Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి నిర్మాణంలో కీలకం ఈ అక్టోబర్‌!

636426175277873405.jpg



  • ఓ కొలిక్కి రానున్న అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు
  • పలు రహదారులు, మౌలిక, లేఅవుట్ల టెండర్లు ఖరారు
  • రైతుల సింగపూర్‌ ట్రిప్‌లూ ఈ నెలలోనే..!

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఈ నెల కీలకంగా నిలవనుంది. ఎప్పుడెప్పుడాని అమరావతి రైతులతోపాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఫైనల్‌ మాస్టర్‌ ప్లాన్‌తోపాటు అసెంబ్లీ, హైకోర్టుల తుది డిజైన్లు ఇంచుమించుగా ఒక కొలిక్కి రావడంతోపాటు పలు కీలక పనులకు సంబంధించిన టెండర్లు అక్టోబరులో ఖరారు కానున్నాయి. అమరావతి అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడనున్న ప్రముఖ హోటళ్లు, విద్యాసంస్థల ఏర్పాటు ప్రక్రియ కూడా రానున్న కొద్దివారాల్లో ఊపందుకోనుంది.

 

(ఆంధ్రజ్యోతి, అమరావతి)

గత కొన్ని నెలలుగా ముమ్మరంగా జరిగిన అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్ల తయారీ ప్రక్రియ గత నెలలోనే ముగిసి, విజయదశమి రోజున వాటికి శంకుస్థాపన జరుగుతుందని ప్రభుత్వంతోపాటు సీఆర్డీయే ఉన్నతాధికారులూ భావించారు. ఇందుకు ఊతమిచ్చేలా పలు పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే సదరు డిజైన్లను రూపొందిస్తున్న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ కొన్ని వారాల క్రితం అందజేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తపరచి, స్వయంగా తానే ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తానని ప్రకటించడం తెలిసిందే. పైగా ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న విధంగా అత్యద్భుతంగా రూపొందేలా చూడడంలో చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తోడ్పాటును తీసుకోవాల్సిందిగా సీఆర్డీయేను ఆదేశించడమూ విదితమే. ఆ ప్రకారం సుమారు 2 వారాల క్రితం రాజమౌళి అమరావతికి వచ్చి, సీఎంతో సమావేశమై, ఆయన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 

తదుపరి దశగా ఈ దిగ్దర్శకుడు ఈ నెల 2వ వారంలో సీఆర్డీయే ఉన్నతాధికారులతో కలసి లండన్‌కు వెళ్లి, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతోనూ సమావేశమవుతారు. ఈ మధ్య వ్యవధిలోనూ వీరందరి మధ్య ఎప్పటికప్పుడు డిజైన్లపై ముమ్మర సంప్రదింపులు జరగబోతున్నాయి. అనంతరం ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం లండన్‌కు వెళ్లి, ఫోస్టర్‌తో చర్చలు జరపడం ద్వారా అసెంబ్లీ, హైకోర్టుల తుది ఆకృతులను దాదాపుగా ఒక కొలిక్కి తేనున్నారు. తదుపరి వాటిపై అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని, తదనుగుణంగా కొన్ని మార్పుచేర్పులతో ఫైనల్‌ డిజైన్లను ఆమోదించనున్నారు.

 

వారం, 10 రోజుల్లో రోడ్ల టెండర్లు..

అమరావతి రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించనున్న పలు రహదారులకు సంబంధించిన టెండర్లను 10 రోజుల్లోపు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారై, పనులు జరుగుతున్న సీడ్‌ యాక్సెస్‌, ఇతర ప్రయారిటీ రోడ్లకు ఇవి అదనం. వీటిని కలిపితే రాజధానిలో మొత్తంమీద సుమారు 365 కిలోమీటర్ల పొడవైన దాదాపు అన్ని ప్రాధాన్య రహదారులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ అంతా పూర్తయినట్లవుతుంది. ఇది జరిగేసరికి, వానలు దాదాపుగా తగ్గుముఖం పడతాయి కాబట్టి, టెండర్లు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు కాలయాపన లేకుండా పనులు చేపట్టనున్నాయి. బిడ్ల ఖరారు తర్వాత 12 మాసాల్లో రహదారులను పూర్తి చేయాల్సి ఉన్నందున వాటి నిర్మాణం ఈ నెలలోనే ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంది.

 

15కల్లా ఎల్పీఎస్‌ లేఅవుట్ల టెండర్లు..

రాజధానికి పూలింగ్‌ ప్రాతిపదికన భూములిచ్చిన వారికి బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లున్న ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన టెండర్లన్నీ కూడా ఈ నెల 15వ తేదీకల్లా ఖరారవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెగ్‌మార్కింగ్‌ పనులు జరుగుతున్న వివిధ లేఅవుట్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.14,000 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లు రానున్న 2 వారాల్లో ఖరారవనున్నాయి.

 

సింగపూర్‌ ట్రిప్‌లూ ..

అర్బన్‌ ప్లానింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సింగపూర్‌ సహాయ సహకారాలతో అమరావతి రూపొందనున్న క్రమంలో రాజధాని రైతులు ఆ దేశాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తే, భవిష్యత్తులో మన క్యాపిటల్‌ సిటీ ఏ విధంగా రూపొందబోతోందనే విషయంపై ఒక అంచనాకు వస్తారన్న అభిప్రాయంతో సీఆర్డీయే వారిని సింగపూర్‌ యాత్రకు పంపనుండడం తెలిసిందే. మొత్తం వందమందిని 3 బృందాలుగా సింగపూర్‌కు పంపనున్న నేపథ్యంలో తొలి బృందం ఈ నెల 22- 26 తేదీల మధ్య అక్కడికి వెళ్లనుంది.

 

ఇవి కూడా..


  • రాజధానికి ఆకర్షణ పెంచనున్న శాఖమూరు రీజియనల్‌ పార్క్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలతో కూడిన భారీ ఉద్యానవనాలు, కృష్ణానదిపై గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌- పవిత్ర సంగమ ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జితోపాటు సీడ్‌ యాక్సెస్‌ రహదారి, ఇతర రోడ్ల వెంబడి అభివృద్ధి పరచదలచిన గ్రీనరీ ఏర్పాటు ఇత్యాదివన్నీ కూడా ఈ నెలలో ఒక క్రియాశీలక రూపం సంతరించుకోనున్నాయి.
  • అమరావతిలో తమ శాఖలను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న పలు సుప్రసిద్ధ హోటల్‌ గ్రూపులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సీఆర్డీయే జరుపుతున్న చర్చలు కూడా ఈ మాసంలోనే ఒక కొలిక్కి రానున్నాయి.
  • అమరావతిలోని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి బాధ్యతలు చేపట్టిన సింగపూర్‌ కన్సార్షియం సదరు కార్యక్రమాలను కూడా ఈ నెలలోనే మరింత ముందుకు
  • తీసుకువెళ్లే అవకాశం ఉంది.
  • గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులు ఇత్యాది వాటిని మరింత సమర్ధంగా పర్యవేక్షించేందుకు వీలుగా రాజధానిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణపనులు కూడా ఈ మాసంలోనే మొదలవనున్నాయి.
  • మరొకపక్క.. రాజధాని నిర్మాణానికి అవసరమైన వేలాది కోట్ల రూపాయల నిధులను వివిధ మార్గాల్లో సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో సీఆర్డీయే చేస్తున్న ప్రయత్నాలు సైతం ఈ అక్టోబర్‌లోనే మరింత ముందడుగు వేయనున్నాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర ప్రాధాన్య రోడ్లలో కొన్నింటికి అడ్డంకిగా నిలిచిన భూమిని సేకరించే ప్రక్రియ కూడా రానున్న కొద్ది వారాల్లో ఊపందుకోనుంది.

Link to comment
Share on other sites

అమరావతి అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌’కు భూమిపూజ

636426177681343701.jpg
అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌కు సోమవారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. దాత మల్లెల అనంత పద్మనాభరావు తనకు గల 79 ఎకరాల భూమిని మూడు సంవత్సరాల క్రితం ప్రజా ప్రయోజానాల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. దానిలో ప్రభుత్వం సుమారు 26 ఎకరాల స్థలంలో మెడికల్‌ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి, క్రీడా మైదానం, విల్లాను, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిమ్స్‌ నిర్మాణాలకు అప్పగించింది. రాజధాని అభిముఖంగా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లయింది. సోమవారం దాత మల్లెల అనంత పద్మనాభరావు, ఎయిమ్స్‌ ఉపాధ్యక్షుడు మొక్కపాటి సాంబశివరావు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. - ఇబ్రహీంపట్నం
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

అమరావతి అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌’కు భూమిపూజ

636426177681343701.jpg
అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌కు సోమవారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. దాత మల్లెల అనంత పద్మనాభరావు తనకు గల 79 ఎకరాల భూమిని మూడు సంవత్సరాల క్రితం ప్రజా ప్రయోజానాల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. దానిలో ప్రభుత్వం సుమారు 26 ఎకరాల స్థలంలో మెడికల్‌ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి, క్రీడా మైదానం, విల్లాను, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిమ్స్‌ నిర్మాణాలకు అప్పగించింది. రాజధాని అభిముఖంగా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లయింది. సోమవారం దాత మల్లెల అనంత పద్మనాభరావు, ఎయిమ్స్‌ ఉపాధ్యక్షుడు మొక్కపాటి సాంబశివరావు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. - ఇబ్రహీంపట్నం

 

:adore: :adore:

Link to comment
Share on other sites

అమరావతిలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల

2021 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి

నెలాఖరుకు ఆకృతులు.. నవంబరులో పనులు ప్రారంభం

మూడేళ్లలో రూ.152 కోట్లు ఇవ్వనున్న కేంద్రం

రూ.వంద కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి జిల్లాలోనూ ప్రయోగశాలలు

2018 మార్చి నాటికి మంగళగిరిలో తాత్కాలికంగా ఏర్పాటు

ఈనాడు - అమరావతి

2ap-story2a.jpg

ప్రతిష్ఠాత్మకమైన ఫోరెన్సిక్‌ ప్రయోగశాల 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలపడంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ప్రయోగశాల కోసం రాజధాని పరిధిలో మూడెకరాల స్థలం కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడంతో భవన నిర్మాణ ఆకృతులను సిద్ధం చేయడంపై పోలీసు శాఖ దృష్టిసారించింది. పుణెకు చెందిన శిరిష్‌బెరి అండ్‌ అసోషియేట్స్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అక్టోబరు నెలాఖరుకు ఆకృతులు పూర్తయితే, నవంబరులో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రాబోయే మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.18,636 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఏర్పాటుకు రూ.152 కోట్లు వెచ్చించనుంది. మూడేళ్లపాటు ఏటా విడతల వారీగా ఈ సొమ్ము విడుదల కానుంది. అమరావతిలో శాశ్వత ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అందుబాటులోకి వచ్చేంతవరకూ మంగళగిరిలోని ఏపీఎస్పీ పోలీసు పటాలం ప్రాంగణంలో నిర్మిస్తున్న టెక్‌టెవర్‌లోని 4,5,6 అంతస్తుల్లో తాత్కాలికంగా రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు. 2018 మార్చి నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రూ.60 కోట్లతో అత్యాధునిక పరికరాలు

అమరావతిలో నిర్మించే రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల భవన నిర్మాణానికి రూ.40 కోట్లు వెచ్చించనున్నారు. రూ.60 కోట్లతో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా జిల్లాస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు నెలకొల్పుతారు. ప్రస్తుతం కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలున్నాయి. ఈ ప్రయోగశాలలకు వచ్చే నమూనాల్లో 80 శాతం మానవ శరీరానికి సంబంధించినవే. జిల్లాల నుంచి వీటిని ఆయా ప్రయోగశాలలకు తీసుకురావాలంటే కనీసం 200 నుంచి 300 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మానవ శరీరానికి సంబంధించిన నమూనాలన్నింటినీ పరీక్షించేందుకు వీలుగా జిల్లాస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా రూ.252 కోట్ల అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర ఫోరెన్సిక్‌ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు డా.కేపీసీ గాంధీ ఆధ్వర్యంలో రూపొందించారు. కేంద్రం రూ.152 భరించనుండగా, మిగతా రూ.100 కోట్లు రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది.

జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సు పరిశోధన సంస్థ: అమరావతిలో నిర్మించనున్న రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పక్కనే జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సు పరిశోధన సంస్థ కూడా రానుంది. ఈ సంస్థ అందుబాటులోకి వస్తే ఫోరెన్సిక్‌ సైన్సు రంగంలో పెద్దఎత్తున పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుంది. అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, సాంకేతికత అందిపుచ్చుకోవచ్చు. బాలిస్టిక్స్‌, జీవశాస్త్రం, డీఎన్‌ఏ, రసాయన, కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌, వేలిముద్రలు, సైబర్‌ ఫోరెన్సిక్‌, ఫోరెన్సిక్‌ సైకాలజీ, భౌతికశాస్త్రం, ఆడియో, వీడియో ఫోరెన్సిక్‌, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, డాక్యుమెంటు ఫోరెన్సిక్‌ తదితర విభాగాలు ఈ పరిశోధన సంస్థలో అంతర్భాగంగా ఉంటాయి. ఆయా విభాగాలకు సంబంధించి అత్యాధునిక విశ్లేషణ ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి.

ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ప్రత్యేకతలు * డీఎన్‌ఏ, సైబర్‌ ఫోరెన్సిక్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, డ్రగ్స్‌ అండ్‌ నార్కోటిక్స్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, బయోమెట్రిక్‌ విభాగాల్లో ఆరు సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ఉంటాయి.

* ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, డీఎన్‌ఏ సూచిక, బయోమెట్రిక్‌ ఆధారిత ఫోరెన్సిక్‌ మనకు మాత్రమే ప్రత్యేకం.

* ఆర్థిక నేరాల విషయంలో ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌కు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

* బయోమెట్రిక్‌ ఆధారిత ఫోరెన్సిక్‌ ద్వారా ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, మావోయిస్టులు తదితరుల సంభాషణలను వారి గొంతు ఆధారంగా పసిగట్టేందుకు వీలవుతుంది.

దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ విభాగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ఫోరెన్సిక్‌ అభివృద్ధి ప్రణాళిక రూపొందించాం. రాబోయే నాలుగేళ్లలో దీన్ని పూర్తిగా అమల్లోకి తెస్తాం. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక విధానాలను ఇక్కడ అందుబాటులోకి రానున్నాం. వీటన్నింటిని పూర్తి చేయడం ద్వారా ప్రస్తుతమున్న శిక్షల శాతాన్ని రెట్టింపు చేయాలనేది లక్ష్యం. కేసుల ఛేదన కూడా సులభమవుతుంది.
- డా. కేపీసీ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు
Link to comment
Share on other sites

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా ఎస్‌ఆర్‌ఎం
 
 
636427008258548228.jpg
  • నన్యాంగ్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీతో ఒప్పందం
  • విశ్వవిద్యాలయ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ
మంగళగిరి రూరల్‌: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ పి.సత్యనారాయణ చెప్పారు. మండలంలోని నీరుకొండ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో మంగళవారంవిలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం ఎన్‌టీయూ (నన్యాంగ్‌ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీ)తో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఎన్‌టీయూ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ బెర్టిల్‌ శాండర్సన్‌ ఆ సంస్థకు చెందిన మరికొందరు ప్రతినిధులు, అధ్యాపకులు మంగళవారం ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆధునిక తరహాలో ముఖాముఖి ద్వారా పాఠ్యాంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే బోధనా విధానాన్ని రూపొందించడానికి ఎన్‌టీయూ బృందం తమ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ఆధునిక పాఠ్యాంశాలను ఎన్‌టీయూ రూపొందిస్తుందని చెప్పారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
  
రానున్న పదేళ్లలో మేనేజ్‌మెంట్‌, లా, వైద్య కళాశాలలను తమ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ బెర్టిల్‌ శాండర్సన్‌ మాట్లాడుతూ తక్కువ కాలంలో ఎన్‌టీయూను ఒక అంతర్జాతీయ ప్రమాణాలు గల విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దామని, అదే తరహాలో ఎస్‌ఆర్‌ఎంను విస్తరింపజేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. పరిశోధనలతో కూడిన పాఠ్యాంశాలను ఎస్‌ఆర్‌ఎం కోసం రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రో వైస్‌ చాన్సలర్‌ డీ.నారాయణరావు మాట్లాడుతూ భారతదేశంలో మొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే జల్‌ జనక్‌ రైలును రూపొందిస్తున్నట్టు తెలిపారు. 2019 చివరిలో వెలగపూడిలో డెమో ఇవ్వనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశి ంచిన స్థాయిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయా న్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్‌ బీవీఆర్‌ చౌదరి, ప్రొఫెసర్‌ లూయిస్‌ ఫీ, ప్రొఫెసర్‌ టిమ్‌ వైట్‌, ఎస్‌ఆర్‌ఎం ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వడివడిగా ప్లాట్ల పెగ్‌ మార్కింగ్‌
 
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: భూసమీకరణ కింద రాజధాని నిర్మాణా నికి భూములందజేసిన రైతులకు.. బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లకు పెగ్‌ మార్కింగ్‌ చేసి, సరిహద్దు రాళ్లను వేసే ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ సంకల్పించింది. ఆన్‌ లైన్‌ లాటరీ ప్రక్రియ ద్వారా తమకిచ్చిన ప్లాట్లకు హద్దుల గుర్తింపులో జాప్యంపై రాజధాని రైతుల్లో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్త మవుతుండడంతో ఈ ప్రక్రియను త్వరగా తేల్చేయాలని నిర్ణయించింది. వర్షాల కారణంగా ఎల్పీఎస్‌ లేఅవుట్లలోని ప్లాట్లకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయలేకపోయామే తప్ప అందులో ఉద్దేశపూర్వక జాప్యమేదీ లేదని సీఆర్‌డీఏ యంత్రాంగం చెబుతున్నా రైతులు విశ్వసించడం లేదు. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. యుద్ధప్రాతిపదికన త్వరగా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. సంబంధిత విభాగాలకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కాగా.. ప్లాట్లకు హద్దులు ఏర్పరచాలంటే అత్యవసరమైన పెగ్‌ మార్కింగ్‌ ప్రక్రియ ఇప్పటికే నేలపాడు, దొండపాడు, పిచ్చికలపాలెంలలో ఇది ముగిసింది. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియను చకచకా చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినందున పెగ్‌ మార్కింగ్‌, హద్దు రాళ్ల ఏర్పాటుకు అంతరాయాలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని అనుకుంటున్నారు.
Link to comment
Share on other sites

దశావతారాల శిఖరం

పవిత్ర సంగమం వద్ద ఆలయ నిర్మాణం

ఆకృతి రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను

రాజధానిలో ఐదు జోన్లలో రూ.10 వేల కోట్లతో వసతులు

అమరావతిలో 20 ఎకరాల్లో క్రీడా సముదాయం

సీఆర్‌డీఏ, పురపాలికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

ఈనాడు - అమరావతి

4ap-main1a.jpg

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ స్థలిలో దశావతారాల అంశంతో ఆలయ శిఖరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఆకృతిని సిద్ధం చేశారు. తిరుమలేశుని మూడు నామాలు, దానిపై ఆలయ గోపురం ఉండేలా... వాటి కింది నుంచి నదీ ప్రవాహం వెళ్లేలా ఈ నిర్మాణం ఉంటుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతి, పురపాలకశాఖలపై ఆ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ, పురపాలకశాఖ అధికారులతో సమీక్షించారు. రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తిరిగి స్థలాలు కేటాయించిన లేవుట్‌లకు (ఎల్‌పీఎస్‌) సంబంధించి ఐదు జోన్లలో రూ.10 వేల కోట్లతో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో ప్రధాన మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో అభివృద్ధి చేసే క్రీడానగరంపై చర్చించారు. వివిధ క్రీడలు ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా 20 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు బ్రిటన్‌కు చెందిన స్టేడియా ఎరీనా సంస్థ ముందుకు వచ్చింది. వారం రోజుల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే రెండు వారాల్లో అమరావతిలో రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తారు. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా రాజధాని పనులు జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా స్వీకరించాలని, అర్థవంతమైన చర్చ జరగాలని, మేధోమథనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే నవంబరులో కృష్ణా నదిలో అంతర్జాతీయ స్థాయిలో పవర్‌ బోట్‌ రేస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. తాను రూపొందించిన గోపురం ఆకృతికి సంబంధించి త్రీడీ చిత్రాల రూపంలో ఆయన ప్రజంటేషన్‌ ఇచ్చారు. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. బోయపాటి రూపొందించిన ఈ కాన్సెప్ట్‌పై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిపుణులు, తితిదే పండితులతో చర్చించి 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఆకృతి నమూనా చిత్రాల్ని రహస్యంగా ఉంచారు. తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే బయట పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ గోపుర నిర్మాణం ఐకానిక్‌గా ఉండాలని సీఎం సూచించారని, ప్రాచీన దేవాలయ భవన నిర్మాణ రీతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆకృతిని రూపొందించామని బోయపాటి ‘ఈనాడు’కి తెలిపారు.

 

4ap-main1b.jpg గోదావరి-కృష్ణా నదులను అనుసంధానించి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి పడుతున్నాం. అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నాం. అమరావతిలో తిరుమలేశుని ఆలయాన్ని తిరుమల తరహాలో దేదీప్యమానంగా నిర్మించాలన్నది నా ఆలోచన. వైకుంఠపురం దానికి అనువైన ప్రదేశంగా భావిస్తున్నాను...
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

అమరావతిలో జలక్రీడోత్సవం

కృష్ణా నదిలో వచ్చే సంవత్సరం నవంబరులో జలక్రీడల నిర్వహణకు ఇటలీకి చెందిన యూఐఎం సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై, తమ ప్రతిపాదన వివరించారు. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. హెచ్‌2ఓ రేసింగ్‌ పేరుతో పవర్‌బోట్‌ రేసింగ్‌, ఎఫ్‌1హెచ్‌2ఓ పేరుతో బోటు రేసింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆక్వాబైక్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్‌, యూఏఈ తర్వాత ఈ పోటీల నిర్వహణకు అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యూఐఎం ప్రతినిధులు తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతి పెద్ద ఆకర్షణ. అందుకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయి జలక్రీడల నిర్వహణకు అనువైన వాతావరణం అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతిని చిరునామాగా మలచాలి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులలో ఏడాది పొడవునా జలక్రీడలు, పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులిచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూఐఎం సంస్థ 40 దేశాల్లో పోటీలు నిర్వహిస్తోందని మంత్రి నారాయణ విలేఖరులకు తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు.

11న లండన్‌కు సీఆర్‌డీఏ బృందం

శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఆర్కిటెక్ట్‌లతో చర్చించడానికి సీఆర్‌డీఏ అధికారుల బృందం ఈ నెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనుంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈ నెల 12న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సీఆర్‌డీఏ అధికారులకు అందజేస్తుంది. అమరావతిలో వీఐపీ గృహ నిర్మాణ ప్రాజెక్టుకి ఈ నెల 9న ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు.

పట్టణాల్లో మౌలిక వసతులకు రూ.5 వేల కోట్ల రుణం

తాగునీరు, రహదారులు, మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు వంటివి పట్టణాల్లో కల్పించాల్సిన ప్రధాన మౌలిక వసతులని మంత్రి నారాయణ బుధవారం విలేఖరులకు తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వచ్చే రెండేళ్లలో రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, పార్కులు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.11 వేల కోట్లు కావాలని తెలిపారు. రాబోయే రెండేళ్లలో 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వ నిధులు, స్థానిక సంస్థలకు సొంత నిధులు పోగా మరో రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని, హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించే వివిధ రహదారులకు సంబంధించి 90 శాతం రూ.13 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచారని, మిగతా టెండర్లు మరో 15 రోజుల్లో పిలుస్తారని చెప్పారు. వచ్చే డిసెంబరు 31 లోగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కుక్కలకు సంతాన ఉత్పత్తి నియంత్రణకు స్టెరిలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

క్షణమైనా వృథా చేయొద్దు
 
 
636427696770203508.jpg
  • చకచకా రాజధాని పనులు
  • అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • వీఐపీ హౌసింగ్‌కు 9 నుంచి ప్రొక్యూర్‌మెంట్‌
  • రోడ్లు, ఇన్‌ఫ్రాకు 10 వేల కోట్ల సమీకరణ
  • స్టేడియం నిర్మాణానికి త్వరలో టెండర్లు
  • వాటర్‌ స్పోర్ట్స్‌కు ఇటలీ సంస్థ సంసిద్ధత
  • దశావతారాల థీమ్‌కు బోయపాటి డిజైన్లు
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ అమరావతిపై పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పనులు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (ఎల్‌పీఎస్‌) లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 ఎల్పీఎస్‌ జోన్లలో ఐదు జోన్లను రూ.10,000 కోట్లతో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. ఇంతవరకు దేశంలో ఈ విధానంలో ఒక్క జాతీయ రహదారులను మాత్రమే నిర్మిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి పరచనున్నారు.
 
మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 49 శాతాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన 51 శాతాన్ని డెవలపర్లు భరించనున్నారు. యాన్యుటీ రీపీమెంట్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వనుంది. రాజధాని నగరంలోని 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్‌, నీరు వంటి మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో కల్పిస్తారు. వీటికి సంబంధించిన టెండర్లు ఈ నెల 11 కల్లా సిద్ధమవుతాయి. రూ.2383 కోట్ల వ్యయంతో 5వ జోన్‌లోని 5,174 ఎకరాలను, రూ.817 కోట్లతో నాలుగో జోన్‌లోని 1360 ఎకరాలు, రూ.3714 కోట్లతో 9వ జోన్‌లోని 6902 ఎకరాలు, రూ.2102 కోట్లతో 12వ జోన్‌లోని 7,838 ఎకరాలు, రూ.1498 కోట్లతో 12-ఏ జోన్‌లోని 3,860 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. వచ్చే 2 వారాల్లో 13,000 కోట్ల విలువైన పనుల గ్రౌండింగ్‌ను జరిపేందుకు నిర్ణయించారు.
 
లండన్‌లో 3 రోజుల పర్యటన
పరిపాలనా నగరంలోని రెండు ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టు భవంతుల తుది ఆకృతుల నిర్మాణ ప్రణాళికపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో చర్చించేందుకు సీఆర్‌డీఏ బృందం ఈ నెల 11నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనుంది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల ప్రణాళికలను ఈ నెల 12న ఫోస్టర్‌ ప్రతినిధులు సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ హౌసింగ్‌కు సంబంధించి ఈ నెల 9న ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు తెలిపారు.
 
కీలక నిర్ణయాలివీ..
రాజధానిలోని ప్రాధాన్య రహదారుల నిర్మాణ టెండర్లలో రూ.13,000 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెలిపామని సమావేశానంతరం పురపాలక మంత్రి పి.నారాయణ తెలిపారు. మిగిలినవి వచ్చే 15 రోజుల్లో ఖరారు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, టీటీ, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ తదితర క్రీడలు ఆడుకునేందుకు, నృత్యోత్సవాల నిర్వహణకు అనువైన ప్రాంగణాన్ని ఒకే చోట నిర్మిస్తారు. స్పోర్ట్స్‌ సిటీలో కృష్ణానదికి అభిముఖంగా 20 ఎకరాల్లో ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌ను ఏర్పాటు చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.
 
రెండు దశల్లో దీని నిర్మాణం ఉంటుంది. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వరుని ఆకృతిలో ఆలయ శిఖర నిర్మాణానికి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలేశుడి మూడు నామాలు, దానిపై ఆలయ గోపురం ఉండేలా, వాటికింద నుంచి నదీ ప్రవాహం సాగేలా ఈ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దశావతారాల థీమ్‌తో ఈ ఆలయ శిఖరాకృతికి రూపకల్పన చేసినట్లు బోయపాటి సీఎంకు వివరించారు. ఈ ఆకృతులపై ఆగమశాస్త్ర నిపుణులు, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పండితులతో చర్చించి, 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి వైకుంఠపురం అనువైన ప్రదేశంగా అభిప్రాయపడ్డారు.
 
2018 నవంబరులో వాటర్‌ ఫెస్టివల్‌పై ఎంవోయూ
భవిష్యత్‌లో రాష్ట్రానికి జలవనరులే అతి పెద్ద ఆకర్షణ కానున్నాయని సీఎం అన్నారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలని ఆదేశించారు. పర్యాటకం, వినోదం, క్రీడలకు రాజధాని చిరునామా కావాలన్నారు. ‘ఎఫ్‌1 హెచ్‌2వో’ పేరుతో అమరావతిలో వాటర్‌ ఫెస్టివల్‌ను వచ్చే ఏడాది నవంబరులో 15 రోజులపాటు నిర్వహించేందుకు ఇటలీకి చెందిన అంతర్జాతీయ సంస్థ యూఐఎం ముందుకొచ్చిందని తెలిపారు. ఈ ఉత్సవాలపై ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300 నుంచి 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు ఇక్కడ కనీసం వారంపాటు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్‌ గదులు అవసరమవుతాయని పర్యాటక శాఖ కార్యదర్శి మీనా తెలిపారు. గోదావరి- కృష్ణా నదుల్లో ఏడాది పొడవునా ఈ తరహా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం టూరిజం శాఖను ఆదేశించారు.
Link to comment
Share on other sites

రాజధానిలో 5 జోన్ల అభివృద్ధి

హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో రూ.10 వేల కోట్లతో అమరావతిలో

తొలిదశ కింద అభివృద్ధి చేయనున్న ఐదు జోన్లు

వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణ పనులు

ఈనాడు - అమరావతి

4ap-main10a.jpg

భూ సమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం-ఎల్పీఎస్‌) విధానంలో రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చెందిన భూములను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రైతులకు కేటాయించిన ఎల్పీఎస్‌ లేఅవుట్ల జోన్లలో ఐదింటిని తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.10వేల కోట్లు వెచ్చిస్తారు. నిధులకు ఇబ్బంది లేకుండా ‘హైబ్రిడ్‌ యాన్యుటీ’ విధానంలో ఈ పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం సీఆర్డీఏ ఈ నెల 11వ తేదీ టెండర్లు పిలవనుంది. వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ‘హైబ్రిడ్‌ యాన్యుటీ’ విధానంలో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో 49 శాతం వాటాను సీఆర్డీఏ భరిస్తే, 51 శాతం వాటాను ప్రైవేటు సంస్థ భరిస్తుంది. లే అవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రైవేటు సంస్థ ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తుంది. మూడేళ్ల తర్వాత ఆ సంస్థకు సీఆర్డీఏ చెల్లిస్తుంది.

2 వారాల్లో 11 వేల కోట్లతో పనులు

రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. వివిధ స్థాయిల ఉద్యోగులకు వసతి గృహాలతో పాటు సమీకరణలో భూములిచ్చిన రైతులకు అందించే స్థలాల్ని అభివృద్ధి చేయడం, రహదారులు, మురికికాలువలు, మంచినీటి పైపులైన్లు... తదితర అన్నిరకాల ప్రాథమిక వసతుల కల్పన వంటి సుమారు రూ.11 వేల కోట్ల విలువైన పనులు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ ప్రధాన రహదారితో పాటు మరో ఏడు రహదారుల పనులు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా... మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సీఆర్‌డీఏ చేస్తున్న సన్నాహాలు వివిధ దశల్లో ఉన్నాయి.

4ap-main10b.jpg

తలమానికంగా క్రీడాప్రాంగణం

రాజధానిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణం నిర్మాణాన్ని స్టేడియా ఎరీనా అమరావతి లిమిటెడ్‌ చేపట్టనుంది. క్రీడా వసతులు, సౌకర్యాల కల్పనలో ఈ సంస్థకు 60 ఏళ్ల అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల క్రీడల నిర్వహణకు వీలుగా ఇక్కడ నిర్మాణాలు చేయనున్నారు. తొలిదశలో రెండు భాగాలుగా పనులు జరుగుతాయి. హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో ప్రాజెక్టు చేపడతారు.

* 5 వేల మంది వీక్షణ సామర్ధ్యంతో కన్వెన్షన్‌ కేంద్రం, 4 వేల మందికి సరిపడా విశాలమైన ప్రాంగణం, 10,000 మంది కూర్చునే వీలుగా క్రీడా ప్రాంగణం నిర్మిస్తారు. దీని వల్ల 500 మందికి ఉపాధి లభిస్తుంది.

* మొదటిదశలో కాన్ఫరెన్స్‌, సమావేశ కేంద్రాలు, క్రీడా ప్రాంగణం, కార్యక్రమాల నిర్వహణకు పార్కు, క్లబ్‌, విపత్తుల నివారణ కేంద్రం నిర్మాణానికి 1.99 కోట్ల పౌండ్లు ఖర్చు చేస్తారు.

* రెండో దశలో 4 నక్షత్రాలు, 5 నక్షత్రాల హోటళ్లు, విశ్రాంతి మందిరాలు నిర్మిస్తారు. ఇందుకు 1.60 కోట్ల పౌండ్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.

* ఫుట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, బాడ్మింటన్‌, టెన్నిస్‌, స్క్వాష్‌, ఈతకొలను, టేబుల్‌ టెన్నిస్‌, జుంబా డ్యాన్స్‌, యోగ, టేబుల్‌ గేమ్స్‌కు సంబంధించి శాశ్వత సౌకర్యాలు అందుబాటులోకి తెస్తారు.

4ap-main10c.jpg

Link to comment
Share on other sites

 

పర్యాటకం, వినోదం, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, 2018 నవంబర్‌లో రాష్ట్రంలో, వాటర్ ఫెస్టివల్.....

water-festival-05102017.jpg

share.png

‘రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతిపెద్ద ఆకర్షణ కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి జలక్రీడలకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతి చిరునామాగా మలచాలి’-అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘ఎఫ్1 హెచ్2వో’ పేరిట వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఇటలీకి చెందిన యుఐఎం సంస్థ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నవంబరు మాసంలో అంతర్జాతీయ జల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు యుఐఎం సిద్ధమవుతోంది.

 

ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్, యుఏఈ తరువాత అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యుఐఎం ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఉత్సవాలపై వారు ముఖ్యమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్2వో రేసింగ్ పేరుతో పవర్‌బోట్ రేసింగ్, ఎఫ్1హెచ్2వో పేరుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆక్వాబైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.

వచ్చే ఏడాది జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300, 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు కనీసం వారం రోజులు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్ గదులు అవసరం అవుతాయని పర్యాటక కార్యదర్శి ఎం.కే. మీనా ముఖ్యమంత్రికి వివరించారు.

గోదావరి, కృష్ణానదులలో ఏడాది పొడవునా జలక్రీడలకు సంబంధించిన ఈ తరహా అన్నిరకాల పోటీలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పర్యాటక శాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాథికార సంస్థని ఏర్పాటుచేస్తామని చెప్పారు.

 

Link to comment
Share on other sites

హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ తో, మౌలిక వసతలు నిర్మాణం...

 

 
amaravati-05102017.jpg
share.png

‘నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా వాటిని స్వీకరించాలి. వాటిపై అర్థవంతమైన చర్చ జరగాలి. మేధోమధనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి’-అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. అనేక తరాలు గర్వంగా చెప్పుకునే గొప్ప ప్రజారాజధానిని నిర్మిస్తున్నామన్న భావన ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిలో ఉండాలని, దానికి తగ్గట్టుగానే నిర్ధిష్ట కార్యప్రణాళికతో పనిచేయాలని ఆయన అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క నిమిషం కూడా వృధాచేయకుండా పనులు జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశం బుధవారం సాయంత్రం వెలగపూడిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) ప్రాంత మౌలిక వసతుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో పనులు చేపట్టేందుకు గల సానుకూలతలు, ప్రతికూలాంశాలపై సమావేశంలో ప్రస్తావించి తుది నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ నిర్ణయం ప్రకారం రాజధానిలోని మొత్తం 13 జోన్లలలో 5 జోన్లను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపడతారు.

ఇంతవరకు దేశంలో ఎన్‌హెచ్ఏఐ మాత్రమే ఈ హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ను అనుసరించి జాతీయ రహదారులను నిర్మిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌కు వెళుతున్నారు.

ఇందులో భాగంగా మొత్తం 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, నీటి సదుపాయాల కల్పన వంటి వివిధ రకాల పనులను చేపడతారు. రూ.2383 కోట్ల అంచనా వ్యయంతో 5,174 ఎకరాల మేర జోన్ 5లో అభివృద్ధి పనులను చేపడతారు. రూ.817 కోట్లతో 1360 ఎకరాల మేర జోన్ 4ను అభివృద్ధి చేస్తారు. రూ.3,714 కోట్ల వ్యయంతో 6902 ఎకరాల మేర జోన్ 9ని అభివృద్ధి చేయనున్నారు. రూ.2102 కోట్ల వ్యయంతో 7838 ఎకరాల మేర జోన్ 12 అభివృద్ధి పనులు చేపడతారు. రూ.1498 కోట్ల వ్యయంతో 3860 ఎకరాల మేర 12ఏ జోన్‌ పరిధిలో పనులు ఆరంభిస్తారు. ప్రతి జోన్‌లోనూ రహదారులు, వారధులు, విద్యుత్, నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఐసీటీ వంటి మౌలిక వసతుల ఏర్పాటుచేస్తారు.

నిర్మాణమైన రాష్ట్ర శాసనసభ, హైకోర్టు భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో చర్చించడానికి ఏపీ సీఆర్‌డీఏ బృందం ఈనెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనున్నది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈనెల 12న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ సీఆర్‌డీఏ బృందానికి సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈనెల 9న ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకొచ్చిన స్టెడీ ఎరీనా...

 

 
amaravati-sports-complex-05102017.jpg
share.png

అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి స్టెడీఎరీనా అనే బ్రిటీష్ సంస్థ ముందుకొచ్చింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి క్రీడలకు అనువైన ప్రాంగణాలన్నీ ఒకేచోట నిర్మిస్తారు.

20 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణానదికి అభిముఖంగా ఈ స్పోర్ట్స్ కాంప్లోక్స్ నిర్మించాలని సీఆర్‌డీఏ తలపోస్తోంది. దీనిని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటుచేయాలని మంత్రి పి. నారాయణ సూచించారు.

 

హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ నిర్వహణకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...