sonykongara Posted January 1 Author Posted January 1 పోలవరంలో ఈ నెలలోనే డయాఫ్రం వాల్ పనులు పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ పనులు జనవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. 2026 డిసెంబరునాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. By Andhra Pradesh News DeskUpdated : 01 Jan 2025 07:40 IST కాంక్రీటు మిశ్రమంపై నిర్ణయం పెండింగ్ మరో రెండు పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణ 5 తర్వాత విదేశీ బృందం, కేంద్ర జలసంఘం భేటీ అక్కడ తుది నిర్ణయం ఈనాడు - అమరావతి పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ పనులు జనవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. 2026 డిసెంబరునాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం.. జనవరి 2న ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. డయాఫ్రం వాల్‌లో వినియోగించాల్సిన కాంక్రీట్‌మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో ఆలస్యమవుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అవి వచ్చాక కేంద్ర జలసంఘం, విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్‌మిక్స్‌ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి. ఈ కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించాలనేది కీలకాంశం. నాలుగు తరహాల్లో కాంక్రీటు సమ్మేళనాలను పరిశీలించారు. వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటీ నుంచి రావాల్సి ఉంది. ఒక తరహా కాంక్రీటు మిశ్రమం గతంలో డయాఫ్రంవాల్ నిర్మాణంలో ఉపయోగించిందే. మరో మూడు మిశ్రమాలు కొత్తవి. ఇప్పటికి రెండు పరీక్షల ఫలితాలు అందాయి. వాటిని కేంద్ర జలసంఘానికి, విదేశీ నిపుణుల బృందానికి పంపారు. మరో రెండు పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. జనవరి 5నాటికి అవి వస్తాయని అంచనా. ఈ నాలుగింటి ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫారసు చేయాల్సి ఉంది. కేంద్ర జలసంఘం ఆమోదించాల్సి ఉంది. వీరి సమావేశం ఏర్పాటుకు ప్రాజెక్టు అథారిటీ ప్రయత్నిస్తోంది. జనవరి 5 తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. కాంక్రీట్ మిశ్రమం ఏది వినియోగించాలో తేలాక తక్షణమే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ వర్కింగ్ ప్లాట్‌ఫాం 500 మీటర్లకుపైగా పూర్తయింది. ఈ ప్లాట్‌ఫాంపై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. గైడ్‌వాల్ పనులూ 400 మీటర్ల మేర పూర్తయ్యాయి. పోలవరం వద్ద ట్రెంచి కట్టర్ ఏర్పాటుచేశారు. డీశాండింగ్ ప్లాంటూ ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. బెంటినైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లు, స్లర్రీ ట్యాంకులు ఏర్పాటుచేశారు. క్రేన్లు, పంపులు, బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటుచేశారు. స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్‌లూ ఏర్పాటయ్యాయి. వారానికోసారి, 15 రోజులకోసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బంది 150 మంది ఇప్పటికే విదేశాలనుంచి పోలవరం చేరుకున్నారు. రోజుకు 20 గంటలు పని చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రంవాల్ పనులు గరిష్ఠంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. Mobile GOM 1
sonykongara Posted January 2 Author Posted January 2 Polavaram: పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు జగన్ హయాంలో ఒక్క అడుగూ ముందుకు పడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వ కృషితో పట్టాలకెక్కాయి. By Andhra Pradesh News DeskPublished : 02 Jan 2025 06:25 IST 4 ప్యాకేజీల టెండర్ల ఖరారు, ఒప్పందాలు పూర్తి మరో ప్యాకేజీలో ఈ వారంలో ముగియనున్న ప్రక్రియ పోలవరం ఎడమ కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులు ఈనాడు, అమరావతి: జగన్ హయాంలో ఒక్క అడుగూ ముందుకు పడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వ కృషితో పట్టాలకెక్కాయి. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పూర్తయ్యే లోపు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఈ కాలువ ద్వారా గోదావరి జలాలు మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వీలైనంత వరకు వచ్చే ఖరీఫ్‌లో గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలనేది ప్రణాళిక. ఇందులో భాగంగా అధికారులు ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచి, గుత్తేదారులను ఖరారు చేసి.. ఒప్పందాలు చేసుకున్నారు. రెండు ప్యాకేజీల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గోదావరిపై పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 4,900 క్యూసెక్కుల గోదావరి జలాలు ఎడమ కాలువ పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలోని లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు అందించాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతలతో ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ కింద ఉన్న 1,18,000 ఎకరాలకు నీళ్లిస్తున్నారు. పురుషోత్తపట్నం, పుష్కర సమర్థ వినియోగంతో అనకాపల్లి ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లనున్నారు. ప్యాకేజీలవారీగా.. ఎడమ కాలువ కింద 1, 3, 5, 5ఏ, 6ఏ ప్యాకేజీలకు టెండర్లు పిలిచి, గుత్తేదారులను ఖరారు చేశారు. ప్యాకేజీ 8, 8ఏ కింద టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఒకటో ప్యాకేజీలో సున్నా నుంచి 25.600 కిలోమీటరు వరకు ప్రధాన కాలువ తవ్వకం, లైనింగు, ఇతర కట్టడాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు తాజా ధరలతో రూ.68.71 కోట్ల పని విలువతో టెండర్లు పిలిచారు. మొత్తం అయిదు సంస్థలు పోటీపడగా, హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీసీ సంస్థ ఎల్1గా నిలిచింది. అందరికన్నా తక్కువగా రూ.71.75 కోట్లకు పనులు చేసేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాలువలో ప్యాకేజీ నంబరు మూడులో గతంలో మిగిలిన పనులకు తాజా ధరలతో టెండర్లు పిలిచారు. కిలోమీటరు 51.600 నుంచి 69.145 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ తవ్వకం, లైనింగు, ఇతర కట్టడాల నిర్మాణానికి రూ.107.84 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా, రూ.112 కోట్లకు ఖరారయ్యాయి. మొత్తం నలుగురు గుత్తేదారులు బిడ్ దాఖలు చేయగా, ఎన్‌సీసీ సంస్థ ఈ పనిని దక్కించుకుంది. 5, 5ఏ ప్యాకేజీలకు రూ.293 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా, అయిదుగురు గుత్తేదారులు టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నారు. ఆర్‌వీఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.307.41 కోట్లతో ఈ బిడ్ దక్కించుకొని, పనులను ప్రారంభిస్తోంది. ప్యాకేజీ 6ఏలో 111వ కిలోమీటరు నుంచి 116 వరకు అవసరమైన పనులు చేసేందుకు రూ.317.17 కోట్లతో టెండర్లు పిలవగా, నలుగురు పోటీ పడ్డారు. ఈ టెండర్‌ను బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా రూ.331.73 కోట్లకు దక్కించుకుంది. ప్యాకేజీ 8, 8ఏలో రూ.73.43 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. జనవరి 2 లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. వచ్చే వారంలో టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది. Mobile GOM 1
sonykongara Posted January 18 Author Posted January 18 డయాఫ్రం వాల్ నిర్మాణం నేడు ప్రారంభం పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం శనివారం ఉదయం 10.19 గంటలకు ప్రారంభించనున్నారు. By Andhra Pradesh News DeskPublished : 18 Jan 2025 04:12 IST Ee Font size ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, పోలవరం: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం శనివారం ఉదయం 10.19 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతించింది. టీ5 ప్లాస్టిక్ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాలి. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్ చేపడుతోంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్లవంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా ప్లాస్టిక్ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. డయాఫ్రం వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలుపెట్టాలని భావిస్తున్నారు. Mobile GOM 1
AndhraBullodu Posted February 1 Posted February 1 On 1/28/2025 at 3:49 AM, sonykongara said: Inthaki, polavaram aentha aethu kadatharu anna ? 2027 june ki annaru, aentha avachestharu? 41.15 metres ka ? 45.72 ka?
TDP_2019 Posted February 1 Posted February 1 3 hours ago, AndhraBullodu said: Inthaki, polavaram aentha aethu kadatharu anna ? 2027 june ki annaru, aentha avachestharu? 41.15 metres ka ? 45.72 ka? Ippatiki chaala saarlu chepparu. Construction will done for 45.72 mts. But water ni 41 odd meters varake store chestharu in Phase 1. Nfan from 1982 and AndhraBullodu 2
NatuGadu Posted February 5 Posted February 5 Just now, NatuGadu said: super good youtube channel covers important construction projects world wide
Flash Posted Thursday at 06:21 AM Posted Thursday at 06:21 AM 15 hours ago, NatuGadu said: Wow B1M covering the project is phenomenal👏🏼👏🏼👏🏼
Yaswanth526 Posted Sunday at 12:58 PM Posted Sunday at 12:58 PM About Polavaram in International Channel
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now