sonykongara Posted November 1, 2016 Author Posted November 1, 2016 అమరావతిలో రూ.4 కోట్లతో పరుచుకుంటున్న పచ్చదనం నాలుగు బ్లాకుల్లో సుందరీకరణ పనులు పూర్తి రాజధానిలో తొలి నిర్మాణమైన తాత్కాలిక సచివాలయ ప్రాంగణం పచ్చదన శోకులు సంతరించుకుంటోన్నది. నవ్యాంధ్రకు పరిపాలనా రాజధానిగానే కాక ఒక సుందర ఉద్యానవనంలా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూ.4 కోట్లతో రకరకాల పూల మొక్కలు, చెట్లతో ప్రాంగణంలో నవ్య శోభను సంతరించుకుంటోన్నది. (ఆంధ్రజ్యోతి - అమరావతి) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో పచ్చదనం పరచు కుంటోంది. ఏపీ అర్బన బ్యూటిఫికేషన కార్పొరేషన సచివాలయంలో సుందరీకరణ పనుల డిజైన్లకు రూ పకల్పన చేసింది. ప్రభుత్వం సచివాలయంలో రూ.4 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టింది. ఇప్పటికే సచివాలయం ఆవరణ రకరకాల పూల మొక్కలతో, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. సచివాలయం ఆవ రణలోని 5 బ్లాకుల్లో ఇప్పటికే నాలుగు బ్లాకుల్లో సుం దరీకరణ ప్రక్రియ పూర్తయింది. బ్లాకుల్లోని కోర్టు యా ర్డుల్లో కడియం, కలకత్తా, బెంగళూరు నుంచి తీసుకువచ్చిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. సీఆర్‌డీఏ సుందరీకరణ పనులను కడియంకు చెందిన గ్రీన క్రా ప్స్ అగ్రీ క్లినిక్ అండ్ అగ్రీ బిజినెస్ సెంటర్‌కు అప్ప గించింది. అగ్రీ హరిత కల్చర్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ, హరిత ప్రియా ప్లాంట్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ సంస్థల సహకారంతో 15 రోజుల్లో నాలుగు బ్లాకుల్లో శరవేగంగా సుందరీకరణ పనులు పూర్తి చే సింది. సీఎం బ్లాక్‌లో సుందరీకరణ పనులు ప్రారం భమయ్యాయి. ఇప్పటికే సచివాలయంలో ఏర్పాటు చేయనున్న పార్కుల్లో ఎర్రమట్టి తోలి చదును చేస్తు న్నారు. ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పా ర్క్ లో రకరకాల పూల మొక్కలు ఉండేలా చూస్తా రు. ఈ పార్క్‌లో పౌంటేన్లు, లాన్స్‌తో పూల బెడ్ల తో పాటు నడక దారులు కూడా ఏర్పాటు చేయ నున్నారు. 360 రోజులు పూసే పూల మొక్కలను ఈ పార్క్‌లో నాటతారు. అసెంబ్లీ భవనం ముం దు పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు భూమిని చదును చేస్తున్నారు. సచివాలయంలోని 4 బ్లాకుల మధ్యలో ఉన్న ప్రతి కోర్టు యార్డులో 450 చదరపు మీటర్లల్లో మొక్కలు నాటారు. కలక త్తా, బెంగళూరు, కడియం నుంచి బ్యాంబూస్, రాపి స్, టెలీకోనియా, లానస్, కార్పెట గ్రాస్, మెండో గ్రా స్, క్రోటన్స్, రియోస్మెతీషియా, షెప్‌లెరా, పెకస్ వం టి వందల రకాల పూల మొక్కలను సచివాలయం లో నాటి ఉద్యానశోభ తీసుకువస్తున్నారు.
swas Posted November 1, 2016 Posted November 1, 2016 అమరావతిలో రూ.4 కోట్లతో పరుచుకుంటున్న పచ్చదనం నాలుగు బ్లాకుల్లో సుందరీకరణ పనులు పూర్తి రాజధానిలో తొలి నిర్మాణమైన తాత్కాలిక సచివాలయ ప్రాంగణం పచ్చదన శోకులు సంతరించుకుంటోన్నది. నవ్యాంధ్రకు పరిపాలనా రాజధానిగానే కాక ఒక సుందర ఉద్యానవనంలా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూ.4 కోట్లతో రకరకాల పూల మొక్కలు, చెట్లతో ప్రాంగణంలో నవ్య శోభను సంతరించుకుంటోన్నది. (ఆంధ్రజ్యోతి - అమరావతి) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో పచ్చదనం పరచు కుంటోంది. ఏపీ అర్బన బ్యూటిఫికేషన కార్పొరేషన సచివాలయంలో సుందరీకరణ పనుల డిజైన్లకు రూ పకల్పన చేసింది. ప్రభుత్వం సచివాలయంలో రూ.4 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టింది. ఇప్పటికే సచివాలయం ఆవరణ రకరకాల పూల మొక్కలతో, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. సచివాలయం ఆవ రణలోని 5 బ్లాకుల్లో ఇప్పటికే నాలుగు బ్లాకుల్లో సుం దరీకరణ ప్రక్రియ పూర్తయింది. బ్లాకుల్లోని కోర్టు యా ర్డుల్లో కడియం, కలకత్తా, బెంగళూరు నుంచి తీసుకువచ్చిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. సీఆర్‌డీఏ సుందరీకరణ పనులను కడియంకు చెందిన గ్రీన క్రా ప్స్ అగ్రీ క్లినిక్ అండ్ అగ్రీ బిజినెస్ సెంటర్‌కు అప్ప గించింది. అగ్రీ హరిత కల్చర్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ, హరిత ప్రియా ప్లాంట్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ సంస్థల సహకారంతో 15 రోజుల్లో నాలుగు బ్లాకుల్లో శరవేగంగా సుందరీకరణ పనులు పూర్తి చే సింది. సీఎం బ్లాక్‌లో సుందరీకరణ పనులు ప్రారం భమయ్యాయి. ఇప్పటికే సచివాలయంలో ఏర్పాటు చేయనున్న పార్కుల్లో ఎర్రమట్టి తోలి చదును చేస్తు న్నారు. ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పా ర్క్ లో రకరకాల పూల మొక్కలు ఉండేలా చూస్తా రు. ఈ పార్క్‌లో పౌంటేన్లు, లాన్స్‌తో పూల బెడ్ల తో పాటు నడక దారులు కూడా ఏర్పాటు చేయ నున్నారు. 360 రోజులు పూసే పూల మొక్కలను ఈ పార్క్‌లో నాటతారు. అసెంబ్లీ భవనం ముం దు పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు భూమిని చదును చేస్తున్నారు. సచివాలయంలోని 4 బ్లాకుల మధ్యలో ఉన్న ప్రతి కోర్టు యార్డులో 450 చదరపు మీటర్లల్లో మొక్కలు నాటారు. కలక త్తా, బెంగళూరు, కడియం నుంచి బ్యాంబూస్, రాపి స్, టెలీకోనియా, లానస్, కార్పెట గ్రాస్, మెండో గ్రా స్, క్రోటన్స్, రియోస్మెతీషియా, షెప్‌లెరా, పెకస్ వం టి వందల రకాల పూల మొక్కలను సచివాలయం లో నాటి ఉద్యానశోభ తీసుకువస్తున్నారు. video unte veyandi
sonykongara Posted November 9, 2016 Author Posted November 9, 2016 సందర్శకుల పార్కింగ్ ఏర్పాట్లు చక చకా అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాలన అంతా వెలగపూడి నుంచే ప్రారంభం కావడం, సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడే అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వర్తిస్తుండం, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి అధికారులు, సందర్శకులు సచివాలయానికి వస్తుండటంతో సచివాలయంలో వీరికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం కోసం చేసే పనుల్లో సీఆర్‌డీఏ అధికారులు వేగాన్ని పెంచారు. సచివాలయం ఆవరణ వెలుపల సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం నేలను చదును చేసి, దాని మీద బీటీ పరచి తారు వేస్తున్నారు. 700 వాహనాలు నిలపడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
sonykongara Posted November 9, 2016 Author Posted November 9, 2016 వెలగపూడి సచివాలయం ఎలివేషన్ డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎల్‌అండ్‌టీ ఇచ్చిన డిజైన్‌ను యథాతధంగా ప్రభుత్వం ఆమోదించింది.
KaNTRhi Posted November 18, 2016 Posted November 18, 2016 ayyedi kaadu pettedi kaadu.. Hyd lo ne jarupukuntaru le...
swarnandhra Posted November 22, 2016 Posted November 22, 2016 ide super ga vundi. deenne permanent cheste potundi ga
Guest Urban Legend Posted November 23, 2016 Posted November 23, 2016 know about timings, blocks and other info http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20161123b_010139002.jpg
sonykongara Posted November 23, 2016 Author Posted November 23, 2016 వెలగపూడిలో ప్రయోగాత్మకంగా సైక్లింగ్ ట్రాక్ అమరావతిని కాలుష్యరహితంగా రూపొందించాలన్న ఆలోచనలో భాగంగా 1620 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా సైకిల్ ట్రాకులను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. డెన్మార్క్ రాజధాని కోహెన్ సెగన్‌లో కూడా ఇంత పెద్ద నెట్‌వర్క్ లేదని చెప్పారు. సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుపై దీనిపై ఆలిండియా బైస్కిలింగ్ ఫెడరేషన్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వెలగపూడి సచివాలయంలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు ఫెడరేషన్ చైర్మన్ డీవీ మనోహర్ చెప్పారు. 43 కిలోమీటర్ల మేర వున్న వెలగపూడి సచివాలయంలో పబ్లిక్ బైక్ షేరింగ్ విధానంలో బైస్కిలింగ్ ట్రాక్స్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. వంద సైకిళ్లు, 6 బైక్ స్టేషన్లను మూడు మాసాల వ్యవధిలోగా వెలగపూడిలో సిద్ధంచేస్తున్నామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. వెలగపూడిలోనే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలలో సైకిల్ ట్రాక్స్ వెంటనే ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడలో ప్రధాన కాలువల వెంబడి వున్న మార్గాలలో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుచేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. అలాగే, బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ సర్కిల్ వరకు సర్విస్ రోడ్డు పక్కనే సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఈ మార్గాలలో ఇ-బైక్‌లను కూడా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
swarnandhra Posted November 25, 2016 Posted November 25, 2016 Source: AndhraJyothy వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ దాడి 25-11-2016 18:28:09 విజయవాడ: వెలగపూడి సచివాలయంలో మొదటిసారి ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ ట్రాప్ జరిగింది. హోంశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ రూ. 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అధికారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వెలగపూడికి చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే సచివాలయలో పరిపాలన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు సోమవారం నుంచి సచివాలయం నుంచే విధులు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఏసీబీకి అధికారి చిక్కడం చర్చనీయాంశమయింది.
Guest Urban Legend Posted November 25, 2016 Posted November 25, 2016 Source: AndhraJyothy వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ దాడి 25-11-2016 18:28:09 విజయవాడ: వెలగపూడి సచివాలయంలో మొదటిసారి ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. వెలగపూడి సచివాలయంలో తొలి ఏసీబీ ట్రాప్ జరిగింది. హోంశాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ రూ. 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అధికారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వెలగపూడికి చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే సచివాలయలో పరిపాలన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు సోమవారం నుంచి సచివాలయం నుంచే విధులు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఏసీబీకి అధికారి చిక్కడం చర్చనీయాంశమయింది. boni chesaru ga .. em chesthey maaratharu e govt emloyees ...
sonykongara Posted November 27, 2016 Author Posted November 27, 2016 పచ్చదనంతో ఆహ్లాదంగా అలరిస్తున్న అమరావతి నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మించారు. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా ఉండేవిధంగా అనువైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాలలో 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకులవారీగా పచ్చదనం నింపుతున్నారు. ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్ కత్తా, బెంగళూరుల నుంచి పలు రకాల మొక్కలు తెస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్ ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తూనే ఉంటాయి. పౌంటేన్లు ఏర్పాటు చేస్తారు. పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తారు. శాసనసభ భవనం ముందు కూడా పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి. అలాగే నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా రూపొందిస్తున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now