Jump to content

Recommended Posts

Posted
పోడియం ఎక్కలేరు!.. మైకు విరగ్గొట్టలేరు..
 
636216810954650982.jpg
  • అధునాతన, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ
  • శరవేగంగా వెలగపూడి అసెంబ్లీ, మండలి పనులు
  • ప్రధాని మోదీతో ప్రారంభింపజేసేందుకు యత్నాలు
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మిస్తున్న నూతన శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక విధానాల్లో.. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో.. అద్భుతమైన వసతులు, కళ్లు చెదిరే హంగులతో ఆంధ్రపదేశ్‌ నూతన అసెంబ్లీ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే శాసనసభ సభాపతి పోడియంతోపాటు, మండలి పోడియం, సీటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. ఇంటీరియర్‌ పనులు తుది దశలో ఉన్నాయి. ప్రధాని మోదీ చేత కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవం చేయించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా.. ఈ నూతన శాసనసభలో అల్లరి చేసి, గోల చేద్దాం అనుకునేవారి ఆటలు సాగవు. ఆ దిశగా ఎన్నో ప్రత్యేకతలతో.. సభ్యులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండేలా అసెంబ్లీ రెడీ అవుతోంది.
 
ఇవీ ప్రత్యేకతలు..
  • ఈ భవనాల నిర్మాణానికి జర్మనీ నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేశారు.
  • మైకు, వాయిస్‌ రికార్డర్‌కలిపి ఒకే పరికరంగా టేబుల్‌ లోపల అమర్చి ఉంటుంది. కోపం వస్తే ఈ మైకుల్ని విరగ్గొట్టడం కుదరదు.
  • నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. తర్వాత ‘మేము అనలేదు’ అని తప్పించుకోవటం కుదరదు, ఎందుకంటే, ప్రతి సభ్యుడి ముందుండే వాయిస్‌ రికార్డర్‌ వారి ప్రతి మాటనూ రికార్డు చేస్తుంది.
  • స్పీకర్‌ పోడియం పైకి ఎక్కడానికి వీల్లేకుండా నిర్మిస్తున్నారు.
  • సభలో సభ్యుల మాటలు ప్రతిధ్వనించకుండా స్పష్టంగా వినిపించేలా అధునాతన శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అలాగే అన్ని చోట్లా ఉన్నట్టు స్పష్టమైన లైటింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Guest Urban Legend
Posted

buradha annaru

bhoomi krungutundhi annaru ....ila enno rakalu ga try chesaru

finally with in a shot spam what a change .... :terrific:

Posted
నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ భవనం రెడీ... Super User 06 February 2017 Hits: 474  
ap-assembly-06022017-1.jpg

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో, ఏపీ అసెంబ్లీ నూతన భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ శాసనమండలి భవనాల నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ అండ్ టి సంస్థ అధికారికంగా ప్రభుత్వానికి అప్పగించనుంది.

అత్యాధునికి టెక్నాలజీతో నిర్మించిన ఈ కొత్త అసెంబ్లీ భవనంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు అనువైందిగా రూపొందించారు. ఏయే ప్రాంతాల్లో ఎవరెవరు సంచరిస్తున్నారనే విషయాన్ని డేగకన్నులా పర్యవేక్షించేందుకు వీలుగా హైపవర్, నైట్ విజన్ సిసి కెమెరాలతో భద్రతా ఏర్పాటు చేశారు.

విశాలమైన సీటింగ్ పద్దతిని రూపొందించడంతో సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త భవనాన్ని నిర్మించారు. మార్చి 1 నుంచి ఇక్కడ రాష్ట్ర 2017-18 వార్షిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమావేశాలకు సంబంధించిన తేదీలు, బడ్జెట్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఫైలును ఆమోదించి ఆర్థిక మంత్రి యనమల ఆమోదానికి పంపినట్లు సిఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సిఎస్ ఆమోదం తెలిపిన ఫైలులో అసెంబ్లీ సమావేశాలను మార్చి 1వ తేదీన గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహసన్ ప్రసంగంతో ప్రారంభించనున్నారు. మార్చి 6వ తేదీన 2017-18 వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

వూర్చి 27న సమవేశాలను ముగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆమోదించారని తెలిసింది. అయితే టక్కర్ పంపిన ఫైలును ఆర్థికశాఖమంత్రి యనమల మరోసారి పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారుచేసే వీలుంది. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ ఆమోదానికి ఫైలు పంపాల్సి ఉంటుంది.

మరోవైపు వెలగపూడిలోని సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసనమండలి పనులను రెండు పర్యాయాలు పరిశీలించిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్మాణ సంస్థకు, భద్రతా సిబ్బందికి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారు లకు పలు సూచలనలు చేశారు. అలాగే శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఎప్పటికప్పుడు అసెంబ్లీ భవన నిర్మాణ పనుల పై ప్రతి రెండు రోజులకో సారి సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనులను ఎల్ అండ్ టి సంస్థ అనుకున్న సమయానికే పూర్తిచేసింది. అధునాతన టెక్నాలజీతో కూడిన అసెంబ్లీ శాసనమండలి సరి కొత్త అనుభూతి కల్పించనుందని స్పీకర్ అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కార్యాలయాలతో పాటు, మంత్రుల పేషీలకు సరికొత్త హంగులు దిద్దుతున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించిన తరువాత మరో సారి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించే అవకాశాలున్నట్లు స్పీకర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ap-assembly-06022017-2.jpg

ap-assembly-06022017-3.jpg

ap-assembly-06022017-4.jpg

ap-assembly-06022017-5.jpg

http://www.amaravativoice.com/te/news/new-assembly-ready-in-velagapudi

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...