February 15, 20251 yr Author Visakhapatnam Metro: కూటమి వచ్చాక విశాఖ ’మెట్రో’ చకచకా.. భూసేకరణకు వేగంగా అడుగులు కూటమి ప్రభుత్వం ‘విశాఖ మెట్రో’పై దృష్టిసారించడంతో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ‘డబుల్ డెక్కర్’ తరహాలో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంది. By Andhra Pradesh Dist. DeskUpdated : 15 Feb 2025 07:14 IST Ee Font size ఈనాడు, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ‘విశాఖ మెట్రో’పై దృష్టిసారించడంతో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ‘డబుల్ డెక్కర్’ తరహాలో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంది. మొదటి దశలో మూడు కారిడార్లలోని 46.23 కిలోమీటర్లలో దీన్ని నిర్మించనున్నారు. ఇందుకు 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ గుర్తించింది. ఆ మేరకు వివరాలను కలెక్టరేట్‌కు పంపించారు. (Visakhapatnam News) ఉప కలెక్టరు ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మార్గాల్లో మొదటి దశ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమో కార్పొరేషన్ నుంచి సమాచారం రావడంతో అక్కడ భూములను గుర్తించే సర్వే ఆరంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉప కలెక్టరు ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్లతో ఒక బృందాన్ని కలెక్టరు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి సర్వే ఆరంభించనుంది. భూసేకరణలో: మొత్తం భూసేకరణలో దాదాపు ప్రభుత్వ స్థలం ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం మెట్రో స్టేషన్లు నిర్మించే చోట ప్రైవేటు స్థలం అవసరం అవుతుంది. గాజువాక, విశాఖ గ్రామీణం, మహారాణిపేట, సీతమ్మధార మండలాల పరిధిలో 42 మెట్రో స్టేషన్లు రానున్నాయి. వీటిలో అన్ని చోట్ల ఎంతోకొంత ప్రైవేటు స్థలం అవసరమవుతుంది. స్టీల్‌ప్లాంట్-కొమ్మాది మధ్య 34.40 కి.మీ.లలో 29 స్టేషన్లు, గురుద్వారా- పాత పోస్టాఫీసు మధ్య 5.08 కి.మీ.లలో ఆరు స్టేషన్లు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మధ్య 6.75 కి.మీ.లలో 7 స్టేషన్లు రానున్నాయి. ఇక్కడే చాలా వరకు స్థలం అవసరం. ప్రకటన ఇచ్చి - మయూర్ అశోక్, సంయుక్త కలెక్టర్ మొదటి దశ మెట్రో ప్రాజెక్టు పనులకు అవసరమైన స్థల సేకరణకు సర్వే మొదలు పెడుతున్నాం. మెట్రో రైలు కార్పొరేషన్ నుంచి వచ్చిన వివరాల ప్రకారం భూమి సేకరిస్తున్నాం. ఎక్కడెక్కడ ఎంతనేది ఇప్పటికే గుర్తించాం. ప్రైవేటు స్థలానికి సంబంధించి భూసేకరణ ప్రకటన ఇచ్చి తీసుకుంటాం. అది చాలా తక్కువగానే ఉంది.
February 24, 20251 yr Introducing metro systems in cities like Vizag is likely to fail in addressing public transportation needs. Even in cities such as Hyderabad, metro systems are not financially viable. India should prioritize the implementation of clean electric buses.
March 6, 20251 yr Author విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదం: చంద్రబాబు విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చలు ఫలప్రదం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. By Andhra Pradesh News TeamUpdated : 06 Mar 2025 20:11 IST Ee Font size 1 min read దిల్లీ: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఏపీకి సహకరిస్తున్నందుకు ఖట్టర్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పర్యటన ముగించుకొని నేరుగా దిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్రమంత్రితో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ రాత్రికి దిల్లీలోనే బస చేయనున్నారు.
March 20, 20251 yr https://x.com/AndhraNexus/status/1902563566785589546?t=RfDwwy09FjoY_bC1rLc31w&s=19
April 28, 20251 yr Author వాయువేగం’గా విశాఖ మెట్రో తాజాగా విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీని నియమిస్తూ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. By Andhra Pradesh Dist. DeskUpdated : 28 Apr 2025 08:39 IST Ee Font size 2 min read నిధుల విషయంలో కేంద్రం నుంచి సానుకూలత వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీని నియమిస్తూ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్రస్తుతం ఎల్‌ఐసీ భవనంలో ఉన్న కార్యాలయాన్ని వీఎంఆర్‌డీఏ భవనంలోకి మారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను త్వరిత గతిన పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు. మూడు కారిడార్లు..42 స్టేషన్లు..: విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును మూడు కారిడార్లలో 46.22 కి.మీ. మేర 42 స్టేషన్లతో నిర్మించాలన్నది ఆలోచన. ఇందులో స్టీల్‌ప్లాంటు-కొమ్మాది కూడలి వరకు 34.40 కి.మీ.లలో 29 స్టేషన్లు, గురుద్వారా నుంచి పాతపోస్టాఫీసు వరకు 5.07 కి.మీ.లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.75 కి.మీ.లలో 7 స్టేషన్లు ఉంటాయి. మొదటి దశ ప్రాజెక్టులో 2026 నాటికి మెట్రో పట్టాలెక్కితే మూడు కారిడార్లలో ప్రయాణికుల రద్దీ రోజుకు 16 వేల వరకు ఉండొచ్చనేది అంచనా. ఆ ఏడాది రెవెన్యూ రూ.590 కోట్లు రావొచ్చనేది మెట్రో అధికారుల లెక్క. 2051కి ప్రయాణికుల రద్దీ 50 వేలకు చేరుతుందని అంచనా వేయగా... ఆదాయం రూ.7,287 కోట్లకు పెరగొచ్చని విశ్లేషిస్తున్నారు. అయిదు చోట్ల సమీకృత స్టేషన్లు.. మెట్రోలో భాగంగా రెండు, మూడు ప్రాంతాలను కలుపుతూ సమీకృత స్టేషన్లు అయిదు చోట్ల నిర్మించనున్నారు. ఎన్‌ఏడీ కూడలి: పెందుర్తి, కంచరపాలెం వైపు వెళ్లే మార్గాలను కలుపుతూ. తాటిచెట్లపాలెం : విశాఖ రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లేలా. గురుద్వారా కూడలి: రెండో కారిడార్‌ను కలుపుతూ ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లేలా. మద్దిలపాలెం: హనుమంతువాక కారిడార్ రామాటాకీస్, ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లేలా. హనుమంతువాక కూడలి : సింహాచలం బీఆర్‌టీఎస్‌తో పాటు ఆరిలోవ, హెల్త్‌సిటీకి చేరుకునేలా.
April 29, 20251 yr 39 minutes ago, sonykongara said: Summary: Vizag Metro ku 100% funding cheyyalani State has been asking Central. But, Central did not respond at all.
April 30, 20251 yr 5 hours ago, Hello26 said: Summary: Vizag Metro ku 100% funding cheyyalani State has been asking Central. But, Central did not respond at all. Anni states ela istunnaro alage istaru anukunta leka pothe andaru adugu taaru. Appudu Nirmalamma peelche gaali meeda kuda gst vestundi ekkuva peelustunnaru ani
April 30, 20251 yr 9 minutes ago, Mobile GOM said: Anni states ela istunnaro alage istaru anukunta leka pothe andaru adugu taaru. Appudu Nirmalamma peelche gaali meeda kuda gst vestundi ekkuva peelustunnaru ani Yela isthunnamo alaane istham ani kuda cheppaledu. Vizag Metro project m plan meeda no response from central side
April 30, 20251 yr 1 hour ago, Mobile GOM said: Anni states ela istunnaro alage istaru anukunta leka pothe andaru adugu taaru. Appudu Nirmalamma peelche gaali meeda kuda gst vestundi ekkuva peelustunnaru ani 10 years metro pakkana pettaali. Amaravati, polavaram r&r ki funds thechukoni complete cheyyaali. Peddha list isthe dustbin lo padesthaaru. 10 years taruvatha center lo BJP government vuntaadho ledho cheppalemu. ee 10 years amaravati, polavaram complete cheyyaali.
June 3, 2025Jun 3 Vizag, Vjw Metro's oka 10 years akkarledu. 30KM, 40KM ki metro enduku. Atleast 150 KMS cover cheyyagaligithene metro veyyali naa lekka lo
June 4, 2025Jun 4 7 hours ago, TDP_2019 said: Vizag, Vjw Metro's oka 10 years akkarledu. 30KM, 40KM ki metro enduku. Atleast 150 KMS cover cheyyagaligithene metro veyyali naa lekka lo Ee metro linkage valla urgent need unna flyovers aagipoyaayi boss Narakam literally now a days
June 4, 2025Jun 4 On 2/24/2025 at 3:10 PM, chanu@ntrfan said: Introducing metro systems in cities like Vizag is likely to fail in addressing public transportation needs. Even in cities such as Hyderabad, metro systems are not financially viable. India should prioritize the implementation of clean electric buses. Govt support cheyyali...even subsidy roopam lo... Traffic mamaukuga vundatledhu...10 years taruvatha..we can't imagine.... Regular middle class vallaki metro chala uses anukuntunna...
June 4, 2025Jun 4 12 hours ago, TDP_2019 said: Vizag, Vjw Metro's oka 10 years akkarledu. 30KM, 40KM ki metro enduku. Atleast 150 KMS cover cheyyagaligithene metro veyyali naa lekka lo Vij ki not needed le gani, vizag ki try cheyyochu, 50km away from city airport kaduthunnaru ga so next use avvochu emo... Vij ki space vadilisthe enough for now..
June 10, 2025Jun 10 Author మెట్రోరైల్ ప్రాజెక్టులపై ఏఐఐబీ ఆసక్తి విశాఖ, విజయవాడల్లోని మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఏఐఐబీ (ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు) ప్రతినిధులు సోమవారం విశాఖలో పర్యటించారు. By Andhra Pradesh News DeskPublished : 10 Jun 2025 05:12 IST Ee Font size 1 min read విశాఖలో కారిడార్లను పరిశీలించిన బ్యాంకు ప్రతినిధులు విశాఖ గురుద్వారా కూడలిని పరిశీలిస్తున్న ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, ఏఐఐబీ ప్రతినిధులు ఈనాడు, విశాఖపట్నం: విశాఖ, విజయవాడల్లోని మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఏఐఐబీ (ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు) ప్రతినిధులు సోమవారం విశాఖలో పర్యటించారు. ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి నగరంలో మొదటిదశలో 46.23 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న మూడు కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మార్గాల్లో నిర్మించాలనుకుంటున్న 43 మెట్రోస్టేషన్ల స్థలాల్లో కొన్నింటిని చూశారు. ఆయా స్టేషన్లు ఎంత కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయో విదేశీ బ్యాంకు ప్రతినిధులకు ఎండీ తెలియజేశారు. ముందుగా వారు విశాఖ విమానాశ్రయం నుంచి కొమ్మాది కూడలికి చేరుకున్నారు. అక్కడ స్టేషన్ నిర్మించే ప్రదేశం, వాణిజ్య నిర్మాణాలకున్న అవకాశాలపై ఆరాతీశారు. తర్వాత హనుమంతువాక, గురుద్వారా, తాటిచెట్లపాలెం, ఎన్‌ఏడీ, గాజువాక, స్టీల్‌ప్లాంటు కూడళ్లను సందర్శించారు. ఆయా మార్గాల్లో చేపడుతున్న భూసేకరణ, కారిడార్ల గురించి అధికారులు వివరించారు. ఆశాభావంతో ఉన్నాం.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని, ఇందుకు విదేశీ పెట్టుబడులు సాధించేందుకు కృషిచేస్తున్నట్లు ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏఐఐబీ బృందంతో కలిసి విశాఖలో పర్యటించిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టుపై ఏఐఐబీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని, కొద్ది రోజుల కిందట విజయవాడలో వారితో సమావేశం నిర్వహించామని వెల్లడించారు. ఇప్పుడు విశాఖలో పర్యటించారని చెప్పారు. రూ.6 వేల కోట్లయినా రుణంగా సాధించి తీరతామని ఆశాభావం వ్యక్తం చేశారు
Create an account or sign in to comment