Jump to content

TTD chairman- br naidu


gnk@vja

Recommended Posts

BR Naidu: తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యులు వీళ్లే

Eenadu

Telugu News

Andhra-pradesh News

తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యులు వీళ్లే!

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 

Updated : 30 Oct 2024 19:22 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తితిదే అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తితిదే బోర్డు సభ్యులు వీరే..

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)

సాంబశివరావు (జాస్తి శివ)

 శ్రీసదాశివరావు నన్నపనేని

కృష్ణమూర్తి

కోటేశ్వరరావు

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

దర్శన్‌. ఆర్‌.ఎన్‌

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

శాంతారామ్‌

పి.రామ్మూర్తి

జానకీ దేవి తమ్మిశెట్టి

బూంగునూరు మహేందర్‌ రెడ్డి

అనుగోలు రంగశ్రీ

బురగపు ఆనందసాయి

సుచిత్ర ఎల్లా

నరేశ్‌కుమార్‌

డా.అదిత్‌ దేశాయ్‌

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

image.gif

Link to comment
Share on other sites

*తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటన* 
*24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి  ప్రకటన*
*టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా బి.ఆర్‌.నాయుడు నియామకం*
*టీటీడీ బోర్డులో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు* 
*టీటీడీ బోర్డులో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు*
*టీటీడీ బోర్డులో కర్ణాటకకు చెందిన ముగ్గురికి చోటు* 

*టీటీడీ సభ్యులు: ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*
*టీటీడీ సభ్యులు: ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి* 
*టీటీడీ సభ్యులు: జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు*
*టీటీడీ సభ్యులు: కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌*
*టీటీడీ సభ్యులు: జంగా కృష్ణమూర్తి, ఆర్‌.ఎన్‌.దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్‌*
*టీటీడీ సభ్యులు: పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్‌రెడ్డి*
*టీటీడీ సభ్యులు: అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి*
*టీటీడీ సభ్యులు: నరేశ్‌ కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, సౌరభ్‌ హెచ్‌.బోరా*

Link to comment
Share on other sites

3 Janasena  members  in TTD Board 

స్వామి సేవ చేయాలనే తపన, ఆగమ శాస్త్ర విషయాలపై పరిజ్ఞానం కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావించారు. అందుకు అనుగుణంగా ముగ్గురికి అవకాశం ఇచ్చారు. 

1) బొంగునూరి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. శ్రీ మహేందర్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు ఆంధ్ర ప్రదేశ్ తో ఉన్నాయి. ఈయన పవన్ కల్యాణ్ తో కలసి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు సమయం నుంచి కలసి ప్రయాణిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటయ్యాక పవన్ కల్యాణ్ తో యువ రాజ్యంలో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కేవలం ఈ రాజకీయ ప్రయాణమే కాకుండా – అప్పగించిన ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నెరవేరుస్తారు అనే నమ్మకం, ఆయన దైవ భక్తిని పరిగణనలోకి తీసుకొన్నారు. 

2) శ్రీమతి అనుగోలు రంగశ్రీ 

జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె స్వస్థలం విజయవాడ. శ్రీమతి రంగశ్రీ జనసేన పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం సతీమణి. శ్రీమతి రంగశ్రీకి దైవ భక్తి అపారం. పలు ఆలయాలకు విరాళాలు ఇవ్వడంతోపాటు, పలు ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

3) బురగపు ఆనంద సాయి 

ఆనంద సాయి కళా దర్శకుడిగా, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ రూపకర్త పరిచితులు. శ్రీకాకుళంకు చెందిన ఈయన విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ తో స్నేహం ఉంది. ఆనంద సాయికి ఆలయ వాస్తు, ఆగమ శాస్త్ర ప్రకారం చేయాల్సిన నిర్మాణాలపై పరిజ్ఞానం ఉంది. హిందూ ఆలయాల నిర్మాణ రీతులపై, శిల్ప కళపై సాధికారిత కలిగిన నిపుణులు ఈయన. ఆగమ, ధార్మిక అంశాలపై ఈయనకు ఉన్న అవగాహన కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సేవలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ అవకాశం కల్పించారు.

Link to comment
Share on other sites

23 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు .. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు స్థానం

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొత్తం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన 23 మందిని సభ్యులుగా నియమించింది. బోర్డులో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్టులో స్థానం లభించింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పని చేసిన వ్యక్తిని తొలిసారి టీటీడీ బోర్డులో నియమించారు. మాజీ సీజేఐ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తును బోర్డు సభ్యుడిగా నియమించారు. 

 
 
  • టీడీపీ నుంచి... 

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం దక్కింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న తెలంగాణకు చెందిన నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. రాజమండ్రికి చెందిన సాధారణ వ్యక్తి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది. నంద్యాల జిల్లా టీడీపీ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ గౌడ్‌, పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా క్రిష్ణమూర్తికి బోర్డులో అవకాశం దక్కింది. ఎన్నికల్లో జంగా క్రిష్ణమూర్తి గురజాల ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిని సభ్యురాలిగా నియమించారు. 

 

 

  • జనసేన కోటాలో... 

జనసేన పార్టీ కోటాలో ముగ్గురు సభ్యులకు టీటీడీ బోర్డులో అవకాశం లభించింది. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డిని సభ్యుడిగా నియమించారు. 2009 నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వెంటే ఉన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పని చేశారు. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి టీటీడీలో చోటు కల్పించారు. ఆమె భర్త ఎం.సి.దాస్‌ జనసేన పార్టీ ట్రెజరర్‌గా ఉన్నారు. ఇక జనసేన పార్టీ కోటాలో డిప్యూటీ సీఎం పవన్‌ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్‌సాయికి అవకాశం దక్కింది. తెలంగాణలోని యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 

 

  • వివిధ రంగాల నుంచి... 

ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి జాస్తి సాంబశివరావు, ఫార్మా రంగం నుంచి నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లాకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది. అమిత్‌షా సతీమణి, కృష్ణమూర్తి సతీమణి చిన్ననాటి స్నేహితులని సమాచారం. కృష్ణమూర్తి మద్రాస్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. కాఫీ వ్యాపారి ఆర్‌ఎన్‌ దర్శన్‌, కుప్పం పారిశ్రామిక వేత్త శాంతరామ్‌, చెన్నైకి చెందిన పి.రామ్మూర్తిని సభ్యులుగా నియమించారు. పి.రామ్మూర్తి తమిళనాడులో పెద్ద టెక్స్‌టైల్స్‌ వ్యాపారవేత్త. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న తిరుప్పూరు బాలుకు స్వయానా సోదరుడు. అంతేగాక మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు అతి సమీప బంధువు అని తెలిసింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో అవకాశం దక్కించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి నరే్‌షకుమార్‌కు చోటు కల్పించారు. ఆర్థిక నిపుణుడు, నిధుల సమీకరణలో అనుభవం ఉన్న సౌరబ్‌ హెచ్‌.బోరాకు బోర్డు సభ్యుడిగా స్థానం దక్కింది. గతంలో ఎంసీఐ చైర్మన్‌గా విధులు నిర్వహించిన కేతన్‌ దేశాయ్‌ కుమారుడు డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌కు బోర్డులో స్థానం లభించింది. కేతన్‌ దేశాయ్‌పై ఆరోపణలు ఉండడంతో ఆయనకు బదులుగా అదిత్‌ దేశాయ్‌కు అవకాశం కల్పించారు. 

 

 

  • మళ్లీ అవకాశం 

టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమితులైన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి గత వైసీపీ హయాంలోనూ బోర్డులో ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలోనూ బోర్డులో స్థానం దక్కించుకున్న సౌరభ్‌ బోరా.. ఇప్పుడు మరోసారి టీటీడీ సభ్యుడయ్యారు. ఇక ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగా నియమితులైన రామ్మూర్తి సోదరుడు తిరుప్పూర్‌ బాలు గతంలో బోర్డు సభ్యుడిగా పని చేశారు. కేతన్‌ దేశాయ్‌ వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండగా... ఇప్పుడు ఆయన కుమారుడు అదిత్‌ దేశాయ్‌కి అవకాశం లభించింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...