Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 685
  • Created
  • Last Reply
కేంద్రం కొర్రీలు! 
 

కనకదుర్గ పైవంతెన బిల్లుల చెల్లింపులో జాప్యం 
పనులు ఆగుతూ... సాగుతూ..! 
తిరిగి వెళ్లిన కార్మికులు.. నెమ్మదించిన పనులు 
మరో నెల పెరిగిన గడువు 
ఈనాడు అమరావతి

amr-gen13a_42.jpg

గడువులోగా పూర్తి చేస్తారని భావిస్తున్న కనకదుర్గ పైవంతెన పనులకు మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పైవంతెనకు కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నెట్టుకు రావాలనే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. గత రెండు నెలలుగా గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. తిరిగి ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించారు. దీనికి తోడు తాజాగా దర్గా వివాదం ఆటంకం కలిగిస్తోంది. దీంతో నత్తతో పోటీ పడుతున్న పనులు వచ్చే మార్చి నాటికి పూర్తికావడం దుర్లభంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నా బిల్లులు రాకపోతే తామేమీ 
చేయలేమని గుత్త సంస్థ చేతులు ఎత్తేసింది. మరోవైపు విజయవాడ నగరంపై ట్రాఫిక్‌ భారం తగ్గించేందుకు త్వరితగతిన కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ పైవంతెన ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ‘ఈనాడు’ పరిశీలనలో పలు అంశాలు వెలుగుచూశాయి. 
ఇదీ నేపథ్యం..! కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి మణిహారంలా తయారు కానుంది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీని నిర్మాణం చేపట్టాయి. పర్యవేక్షణ మాత్రం ర.భ. జాతీయరహదారుల విభాగం చేపట్టింది. కనకదుర్గ కొండ సమీపంలో ఒక పారాబ్రిడ్జి నిర్మాణం చేసి నాలుగు వరసల రహదారి వచ్చే విధంగా మార్పు చేశారు. 249 మీటర్లు దాదాపు నదిలోకి విస్తరించి ఈ వంతెన నిర్మాణం చేశారు. కనకదుర్గ పైవంతెన ఇంద్రకీలాద్రి వద్ద నదిలో నిర్మాణం చేయాల్సి వచ్చింది. నదిలోనే పిల్లర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ స్పాన్లు ఒకవైపు నిర్మాణం చేసేవిధంగా ఆకృతులను మార్చారు. నదిలో ఆక్రమణలు లేకుండా డిజైన్లు మార్చారు. ఈ పైవంతెన నిర్మాణంలో ప్రి ఫ్యాబ్రికేషన్‌ పద్ధతిలో యార్డులో గడ్డర్లు, స్పాన్లు, వింగ్స్‌ నిర్మాణాలు చేసి అమర్చుతున్నారు. దీనికి భారీ యంత్రాలు అవసరం ఉంది. వీటి కదలిక సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిర్మానుష్యంగా ఉండాలి. భారీ యంత్రాలు, భారీ క్రేన్లు తిరిగేందుకు అవసరమైన స్థలం ఉండాలి. ఫినిషింగ్‌ పనులు పూర్తి చేయకముందే ఎఫ్‌1 హెచ్‌2ఓ పేరుతో రూ.కోట్లు వెచ్చించి పార్కు నిర్మాణం చేశారు. పిల్లర్లకు అందాలు మెరుగులు దిద్దారు. కనకదుర్గ గుడి వద్ద నిర్మాణం చేస్తున్న 24, 25 పిల్లర్ల వద్ద సమస్య ఎదురవుతోంది. ఇక్కడ దాదాపు పరిహారంగా రూ.80లక్షల వరకు చెల్లించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాలువల్లో పిల్లర్ల నిర్మాణానికి జాప్యం జరిగింది. ప్రస్తుతం స్లాబ్‌లు వేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి నగరపాలక సంస్థ వరకు నిర్మాణం సవాల్‌గా మారిందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వరసల రహదారి దాదాపు 5280 మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1675 మీటర్ల నిర్మాణం చేశారు. ఇంకా 3605 మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. అంటే పైవంతెన, కింద మరో రెండు వరసల బీసీ పొర వేయాల్సి ఉంది. పైవంతెన నిర్మాణం పూర్తయితే ఈ రహదారిని పూర్తి చేస్తారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉంది. 2219 మీటర్ల డ్రైను నిర్మాణం చేయాల్సి ఉంది. 
బిల్లులకు కేంద్రం కొర్రీ..! ఈ ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టింది. రాష్ట్ర వాటా రూ.110 కోట్లు. కాగా ఇప్పటివరకు రూ.170 కోట్లు ఖర్చు చేసింది. సాధారణంగా పనులు జరిగిన వారం లేదా నెలకు బిల్లులు పెడతారు. కేంద్రం జాతీయ రహదారుల సంస్థ పీఏఓ నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీని ప్రాంతీయ కార్యాలయం బెంగళూరులో ఉంది. అక్కడి నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత రెండు నెలలు బిల్లులను గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేదు. నవంబరులో రూ.5.8 కోట్లు, డిసెంబరులో రూ.5.8 కోట్లు బిల్లులు పెట్టారు. కానీ ఫిబ్రవరి వచ్చినా బిల్లులు ఇవ్వలేదు. ఇటీవల దాదాపు 15 రోజులు పనులు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో ఒక నెల బిల్లు రావడంతో తిరిగి మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 100 మంది కార్మికులకు పైగా తిరిగి వెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.4.75కోట్లకు బిల్లులు పెట్టారు. అయితే నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ బిల్లులు రాలేదని చెబుతున్నారు. గత వారం మంజూరు చేశామని ర.భ. అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో ఉండటంతో పనులు నిలిపివేశారు. ఈ వంతెన నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. ఎక్కువగా బిహార్‌ నుంచి వచ్చారు. వారికి వారం వారం వేతనాలు చెల్లించాల్సి ఉంది. భోజనాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. భారీ మొత్తంలో ఖర్చు ఉంటుంది. బిల్లులు రాకపోవడంతో పలువురు కార్మికులు వెళ్లిపోయారు. పైవంతెనపై ఇప్పటివరకు రూ.219.51 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 310.25 కోట్లు అంచనా. 78 శాతం నుంచి 80 శాతం పనులు పూర్తయినట్లు చెబుతున్నారు. బిల్లులు మాత్రం ఆ మేరకు రాలేదు. ప్రధానంగా కేంద్రం నుంచి ప్రతి నెలా కొర్రీలు వేస్తున్నారు. ఇప్పటికే మారిన ఆకృతులపై రాజీ పడాల్సి వచ్చింది. డీవియేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం వైపు అప్రోచ్‌ రహదారి వయాడక్టు తరహాలో నిర్మాణం చేయాల్సి ఉంది. దీని వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. బిల్లులకు ప్రతిసారి వివరణలు పంపాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. 
మరో వివాదం..! తాజాగా మరో వివాదం గుత్త సంస్థ ముందుకు వచ్చింది. 24, 25 పిల్లర్ల వద్ద ఒక ప్రార్థనా మందిరం ఉన్న విషయం తెలిసిందే. గతంలో దీని విషయంలో వివాదం రాగా పరిష్కరించారు. ఆ ప్రార్థనా మందిరం ప్రహరీ నిర్మాణానికి దాదాపు రూ.60 లక్షలు చెల్లించేందుకు ర.భ. అంగీకరించింది. దీనికి రూ.1.3కోట్లు కావాలని వారు డిమాండ్‌ చేశారు. మధ్యే మార్గంగా ఇంజినీర్లతో అంచనా వేయించి రూ.60లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. పనులు ప్రారంభించారు. తాజాగా ప్రార్థన మందిరం మీదుగా వంతెన వెళ్తుందని, దీన్ని తాము సమ్మతించమని ఒక వర్గం లేఖ రాసినట్లు తెలిసింది. ఈ అభ్యంతరంతో పనులు కొన్ని రోజులపాటు నిలిచిపోయాయి. స్పాన్లు ఏర్పాటు చేస్తే ప్రార్థనా మందిరం మీదకు వస్తుందని వారు భావిస్తున్నారు. ఇప్పుడు పైవంతెన ఆకృతి మార్చడం సాధ్యం కాదు. కానీ పనులకు మాత్రం ఆటంకం ఏర్పడింది. సున్నితమైన ఈ అంశాన్ని వెలుగులోకి రాకుండా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పనులు ఆగిపోవడంతో మార్చి 31 నాటికి పైవంతెన నిర్మాణం పూర్తి కావడం అసాధ్యం. కేంద్రం కొర్రీలు, ఆర్థిక సమస్యలు, కార్మికుల కొరత లాంటి సమస్యలతో నిర్మాణం వేగవంతానికి అవరోధంగా మారాయి. 
ఏప్రిల్‌ నాటికి పూర్తి: ఈ విషయమై రహదారులు భవనాల శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ జాన్‌మోషేను ‘ఈనాడు’ సంప్రదించగా పనులు ఆగిపోలేదని, కొనసాగుతున్నాయని చెప్పారు. రెండు నెలల బిల్లులు ప్రతిష్టంభనలో పడిన విషయం వాస్తవమేనని ఇటీవల మంజూరు చేశారని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారం కిందట రూ.4.5కోట్లు బిల్లులు మంజూరు చేసిందని చెప్పారు. ఒప్పందం ప్రకారం బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 24 పిల్లర్‌ దగ్గర పనులు జరుగుతున్నాయని చెప్పారు. 34, 35, 41 పిల్లర్ల వద్ద పైవంతెన పైన క్రాష్‌ బారియర్‌ పనులు చేస్తున్నారని చెప్పారు. దర్గా ప్రాంతంలో కొన్ని అభ్యంతరాలు వచ్చినా పనులు నిలిచిపోలేదన్నారు. అయితే సోమా ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో మాట్లాడుతూ బిల్లులు సకాలంలో మంజూరు చేయడం లేదని ధ్రువీకరించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
డామిట్‌.. డెడ్‌లైన్‌ ..!
22-02-2019 08:05:02
 
636864195036417495.jpg
  • మే 14కు పొడిగించాలని కోరిన ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌
  • నిధులొచ్చినా పనుల్లో తాత్సారం
  • సోమాలో ఉన్నతాధికారుల అంతర్గత వివాదం
  • కార్మికులు లేకనే జాప్యం!
  • సా..గుతున్న కనక దుర్గ ఫ్లైవోవర్‌
  • ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు మార్చి 14
  • కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. పనుల్లో తాత్సారం
  • పనుల విషయంలో రాష్ట్రంపై నెపం
హే దుర్గా! ఫ్లై ఓవర్‌ పూర్తికి గడువు మళ్లీ మారింది. మే 14 వరకు ఎక్స్‌ టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌ (ఈవోటీ) కోరుతూ ప్రభుత్వానికి ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ అధికారులు ప్రతిపాదన పంపించారు. దీంతో దుర్గా ఫ్లై ఓవర్‌ మార్చి 14కు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాదని, ఇంకొంత కాలం పనులు సా..గుతూనే ఉంటాయని స్పష్టమవుతోంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): కనకదుర్గా ఫ్లై ఓవర్‌కు కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు వచ్చినా కాంట్రాక్టు సంస్థ సోమా వేగంగా పనులు పూర్తి చేయలేకపోతోంది. లేబర్‌ను పెంచి పనులు చేపట్టాల్సిన తరుణంలో కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4.75 కోట్ల బకాయిల గురించే కాంట్రాక్టు సంస్థ చర్చనీయాంశం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో వై - పిల్లర్ల పనులను పూర్తి చేయటంలో జరుగుతున్న జాప్యం మొత్తం ఫ్లై ఓవర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. క్షేత్ర స్థాయిలో సోమా జరుపుతున్న పనులను అంచనా వేసిన ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ యంత్రాంగం ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయటానికి మరో రెండు నెలల సమయం అవసరం అని అభిప్రాయపడింది. దుర్గా ఫ్లైఓవర్‌ను పూర్తి చేయటానికి మే 14 వరకు ఎక్స్‌టెన్షన్‌ఆఫ్‌ టైమ్‌ కావాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దుర్గా ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల మార్చి 14 నాటికి పూర్తి చేయాల్సిందిగా ఇంతకు ముందే ప్రభుత్వం డెడ్‌లైన్‌ను నిర్దేశించింది. ఈ సమయం తుది డెడ్‌లైన్‌గా కూడా నిర్దేశించటం జరిగింది.
 
 
మీన మేషాలు
కేంద్రం నుంచి నిధులు వచ్చినా కాంట్రాక్టు సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. కాంట్రాక్టు సంస్థ చేసిన పనులకు నవంబరు నాటి నుంచి బిల్లులు ఆగిపోయాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పనుల జాప్యం కారణంగా ఆర్థిక సంవత్సరాంతం దాటిన తర్వాత కాంట్రాక్టు సంస్థ బిల్లులు పెట్టుకుంది. ఈ బిల్లులపై కేంద్రం కొర్రీ వేసింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే సందర్భంలో సోమాతో పాటు దేశ వ్యాప్తంగా ఇలా 18 ప్రాజెక్టులకు కొర్రీలు పడ్డాయని సమా చారం. గత ఆర్థిక సంవత్సర బిల్లులను రీ అప్రప్రొయేషన్‌ చేయాలని కేంద్రానికి సోమా పంపింది. నవంబరు నెల లో రూ.6 కోట్లకు చెందిన బిల్లులతో పాటు డిసెంబర్‌ నెల కు సమర్పించిన బిల్లుల తాలూకా డబ్బులు కూడా వచ్చా యి. జనవరి నెలకు ఇంకా సోమా బిల్లులు పెట్టలేదు. బిల్లుల పెట్టడానికి వీలైన విధంగా క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉంది.
 
 
రాష్ట్ర ప్రభుత్వంపై నెపం
కాంట్రాక్టు సంస్థకు కేంద్రం నుంచి బిల్లులు వచ్చిన నేపథ్యంలో, పనులు చేపట్టడానికి పూర్తి వెసులుబాటు ఉన్నా ఆశించిన పురోగతి కనిపించటం లేదు. శ నీశ్వరాలయం దగ్గర, కృష్ణా తూర్పు కెనాల్‌ మీద చేపడుతున్న వయాడక్ట్‌ నిర్మాణ పనులకు సంబంధించి రూ.4.75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీని డిజైన్‌ను మార్చినందున ఈ భారాన్ని భరించటానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ బిల్లు ప్రాసెస్‌లో ఉంది. ఆర్థిక సంవత్సరాంతం కావటంతో కొద్దిగా అలస్యమైన మాట వాస్తవమే. త్వరలో బిల్లుల చెల్లింపు జరిగే అవకాశం ఉంది. దీనిని సాకుగా చూపి పనులను ఆశించిన వేగంతో చేపట్టడం లేదన్న విమర్శలు వున్నాయి. కేంద్రానికి పంపించిన డిజైన్‌ప్రకారం కాకుండా ఇప్పటికే అనేక మార్పులు జరిగాయి. వాటిలో కృష్ణలంక దగ్గర రిటైనింగ్‌ వాల్‌ ఉంది. దానికి రూ. 11 కోట్ల మేర ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. అలాగే మరో రూ. కోటి మేర చిన్న చిన్న మార్పులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇవ్వగానే వయాడక్ట్‌ డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసే క్రమంలో సోమా సంస్థకు సంబంధించి అంతర్గతంగా ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. కనకదుర్గా ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టు మేనేజర్‌గా ఉన్న చౌదరి, సోమా ప్రాజెక్టు డైరెక్టర్‌ రఘుల మధ్య ఇటీవల ఒక ఉదంతం వివాదాన్ని రేపిందని సమాచారం.
 
 
స్లోగా పనులు
ప్రధానంగా ‘వై’ పిల్లర్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఫ్లై ఓవర్‌ డిజైన్‌లో పొడవైన స్పాన్స్‌ను హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ (కొండమలుపు దగ్గర) నుంచి కృషా ్ణకెనాల్‌ వరకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పొడవాటి స్పాన్స్‌ను ఏర్పాటు చేయటానికి వీలుగా ‘వై ’ పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇవి సాధరణ పిల్లర్ల కంటే బలంగా, ధ ృడంగా ఉంటాయి. ఇలాంటివి మొత్తం ఆరు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రెండు పిల్లర్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ పిల్లర్లను పూర్తి చేయటానికి ఆరు నెలల సమయం పైగా పట్టింది. మరో రెండు పిల్లర్లు పురోగతిలో ఉన్నాయి. దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇవి అందుబాటులోకి రావటానికి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఇంకా రెండు పిల్లర్ల పనులు ప్రారంభించారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాల్సిందే! ఎంతో సంక్లిష్టమైన ‘వై ’ పిల్లర్ల పనులను సకాలంలో పూర్తి చేయటానికి కాంట్రాక్టు సంస్థ తగిన ప్లానింగ్‌తో వెళ్లటం లేదన్నది అక్కడి పనులను చూస్తే అవగతమౌతోంది. శనీశ్వరాలయం దగ్గర వయాడక్ట్‌ పనుల విషయంలో కూడా కొంత జాప్యం నడుస్తోంది. ఈ రెండు పనులలో వేగం పెంచితే మూడు నెలల్లోనే ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకు రావచ్చని తెలుస్తోంది.
 
 
అరకొర సిబ్బందితోనే..
పనుల జాప్యం నేపథ్యంలో, కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా రంగంలోకి దిగింది. కొద్ది రోజుల కిందట ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ జాన్‌ మోషేతో పాటు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిథులతో కలిసి మోర్టు ప్రాంతీయ అధికారి శ్రావణ్‌ కుమార్‌ సింగ్‌ క్షేత్రస్థాయిలో ఫ్లైఓవర్‌ నిర్మాణం నిశితంగా పరిశీలించారు. క్యాస్టింగ్‌ యార్డులో జరుగుతున్న పనులను కూడా పరిశీలించిన తర్వాత కార్మికులు తగిన సంఖ్యలో లేకపోవటం వల్లే పనులు జాప్యమౌతున్నాయని గుర్తించారు. ప్రస్తుతం 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పనులను వేగవంతం చేయటానికి మరో 300 వరకు కార్మికులను తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇంకా కాంట్రాక్టు సంస్థ చర్యలు తీసుకోకపోవటం కూడా పనుల జాప్యానికి దారి తీస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...