sonykongara Posted April 18, 2019 Author Posted April 18, 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు వచ్చే 60 రోజుల్లోయుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులు ఖాళీగా కూర్చోను... పాలన పక్కన పెట్టను ఫలితాలు వచ్చే వరకు ప్రజాసమస్యలు పరిష్కరిస్తా సీఎం చంద్రబాబు సమీక్ష ఈనాడు - అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులు ఈ 45 రోజుల్లో కొంత మందగించాయని, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 60 రోజుల్లో ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపడతామని, వర్షాకాలం మొదలయ్యేసరికే ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేసి, క్రస్ట్ లెవెల్ వరకు గేట్లు బిగించి... గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని ఆయన బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ‘జూన్ 20 నాటికి గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని గత లెక్కలు చెబుతున్నాయి. అప్పటికి అవసరమైన పనులు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ఇంతవరకు 68.99 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్వాసితులకు పునరావాసానికి సంబంధించి రూ.60కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే వెంటనే విడుదల చేయమని చెప్పా. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో.. ఇంకా రూ.4,508.35 కోట్లు రావాల్సి ఉంది. ఆ నిధులూ ఇవ్వకుండా, సవరించిన డీపీఆర్‌ను ఆమోదించకుండా కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెడుతోంది. నిధుల్లేవని పనులు ఆపేస్తే మొత్తం ప్రాజెక్టు ఆగిపోతుంది. అందుకే ఏదో ఒకలా నిధులు సర్దుబాటు చేసుకుంటూ ముందుకి తీసుకు వెళుతున్నాం...’’ అని చంద్రబాబు వివరించారు. ఖాళీగా కూర్చోను... పాలన పక్కన పెట్టను ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పాలనను పక్కన పెట్టి కూర్చునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘ఫలితాలు వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. అంతవరకు ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఖాళీగా కూర్చోను. వారి సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నాకు ముఖ్యం...’ అని తెలిపారు. పోలవరం పనుల పురోగతిపై బుధవారం ఆయన ఉండవల్లిలోని ప్రజావేదికలో 90వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఆలస్యాన్ని అధిగమించి పనులు సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. . ఇటీవలే ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్‌కే జైన్, తదితరులు 2 రోజుల పాటు పోలవరంలోనే ఉండి పనుల ప్రగతిని సమీక్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుత దశలో కాఫర్ డ్యాం నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళ్లాలో లేదో మీ ముఖ్యమంత్రితో చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని అథారిటీ సూచించింది. ఆ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం నదీ గర్భంలోకి కాఫర్ డ్యాం పనులు చేపట్టాలా లేదా అన్న విషయంలో సంశయంతో ఉన్నామన్న విషయాన్ని వివరించారు. నదీ ప్రవాహాలు వచ్చేలోపు కాఫర్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి అవుతాయో లేదో అన్న కోణంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. యంత్ర సామగ్రిని పెంచుకుని ఎట్టి పరిస్థితుల్లో కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. అనుకున్న సమయానికి స్పిల్‌వే ఛానల్ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించాల్సి ఉంది. జూన్ నెలాఖరుకల్లా 35 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ పనులు ముందుగా చేసి స్పిల్ వే ఛానల్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చెప్పారు. గేట్ల ఏర్పాటుకు సంబంధించి జర్మనీ నుంచి సిలిండర్లు రావాల్సి ఉందని, అవి జూన్ నెలలో వస్తాయని అధికారులు వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రాగానే కార్యాచరణ ప్రణాళికతో వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పునరావాస పనులు ఎంత వరకు వచ్చాయని సీఎం అడిగి తెలుసుకున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరులో 660 ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దుతున్నామని వారు వివరించారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు అదనంగా ఇవ్వడం వల్ల కమ్యూనిటీ హాలు, పార్కు, ఆటస్థలం, అంగన్‌వాడీ భవనం, షాపింగ్ కాంప్లెక్సు తదితరాలన్నీ ఒకే చోట వచ్చేలా 24 మౌలిక వసతులతో నిర్మిస్తున్నట్లు పునరావాస కమిషనర్ రేఖారాణి పేర్కొన్నారు. 60 కోట్ల వరకు నిధులు అవసరమని కూడా పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు శ్రీధర్, పునరావాస కమిషనర్ రేఖారాణి పాల్గొన్నారు
sonykongara Posted April 18, 2019 Author Posted April 18, 2019 ప్రోగ్రెస్ వెరీ పూర్ 18-04-2019 03:19:30 పోలవరం పనుల తీరుపై సీఎం అసంతృప్తి 46రోజులుగా సమీక్షలు లేకపోవడంతో ప్రతిష్టంభన నెలకొందని అసహనం ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధే ముఖ్యం ఫలితాల కోసం పాలన ఆగదని స్పష్టీకరణ సహాయ పునరావాస పనుల్లో వేగం పెంచాలి ప్రత్యామ్నాయ కార్యాచరణతో నేడు మళ్లీ రండి ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, అప్పటిదాకా పాలన పక్కనపెట్టి కూర్చోబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాసమస్యలు పరిష్కరించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తనకు ముఖ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై బుధవారం 90వ వర్చువల్ రివ్యూ నిర్వహించారు. జూలై నాటికి ప్రాజెక్టు నుంచి నీరిచ్చేలా 60రోజుల ప్రత్యామ్నాయ ప్రణాళికలతో పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఎన్నికల హడావిడిలో 46రోజుల పాటు సమీక్షలు నిర్వహించకపోవడంతో పనుల్లో ప్రతిష్టంభన నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు ప్రోగ్రెస్ ఈజ్ వెరీపూర్’ అంటూ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా నీటిని నిలుపుదల చేసి, వరదను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. 60రోజుల ప్రత్యామ్నాయ ప్రణాళికను 24గంటల్లో సిద్ధం చేయాలని, దానిపై గురువారం సమీక్షిద్దామని సీఎం ఆదేశించారు. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అందుబాటులో లేనందున ఈ సమీక్షను 22న నిర్వహించాలన్న ఈఎన్‌సీ ప్రతిపాదనతో ఆయన ఏకీభవించలేదు. ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇంకా తాత్సారం చేసేందుకు వీల్లేదన్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై చర్చిద్దామని స్పష్టం చేశారు. ఎన్నికల కారణంగా పనుల్లో జరిగిన జాప్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్‌డ్యామ్ నిర్మాణం 42.6మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉందని, జూన్ నాటికి 36మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తి చేయాలన్నారు. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ ముందుగా నిర్మించి స్పిల్ చానల్ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్వాసితులకు పునరావాసం, సహాయ కార్యక్రమాలు ప్రాజెక్టు నిర్మాణంతో సమానంగా పూర్తికావాలన్నారు. గోదావరికి వరద పోటెత్తినా పనులకు ఆటంకం కలుగకుండా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లా పునరావాస కాలనీలు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో 660ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న పునరావాస కాలనీని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దుతున్నామని ప్రాజెక్టు సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి తెలిపారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఇవ్వడంతో పాటు కమ్యూనిటీ హాల్, పార్కు, ఆటస్థలం, అంగన్‌వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటర్నరీ డిస్పెన్సరీ వంటి 24 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. కోళ్లు, గేదెలు, ఆవుల పెంపకానికి సామూహిక వసతులు కల్పించాలని, పునరావాస కాలనీల్లో విద్యుత్ సదుపాయం ఉండేలా ముందస్తు చర్యలు చేట్టాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో ప్రాజెక్టు ప్రాంతం నుంచి ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు రమేశ్‌కుమార్, ఉండవల్లి ప్రజావేదిక నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ హాజరయ్యారు. గురువారం సమావేశానికి ప్రధాన నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. పూర్తయిన పనులు ఇవీ.... ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు మొత్తం 69శాతం పూర్తికాగా, తవ్వకం పనులు 84.60శాతం, కాంక్రీట్ పనులు 72.40శాతం మేర పూర్తయ్యాయి. కుడి ప్రధాన కాలువ 90.87శాతం, ఎడమ ప్రధాన కాలువ 70.38శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66.22శాతం, ఎగువ కాఫర్‌డ్యామ్ పనులు 40.71శాతం, దిగువ కాఫర్‌డ్యామ్ పనులు 26.04శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మొత్తం 38.88లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, 1169.66లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులకుగాను 989.16లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యాయని తెలిపారు. గతవారం స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.43లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తయినట్లు చెప్పారు. స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 31వేల క్యూబిక్ మీటర్ల వరకూ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా రూ.4,508.35కోట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
sonykongara Posted April 25, 2019 Author Posted April 25, 2019 పనుల్లో పురోగతి ఏదీ? 25-04-2019 01:41:59 పోలవరం ప్రాజెక్టుపై పీపీఏ అసంతృప్తి కాఫర్ డ్యాం డిజైన్లపై సమీక్ష ప్రత్యామ్నాయ నమూనా ఇవ్వాలని నవయుగ సంస్థకు ఆదేశం సహాయ పునరావాసంపైనా చర్చ నేడు పూర్తి స్థాయిలో సమీక్ష అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం విజయవాడలోని ప్రాజెక్టు సహాయ పునరావాస కమిషనర్ కార్యాలయంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాల తీరుపై పీపీఏ సీఈవో ఆర్‌కె జైన్, చీఫ్ ఇంజనీర్ ఏకే ప్రధాన్, కృష్ణా బోర్డు చైర్మన్ ఆర్‌కే గుప్తా, పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ కె.శంకర్ సమీక్షించారు. ఇందులో రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరో రెండు నెలల్లో గోదావరిలో వరద ఉధృతి పెరగనున్నందున ఆలోగా కాఫర్ డ్యాంల నిర్మాణ పనులు పూర్తి చేయడంపై ప్రధానంగా చర్చించారు. కాంట్రాక్టు సంస్థ నవయుగకు ఇండో-కెనడియన్ కంపెనీ (ఐసీసీ) అందించిన కాఫర్ డ్యాం డిజైన్లను పరిశీలించింది. గోదావరిలో వరద ఉధృతి మరో రెండు నెలల్లో పెరగనున్నందున ప్రత్యామ్నాయ డిజైన్లను గురువారంనాటి సమావేశంలో అందజేయాలని ఐసీసీని పీపీఏ ఆదేశించింది. గోదావరిలో గత మూడేళ్లుగా 15 లక్షల క్యూసెక్కుల దాకా వరద వస్తోంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను ప్రస్తుతం 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్లు రూపొందించారు. జూలై నెలాఖరునాటికి వీటి పూర్తికి అవసరమయ్యే వనరులు, యంత్రసామగ్రిపై కాంట్రాక్టు సంస్థ స్పష్టత ఇవ్వాలని పీపీఏ సూచించింది. వరద ఉధృతిని తగ్గించి.. స్పిల్‌వే వైపు గోదావరి జలాలు రాకుండా చేసేలా కాఫర్ డ్యాంను కొంత గ్యాప్‌తో నిర్మించడంపైనా దృష్టి సారించాలని అభిప్రాయపడింది. గురువారం నాటి సమావేశంలో స్పష్టమైన అభిప్రాయం వెల్లడిస్తామని తెలిపింది. కాగా.. 90 రోజుల పాటు పనుల వేగాన్ని పెంచుతూ పోతే.. కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్, రేడియల్ గేట్ల బిగింపు కార్యక్రమాలు పూర్తవుతాయని జల వనరుల శాఖ తెలిపింది. ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలు, నిర్మించి ఇస్తున్న గృహాలపై కమిషనర్ రేఖారాణితో పీపీఏ సమీక్షించింది. డిజైన్లపై పీపీఏ సమీక్షా? పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావలసిన పీపీఏ.. డిజైన్లపై సమీక్ష నిర్వహించవచ్చా అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిజైన్లపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకోవలసి ఉందని.. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ)లో సమీక్షించాకే.. డిజైన్లలో తాత్కాలికంగానైనా మార్పులు, చేర్పులూ చేయాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాఫర్ డ్యాం నిర్మాణ డిజైన్లపై సాంకేతికానుభవం లేని పీపీఏ ఏవిధంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డీడీఆర్‌సీ సమావేశం జరగాల్సి ఉన్నా.. సంబంధిత అధికారులు ఎవరూ రాలేదని.. అప్పుడు కూడా పీపీఏనే సమీక్షించిందని గుర్తు చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో గోదావరి డెల్టా రైతులకు సాగు నీరందించడాన్ని తప్పుపట్టడాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
rk09 Posted May 22, 2019 Posted May 22, 2019 almost crest level ki completed but inka 1 meter paine legavali lekapothe galleries loki water velthayi
SREE_123 Posted May 29, 2019 Posted May 29, 2019 Looks PPA...eddude nedhra lechenatuu vundheee.......next month varadhalu..vasthayeee.....no coper dam completion.... if it is half ......guess it may wash away... https://www.eenadu.net/ap/mainnews/2019/05/29/123278/
ravikia Posted May 29, 2019 Posted May 29, 2019 Central Govt not interested in giving money for R&R and they won't release. Unless they release, water cannot be stored to even basic level without cofferdam. I don't think this project will ever complete in coming 3-4 years. They may try to do it probably at the end of Jagan term in 2024. Ee lopu docukunnodiki dochukunnantha. They will remove Navayuga soon or make Navayuga to walkaway.
rama123 Posted August 17, 2019 Posted August 17, 2019 Contractors also fixed it seems 2 ap and 1 tg Peddyreddy and megha
SREE_123 Posted August 17, 2019 Posted August 17, 2019 (edited) center enee warning luu echenaa mana peche reddy venadamu ledhu gaaa...! విరమించుకోండి పోలవరం రీ టెండర్ల నిర్ణయంపై ‘అథారిటీ’ సలహా మళ్లీ టెండర్లకు వెళితే ప్రాజెక్టు అనిశ్చితిలోకే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ ఈనాడు - అమరావతి పోలవరం ప్రాజెక్ట్ టెండర్‌ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న (రీ టెండరింగ్) నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని, ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆందోళన వ్యక్తంచేసింది. రీ టెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ ప్రకటనకు సిద్ధమవుతూ.. శుక్రవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో.. ప్రాజెక్టు అథారిటీ ఈ సూచనలు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆర్.కె.జైన్ శుక్రవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి లేఖ రాశారు. పోలవరం రీటెండరింగ్ అంశంపై ఈ నెల 13న హైదరాబాద్‌లో అత్యవసరంగా నిర్వహించిన పీపీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్నే పునరుద్ఘాటించారు. ‘‘ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రిక్లోజర్, రీ టెండరింగ్ ఆలోచనల్ని విరమించుకోవాలని మీకు వినయపూర్వకంగా సలహా ఇస్తున్నాను. కనీసం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి తీసుకునే వరకైనా... మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి’’ అని సూచించారు. ‘‘ఈ నెల 13న నిర్వహించిన పీపీఏ అత్యవసర సమావేశంలో మనం చర్చించిన అంశాలను దయచేసి గుర్తు తెచ్చుకోండి. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరంగానీ, అలా చేయాలన్న ఆలోచనకు బలమైన ప్రాతిపదికగానీ లేదన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టు జాప్యమవడంతో పాటు, ఖర్చూ పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు సకాలంలో పూర్తవకపోతే ప్రయోజనాలు అందడమూ ఆలస్యమవుతుంది. అది సామాజిక-ఆర్థిక పరంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నారు. ఆ సమావేశం మినిట్స్‌తో పాటు, ఆ అంశంపై నివేదిక రూపొందించే పని తుది దశలో ఉంది. దాన్ని త్వరలోనే మా మంత్రిత్వశాఖకు పంపిస్తాం. మీకు కూడా అందజేస్తాం’’ అని ఆయన తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో లేఖ..! పోలవరం పనులపై రీటెండరింగ్‌కి వెళ్లాలన్న నిర్ణయంపై ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పీపీఏ ఆందోళన వ్యక్తంచేసింది. మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థకు పనులు అప్పగిస్తే ఖర్చు పెరగడం, ప్రాజెక్టులో జాప్యం జరగడంతో పాటు ఇతర సమస్యలూ తలెత్తుతాయని తెలిపింది. ఖర్చు పెరిగితే ఆ భారాన్ని కేంద్రం భరించబోదనీ స్పష్టం చేసింది. ఆ నిర్ణయం వల్ల తలెత్తే లాభనష్టాల్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు పనులు చేస్తున్న సంస్థను కాదని, మరో సంస్థకు పనులు అప్పగిస్తే సాంకేతిక నైపుణ్యం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లను ప్రశ్నించింది. ఇప్పుడు మళ్లీ లేఖ రాసింది. Edited August 17, 2019 by SREE_123
Raaz@NBK Posted August 17, 2019 Posted August 17, 2019 Bharati cement ki Cement bastala contract and Commision lu vasthai and Navayuga vadini tappinchali... Ee 3 points Medha depend ayi alochanalu chesthunnadu Jagga.. project cost inko 10k crores ki perigina Jagga ki no problem..
rama123 Posted August 17, 2019 Posted August 17, 2019 Peeaganivvaru.,....taggistharu vere vaatilo istaru.... Menu taggichamu antaru
Raaz@NBK Posted August 17, 2019 Posted August 17, 2019 (edited) 6 minutes ago, rama123 said: Peeaganivvaru.,....taggistharu vere vaatilo istaru.... Menu taggichamu antaru Taggithe maha ayithe 180 crores taggutadhi antunnaru bcoz one contractor cutting 5% off.. But akkada tagge chance ksnapadadam ledhu.. Navayuga vaadu Old rates prakaram work chesthunnadu.. Edited August 17, 2019 by Raaz@NBK
Kumbk Posted August 17, 2019 Posted August 17, 2019 (edited) 10 hours ago, rama123 said: Peeaganivvaru.,....taggistharu vere vaatilo istaru.... Menu taggichamu antaru This is a very valid point. Kaani contractor change ayithe delays ekkuva ga vuntayi. Polavaram level projects execution chala complicated ga untundhi due to too many variables that can go wrong. Edo kalavalu tavvinattu, roads vesinattu kadhu. Kotha contractor anni ready chesukoni, niggling issues ni sort chesukone patiki chala time paduthundhi. Plus deeniki todhu PPA approve cheyyali prathidhi. Plus vellu head works and power project kalipi tendering ki velthunnaru. Dentho center kelukudu inka ekkuva vunthundhi. Ee issue antha twaraga solve avvadhu. Ee delays moolamga contractors estimate cheskunna cost kante actual cost ekkuva vuntundhi. My guesstimate: 5 years lo complete avvatam chala kashtam. Edited August 17, 2019 by Kumbk
Kumbk Posted August 17, 2019 Posted August 17, 2019 Navayuga backout ayyi, valla equipment motham site nunchi teesukelli pothe, vellaki itthade.
Vulavacharu Posted September 8, 2019 Posted September 8, 2019 https://www.telugu360.com/te/did-jagan-caught-in-prohblem-by-giving-report-to-pmo-and-amit-shah/
Hello26 Posted September 8, 2019 Posted September 8, 2019 1 hour ago, Vulavacharu said: https://www.telugu360.com/te/did-jagan-caught-in-prohblem-by-giving-report-to-pmo-and-amit-shah/ Raymond Peter aa ...hmm
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now