sonykongara Posted August 10 Share Posted August 10 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 10 Author Share Posted August 10 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 29 Author Share Posted August 29 విశాఖ, విజయవాడ మెట్రోలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11వేల కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14వేల కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు విశాఖ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11,400 కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు విశాఖ మెట్రో ఫేజ్-2 కోసం రూ.5,700 కోట్లు కావాలి. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రో వల్లే సాధ్యం. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 30 Author Share Posted August 30 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 30 Author Share Posted August 30 Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల్లో కదలిక జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. Updated : 30 Aug 2024 07:10 IST తొలిదశ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం విజయవాడ-అమరావతి మెట్రోరైలు కారిడార్లు ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు గురువారం ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపాలని ఆయన ఆదేశించారు. సవరించిన డీపీఆర్‌ల ప్రకారం... రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో. మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు. తొలి దశలో: 38.40 కి.మీ. నిర్మాణ వ్యయం: రూ.11,009 కోట్లు. విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ., బస్‌స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ. రెండో దశలో: 27.80 కి.మీ. నిర్మాణ వ్యయం: రూ.14,121 కోట్లు. పండిట్‌నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతికి 27.80 కి.మీ. మొత్తం ఖర్చు కేంద్రం భరించాలని కోరుతున్నాం: నారాయణ విశాఖ, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకర్లకు తెలిపారు. ‘‘ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపాం. కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొన్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదన. నాలుగూ కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. 54 స్టేషన్లు ఉంటాయి. ఆయా కారిడార్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు: 46.23 కి.మీ. నిర్మాణవ్యయం: రూ.11,498 కోట్లు కారిడార్ 1: విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది. పొడవు: 34.40 కి.మీ. స్టేషన్లు: 29 కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు. పొడవు: 5.07 కి.మీ. స్టేషన్లు: 6 కారిడార్ 3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు. పొడవు: 6.75 కి.మీ. స్టేషన్లు: 7 రెండో దశలో: ఒకటే కారిడార్. నిర్మాణ వ్యయం: రూ.5,734 కోట్లు కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం. పొడవు: 30.67 కి.మీ. స్టేషన్లు: 12 విశాఖ మెట్రోరైలు మార్గాలు ఇలా.. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 30 Share Posted August 30 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now