MVS Posted October 3, 2016 Posted October 3, 2016 Alu Edo Anni hyd lo vadilesi kattu battalato velutunatlu endi veela racha ah paper lo heading lu
sonykongara Posted October 3, 2016 Author Posted October 3, 2016 నేటినుంచి వెలగపూడిలో పాలన తాత్కాలిక సచివాలయానికి చేరిన ఫైళ్లు తరలివస్తున్న ఉద్యోగులు నవ్యాంధ్ర రాజధాని.. నవ్య నగరి.. అమరావతిలో నూతన అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు బ్లాకుల్లో మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులు కొలువుదీరనున్నారు. తాత్కాలిక సచివాలయానికి మూడంచెలుగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయి హంగులతో నిర్మించిన భవనాల్లో అత్యాధునిక చాంబర్లు, ఫర్నీచర్, సెంట్రల్ ఏసీ, హై ఫ్రీకెన్సీ నెట్, వైఫై సౌకర్యం కల్పించారు. ఉద్యోగులు రోజూ సచివాలయానికి రాకపోకలు సాగించేందుకు విజయవాడ, గుంటూరు నగరాల నుంచి మెట్రో బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు. అమరావతి: ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు వెలగపూడికి తరలివస్తున్నారు. తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభించేందుకు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలోని ఫైళ్లు, ఫర్నీచర్ వారం రోజులుగా వెలగపూడికి తరలించారు. కీలక రికార్డులను స్కానింగ్ చేసి కంప్యూటర్లలో భద్రపరిచారు. కోర్టు కేసులకు సంబంధించిన ఫైళ్లు మినహా దాదాపు రికార్డులన్నీ వెలగపూడికి తెచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉన్న ఒకటో బ్లాకు పై ఫ్లోర్ దసరా లోపు సిద్ధం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలన, న్యాయశాఖ విభాగాలు సిద్ధమయ్యాయి. మిగిలిన 2,3,4,5 బ్లాకుల్లో 19 మంది మంత్రులు, సుమారు 48 మంది కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు కొలువుదీరనున్నారు. ఇక్కడి నుంచే పాలన ఉద్యోగులు వెలగపూడికి వచ్చి విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు బ్లాకుల్లో మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులు కొలువుదీరనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో నిర్మించిన భవనాల్లో మిలమిల మెరిసే చాంబర్లు, చక్కటి ఫర్నీచర్, హాయి గొలిపే సెంట్రల్ ఏసీ, హై ఫ్రీకెన్సీ నెట్, వైఫై సౌకర్యం కల్పించారు. ప్రతి ఉద్యోగి సీటుకు ఇంటర్ కమ్ ఫోన కనెక్షన ఏర్పాటు చేశారు. ఉద్యోగులు రోజూ సచివాలయానికి రాకపోకలు సాగించేందుకు విజయవాడ, గుంటూరు నగరాల నుంచి మెట్రో బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నారు.మూడంచెల భద్రత..తాత్కాలిక సచివాలయానికి మూడంచెలుగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన ఫోర్స్‌కి చెందిన వంద మంది సిబ్బంది 24 గంటలు బందోబస్తు నిర్వహించనున్నారు. సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేశాకే ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. తర్వాత బ్లాకుల వద్ద ఇతరులను విధిగా తనిఖీ చేసి గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు. సచివాలయంలో ఏ చిన్న ఘటన జరిగినా తెలిసేలా ప్రతి బ్లాకులో సుమారు 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు.226 రోజులకు పాలన ప్రారంభం వెలగపూడి పరిధిలోని 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మూడు రోజుల తర్వాత నిర్మాణ సం స్ధలు పనులను చేపట్టాయి. ఒక్కొక్క భవనం జీ+1గా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు బ్లాకులను నిర్మించారు. ఏప్రిల్ 25న నాలుగో బ్లాకులో సీఎం చంద్రబాబు ఒక గదిని ప్రారంభించారు. తర్వాత జూన 29న మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని ఐదో బ్లాకులోని తమ శాఖల కార్యాలయాలను ప్రారంభించుకున్నారు. తర్వాత వరుసగా ఇతర మంత్రులు తమకు కేటాయించిన బ్లాకుల్లో కొలువులు ఏర్పాటు చేసుకున్నారు. రూ.201 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో భాగంగా తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలి భవనం కూడా ఆరో బ్లాకుగా నిర్మిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం తా త్కాలికంగా ఏర్పాటు చేస్తున్నా సచివాలయ భవనాలు పటిష్ఠ పునాదులతోనే నిర్మించడం గమనార్హం. శంకుస్థాపన రోజు నుంచి పరిపాలన ప్రారం భం కావటానికి 226 రోజులు పట్టింది. వేలాది మంది కార్మికులు తాత్కాలిక సౌధం నిర్మాణంలో చెమటోడ్చారు. మంత్రి నారాయణ పనులను నిరంతర పర్యవేక్షించారు. సీఆర్‌డీఏ అధికారుల సూచనలతో ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ అండ్ పల్లోంజి సంస్ధలు తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాయి. సచివాలయంలోని ప్రతి ఫ్లోర్‌కి నిరంతర శుద్ధజల సరఫరా, నిరంతర విద్యుత్, ఉద్యోగుల సౌలభ్యం కోసం క్యాంటీన, ఏటీఎంలతో పాటు బీఎ్‌సఎనఎల్‌తో సహా నాలుగు సెల్ నెట్‌వర్కులు ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, పోస్టాఫీసు, ట్రావెల్ ఏజెన్సీ, క్రీడాసౌకర్యాలు కల్పించనున్నారు.
sonykongara Posted October 8, 2016 Author Posted October 8, 2016 http://epaper.andhrajyothy.com/c/13794403
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now