Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

చలో వెలగపూడి
 
636096705454381799.jpg
  • మూడో తేదీ నుంచి పాలనంతా అక్కడి నుంచే
  • నెలాఖరులోగా శాఖలన్నీ తరలింపు
  • దసరా రోజు సీఎం ఆఫీసు ప్రారంభం
  • సన్నాహక చర్యల్లో భాగంగా
  • ఉద్యోగులకు వారం పాటు సెలవు
  • బ్యాంకులకు మరో 500 గజాలు
  • ఎస్పీఎఫ్‌ భద్రతలో సచివాలయం
  • ఇకపై అనుమతి ఉంటేనే
  • సామాన్యులకు సచివాలయ ప్రవేశం
 
హైదరాబాద్‌/అమరావతి, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): ఏపీ పాలన ఇక పూర్తిస్థాయిలో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే జరగనుంది. దీనికి సంబంధించి ముహూర్తం పక్కాగా ఖరారైంది. అక్టోబరు 3వ తేదీ నుంచి వెలగపూడి నుంచే పూర్తిస్థాయి పాలన జరుగుతుందని కార్యాలయాల తరలింపు వ్యవహారాలు చూస్తున్న అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి 30 వరకు ఒక్కొక్కటిగా అన్ని సచివాలయ శాఖలు వెలగపూడిలో కేటాయించిన తమ కార్యాలయాలకు చేరుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత 3వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక, సీఎం చంద్రబాబు తన కార్యాలయాన్ని దసరా రోజు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
 
శాఖల తరలింపు నేపథ్యంలో ఉద్యోగులకు వారం పాటు సెలవులు ఇస్తామని ఈ సమయంలో సచివాలయ కార్యకలాపాలు మందగించే అవకాశం ఉందని అన్నారు. సచివాలయం పూర్తిస్థాయిలో తరలిన తర్వాత కోర్టు వ్యవహారాలు చూసుకోవడానికి ఒక్కోశాఖ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులు హైదరాబాద్‌ సచివాలయం నుంచే పనిచేస్తారని చెప్పారు. ఇక, తీవ్ర అనారోగ్యం, భార్యభర్తల సమస్య, ఇతర సమస్యలతో వెలగపూడికి రాలేమంటున్న ఉద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ఈ జాబితా అక్టోబర్‌ 3 తర్వాత పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అప్పుడు వారిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 
తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగులందరికీ అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, సంక్షేమానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులకు అధునాతన సదుపాయాలతో కూడిన ఆఫీసు గదులు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి రిక్రియేషన్‌తో పాటు.. సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికిగాను చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకులు తమ శాఖలను వెలగపూడిలో ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఈ రెండు బ్యాంకుల ఏర్పాటుకు తొలుత కేటాయించిన 500 చదరపు అడుగులతో పాటు అదనంగా మరో 500 చదరపు అడుగుల స్థలం కేటాయించారు.
 

భద్రతా వలయంలో సచివాలయం
తాత్కాలిక సచివాలయాన్ని ఏపీ ప్రత్యేక భద్రతా దళం(ఏపీ ఎస్పీఎఫ్‌) తన అధీనంలోకి తీసుకుంది. సచివాలయంలో ఐదు బ్లాక్‌ల నిర్మాణం పూర్తయి.. వివిధ శాఖలు కార్యాలయాలను కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్‌పీఎఫ్‌ డీఐజీ ఏసురత్నం సచివాలయంలో ఆయుధ పూజ నిర్వహించి 5 బ్లాకులను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి 90 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. అసెంబ్లీ నిర్మాణం పూర్తయ్యాక భద్రతపై పటిష్ట ప్రణాళిక రూపొందిస్తామని ఏసురత్నం తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయాన్ని మించిన భద్రతను ఇక్కడ కల్పించనున్నట్లు తెలిపారు. వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి వ్యక్తిగత పనులపై వస్తున్నవారు కార్యాలయంలో సిబ్బందిని కలుస్తున్నారని, దీని వలన సిబ్బందికి ఇబ్బందికరంగా ఉన్నట్లు ఆయా అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌పీఎ్‌ఫను రంగంలోకి దించారు. ఇక నుంచి అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ సచివాలయంలోకి వెళ్లనివ్వరు. సచివాలయంలోకి వెళ్లటానికి ఎవరైన వస్తే ఏ కార్యాలయానికి వెళ్లాలి, ఎవరిని కలవాలి అనే వివరాలు తెలుసుకొని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారు పంపమంటేనే విజిటర్స్‌ను పంపనున్నారు

Link to comment
Share on other sites

inside entha bagundho telvadhu kaani... bayata nunchi matram no change... adhe type buildings.. Govt antee antha alusu anukunta... govt lo kuda evadu pattinchukodu.... kanisam Gannavaram eduta vunna L&T builing ni copy chesina chala better ga vundhedhi look.

Link to comment
Share on other sites

inside entha bagundho telvadhu kaani... bayata nunchi matram no change... adhe type buildings.. Govt antee antha alusu anukunta... govt lo kuda evadu pattinchukodu.... kanisam Gannavaram eduta vunna L&T builing ni copy chesina chala better ga vundhedhi look.

 

avi just temporary buildings....

Link to comment
Share on other sites

inside entha bagundho telvadhu kaani... bayata nunchi matram no change... adhe type buildings.. Govt antee antha alusu anukunta... govt lo kuda evadu pattinchukodu.... kanisam Gannavaram eduta vunna L&T builing ni copy chesina chala better ga vundhedhi look.

building elevation ippude paurthiga radu,  anni anthasthulu kattakakani cheyyaru.

Link to comment
Share on other sites

వెలగపూడికి వెల్‌కమ్‌
 
636106234275994396.jpg
  • సచివాలయ శాఖలకు కేటాయింపులు పూర్తి 
  • 3వ బ్లాకులో ‘సంక్షేమం’.. 3 నుంచి పాలన 
  • 1 నుంచి ఉద్యోగినులకు ఉచిత వసతి 
  • రెయిన ట్రీ పార్కులో 30 ఫ్లాట్లు సిద్ధం 
  • సకల హంగులతో సచివాలయం సన్నద్ధం 
 కొత్త ఫర్నిచర్‌, కంప్యూటర్లు, వసతులు
 సెంట్రల్‌ ఏసీ, సెన్సర్లతో లైటింగ్‌
 మినరల్‌ వాటర్‌నుంచి వైఫై వరకు ఏర్పాట్లు
 ఊపందుకున్న సచివాలయ తరలింపు


అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): అటు హైదరాబాద్‌లోని సచివాలయంలో తరలింపు హడావుడి... ఇటు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ‘కొత్త సందడి’! వచ్చేనెల 3 నుంచి వెలగపూడి నుంచే పూర్తిస్థాయి పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... తరలింపు కార్యక్రమం ఊపందుకుంది. హైదరాబాద్‌ నుంచి ఫైళ్లు, ఫర్నిచర్‌ తరలింపు ప్రక్రియ మంగళవారం అన్ని శాఖల్లో పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఉద్యోగులు ఫైళ్లను సర్దుతూ, ప్యాక్‌ చేస్తూ, అమరావతికి తీసుకువెళ్లాల్సిన ఫైళ్లను స్కాన్‌ చేస్తూ బిజీ బిజీగా కనిపించారు. మునిసిపల్‌, హౌసింగ్‌, ఫైనాన్స, ప్లానింగ్‌ శాఖలు ఇప్పటికే కొన్ని ఫైళ్లను స్కానింగ్‌ చేయగా, మిగిలి ఉన్నవాటిని ప్యాక్‌ చేసి తరలించడానికి సిద్ధం చేస్తున్నాయి. ఈ నెల 30వ తేదీనాటికి అన్ని శాఖలు ఫైళ్లను, ఫర్నిచర్‌ను వెలగపూడికి తరలించే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో... సచివాలయ ఉద్యోగులకు అవసరమైన ఏర్పాట్లన్నీ వెలగపూడిలో పూర్తవుతున్నాయి. ప్రతి శాఖ కార్యాలయంలో కొత్త ఫర్నీచర్‌, కొత్త కంప్యూటర్లు, క్యూబికల్స్‌, ఇతర వసతులను పద్ధతి ప్రకారం అమరుస్తున్నారు. ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని సృష్టించారు. బయటి గోడల స్థానంలో సెయింట్‌ గోబిన గ్లాస్‌ వాడారు. దీంతో... మంచి వెలుతురు లోపలికి వస్తోంది. ఉద్యోగులు బయట ఉన్న ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. లోపలంతా సెంట్రల్‌ ఏసీ ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు కొత్తవి అమరుస్తున్నారు. ప్రతి భవనంలో అత్యాధునిక ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. పొగ కనిపిస్తే కనిపెట్టే స్మోక్‌ డిటెక్టివ్‌ యంత్రాలను అమర్చారు. అన్ని భవనాల్లో ప్రతి అంతస్తులో రెండు నీటిశుద్ధి యంత్రాలు, వాటికి అనుసంధానంగా మంచినీటి కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక...విద్యుత పొదుపునకూ ప్రాధాన్యం ఇచ్చారు. కారిడార్‌లో రాకపోకలను బట్టి అవసరమైన మేరకే లైట్లు వెలుగుతాయి, ఆరిపోతాయి. రెండు భవనాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించారు. మిగిలిన భవనాల్లోనూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని కూడా దసరాకల్లా పూర్తిచేయాలన్న సంకల్పంతో పనులు చేస్తున్నారు. మంగళవారం ఆర్థిక, ప్రణాళికా శాఖలకు సంబంధించి 400ల మంది కూర్చోవడానికి అవసరమైన క్యూబికల్స్‌, కుర్చీలు, కొత్త కంప్యూటర్లు అమర్చారు. కాగా, సచివాలయ నిర్మాణం తీరు, పనులను చూసేందుకు మంగళవారం ఎంటెక్‌ విద్యార్థులు వచ్చారు. భవనాల నిర్మాణ విశేషాలను ఇనచార్జి అధికారి బీఆర్‌కే రెడ్డి వివరించారు. అత్యాధునికంగా నిర్మిస్తున్న ఈ భవనాలు తమకు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ఉపయోగపడతాయని విద్యార్థులు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...