sonykongara Posted September 21, 2017 Author Posted September 21, 2017 సీఎంని కలిసిన రాజమౌళి మూడు విడతలుగా భేటీ.. డిజైన్లపై చర్చ రాజమౌళి సూచించేది కాన్సెప్టు మాత్రమే: నారాయణ అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తగిన సూచనలు ఇచ్చేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సీఎం చంద్రబాబును కలిశారు. బుధవారం అమరావతి వచ్చిన రాజమౌళి మూడు విడతలుగా సీఎంతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో, మధ్యాహ్నం కలెక్టర్ల సదస్సులో, రాత్రి విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో రాజమౌళి భేటీ అయ్యారు. ఐకానిక్ నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టులు ఎలా రూపుదిద్దుకోవాలని సీఎం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. వీటి కోసం మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ రూపొందించిన డిజైన్లు, వాటి వెనుక ఉన్న కాన్సె్‌ప్టల గురించి ఆ సంస్థ ప్రతినిధులతోపాటు సీఆర్డీయే ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజమౌళికి వివరించారు. అంతకుముందు రాజమౌళి రాజధాని ప్రాంతాన్ని, వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. కాగా, రాజమౌళి సలహాలు ఇచ్చేది డిజైన్లకు సంబంధించి కాదని,ఏ కాన్సె్‌ప్టలో అవి రూపొందితే బాగుంటాయో మాత్రమే సూచిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబరు 12 లేదా 13 తేదీల్లో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్ వెళ్లి, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.ఈ సేవలకుగాను రాజమౌళికి ఫ్రభుత్వం ఎలాంటి ఫీజూ చెల్లించడంలేదన్నారు. సచివాలయం భేష్: రాజమౌళి వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు బాగున్నాయని రాజమౌళి కితాబిచ్చారు. సచివాలయం మొదటి బ్లాకులోని సీఎం చాంబరు, సమావేశపు గదులను, అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించారు.
sonykongara Posted September 21, 2017 Author Posted September 21, 2017 http://www.andhrajyothy.com/artical?SID=466855
sonykongara Posted September 21, 2017 Author Posted September 21, 2017 ఆకృతుల రూపకల్పనలో సహకరిస్తా: రాజమౌళి ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా ఆకృతుల రూపకల్పనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చెప్పారు. బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వేర్వేరు సమయాల్లో మొÅ్తŒం మూడు సార్లు సమావేశమయ్యారు. ఆకృతుల పరంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు. ప్రస్తుత ఆకృతులు ఏ ప్రాతిపదికన రూపొందించారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాజధాని నిర్మాణ ఆకృతులు ఉండాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. బాహ్య స్వరూపం ఆకట్టుకునేలా ఉండాలన్నారు. రాజధాని నిర్మాణం ప్రపంచంలోని అగ్రనగరాల్లో ఒకటిగా ఉండాలని, ప్రజలందరూ ఆమోదించేలా ఉండాలని స్పష్టం చేశారు. లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులను కలిసేందుకు దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. తొలుత నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం అవుతానని, ఆ తర్వాత లండన్ వెళతానని చెప్పారు. దర్శకుడు రాజమౌళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. అక్కడి శాసనసభ, ఇతర భవనాలను పరిశీలించారు. కరకట్ట మీదుగా ప్రయాణం చేసి రాయపూడిలో ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్ నుంచి నదిలో బోటుపై పున్నమిఘాట్ వరకు ప్రయాణం చేశారు. ఆ ప్రాంతాలను సందర్శించారు. తాను తిరిగిన ప్రదేశాలను చరవాణిలో బంధించారు. అనంతరం మూడో సారి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువకప్పి సీఎం ఘనంగా సత్కరించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్కిటెక్టు చంద్రశేఖర్, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ఉన్నారు. దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అధ్యయనం చేస్తారు: మంత్రి నారాయణ నార్మన్‌ఫోస్టర్ ఆకృతులను అధ్యయనం చేసి మరోసారి సీఎంతో దర్శకుడు రాజమౌళి సమావేశమవుతారని మంత్రి నారాయణ చెప్పారు. సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవగాహన కోసం రాజధాని ప్రాంతంలో రాజమౌళి పర్యటించారని, వివిధ ప్రాంతాలను పరిశీలించి సందేహాలను తీర్చుకున్నారని వివరించారు. చరిత్ర తెలిసిన వ్యక్తి కావడం, వివిధ దేశాల్లో పర్యటించిన అనుభవం ఉండటంతో రాజధాని ఆకృతుల విషయంలో ఆయన సహాయం కోరగా సానుకూల స్పందన లభించిందని చెప్పారు. నార్మన్‌ఫోస్టర్ రూపొందించిన డైమండ్ ఆకృతి అంతగా నచ్చలేదని ప్రజాభిప్రాయసేకరణలో తేలిందన్నారు. రహదారుల నిర్మాణానికి 15లోగా టెండర్లు రాజధాని ప్రాంతంలో 365 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్ల నిర్మాణానికి వచ్చే నెల 15లోగా టెండర్లను పిలువనున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. వీటిని ఏడాదిలోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయం, ఐకానిక్ భవనాలలో మౌలిక సదుపాయాల కల్పన, భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 27 గ్రామాలకు చెందిన రైతులకు స్థలాలు ఇచ్చామని వెల్లడించారు.
sonykongara Posted September 21, 2017 Author Posted September 21, 2017 అందులో నిజం లేదు: రాజమౌళి హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ సలహాదారు, రూపశిల్పి, పర్యవేక్షకుడిగా తాను నియమితుడైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పష్టం చేశారు. అమరావతి రాజధాని విషయంలో దర్శకుడు రాజమౌళి సలహాలను తీసుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడిని కలిసిన రాజమౌళి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. తాజాగా ఈ విషయమై రాజమౌళి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అమరావతి నిర్మాణ సలహాదారు, డిజైనర్, పర్యవేక్షకుడిగా నన్ను నియమించారన్న వార్తల్లో నిజం లేదు. ఫోస్టర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ. వారు అందించిన డిజైన్లు అన్నీ ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయన్నది నా అభిప్రాయం. చంద్రబాబునాయుడు గారు ఆయన బృందం ఆ డిజైన్లతో చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే అసెంబ్లీ భవన డిజైన్ మరింత అద్భుతంగా ఉంటే బాగుండేది అభిప్రాయపడ్డారంతే. భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి నేను కేవలం చంద్రబాబునాయుడిగారి విజన్‌ను ఫోస్టర్, వారి భాగస్వాములకు వివరిస్తానంతే. చారిత్రక ప్రాజెక్టులో నావంతు కృషి, సహాయం చాలా చిన్నది’ అని వరుస ట్వీట్లు చేశారు.
sonykongara Posted September 21, 2017 Author Posted September 21, 2017 ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం: రాజమౌళి21-09-2017 17:39:03 హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం తనను కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా, సూపర్‌వైజర్‌గా నియమించారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అమరావతి రూపశిల్పిగా రాజమౌళిని నియమించారంటూ కొద్దిరోజులుగా మీడియా కోడైకూస్తోంది. ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై స్పందించిన రాజమౌళి తన ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది అని పేర్కొన్నారు. అమరావతిపై వారు సమర్పించిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయని.. ఆ డిజైన్స్ సీఎం చంద్రబాబుకి కూడా ఎంతగానో నచ్చాయన్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ మరింత ప్రత్యేకంగా ఉండాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను, విజన్‌ను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధలకు వివరించడమే తన పని అని క్లారిటీ ఇచ్చారు. చరిత్రాత్మక ప్రాజెక్టు రూపకల్పనలో తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చిన్న సాయంగానే భావిస్తానని చెప్పారు రాజమౌళి.
sonykongara Posted September 22, 2017 Author Posted September 22, 2017 రాజమౌళి మంచి సృష్టికర్త.. ఆయన ఆలోచనలు వాడుకుంటా: చంద్రబాబు విజయవాడ: దర్శకుడు రాజమౌళిపై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. రాజమౌళి మంచి సృష్టికర్త, బాహుబలి సినిమా బాగా తీశారని కొనియాడారు. అందుకే ఆయన ఆలోచనలను డిజైన్లలో వాడుకుంటున్నామని సీఎం చెప్పారు. రాజమౌళి కూడా సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో డిజైన్లపై చంద్రబాబును రాజమౌళి కలిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం భవనాల విషయంలో సలహాలివ్వాలని ప్రభుత్వం కోరడంతో ఆయన సీఎంను కలిశారు. ఈ భేటీలో అమరావతి డిజైన్లపై చర్చించారు. ఈ నెలాఖరులో లండన్ రాజమౌళి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలిస్తారు.
sonykongara Posted September 23, 2017 Author Posted September 23, 2017 సొంతిళ్లు లేని అమరావతి ప్రజలకు శుభవార్త.. రాజధానిలో.. పేదలకు సొంతిళ్లు రెండు దశలుగా పదివేల ఇళ్లు తొలిదశలో 5,024 గృహాలు పది గ్రామాల్లో 50 ఎకరాల కేటాయింపు పూర్తి కావొస్తున్న లబ్ధిదారుల ఎంపిక ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు 2018 డిసెంబరు కల్లా పూర్తి రాజధాని గ్రామాల్లో సొంతిళ్లు లేని పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధానిలో ఎంపిక చేసిన పది గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో పదివేల పక్కా గృహాలను జీ+3 భవన సముదాయాల రూపంలో నిర్మించి ఇవ్వనుంది. సీఆర్డీయే నిర్వహించిన ఓ సర్వేలో రాజధాని గ్రామాల్లో సుమారు ఏడు వేల కుటుంబాలకు సొంతిళ్లు లేవని తేలింది. వీరందరికీ రెండు దశలుగా అద్భుతమైన కాలనీల రూపంలో పక్కా గృహాలను నిర్మించి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అమరావతి: రాజధాని గ్రామాల్లో పేదలకు సొంతింటి కల సాకారం కానుంది. రాజధానిలో ఎంపిక చేసిన పది గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో పదివేల పక్కా గృహాలను జీ+3 భవన సముదాయాల రూపంలో నిర్మించి ఇవ్వనుంది. సీఆర్డీయే నిర్వహించిన ఓ సర్వేలో రాజధాని గ్రామాల్లో సుమారు ఏడు వేల కుటుంబాలకు సొంతిళ్లు లేవని తేలింది. వీరందరికీ రెండు దశలుగా అద్భుతమైన కాలనీల రూపంలో పక్కా గృహాలను నిర్మించి ఇచేవిధంగా రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.345 కోట్ల వ్యయంతో 5,024 మందికిగాను 50 ఎకరాల్లో మూడు కేటగిరీలుగా.. పక్కా గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రెండోదశలో అవసరమైతే మరో ఐదు వేల పక్కా గృహాలను నిర్మించేందుకు సిద్ధమని సీఆర్డీయే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు పట్టణ నివాస సముదాయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో గృహ నిర్మాణాలను చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో గృహ నిర్మాణాలను చేపట్టి వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు నవులూరు సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. పది గ్రామాల్లో గృహ నిర్మాణాలు రాజధాని అమరావతిలో వున్న 27 గ్రామాలకుగాను పది గ్రామాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ గృహనిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నారు. నవులూరు, ఉండవల్లి, పెనుమాక, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, మందడం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో గృహ నిర్మాణాలను జరిపేందుకు నిర్ణయించారు. ఈ పది గ్రామాలకు కలిపి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ టిడ్కో ఆఽధ్వర్యంలో గృహ నిర్మాణాలను చేపడతారు. ఉదాహరణకు మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూ గ్రామానికి సంబంధించి నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం గ్రామాలకు కలిపి తొలిదశలో ఏడొందల గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ గృహాలను నవులూరు పోతురాజు చెరువుకు ఉత్తరంగా ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటికే సంబంధిత స్థలాన్ని ఏపీ టిడ్కోకు స్వాధీనం చేసింది. మూడు కేటగిరీలుగా.. పక్కా గృహాలను ఏపీ టిడ్కో మూడు కేటగిరీలుగా నిర్మించనుంది. అన్నీ కేటగిరీలు జీ+3 భవన సముదాయాలుగానే వుంటాయి. 300 చ.అడుగులు, 365 చ.అడుగులు, 430 చ. అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తారు. ఈ మూడింటికి సంబంధించి యూనిట్ ధరలను వరుసగా రూ.5.73 లక్షలు, రూ.6.60లక్షలు, రూ.7.47లక్షలుగా నిర్ణయించారు. మూడు కేటగిరీలకు సబ్సిడీ ఒకేరకంగా వుంది. బ్యాంకుల నుంచి ఇప్పించే రుణసౌకర్యంలో మాత్రమే వ్యత్యాసం వుంటుంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో యూనిట్‌కు చెరిసగం వంతున రూ.మూడు లక్షల మేర సబ్సిడీ ఇస్తాయి. బ్యాంకుల నుంచి ఇప్పించే రుణం మొదటి కేటగిరీకి రూ.2.72 లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.10లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.47 లక్షల వంతున వుంటుంది. లబ్దిదారుని వాటా విషయానికొస్తే.. తొలి కేటగిరీకి కేవలం అయిదొందల రూపయాలు మా త్రమే! రెండో కేటగిరీ గృహాలవారికి రూ.50వేలు, మూడో కేటగిరీ గృహాల వారికి రూ.లక్ష వంతున నిర్ణయించారు. ఈ సొమ్మును నాలుగు వాయిదాలలో చెల్లించే వెసులుబాటును ఏపీ టిడ్కో కల్పించింది. బ్యాంకు రుణాలను అయిదు నుంచి 25 సంవత్సరాలలోపు నెలసరి వాయిదాలుగా చెల్లించాల్సి వుంటుంది. చెల్లింపులు పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంటిపై లబ్దిదారునికి యాజమాన్యపు హక్కు లభిస్తుంది. వరుసగా రెండు వాయిదాలను చెల్లించకుంటే మూడో మాసంలో టిడ్కో అధికారులు సంబంధిత ఫ్లాట్‌కు తాళాలు వేసేవిధంగా ఒప్పందం వుంది. అద్భుతంగా రూపొందనున్న కాలనీలు రాజధాని గ్రామాల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ సుందర కాలనీలు మహా అద్భుతంగా వుండబోతున్నాయి. ఈ కాలనీల్లో ఏపీ టిడ్కో సకల సదుపాయాలను రాజీ లేకుండా సమకూర్చనుంది. విశాలమైన వీధులు, అంతటా పచ్చని గ్రీనరీ, పార్కులు, ఆసుపత్రి, పాఠశాలతో పాటు ఇతర మౌలిక వసతులన్నింటిని పూర్తిస్థాయిలో కల్పిస్తారు. నవులూరు పోతురాజు చెరువు వెంబడి నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం గ్రామాలకు కలిపి ఆరున్నర ఎకరాల్లో నిర్మించనున్న కాలనీ పక్కగా ఎయిమ్స్ నుంచి రాజధాని వైపు వెళ్లే 210 అడుగుల రహదారి ఏర్పాటుకానుంది.
sonykongara Posted September 25, 2017 Author Posted September 25, 2017 3450 Crore to Put Amaravati on Rail Map? Indian Railways has finished the survey to connect Amaravati, the upcoming capital of Andhra Pradesh with Railways. 106.56 Kilometers of the track has to be laid to connect Amaravati on Rail Map and this is going to cost a whopping 3450 Crore. 800 hectares of land had to be acquired for this track and this complete expense had to be born by Andhra Pradesh government. Amaravati will also get a huge terminal which will only cost a sensational 500 Crore. The exact location had to be finalized. Once this track is complete, one can directly travel to Delhi, Hyderabad, and Chennai from Amaravati itself. Cargo facilities will also come up which will make the transportation of construction material for the Capital easy.
sonykongara Posted September 25, 2017 Author Posted September 25, 2017 అమరావతికి రైలు మార్గం తుది సర్వే పూర్తి పెరిగిన అంచనా వ్యయం రూ. 2,680 కోట్ల నుంచి రూ. 3,450 కోట్లకు? రైలు మార్గాలకు 800 హెక్టార్ల భూసేకరణ ఈనాడు, హైదరాబాద్, గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నూతన రైలు మార్గం తుది స్థానం (ఫైనల్ లొకేషన్) సర్వే పూర్తయ్యింది. రైల్వే అధికారులు ఈ మేరకు నివేదికను సిద్ధం చేశారు. మొత్తం మూడు మార్గాల్లో నిర్మించే 106.56 కిలోమీటర్ల మేర అమరావతికి అనుసంధాన రైలు మార్గాలకు రూ.3,450 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సర్వే అంచనా వ్యయం రూ.2,680 కోట్లతో పోలిస్తే ఇది రూ.770 కోట్లు అధికం. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆమోదంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, జపాన్‌కు చెందిన సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాత రైల్వేబోర్డుకు పంపిస్తారు. మొత్తం ఈ నూతన రైలు మార్గాలకు 800 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు క్షేత్రస్థాయి సర్వేలో గుర్తించారు. 23 మేజర్, 160 మైనర్ వంతెనలు ఆయా మార్గాల్లో నిర్మిస్తారు. ఎర్రుపాలెం-అమరావతి మార్గంలో రెండు వరుసల (డబ్లింగ్)తో కృష్ణా నదిపై దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంతో భారీ వంతెన నిర్మించనున్నారు. పెదకూరపాడు - అమరావతి, సత్తెనపల్లి - నరసరావుపేటల మధ్య కొత్తగా సింగిల్ లైన్లు నిర్మిస్తారు. రాజధాని ప్రాంతంలో భారీ టెర్మినల్ రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ టెర్మినల్‌కు రూ. 500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది పూర్తయితే అమరావతి నుంచి నేరుగా దిల్లీ, హైదరాబాద్, చెనై నగరాలకు వెళ్లే సదుపాయం వస్తుంది.
sonykongara Posted September 26, 2017 Author Posted September 26, 2017 సింగపూర్‌కు రాజధాని రైతులు 26-09-2017 22:26:44 అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు సింగపూర్ చూపించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. రైతులే ముందు ప్రాతిపదికన 100 మంది రైతులను ఎంపిక చేశారు. మూడు విడతలుగా 100 మంది రైతులను సీఆర్డీఏ సింగపూర్ తీసుకెళ్లనుంది. అక్టోబర్ 22న తొలి బృందం అక్కడికి వెళ్లనుంది
sonykongara Posted September 27, 2017 Author Posted September 27, 2017 ఏపీలో పెట్టుబడులకు ఆసియా కంపెనీల ఆసక్తి అవకాశాల్ని వివరించిన అజయ్‌జైన్ ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్, ఇతర ఆసియా దేశాలకు చెందిన 100 కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, భద్రతా వ్యవస్థలు, నాణ్యత నియంత్రణ, ఆకర్షణీయ నగరాల అభివృద్ధి, ఆహార పదార్థాల ప్రాసెసింగ్, నీటి సరఫరా, డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థలు, ఆతిథ్య రంగం, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రవాణా, సుస్థిర ఇంధన సామర్థ్యం, ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ సింగపూర్‌లోని మెరీనా బే కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ఆసియా-సింగపూర్ మౌలిక వసతుల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ బృందాన్ని సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ప్రతినిధులు... సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పరిచయం చేశారు. అమరావతిలో పెట్టుబడి అవకాశాల గురించి సీఆర్‌డీఏ ప్రత్యేక కమిషనర్ వి.రామమనోహర్‌రావు వివరించారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ సంస్థల కన్సార్టియం తీసుకుంటున్న చర్యలను సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ప్రతినిధి బెంజమిన్ యాప్ వివరించారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లకు తమ సహకారం కొనసాగుతుందని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ పునరుద్ఘాటించారు.
sonykongara Posted September 27, 2017 Author Posted September 27, 2017 చంద్రబాబు, రాజమౌళి లండన్ పర్యటన ఖరారు అమరావతి: సీఎం చంద్రబాబు, దర్శకుడు రాజమౌళి లండన్ పర్యటన ఖరారైంది. లండన్‌లో అక్టోబర్ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు. అక్టోబరు 11, 12, 13 తేదీల్లో లండన్ నార్మన్ ఫోస్టర్ ఆఫీస్‌లో అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై వర్క్‌షాప్‌లో డైరెక్టర్ రాజమౌళి పాల్గొననున్నారు. రాజధాని నిర్మాణాలపై ఈ నెల 20వ తేదిన చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అంతర్జాతీయ పోటీలకు అమరావతి ఆతిధ్యం ఇవ్వనుందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా వన్ తరహాలో పవర్ బోటింగ్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలిసారిగా నదిలో నిర్వహిస్తున్న పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే పోటీల కోసం వివిధ దేశాల నుంచి క్రీడాకారులు రానున్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు చంద్రబాబు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు
sonykongara Posted September 27, 2017 Author Posted September 27, 2017 అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా అమరావతిలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసు విభాగాన్ని ఆధునికీకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.25,060 కోట్లు కేటాయించనున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now