Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

వెలగపూడికి బోట్‌ షికార్‌!
 
636116573007895293.jpg
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఏపీటీడీసీ
  • ఇప్పటికే ఓసారి ట్రైల్‌ రన్‌ నిర్వహణ
  • తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో బోటింగ్‌ యూనిట్‌
  • అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెలగపూడికి
  • ప్రాజెక్టు సిద్ధమైతే ఏపీటీడీసీకి భారీ ఆదాయం
  • పర్యాటకులతోపాటు సచివాలయ ఉద్యోగులకూ ఉపయుక్తం
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో పర్యాటకాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజధానికి పర్యాటకులను ఆకర్షించేందుకు భవానీ ఐలాండ్‌ను మరింత సుందరంగా తయారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనితోపాటు ప్రకాశం బ్యారేజీలో బరమ్‌ పార్కు, భవానీ ఐలాండ్‌ కేంద్రంగా బోటింగ్‌ నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ బోటింగ్‌కు పర్యాటకులు భారీగా మొగ్గు చూపుతున్నారు.
 
పుష్కరాల్లో ఆదాయమే ప్రేరణ!
ప్రస్తుతం విజయవాడలో డబుల్‌ డెక్కర్‌ క్రూయిజ్‌ ఒకటి, స్పీడ్‌ క్రూయిజ్‌లు ఐదు, జెడ్‌ స్కీ ఒకటి మాత్రమే ఉన్నాయి. మరో మూడు క్రూయిజ్‌లు ఉన్నప్పటికీ అవి రిపేర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆరు క్రూయిజ్‌లతోనే ఏపీటీడీసీకి నెలకి సుమారు రూ.25వేల ఆదాయం వస్తోంది. ఇవే క్రూయిజ్‌లతో సీజన్‌ సమయంలో ఏపీటీడీసీ మరింత ఆదాయాన్ని ఆర్జిస్తుంది. కృష్ణాపుష్కరాల సమయంలో కేవలం 12రోజుల్లోనే బోటింగ్‌ ద్వారా ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా రూ.31 లక్షల ఆదాయం కార్పొరేషన్‌కు లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకునే... రాజధానిలో పర్యాటకాభివృద్ధి చేస్తే ఏపీటీడీసీకి మరింత ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా వెలగపూడికి బోట్‌లో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఏపీటీడీసీకి వచ్చింది. మూడు రోజుల కిత్రం వెలగపూడి వరకూ ఒక క్రూయిజ్‌తో ట్రయల్‌ కూడా వేశారు. వెగలపూడి ట్రిప్‌ అంటే బరమ్‌ పార్క్‌లో క్రూయిజ్‌ బయలుదేరి... భవానీ ఐలాండ్‌ మీదగా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వరకూ వెళ్తుంది. అక్కడ నుంచి వెలగపూడి మూడు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ కాస్త దూరాన్ని రోడ్డు మార్గం బస్సులో ప్రయాణించే విధంగా కార్పొరేషన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వెలగపూడి ట్రిప్‌లో భాగంగా క్రూయిజ్‌ ద్వారా ట్రైల్‌ వేసిన అధికారులకు శైవక్షేత్రానికి వెళ్లే సరికి ఆరు కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా రీడింగ్‌ మీటర్‌ చూపించింది. పైగా మూడు గంటల సమయం పట్టింది. దీంతో, మరికొంత సామర్థ్యం ఉన్న క్రూయిజ్‌ను ఉపయోగిస్తే తక్కువ సమయంలోనే శైవక్షేత్రానికి చేరుకోవచ్చునని అధికారులు గుర్తించారు.

పుష్కర ఘాటే బోటింగ్‌ యూనిట్‌!
శైవక్షేత్రం వద్ద ప్రత్యేకంగా బోటింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. పుష్కరాల సమయంలో శైవక్షేత్రం వద్ద ప్రభుత్వం ఘాట్‌ను నిర్మించింది. దీనిని ఉపయోగించుకుంటే వెలగపూడి ట్రిప్‌ పేరిట పర్యాటకులను ఆకర్షించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే పర్యాటకులతోపాటు... సెక్రటేరియట్‌ ఉద్యోగులను కూడా ఏపీటీడీసీ ఆకర్షించే అవకాశం ఉంది. కేవలం ప్రయాణించే క్రూయిజ్‌లే కాకుండా అందులోనే ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేస్తే టూరిస్టులను మరింత ఆకర్షించవచ్చు. దీనిని కూడా ఏపీటీడీసీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. ప్రకాశం బ్యారేజీలో వాటర్‌ స్టోరేజీ తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. లేకపోతే భారీ క్రూయిజ్‌లు శైవక్షేత్రం వరకూ ప్రయాణించేందుకు వీలు పడదు. దీనిని ప్రభుత్వం గుర్తించి వాటర్‌ స్టోరేజీ సరిపడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

What Is Happening in Amaravati – Mirchi9 Ground Report

 

Amaravati-Ground-Talk-Report-Reality-AmaMirchi9.com is bringing you a truth which no other main-stream media ventured to show you. While they say nothing is happening at Ground Zero in Amaravati, Things seem to be very different. There is a visible change in the Capital Area and the locals are very happy with that. Mirchi9 team visited the area and finds change happening rapidly. Trust us, Naidu is not bluffing when he said he will show drastic change for next Dussehra.

Security @ Interim Secretariat

Special Protection Force had taken over the area and anyone are not allowed until there is an identity card or appointment. Even the construction workers are asked to present their ID Cards. There are Two Gates at the left and right of the Secretariat entrance. There are sign boards leading the visitors to find their destination.

Construction Work:Check on Going Assembly Construction Photos

Amaravati-Ground-Talk-Report-Reality-Ama

Five Buildings are almost completed and are being given final touches. You can see them in the gallery. The construction got completed in record time of Seven months and the employees are already at work. Ministers have also started occupying their chambers. All the buildings are centralized air conditioning as there is lot of activity going on outside we see all windows closed. Assembly is the last building that is being constructed and it should be complete by the end of this year. The campus will pretty much look like a mini IT park once the construction folks move out in the next few months.

Transportation to Employees: Pics: 5 Completed Buildings in Campus 

Amaravati-Ground-Talk-Report-Reality-AmaGovernment is making things extremely comfortable for employees at the interim secretariat. The roads are completed and the buses are directly picking up the employees from the secretariat. These areas barely have any roads previously. All the roads leading to the interim secretariat are being widened with blocking constructions being razed.

Anna Canteen: Check NTR Canteen Photos

Amaravati-Ground-Talk-Report-Reality-Ama

Just outside the Secretariat building, there is Anna Canteen which is well maintained. The construction workers at the site and the villagers living close by are filling their tummies here. Low prices yet very well maintained like a private fast food service.

Walking Tracks: Check Photos Here and Video Below;

Amaravati-Ground-Talk-Report-Reality-Ama

In a bid to turn the Capital area into a blue-green city, the beautification is going on at a brisk pace. We have come across a lake which is well maintained and has a walking track which is almost ready. The landscaping work is nearing the completion. We have seen the locals enjoying there in the evenings.

 

What about Vijayawada city? Photos of Vijaywada Post Bifurcation

Amaravati-Ground-Talk-Report-Reality-Ama

If you have not visited Vijayawada for the last two years, you will be very surprised. Yes we mean it, you will be very surprised. Roads widening plays big role here while it is still going on in several areas of the city. First Mc Donalds (we have pics above), Posh malls, restaurants welcome you to the city. One can see a ton of construction activity mostly apartments in and around the city, you will be surprised to see few iconic apartments being built and priced over 2 Crore.

 

source : mirchi9

https://www.mirchi9.com/politics/what-is-happening-in-amaravati-mirchi9-ground-report/

Link to comment
Share on other sites

సీఎంవో ప్రారంభించిన చంద్రబాబు

brk-cm1c.jpg

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం వెలగపూడిలో నూతనంగా నిర్మించిన సచివాలయంలోని సీఎం ఛాంబర్‌ను బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన మహూర్తానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, సీఎస్‌ టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సీఎంకు అభినందనలు తెలిపారు. సీఎం ఛాంబర్‌లోని తన సీటులో ఆసీనులైన చంద్రబాబు.. రెండో విడత రుణ సహాయం దస్త్రంపై తొలి సంతకం చేశారు.

brk-cm1b.jpg

నూతన శకం ప్రారంభమైంది: చంద్రబాబు

నవ్యాంధ్రలో నూతన శకం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం ఛాంబర్‌ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేశారు. కట్టుబట్టలతో వచ్చాం. స్వాతంత్య్రం నాటి నుంచి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. మద్రాస్‌ నుంచి కర్నూలు వచ్చినప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత గంపెడు కష్టాలతో వచ్చాం. అన్యాయంతో పాటు అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ నేలపై నుంచి పరిపాలన చేస్తే తప్ప ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండదు. అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే ఇక్కడినుంచే పరిపాలన రావాలి. తెలుగు వారికి బ్రహ్మాండమైన రాజధాని రావాలి. ఆ స్థాయి కోసం వేచివుంటే అభివృద్ధి ఆలస్యమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 8 నెలల వ్యవధిలోనే పూర్తిస్థాయి పాలనకు సిద్ధమయ్యాం. పరిపాలన భవనాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి కోసం వేచివుంటే అభివృద్ధి ఆలస్యమవుతుంది. అందుకే తాత్కాలికంగా భవనాలు నిర్మించి పాలన ప్రారంభించాం’’ అని వివరించారు.

రాజధానికి భూములిచ్చిన రైతులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. నాపై నమ్మకం ఉంచి రైతులు స్వచ్ఛందంగా భములు ఇచ్చారని తెలిపారు. లేనిపోని విమర్శలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. ప్రజలకు అందుబాటులో కాకుండా అడవుల్లో రాజధాని పెట్టాలా అని ప్రశ్నించారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూ సమీకరణ ద్వారా 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. పేద మహిళలను ఆదుకోవాలనేదే నా ప్రధాన ఉద్దేశం... 82 లక్షల మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారు. డ్వాక్రా సభ్యులను శక్తిమంతమైన సంఘాలుగా తయారు చేయాల్సిన అవసరముందన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్లు విడుదల చేస్తాం, నవంబర్‌ 1 నుంచి రూ.3వేలు చొప్పున పంపణీ చేస్తామని ప్రకటించారు. నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

inside entha bagundho telvadhu kaani... bayata nunchi matram no change... adhe type buildings.. Govt antee antha alusu anukunta... govt lo kuda evadu pattinchukodu.... kanisam Gannavaram eduta vunna L&T builing ni copy chesina chala better ga vundhedhi look.

మరింత ఆకర్షణీయంగా అసెంబ్లీ బ్లాక్‌

 

636120130589868865.jpg
  • సువిశాలంగా కమిటీ హాళ్లు.. చాంబర్లలోనూ మార్పులు
  • తాత్కాలిక సచివాలయంలోని మిగిలిన బ్లాక్‌లకూ ఎలివేషన
  • ప్రాంగణంలో కనువిందు చేసేలా హరితహారం
  • సెక్రటేరియట్‌కు దారి తీసే మార్గాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి: సీఎం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ బ్లాక్‌ను మరింత ఆకర్షణీయంగా మలచేందుకు ఉపకరించే వివిధ సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు ఇచ్చారు. వెలగపూడిలోని తన కొత్త కార్యాలయంలో గురువారం ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ కాంప్లెక్స్‌లోని అసెంబ్లీ బ్లాక్‌తోపాటు మిగిలిన 5 బ్లాక్‌లనూ ఇంకా మెరుగ్గా, సౌకర్యవంతంగా అభివృద్ధిపరచేందుకు ఏమేం చేయాలో సూచించారు. స్థ్థూలంగా చూస్తే అసెంబ్లీ డిజైన బాగానే ఉన్నప్పటికీ కొద్దిపాటి మార్పుచేర్పులతో దాన్ని ఇంకా ఆకర్షణీయంగా చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా శాసనసభ భవనంలోని మొదటి అంతస్తులో కమిటీ హాళ్లను సువిశాలంగా నిర్మించాలన్నారు. కనీసం 200 మంది ఆసీనులయ్యేలా ఇవి ఉండాలని, ఇందుకోసం మొదట ప్రతిపాదించిన విధంగా 3 హాళ్లకు బదులు.. 2 హాళ్లనే పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. అలాగే.. అసెంబ్లీ బ్లాక్‌ను ఇతర బ్లాక్‌ల నుంచి వేరు చేస్తూ ప్రత్యేకంగా నిర్మించనున్న కాంపౌండ్‌ వాల్‌తోపాటు శాసనసభ్యులు, అధికారులు, సందర్శకులు, ఇతరులకు అనుకూలంగా ఉండేలా సీటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు.. సీఎం బ్లాక్‌లో మార్పులనూ ఆయన సూచించినట్టు సమాచారం.
 
 
సచివాలయ కాంప్లెక్స్‌లోని 6 బ్లాక్‌లూ అంతర్గతంగా చక్కగా, ఐటీ కంపెనీల మాదిరిగా ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నప్పటికీ వాటి బాహ్యరూపం మాత్రం మెరుగుపడాల్సి ఉందన్న చంద్రబాబు.. అందుకోసం వాటి ఎలివేషనను అధునాతనంగా, ఆకర్షణీయంగా చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అప్పటికే అధికారులు సిద్ధం చేసిన కొన్ని డిజైన్లను పరిశీలించి.. మరొక 2, 3 నమూనాలను తయారు చేసి, తెమ్మన్నట్టు తెలిసింది. దాదాపు రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ ప్రాంగణంలో అభివృద్ధి చేయదలచి, టెండర్లు కూడా పిలిచిన ‘హరిత హారం’ కనువిందు చేసేలా ఉండాలని కూడా సీఎం ఆదేశించారు. కేవలం సచివాలయ ప్రాంగణాన్ని మాత్రమే సర్వాంగసుందరంగా రూపొందించి, దానికి వివిధ గ్రామాల మీదుగా ఉన్న మార్గాలను నిర్లక్ష్యం చేస్తే బాగోదని, అందువల్ల ఆయా రోడ్లను కూడా అభివృద్ధి పరచడంతోపాటు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ పనులపై ముఖ్యమంత్రి శుక్రవారం మరో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా, కొత్తగా నిర్మిస్తున్న నవ్యాంధ్ర అసెంబ్లీలో జర్మన టెక్నాలజీతో కూడిన ఆధునిక సౌండ్‌ సిస్టమ్‌ను, మైకులను ఏర్పాటుచేయనునన్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మైక్‌ ముందు ఉన్న వ్యక్తి ఎటువైపు తిరిగి మాట్లాడినా వినిపిస్తుందన్నారు.

 

పర్యాటకానికి ప్రత్యేక బోర్డు

పర్యాటక రంగాన్ని ప్రగతిపథాన నడిపేలా ఆ శాఖకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో జవసత్వాలు తీసుకురానుంది. పర్యాటకరంగ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ, వారసత్వ సంపదను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ టూరిజం, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ బోర్డును త్వరలో ఏర్పాటుచేయనుంది. బోర్డు ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం వెలగపూడిలో తన కార్యాలయం నుంచి సీఎం రెండో రోజు పాలన సాగించారు. పర్యాటక శాఖపై ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను బలోపేతం చేసేందుకు బోర్డు ఆవశ్యకతను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించే టూరిజం-కల్చర్‌-హెరిటేజ్‌ బోర్డులో రాష్ట్రస్థాయి నిర్వాహక కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు కొత్తగా ఏర్పాటుచేసే టూరిజం అథారిటీ, కల్చర్‌ కమిషన్‌, హెరిటేజ్‌ అథారిటీని పర్యవేక్షిస్తుంటాయి. కార్యనిర్వహణ కమిటీతో పాటు నిపుణులను నియమిస్తారు. జిల్లా యూనిట్‌గా డిసి్ట్రక్‌ టూరిజం అండ్‌ కల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తారు. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నూతనంగా ఏర్పాటుచేసే సిటీ టూరిజం అండ్‌ కల్చర్‌ కౌన్సిల్‌కు మున్సిపల్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఉంటారని అధికారులు సీఎంతో చెప్పారు. కాగా, ఏటా రాజధాని ప్రాంతంలో డిసెంబరులో ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని సీఎం అన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...