Jump to content

Recommended Posts

Posted

ndhra news: పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం

పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 

Published : 30 Jun 2024 20:43 IST
 
 
 
 
 
 

30polavaram-1a.jpg

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు శనివారమే దిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆదివారం రాజమహేంద్రవరం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. తొలుత అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం సైట్‌ పరిశీలన చేపట్టారు. తొలి రెండ్రోజులు డయాఫ్రమ్‌ వాల్‌, రెండు కాపర్‌ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌ల పరిశీలన కొనసాగనుంది. ప్రాజెక్టు డిజైన్‌ల మొదలు..ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. రెండ్రోజుల తర్వాత కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మేధోమథనం చేయనున్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం.. అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది.

Posted
3 hours ago, Yaswanth526 said:

At current polavaram is back at 50% antunnaru

Diaphragm wall dismantle chesi malla kattali antunnaru

unnadhi teeseyyakkarledhu anukuntaga anna.

unna dhaaniki samaantharanga inkokati kadathaaru anta.

entha dabbu naasanam, entha paryavarana nastam...... eedi daridram ento raastraniki

Posted
6 minutes ago, AndhraBullodu said:

unnadhi teeseyyakkarledhu anukuntaga anna.

unna dhaaniki samaantharanga inkokati kadathaaru anta.

entha dabbu naasanam, entha paryavarana nastam...... eedi daridram ento raastraniki

Parallel ga kattina malla unkoti kattalsindhe ga a lekkana chusina waste a

Posted

 పోలవరమా.. ఊపిరి పీల్చుకో!

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది. కేంద్రం నిధులిచ్చే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

Published : 24 Jul 2024 06:06 IST
 
 
 
 
 
 

నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం సుస్పష్టం
ఈ ప్రాజెక్టు దేశ ఆహార భద్రతకు కీలకమని ప్రకటన
జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలినీడలు

ap230724main3a.jpg

ఈనాడు- అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది. కేంద్రం నిధులిచ్చే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరితగతిన నిధులిచ్చి, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేల్చి చెప్పింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని.. యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఆశలకు కేంద్రం ఊపిరి పోసినట్లయింది. 

ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ముసురుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే రూ.33 వేల కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ మొత్తం నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని కూడా వాదించింది. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం కూడా జరిగింది. 2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం రూ.20,398 కోట్లు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబరులోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీ వేసి ఆ నిధులే ఇస్తామంటూ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్‌ ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు పొడచూపుతూనే ఉన్నాయి. 


నిధులు ఎప్పటి నుంచో పెండింగ్‌

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్‌ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వడం లేదు. కొత్త డీపీఆర్‌కు ఆమోదం లేకపోవడంతో రూ.2,000 కోట్లకు పైగా బిల్లులు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 ధరలతో రూ.55,548.87 కోట్లతో రెండో డీపీఆర్‌కు ఒక దశ (సాంకేతిక సలహా కమిటీ) ఆమోదం సాధించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో రూ.47,725.47 కోట్లకు రెండో డీపీఆర్‌కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ రూ.20,398.81 కోట్లే ఇస్తామంటూ లేఖ రాయడంతో రాష్ట్రం గుండెల్లో రాయిపడింది. తొలిదశ పేరుతో కొత్త డీపీఆర్‌ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తొలిదశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం రూ.30,436.95 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్‌ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే రూ.12,157 కోట్లు అందుబాటులోకి వస్తాయి.


తొలగిన సందేహాలు

2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దాని ప్రకారం పోలవరం భూసేకరణ వ్యయం, పునరావాస వ్యయం పెరిగిపోయాయి. ఈ రెండింటికే రూ.33 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతో 2017-18 ధరల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.55,457 కోట్లకు రెండో డీపీఆర్‌ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా.. కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో  కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డీపీఆర్‌ అంశం కేంద్రం తేల్చనేలేదు. అలాంటి సంక్షుభిత పరిస్థితుల్లో తాజాగా మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్‌తో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి. అవసరమైన నిధులిచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ మరీ ఈ విషయం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేంద్రం ఇస్తుందన్న భరోసా లభించింది. 


ఏమిటీ రూ.12,157 కోట్లు? 

1. 2017-18 ధరల ప్రకారం తొలిదశకు అవసరమయ్యే మొత్తం రూ.30,436.95 కోట్లు

2. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటనకు ముందు రాష్ట్రం చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు (ఈ నిధులు తిరిగివ్వబోమని కేంద్రం తేల్చేసింది)

3. దీంతో తొలిదశ పూర్తికి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం రూ.25,706.24 కోట్లు

4. ఇంత వరకు కేంద్రం ఇచ్చినవి  రూ.15,146.27 కోట్లు

5. ఇక కేంద్రం ఇవ్వాల్సిన నిధులు రూ.10,559.97 కోట్లు

6. రెండో దశ పనులకు ఇప్పటికే పెట్టిన ఖర్చు రూ.1,597.56 కోట్లు

7. అవి కూడా కలిపి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు రూ.12,157.53 కోట్లు

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...