Saichandra Posted February 26, 2017 Posted February 26, 2017 They are permanent buildings bro.... No need ani aela antaaru... At least some signature kuda ledu aa buildings lo... Edo hostels laaga unnaayi bro assembly and secretariat new designs vastyi and e buildings general purpose ki use chestaru future lo,exterior designs petti 1year lo kattali ante impossible
Nfan from 1982 Posted February 26, 2017 Posted February 26, 2017 bro assembly and secretariat new designs vastyi and e buildings general purpose ki use chestaru future lo,exterior designs petti 1year lo kattali ante impossible Ok bro.... Babu gari meeda eega vaalanivvavuga..
sonykongara Posted February 26, 2017 Author Posted February 26, 2017 Ok bro.... Babu gari meeda eega vaalanivvavuga.. aya cheppindi nijame bro vati vare vati vadukuntaru future lo anduke basic design tho chesaru,taruvtha avasara ni batti elevation design marstharu.
nbk1605 Posted February 26, 2017 Posted February 26, 2017 aya cheppindi nijame bro vati vare vati vadukuntaru future lo anduke basic design tho chesaru,taruvtha avasara ni batti elevation design marstharu.
sonykongara Posted March 2, 2017 Author Posted March 2, 2017 ఇక ‘అమరావతి’ శాసనాలు నేడే శాసనసభ భవనం ప్రారంభం అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర పాలనలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయం ఇప్పటికే ప్రారంభం కాగా... ఇప్పుడు శాసనాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ భవనం కూడా ప్రారంభానికి రెడీ అయింది. వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలోనే నిర్మితమైన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 11:25 గంటలకు ప్రారంభించనున్నారు. తాత్కాలికంగా కొద్దికాలంపాటు సమావేశాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ భవన నిర్మాణం వేగంగా జరిగింది. ఈ నెల ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో... నిర్మాణ బాధ్యతను తీసుకున్న రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీయే)... 4వ తేదీన భవనాన్ని అప్పగించనుంది.రాష్ట్ర విభజన తర్వాత సొంత గడ్డ నుంచే పరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలోని పొలాల్లో తొలి నిర్మాణంగా సచివాలయాన్ని చేపట్టారు. ఆ తర్వాత కూడా కొన్ని అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. కానీ, 2017లో అసెంబ్లీ సమావేశాలను రాజధాని ప్రాంతం నుంచే నిర్వహించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలను చేపట్టారు. బడ్జెట్ సమావేశాల నాటికి నిర్మాణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఓ వైపు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరోవైపు సీఆర్డీయేకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. పట్టణాభివృద్ధి-సీఆర్డీయే శాఖల మంత్రి నారాయణ ఈ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అసెంబ్లీ, మండలి సమావేశ మందిరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఫలితంగా... ప్రజలు కోరుకున్నట్టుగా ఇక ఈ నేల నుంచే శాసనాలు కూడా రూపొందించడం బడ్జెట్ సమావేశాలతోనే ప్రారంభం కానుంది. అసెంబ్లీ స్వరూపం ఇది అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 175 కాగా... 231 సీట్లను ఏర్పాటు చేశారు. మండలిలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 58 కాగా... 90 సీట్లు ఏర్పాటయ్యాయి. శాసనసభ, శాసనమండలి కలిపితే మొత్తం51,185 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 39,199 చదరపు అడుగులు. అసెంబ్లీ సమావేశ మందిరం 7,683 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏడు మీటర్ల ఎత్తు (22.96 అడుగులు) ఉంటుంది. శాసన మండలి విస్తీర్ణం 4,304 చదరపు అడుగులు. సభాపతి పోడియం ఆరడుగుల ఎత్తులో ఉంటుంది. ఆయనకు అభిముఖంగా మొదటి అంతస్తులో ఐదు గ్యాలరీలు ఉంటాయి. వీఐపీలు, అధికారులు, సందర్శకులు, మీడియా కోసం వీటిని కేటాయించారు. తాత్కాలికమైనా ఎన్నో ప్రత్యేకతలు వెలగపూడిలో శాసనసభ కొంతకాలమే కొలువుదీరుతుంది. అందుకే నిర్మాణాల్లో గొప్పతనం కనిపించకపోయినా... నిర్వహణలో కొన్ని ప్రత్యేకతలు మాత్రం ఉంటాయి. సభ్యులు విరగ్గొట్టే, పీకే వీలు లేకుండా... పాత తరహా మైకులకు బదులు రెవెల్యుటో సౌండ్ టెక్నాలజీతో బాక్సులను అమర్చారు. సభాపతి అనుమతిస్తే సభ్యుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందుకు వీలుగా సెన్సర్లు పని చేస్తాయి. సభ్యులు ఏం మాట్లాడినా అది రికార్డవుతుంది. ఏదైనా అంశంపైన ఓటింగ్ జరిగినా ఈ బాక్సులే ఉపయోగపడతాయి. స్పీకర్ పోడియంపైకి కూడా గతంలో మాదిరిగా దురుసుగా వెళ్లడానికి అవకాశం లేదు. ఇక భద్రతా ఏర్పాట్లలో భాగంగా హై పవర్ నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణితో కలసి మంత్రి నారాయణ బుధవారం ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అధికారులను, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సమావేశాలకు భారీ బందోబస్తు ఈ నెల ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. 12 జిల్లాల నుంచి 2200 మంది పోలీసులను ప్రత్యేకంగా ఈ విధుల కోసం రప్పిస్తున్నట్లు ఐజీ సంజయ్ తెలిపారు. నలుగురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు అసెంబ్లీ సమావేశాల్లో విధులు నిర్వహిస్తారని వివరించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి సచివాలయం వరకు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బాడీ కెమెరాలతో, మైక్రోఫోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు
sonykongara Posted March 2, 2017 Author Posted March 2, 2017 అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ భవనాలను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పాల్గొన్నారు. ఒకే సముదాయంలో అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఏర్పాటు చేశారు. రికార్డ్ సమయంలో ఈ భవనాలను ఎల్‌అండ్‌టీ, సీఆర్డీఏ సంస్థలు నిర్మించాయి. సచివాలయ ప్రాంగణంలో ఆరో భవనంగా అసెంబ్లీ, మండలి నిలవనున్నది. మొత్తం 260 మంది సభ్యులు కూర్చునేలా అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేశారు. 90 మంది సభ్యులు కూర్చునేలా శాసనమండలి భవనాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి చైర్ అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతోంది. ఏడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీకర్ చైర్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. సభ్యుల కుర్చీల వద్ద సెన్సార్ మైక్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మొత్తం ఐదు అత్యాధునిక గ్యాలరీల్లో 2 మీడియాకు, ఒకటి అధికారులకు, ఒక్కొక్కటి చొప్పున మరో రెండు వీఐపీలకు కేటాయించారు.
sonykongara Posted March 5, 2017 Author Posted March 5, 2017 https://www.youtube.com/watch?v=3zqaYKein7w
Nfan from 1982 Posted March 5, 2017 Posted March 5, 2017 @sonykongara,Pictures Super ga vunnayi brother.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now