Jump to content

KAVITHA ARRESTED


Recommended Posts

  • Replies 464
  • Created
  • Last Reply

Top Posters In This Topic

2 hours ago, sudhakar21 said:

Actually it happens in every state

Taking commissions and giving tenders and projects

But modi want to target kejriwall

Unfortunately all south people booked 

But we have to enjoy as kcr targeted tdp and Ap

 

But they have distributed the money earned from this scam in Punjab elections and defeated Baffas 

That triggered the baffas 

Link to comment
Share on other sites

వితకు 23 వరకు ఈడీ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన భారాస ఎమ్మెల్సీ కవితకు ఇక్కడి రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

Published : 17 Mar 2024 04:39 IST
 
 
 
 
 
 

ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు

gh160324main4a.jpg

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన భారాస ఎమ్మెల్సీ కవితకు ఇక్కడి రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి దిల్లీకి తరలించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆమెను శనివారం ఉదయం ఇక్కడి రౌజ్‌ఎవెన్యూలోని ఈడీ, సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వారు పదిరోజుల కస్టడీకి అడగ్గా న్యాయమూర్తి ఏడురోజుల కస్టడీకి ఇచ్చారు. ఉదయం కోర్టులోకి వస్తూ కవిత తనది అక్రమ అరెస్ట్‌ అని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని విలేకర్లను ఉద్దేశించి గట్టిగా చెప్పారు. ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టుహాల్‌లోని బోనులో కూర్చోబెట్టారు. కవితతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆమె న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి వారికి కొంత సమయం ఇచ్చారు.

ఈడీ మనసులో ఒకటి, రాతలో ఇంకోటి...

తదుపరి విచారణ వరకు కవితపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని గత సంవత్సరం సెప్టెంబరు 15న ఈడీ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి ఆమె తరఫున వాదనలు వినిపించారు. ‘‘ఆమెకు సమన్లు ఇవ్వబోమని నాడు ఈడీ చెప్పగా ఆ విషయాన్ని రికార్డు చేయాలా అని ఆరోజు న్యాయమూర్తి అడిగారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు ఆ అవసరం లేదు అని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈడీ చెప్పిన విషయాలన్నింటినీ కలిపి ఒక అప్లికేషన్‌ దాఖలు చేస్తాం. మహిళను విచారించే సమయంలో సంయమనం పాటించాలని ఇదివరకు సుప్రీంకోర్టు నళినీ చిదంబరం కేసులో చెప్పింది. కవిత కేసును కూడా ఆ పిటిషన్‌తో జతచేసి విచారిస్తున్నారు. శుక్రవారం కూడా ఆ కేసు విచారణ జరిగింది. ఈనెల 19న మరోసారి విచారణకు రానుంది. ఈలోపే ఆమెను అరెస్ట్‌ చేశారు. శుక్రవారం న్యాయచరిత్రలో బ్లాక్‌డే. ఆమెను ఇదివరకు 2023 మార్చి 11, 20, 21 తేదీల్లో విచారించారు. దానిపై ఆమె సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టిన తర్వాత ధర్మాసనం దాన్ని విచారణకు స్వీకరించింది. దర్యాప్తు సంస్థ ముందు విచారణకు రాకుండా కోర్టుకు వెళ్తారా.. ఎంత ధైర్యం మీకు అనే రీతిలో ఈడీ అధికారులు వ్యవహరించారు. ఈడీ మనసులో ఒకటి, రాతలో ఇంకోటి, చేతలో మరొకటి కనిపిస్తోంది. ఈకేసులో ఇప్పటికే ఒక ఛార్జిషీటు, 3 సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

సీబీఐ సాక్షి అంటుంటే.. ఈడీ నిందితురాలు అంటోంది

సీబీఐ.. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి 2022 డిసెంబరులో ఇంటికి వచ్చి కవితను విచారించింది. ఆ నోటీసులో పిటిషనర్‌ను సాక్షిగా చూపారు. సీబీఐ ఆమెను సాక్షి అంటుంటే, ఈడీ.. నిందితురాలు అంటోంది. ఇందులో ఏది వాస్తవం? పిటిషనర్‌ బంధువులు శుక్రవారం ఇంటిబయట హంగామా చేశారని దర్యాప్తు సంస్థ ఈడీ అబద్ధాలు చెబుతోంది. వాస్తవానికి వారిని అధికారులే ఇంట్లోకి అనుమతించారు. ఒక మహిళను అరెస్ట్‌ చేసి 30 కిలోమీటర్లకు మించి తీసుకెళ్తే తప్పకుండా ట్రాన్సిట్‌ రిమాండ్‌ తీసుకోవాలి. కానీ పిటిషనర్‌ను హైదరాబాద్‌ నుంచి దిల్లీకి తరలించినా ఈడీ అది చేయలేదు. దర్యాప్తు సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందనడానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ’’ అని న్యాయవాది విక్రమ్‌ చౌధరి వివరించారు.

సమన్లు పదిరోజులు వాయిదా వేస్తామని చెప్పాం అంతే: ఈడీ

ఈడీ తరఫున హాజరైన ప్రత్యేక పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ ఎంకే మట్టా, ప్రత్యేక న్యాయవాది జోసెఫ్‌ హుస్సేన్‌లు కవిత న్యాయవాది వాదనలను ఖండించారు. ఆమెపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఇంతవరకూ ఏ కోర్టూ ఉత్తర్వులు జారీచేయలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ‘‘గత సెప్టెంబరు 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సమయంలో ఆమె తీరికలేని పనుల కారణంగా విచారణకు హాజరుకాలేని పరిస్థితి ఉంటే సమన్లను పదిరోజులు వాయిదా వేస్తామని చెప్పాం. అంతే తప్ప మొత్తంగా సమన్లు ఇవ్వబోమని చెప్పలేదు. ఆరోజు అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఇచ్చిన హామీని నిరవధిక కాలానికి అన్వయించుకోవడానికి వీల్లేదు. ఆమె అరెస్ట్‌కు కారణాలను రిమాండ్‌ రిపోర్ట్‌లో పూర్తిగా చెప్పాం. ఆమెను సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్‌ చేశాం. అప్పటికి సూర్యాస్తమయం కాలేదు. అరెస్టుకు సంబంధించి మేము ఇచ్చిన నోటీసులను 20 నిమిషాలు చదివిన తర్వాత 5.40కి ఆమె సంతకం చేశారు. శుక్రవారం జరిగిన సోదాల్లో 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఇంట్లో సోదాలు జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి ఆందోళనలు చేశారు. సోదరుడు, బంధువులమంటూ వచ్చి సోదాలను అడ్డుకొనేందుకు యత్నించారు. మేము విచారిస్తున్న తీరును వీడియో తీసి బయటికి విడుదల చేశారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేకపోయే పరిస్థితుల్లోనే ట్రాన్సిట్‌ రిమాండ్‌ తీసుకోవాలి. కానీ కవితను ఆలోపే హాజరుపరిచాం’’ అని వివరించారు. కవితకు సంఘీభావంగా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, లింగయ్య, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌, కవిత భర్త అనిల్‌కుమార్‌ కోర్టుకు వచ్చారు. వాదనలు పూర్తయ్యేంతవరకూ అక్కడే ఉన్నారు.

కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి

ఈనాడు, దిల్లీ: ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ అనుమతి ఇచ్చారు. రోజూ సాయంత్రం 6-7 గంటల మధ్య ఆమె భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, హరీశ్‌రావు, కుమారుడు, న్యాయవాదులు కలిసేందుకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. మరోవైపు కవిత ఇంట్లో సీజ్‌ చేసిన ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను వారి సమక్షంలో తెరిచి పరిశీలించాల్సి ఉన్నందున కవిత భర్త అనిల్‌కుమార్‌తోపాటు, ఆ పరికరాలతో సంబంధం ఉన్నవారిని సోమవారం తమ కార్యాలయానికి రావాలని ఈడీ అధికారులు నిర్దేశించినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

మద్యం కేసులో కవిత కుట్రదారు

దిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో భారాస ఎమ్మెల్సీ కవిత ఒకరని.. కీలక లబ్ధిదారు అని.. ఆమే కింగ్‌పిన్‌ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది.

Updated : 17 Mar 2024 09:53 IST
 
 
 
 
 
 

ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు
ఆమె అక్రమార్జన రూ.192.8 కోట్లు
కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ

gh160324main7a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో భారాస ఎమ్మెల్సీ కవిత ఒకరని.. కీలక లబ్ధిదారు అని.. ఆమే కింగ్‌పిన్‌ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దిల్లీలోని రౌజ్‌ఎవెన్యూ కోర్టులో శనివారం దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది. ‘‘సౌత్‌ గ్రూప్‌నకు చెందిన కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ తదితరులు ఆప్‌ నేతలతో కలిసి కుట్ర పన్నారు. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్‌ నేతలకు లంచం రూపంలో రూ.100 కోట్లు సమర్పించారు. ఈమేరకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది.

ఆప్‌ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది. అలాగే కవిత బినామీ అరుణ్‌రామచంద్రపిళ్లైకి ఇండోస్పిరిట్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతోపాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్‌రికార్డ్‌ సంస్థలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం దక్కింది. ఈక్రమంలోనే 2021-22 దిల్లీ మద్యం పాలసీలో ఎల్‌1గా నిలిచిన ఇండోస్పిరిట్‌కు అత్యధిక లాభాలు దక్కాయి. మద్యం పాలసీలో హోల్‌సేలర్లకు లాభాలవాటాను 12శాతానికి పెంచడం ద్వారా సౌత్‌గ్రూప్‌నకు లబ్ధి చేకూరడమే కాకుండా.. వాటిల్లో నుంచే ఆప్‌ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది. కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో అరెస్ట్‌ చేశాం.

విజయ్‌నాయర్‌ కలిసి వెళ్లిన అనంతరమే నివేదిక

మద్యం పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానల రూపకల్పన కుట్రకు.. 2021 మార్చి19న కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా ప్రతినిధి విజయ్‌నాయర్‌ హైదరాబాద్‌ పర్యటనకు మధ్య సంబంధముంది. ఆ మరుసటి రోజు హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ బుచ్చిబాబు ఫోన్‌లో వాట్సప్‌ ఛాటింగ్‌ల విశ్లేషణలో ఇది తెలిసింది. అయితే మార్చి 15-19 మధ్య దిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్‌, స్టెనో సునీల్‌సింఘాల్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు కాకుండా.. విజయ్‌నాయర్‌.. కవితను హైదరాబాద్‌లో కలిసి వెళ్లిన తర్వాత 22న మద్యం విధానం నివేదికకు తుదిరూపం వచ్చినట్లు గుర్తించాం.

వినోద్‌చౌహాన్‌కు డబ్బు అప్పగింత

2023 ఆగస్టు 8న కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈడీ వాంగ్మూలం సేకరించింది. కవిత అనుచరుడు అభిషేక్‌ బోయినపల్లి సూచనల మేరకు దినేశ్‌ అరోరా కార్యాలయం నుంచి తాను రెండు పెద్ద సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్‌ చౌహాన్‌ అనే వ్యక్తికి అప్పగించినట్లు అతను వెల్లడించాడు. మరో సందర్భంలో దిల్లీ నారాయణ తోడాపూర్‌ సమీపంలోని చిరునామాకు రెండు సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అతడికి అప్పగించినట్లు అంగీకరించాడు. వినోద్‌ చౌహాన్‌ అదే డబ్బును గోవాలో ఆప్‌ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపించినట్లు దర్యాప్తులో తేలింది’’ అని ఈడీ పేర్కొంది.

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

దరిద్రాన్ని బొట్టుపెట్టి ఆహ్వానించడం అంటే ఇదే Image:roflmao:

dheenitho vizag palace open cheyinchaadu jagga. ika life lo aa palace lo enter kaaledu.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...