sonykongara Posted November 27, 2016 Author Posted November 27, 2016 పచ్చదనంతో ఆహ్లాదంగా అలరిస్తున్న అమరావతి నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మించారు. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా ఉండేవిధంగా అనువైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాలలో 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకులవారీగా పచ్చదనం నింపుతున్నారు. ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్ కత్తా, బెంగళూరుల నుంచి పలు రకాల మొక్కలు తెస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్ ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తూనే ఉంటాయి. పౌంటేన్లు ఏర్పాటు చేస్తారు. పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తారు. శాసనసభ భవనం ముందు కూడా పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి. అలాగే నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా రూపొందిస్తున్నారు. superrrrrrrrrrrrrrr
sonykongara Posted November 30, 2016 Author Posted November 30, 2016 ఇకపై కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే: చంద్రబాబు విజయవాడ: ఇక నుంచి అన్ని కార్యకలాపాలు వెలగపూడి నుంచే కొనసాగుతాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి వచ్చిన సీఎంకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఇది రెండో మజిలీ అని...గతంలో విభజన జరిగినప్పుడు కూడా కట్టుబట్టలతోవచ్చామని గుర్తు చేశారు. కర్నూలు రాజధాని అయినప్పుడు కూడా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీస్ లేకపోతే లేక్‌వ్యూలో ఉన్నానని...ఆ తర్వాత బస్సులో నుంచి పరిపాలన చేశానని...ఆ తర్వాత వెలగపూడి వచ్చానని బాబు తెలిపారు. ఉద్యోగులు త్యాగాలు చేసి ఇక్కడికి వచ్చారన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను చూస్తానని...ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూడాలని అన్నారు. మనమంతా ఒక కుటుంబం...తాను కుటుంబ పెద్దను మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం ఇబ్బందులున్నా భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందన్నారు. అందరూ మెచ్చే రాజధానిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందిద్దామని ఉద్యోగులకు సూచించారు. నేటి నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి సీఎం పాలన సాగించనున్నారు. ద్వితీయ విజ్ఞాలు ఉండకూడదన్న పండితుల సూచనలతో ఒక రోజు ముందే సీఎం సచివాలయం నుంచి పాలన ప్రారంభించారు. రేపు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది.
Guest Urban Legend Posted November 30, 2016 Posted November 30, 2016 ah AC lo evaru lekapoyina ON chesi potunnaru anta ....waste chestunnaru electricity ni ...govt offices lo yeppudu jarighey yevvarame idhi
Yaswanth526 Posted November 30, 2016 Posted November 30, 2016 https://www.youtube.com/watch?v=UaSDk8Xl-aA
aditya369 Posted December 2, 2016 Posted December 2, 2016 temporary annapudu enduku intala ivest chestaru...
sonykongara Posted December 6, 2016 Author Posted December 6, 2016 వెలగపూడిలో తాత్కాలిక ఫైర్ స్టేషన్ అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వెలగపూడిలోని సచివాలయం నుంచే అగ్నిమాపక సేవలు అందించనున్నట్లు ఆ శాఖ డీజీ కె.సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన వెలగపూడిలోని సచివాలయం ప్రధాన గేటు బయట తాత్కాలిక అగ్నిమాక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సచివాలయం వద్ద అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని, దాని నిర్మాణం పూర్తి కావలసి ఉందని అన్నారు. సచివాలయంలో ప్రమాదాలు జరిగితే తక్షణం స్పందించడానికి అనుకూలంగా ప్రస్తుతం తాత్కాలిక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ స్టేషన్‌లో అగ్నిమాపక సేవలు అందించడానికి 14 మంది సిబ్బందిని నియమించామన్నారు. కేవలం సచివాలయానికే కాక చుట్టు పక్కల 11 గ్రామాలకు ఇక్కడి నుంచే అగ్నిమాపక సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
JAYAM_NANI Posted December 6, 2016 Posted December 6, 2016 temporary annapudu enduku intala ivest chestaru... temporary ante ah buildings taruvatha dayyala dibbala vadilestaaru ani ardham kaadu. Govt will utilize it for some other purposes. Temporary fire station is also very important to protect the existing buildings. If not all these investments are under threat. Suresh_Ongole 1
swarnandhra Posted December 19, 2016 Posted December 19, 2016 good, velagapudi finally atracting agitations. Now, i get the feeling it is capital
sonykongara Posted December 19, 2016 Author Posted December 19, 2016 good, velagapudi finally atracting agitations. Now, i get the feeling it is capital hahhhhhha
sonykongara Posted December 21, 2016 Author Posted December 21, 2016 సచివాలయానికి హరితహారం వెలగపూడి సచివాలయం పచ్చదనాన్ని సంతరించుకుంది. సీఎం బ్లాకుతోసహా 5 బ్లాకులు, కోర్టు యార్డు పచ్చదనంతో నిండిపోయాయి. బ్లాకుల బయట కారిడార్ పచ్చని గడ్డి.. పూల మొక్కలతో కనువిందు చేస్తోంది. సచివాలయం ఆవరణలో.. అసెంబ్లీకి పక్కన 2.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. - అమరావతి, ఆంధ్రజ్యోతి
sonykongara Posted December 23, 2016 Author Posted December 23, 2016 సచివాలయంలో.. శరవేగంగా పనులు సీఎం కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్ సచివాలయ ప్రవేశానికి ప్రత్యేక గేటు పూర్తవుతున్న అసెంబ్లీ నిర్మాణ పనులు అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వెలగపూడి సచివాలయంలో సీఎం కోసం ప్రత్యేక హెలీప్యాడ్, ప్రవేశ గేటు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో హెలీకాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి సచివాలయానికి నేరుగా చేరుకోవడానికి వీలుగా సీఎం బ్లాకు పక్కనే హెలీప్యాడ్ నిర్మిస్తున్నారు. హెలీప్యాడ్ ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చి, నేల చదును చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27 నాటికి హెలీప్యాడ్ నిర్మాణం పూర్తిచేసే పనిలో సీఆర్‌డీఏ అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి సచివాలయ ప్రవేశానికి ప్రత్యేక గేటు ఏర్పాటు కానుంది. ఇప్పటికే సచివాలయంలో ప్రవేశానికి 1, 2 గేట్లు ఏర్పాటుకాగా సీఎం కోసం ప్రత్యేకంగా మరో గేటు ఏర్పాటు కానుంది. ప్రస్తుతం మొదటి గేటు ద్వారా ముఖ్యమంత్రి, రెండో గేటు ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సాధారణ ప్రజలు సచివాలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా సీఎం బ్లాకు పక్కనే దక్షిణం వైపున మరో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ గేటు ద్వారా సీఎం కాన్వాయ్ మాత్రమే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. ఈ గేటు పక్కనే హెలీప్యాడ్, అసెంబ్లీ వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రస్తుతం ఉన్న పార్కింగ్ సరిపోదనే ఉద్దేశంతో 5 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ భవన నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, స్పీకర్ యాంటీ రూమ్‌ల నిర్మాణం పూర్తయింది. స్పీకర్ పోడియం, సభ్యుల సీటింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫైర్ సేఫ్టీ వర్క్, ఇంటీరియర్, అధికారులకు గదుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. శానన మండలి చైర్మన్ చాంబర్, చైర్మన్ పోడియం పనులు పూర్తయ్యాయి. ఇంటీరియర్ డెకరేషన్ పనులు జరుగుతున్నాయి
sonykongara Posted December 23, 2016 Author Posted December 23, 2016 వెలగపూడి సచివాలయం సమస్త సమాచారం నవ్యాంధ్రలో మనం కట్టుకున్న మొదటి కట్టడం, సచివాలయం. వెలగపుడిలో సకల హంగులతో సచివాలయం ఏర్పాటు అయ్యి, పాలన మొత్తం ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యింది. ముఖ్యమంత్రి మొదలుకుని, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు వివిధ శాఖలు అన్నీ ఇక్కడ నుంచే పని చేస్తున్నాయి. తమ సమస్యలు తీరుస్తారు అని గంపడే ఆశతో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వెలగపూడిలో ఉన్న కొత్త సచివాలయానికి వస్తున్నారు. తీరా అక్కడకి వచ్చిన తర్వాత, చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్న సచివాలయంలో, మొత్తం 5 బ్లాకులులో ఉన్న పరిపాలనా భవనాలు, వివిధ శాఖలు.. ఇలా ఎక్కడకి వెళ్ళాలో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ డిపార్టుమెంట్ ఏ బ్లాక్‌లో ఉంటుందో, ఏ మంత్రి ఏ బ్లాక్‌లో ఉంటారో తెలుసుకోవటానికి ప్రజలు ఇబ్బంది పడకుండా, ముందుగా ఇవి తెలుసుకుంటే, చలా తేలికగా వెళ్లి మీ పనులు చేసుకోవచ్చు... సచివాలయానికి ఎలా చేరుకోవాలి ? వెలగపుడిలోని సచివాలయం చేరుకోవటానికి విజయవాడ, గుంటూరు నుంచి 23 బస్ సర్వీస్లు నడుపుతుంది ఆర్టీసి. ప్రతి పది నిమషాలకు ఒక బస్ వచ్చేలా ఏర్పాట్లు చేసింది ఆర్టీసి. సచివాలయం లోపలాకి వెళ్ళాలి అంటే ? సచివాలయం ప్రాంగణం లోపలకి చేరుకోవటానికి రెండో గేటు ద్వారా వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి, లోపాలకి వెళ్ళటానికి ఐదు నిమషాలు పడుతుంది. ముందుగా, మేము ఫలానా శాఖలో, ఫలానా అధికారిని, ఫలానా పని మీద కలవాలి అని, సచివాలయం బయట ఉన్న రెండు ద్వారం దగ్గర ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసుల సమాచార కేంద్రం వద్ద, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పోలీసులు, మీరు చెప్పిన డిపార్టుమెంట్ ఉన్న, బ్లాక్ వద్ద సెక్యూరిటీగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులకు వాకీ టాకీ ద్వారా సమాచారం ఇస్తారు. వారు, ఆ డిపార్టుమెంట్ సెక్షన్ ఆఫీసర్ కు తెలియచేస్తారు. ఈ సెక్షన్ ఆఫీసర్, మిమ్మల్ని నేరుగా, మీరు కలవాలి అనుకుంటున్న అధికారి దగ్గరకు తీసుకువెళ్తాడు. ప్రతి సందర్భంలో, క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపాలకి పంపిస్తారు. సచివాలయం లోపలాకి వెళ్ళటానికి పాస్ ఎలా పొందాలి ? సచివాలయం లోపాలకి వెళ్ళాలి అంటే, పాస్ ఉండాల్సిందే. పాస్ సచివాలయం గేటు దగ్గర ఉన్న సెక్షన్ ఆఫీసర్ జారీ చేస్తారు. ఎంత మంది ఆ పాస్ తో సచివాలయం లోపాలకి వెల్లవచ్చో వివరాలు రాస్తారు. సచివాలయం లోపలాకి వెళ్ళటానికి టైమింగ్స్ ? ఉదయం 10 గంటల నుంచి, మీరు కావాలి అనుకుంటున్నా అధికారి సచివాలయంలో ఉండే దాకా, ఎప్పుడైనా మీకు పాస్ జారీ చేస్తారు. సచివాలయంలో పార్కింగ్ ఎలా ? సచివాలయం లోపాలకి సందర్శకుల వాహనాలు అనుమతించరు. మీ ద్విచక్ర వాహనం కాని, కార్ కాని, సచివాలయం బయట ఉన్న పార్కింగ్ ప్రదేశంలోనే పార్కింగ్ చెయ్యాలి. సచివాలయం లోపలాకి వికలాంగులని ఎలా తీసుకువెళ్ళాలి ? వికలాంగులు, లోపాలకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది కాబట్టి, వారిని లోపలకి తీసుకువెళ్ళి, తీసుకురావటానికి ఉచితంగా బ్యాటరీ ఆటోలు ఉంటాయి. సచివాలయంలో క్యాంటీన్ సదుపాయం ఉందా ? సచివాలయం ప్రాంగణంలో రెండు క్యాంటీన్లు ఉన్నాయి. ఒకటి సచివాలయం లోపల ఉంటుంది. ఇక్కడ 50 రూపాయలకే భోజనం లభిస్తుంది. అలాగే, సచివాలయం బయట CRDA క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ 30 రూపాయలకే భోజనం లభిస్తుంది. ఇంకా వెరైటీ కావలి అనుకుంటే, వెలగపూడిలో, 4-5 రెస్టారెంట్లు ఉన్నాయి. పెద్ద ప్రాంగణంలో ఉన్న సచివాలయంలో, మొత్తం 5 బ్లాకులులో, ఏ మంత్రి, ఏ బ్లాక్ లో ఉంటారు ? 1. నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయం టోటల్ ఒకటో బ్లాక్ 2. కేఈ కృష్ణమూర్తి, ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలు బిల్డింగ్-2, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 214, 215 3. ఎన్.చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి హోమ్, డిజాస్టర్ శాఖలు బిల్డింగ్-2, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 136 4. యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రి బిల్డింగ్-2, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 212, 213 5. సీహెచ్ అయ్యన్నపాత్రుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖలు బిల్డింగ్-5, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 193 6. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహకారం, అటవీ శాఖలు బిల్డింగ్-4, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 132 7. దేవినేని ఉమామహేశ్వరరావు జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి శాఖలు బిల్డింగ్-4, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 212 8. డాక్టర్ పి.నారాయణ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ బిల్డింగ్-2, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 134,135 9. పరిటాల సునీత ధరల నియంత్రణ, పౌరసరఫరాల శాఖలు బిల్డింగ్-5, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 210 10. ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖ మంత్రి బిల్డింగ్-4, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 130 11. కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య శాఖలు బిల్డింగ్-5, గ్రౌండ్ ప్లోర్, రూమ్ నెంబర్: 191 12, గంటా శీనివాసరావు విద్యాశాఖ మంత్రి బిల్డింగ్-4, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 210 13. పల్లె రఘునాథరెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ బిల్డింగ్-4, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 211 14. పి.సుజాత మహిళాసాధికారిత, మహిళా సంక్షేమం బిల్డింగ్-3, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 211 15. కె.అచ్చెన్నాయుడు కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖలు బిల్డింగ్-4, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 131 16. శిద్ధా రాఘవరావు రవాణా, రోడ్లు, భవనాల శాఖ బిల్డింగ్-5, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 211 17. కె.మృణాళిని గ్రామీణాభివృద్ధి శాఖ బిల్డింగ్-5, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 192 18. కొల్లు రవీంద్ర ఎస్సీ సంక్షేమం, ఎక్జైజ్ శాఖలు బిల్డింగ్-5, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 212 19. రావెల కిషోర్‌బాబు సాంఘిక, గిరిజన సంక్షేమం, సాధికారిత బిల్డింగ్-3, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 210 20. పి.మాణిక్యాలరావు దేవాదాయశాఖ బిల్డింగ్-2, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్: 137 సచివాలయంలో మొత్తం ఐదు బ్లాక్లలో విస్తరించి ఉంది. ఏ శాఖ, ఏ బ్లాక్ లో ఉన్నది వివరాలు ఇవే మొదటి బ్లాక్: కింద అంతస్తులో సాధారణ పరిపాలన, న్యాయ శాఖలు మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సియం పేషి కార్యాలయాలు మంత్రిమండలి సమావేశం అయ్యే హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే ఉంటాయి. రెండో బ్లాక్: కింద అంతస్తులో పురపాలక, హోం, దేవాదాయ, విపత్తుల నిర్వహణ, ఇంధనం, ఐఅండ్ఐ, పబ్లిక్ ఎంటర్-ప్రైజెస్, పరిశ్రమల శాఖలు ఉన్నాయి మొదటి అంతస్తులో ఆర్ధిక, ప్రణాళిక శాఖలు ఉన్నాయి. మూడో బ్లాక్: కింద అంతస్తులో టెలికాం కార్యాలయం, ప్లే స్కూల్, ఈ-సేవా కేంద్రం, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, జిమ్, అసోసియేషన్ హాల్, ఐటీ అండ్ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, లైబ్రరీ ఉంటాయి. మొదటి అంతస్తులో గనులు, బిసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, సామాజిక, గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం, యువజనాభివృద్ధి, సంస్కృతిక శాఖలు ఉన్నాయి. నాలుగవ బ్లాక్: కింద అంతస్తులో వ్యవసాయం, సహకార శాఖలు, కార్మిక, అటవీ, రిజిస్ట్రేషన్, పశుసంవర్ధక, డీడీఎఫ్, ఈఎఫ్ఎస్ అండ్ టీ, రెవెన్యూ శాఖలు ఉన్నాయి మొదటి అంతస్తులో ఉన్నత విద్య, ఐటి అండ్ సీ, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖలు ఉన్నాయి ఐదో బ్లాక్: కింద అంతస్తులో ఆరోగ్య, కుటుంబ సక్షేమం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, ఎల్ ఈటీ అండ్ ఎఫ్, నైపుణ్యాభివృద్ధి శాఖలు ఉన్నాయి మొదటి అంతస్తులో రవాణా, రోడ్లు భవనాలు, ఏపీవీసీ, విచారణల కమీషనర్, విజిలెన్స్, పౌరసరఫరాలు, డిప్యూటీ పే అండ్ అకౌంట్స్ శాఖలు ఉన్నాయి.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now