Jump to content

Recommended Posts

Posted

Nara lokesh: అక్టోబర్‌ 9న బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. లోకేశ్‌ ట్వీట్‌

టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భేటీ అయ్యారు.

Updated : 08 Oct 2024 21:34 IST
 
 
 
 
 
 

124183460_8102024lokesh1a.webp

ఇంటర్నెట్ డెస్క్‌: టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భేటీ అయ్యారు. ఈ సమావేశం అద్భుతంగా జరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం భారీ ప్రకటన కోసం వేచి చూడాలంటూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. అయితే, ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి నెలకొంది.

తెదేపా అధికారంలోకి వచ్చాక చంద్రశేఖరన్‌తో లోకేశ్‌ భేటీ కావడం ఇది రెండోసారి. ఆగస్టు 16న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన చంద్రశేఖరన్‌తో లోకేశ్‌ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రోత్సాహకాలను వివరించారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్‌ ఎనర్జీ, టెలీకమ్యూనికేషన్స్, కెమికల్‌ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అన్ని వనరులున్నాయని.. పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయనకు వివరించారు. దీనికి సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. 

లోకేశ్‌ ప్రతిపాదనలపై చంద్రశేఖరన్‌ స్పందిస్తూ.. ఏపీలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని, పూర్తి స్థాయి ప్రతిపాదనలతో మరోమారు కలుస్తామని అప్పట్లో అన్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తాజాగా వీరిద్దరి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో టాటా గ్రూపు పెట్టుబడుల అంశంపైనే బుధవారం ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. లోకేశ్‌ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘టీసీఎస్‌ కంపెనీకి, ఏపీ ప్రజలకు కంగ్రాట్స్‌’ ‘ఎక్స్‌లెంట్‌... రేపటి కోసం వేచిచూస్తున్నాం’.. ‘రాష్ట్రాభివృద్ధి కోసం తండ్రి దిల్లీలో.. కొడుకు అమరావతిలో..’ అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు

Posted
Lokesh Nara
 
@naralokesh
 
I’m happy to announce the development of a IT facility by the Tata Consultancy Services Ltd. in Vizag that will house 10,000 employees. We are committed to offering best-in-class investment climate to corporates driven by our motto of ‘speed of doing business’. This investment by TCS is an important milestone as we work to make AP as India’s No. 1 state to do business.
Posted

Lokesh: విశాఖ సాగర తీరంలో టీసీఎస్‌.. మంత్రి లోకేశ్‌ ప్రకటన

విశాఖ సాగర తీరంలో మరో మణిహారం చేరబోతోంది. సాగర తీరంలో టీసీఎస్‌ ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

Updated : 09 Oct 2024 19:45 IST
 
 
 
 
 
 

124184062_9102024lokesh1a.webp

అమరావతి: విశాఖ సాగర తీరంలో మరో మణిహారం చేరబోతోంది. సాగర తీరంలో టీసీఎస్‌ (TCS) ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా ఈవీ, ఏరోస్పేస్‌, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని ఇదివరకే టాటా గ్రూపు తెలిపింది. ఈ క్రమంలో నిన్న టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం, ఇతర రంగాల్లో అభివృద్ధిపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో బుధవారం బిగ్ అనౌన్స్‌ మెంట్‌ ఉంటుందని ప్రకటించిన లోకేశ్..  సాగర తీరంలో టీసీఎస్‌ ఏర్పాటు గురించి వెల్లడించారు.

లులు, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజలాన్‌ తర్వాత తాజాగా టీసీఎస్‌ వస్తుండటంతో ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోంది.  ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ నినాదం ద్వారా పెట్టుబడులకు అత్యుత్తమ వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బిజినెస్‌ చేసేందుకు ఏపీని దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో.. టీసీఎస్‌ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...