణం చేయాల్సి ఉంది. కృష్ణలంక వద్ద అండర్‌పాస్‌ ఎత్తు పెంచాల్సి రావడంతో నిధుల సమస్య ఎదురైంది. ఇక్కడ ఎత్తుగా రహదారి వేయాల్సి రావడంతో గుత్త సంస్థ మొదట వ్యతిరేకించింది. అధికారులు ఒత్తిడి చేయడంతో పుష్కరాలకు నిర్మాణం పూర్తి చేయాల్సిన అండర్‌పాస్‌ ఇటీవల పూర్తయింది. రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్మాణం చేయాల్సిన అండర్‌పాస్‌లు అప్రోచ్‌ రోడ్డులో కలిసిపోనున్నాయి. దీనికి ఇక్కడ కాలువ వరకు గోడ నిర్మాణం చేయాల్సి ఉండగా దాన్ని మార్చి వయాడక్టు తరహాలో పిల్లర్లతో కట్టాలని ఆకృతులు మార్చి కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి రూ.19కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ప్రతిపాదించారు. మొదట ప్రతిపాదించిన ఆకృతుల ప్రకారం నిర్మాణం చేయాల్సి ఉందని, అదనపు చెల్లింపులు అనవసరమని అభిప్రాయపడింది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...