Jump to content

టీడీపీ తిరిగి ఎలా అధికారం లోకి రావచ్చు?


Recommended Posts

*టీడీపీ తిరిగి ఎలా అధికారం లోకి రావచ్చు?*
పోయిన చోటనే ఎలా వెతుక్కోవాలి?

ఇది ఒక అంతర్జాతీయ  విశ్రాంత పాత్రికేయుని వ్యక్తిగత కోణం

ఆంధ్ర లో గెలవాలి అంటే, మతం, పాలసీలు, పార్టీలు కన్నా *కులం అన్నదే అసలు ముఖ్యం. కులం ఒక్కటే ముఖ్యం*

బీజేపీ అందుకే ఆంధ్ర లో చొచ్చుకుని వెళ్ళ లేక పోతూ వుంది..

అందుకే టీడీపీ, వైసీపీ, జనసేన లతో స్నేహం దొబుచు లాడుతూంది. ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది బీజేపీ. చిన్న రాష్ట్రాలు గా మన పార్టీలకు కేంద్రంకు మద్దతు ఇవ్వటం తప్ప వేరే దారి లేదు.

గత ఎన్నికలలో వైసీపీ తెలివిగా ఎలక్షన్ ను 6% vs 94% గా మార్చింది. అందుకే విజయం జగన్ రెడ్డి గారికి చాలా తేలిక అయింది.

కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా, ఈ 6% vs 94% ను వజ్రయుధంలా బయటకు తీసుకుని రావటం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో  గతం లో అనేక సార్లు చూసాం

చంద్రబాబు గారి  నుండి దూరం జరిగిన, ఆ  వెళ్లి పోయినట్లు కనపడుతున్న ఆ 94 శాతం ప్రజలను సీబీన్ వెనక్కు తెచ్చుకోవాలి. ఈ సీక్రెట్ సాస్  టీడీపీ తెలుసు కోవాలి.

ఈ కుల ఈక్వషన్ లో ప్రశాంత్ కిషోర్ సలహాలు బాగా పని చేసాయి జగన్ రెడ్డి గారికి. ఒక నియోజకవర్గం లో టీడీపీ బలం గా ఉంటే, మేక, కుక్క కథ లాగా ప్రశాంత్ కిషోర్ నయాన, భయన ఆ స్థానిక లీడర్ ను లేదా ఎమ్ ఎల్ యే ను  ఎన్నికల ముందు జగన్ దగ్గరికి వచ్చేలా చేర్చాడు. ప్రశాంత్ కిషోర్ *ఫేసుబుక్ ఎనలిటిక్స్, ట్విట్టర్ ఫీడ్స్* ద్వారా ఏ జిప్ కోడ్ లో వైసీపీ వెనుక పడి ఉందొ ఆలోచించి
అక్కడ రూమర్లు స్ప్రెడ్ చేయటం ద్వారా వైసీపీ కి అనుకూలం గా ఓట్ల ను  వైసీపీ పాజిటివ్ ఓట్లు గా మార్చాడు. అలానే ఎక్కడ టీడీపీ కి లీడ్ ఉందొ అక్కడ మళ్ళీ రూమర్స్ ద్వారా టీడీపీ బలాన్ని తుత్తునినియలు చేసాడు.

మత పరంగా కూడా జగన్ నీటిలో మూడు మునకలు, చిన్న జీయర్ ఆశీస్సులు ఇలాంటివి ప్రశాంత్ కిషోర్ సలహా వల్లనే.

సీబీన్ టెక్నాలజీ లో వెనుక పడిన ఇంటరక్టివ్ వాయిస్ సిస్టం (IVR) మీద ఆధారపడ్డారు. IVR కాల్ రాగానే జనాలు ఓపిక లేక అన్ని పాజిటివ్ గా "1"  ఫోన్ మీద నొక్కే వారు. ఇది టీడీపీ కి చాలా నష్టం చేసింది. సీబీన్ కు పాజిటివ్ గా కనపడేలా టీడీపీ టీమ్స్ కూడా విండో డ్రెసింగ్ చేసి సీబీన్ ను ఏమార్చారు.

చివరి సంవత్సరం లో సీబీన్ కళ్ళు తెరచినా అప్పటికి సమయం ఎక్కువ లేదు.

సీబీన్ అనగానే అభివృద్ధి ఫార్ములా అనో, హై టేక్ సిటీ అనో, అమరావతి అనో ఆయన చేసిన లార్జర్ దన్ లైఫ్ ప్రాజెక్ట్ల్ ఆయనకు మిత్రుల కన్నా శత్రువులను ఎక్కువ చేసి పెట్టాయి. ఏది అధిక ప్రచారం  చేయకూడదో అదే ప్రచారం చేసారు సీబీన్ చుట్టు ఉన్న కోటరీ. ఏది చేయాలో అది అసలు చేయకుండా మరుగున పరిచారు.  రివర్స్ ట్రియాంగిల్ లా సీబీన్ వ్యక్తిత్వం డిజైన్ చేసారు టీడీపీ వారు. సమాజంలో అత్యధిక్కులు ఉన్న పేద, రైతు, సన్నకారి వ్యక్తులు, మహిళలు కు, యువతరానికి సీబీన్ ను దగ్గర చేయాలి. ఎందుకంటే వీరి జనాభా ఎక్కువ కనుక. కాని కార్పొరేట్, సీఈఓ వల్ల చదువుకున్న విద్యార్థులు, సీబీన్ వల్ల బెనిఫిట్ అయిన వారు విదేశాలలో, హైదరాబాద్ లలో ఇరుక్కు పోయారు. కాని వారి వల్ల టీడీపీ కి వచ్చిన లాభం సున్న. సీబీన్ చేసిన మంచి పనుల వల్ల బెనిఫిట్ కన్నా, అంత కన్నా వేగం గా అసూయ ప్రచారం అయ్యింది. కాదు అసూయ అసహ్యం గా ప్రచారం చేయబడింది. దీని వల్ల రాష్టమే ప్రపంచానికి  దిక్షుచి గా అయ్యే సువర్ణ అవకాశం పోగొట్టుకుంది.

*ఇప్పుడు టీడీపీ ఏమి చేయాలి?*

సీబీన్, లోకేష్ ల వ్యక్తి గత ఇమేజ్ మాకేఓవర్ కొత్తగా ఉండటం, వారి వ్యక్తిత్వం ప్రజలలో అజనుభాహుడి లా కనిపించటం ఇప్పుడు అత్యవసరం. ఎన్నికల కన్సల్టెంట్ లు దొరికిన, దొరకక పోయినా కనీసం వ్యక్తిత్వ కన్సుల్టేన్సీ తో పని చేయటం ఇప్పుడు అత్యవసరం.

ఆంధ్ర ప్రదేశ్ లో సి నరసింహ రావు ఇలాంటి ట్రైనింగ్ లు ఇచ్చేవారు.

ఇండియా లో vibhinta varma, tiyara, style ink, Sheena agarwal, image redefined ఇలాంటి సేవలు అందిస్తున్నాయి.

అంతర్జాతీయము గా Reina Trust, Patreon, edithc,  imagedgeacademy, next level wardrobe, still water, mza consulting, meta human, arts consulting, oasis, total image, universal, image academy, super seventies, style coaching, edit HC, London image, kahini creative, strength scape, carol park లాంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా ఇందులో పని చేస్తున్నాయి. 

టీడీపీ లో లీడర్ నుండి కార్యకర్తల వరకూ ఈ ఇమేజ్ మీకోవర్ ట్రైనింగ్, ఆత్మ విశ్వాసం, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్స్ అత్యవసరం

వ్యక్తిత్వ మేకోవర్, ఇమేజ్ చేంజ్, ఆహార్యం, మాట, ఫోటోలలో సమూల మార్పు  వస్తూ,

టీడీపీ పార్టీ మేనిఫెస్టో జాగ్రత్త గా తయారీ చేయటం, ఆచరణ సాధ్యం అయ్యేవే ప్రామిస్ చేయటం, ఇచ్చిన ప్రామిస్ నుండి అంగుళం కూడా పక్కకు తప్పు కోకుండా ఉండటం,

పార్టీ భావ జాలం డెఫినిషన్ ను అన్ని మతాలు, అన్ని కులాలు, 4 శాతం నార్త్ ఇండియన్స్, 1 శాతం తమిళ్ లకు కూడా దగ్గర అయ్యేలా, ఇప్పుడు ఓటు లేక మరో రెండు ఏళ్లలో ఓటు హక్కు వచ్చే వారికీ కూడా దగ్గర గా పార్టీ నీ పునర్ నీర్మించటం ఆవశ్యం.

పార్టీ భావజాలం బలంగా వినిపించే మంచి వక్తలు అందరూ వెళ్లి పోవటమొ, రిటైర్ అవటమో జరిగింది. వారిని ఏరి, కోరి, ఎంచి వృద్ధి చేయాలి. టీడీపీ నుండి టీవీ లలో కనపడే వారిలో విషయం లేదు.

పార్టీ భావజాలం, ఐడియాలజి, ఆశయం, లక్ష్యం, మిషన్ స్టేట్మెంట్, కోర్ ఐడియాస్ కూడా unique గా ఉండటం, వైసీపీ, జనసేన భావజాలం నచ్చని వారు  ఆయస్కంతం లా వచ్చేలా ఉండటం, కొత్త గా ఉండటం, redefine చేయటం చారిత్రక ఆవశ్యం.

సీబిన్ సోషల్ ఇంజనీరింగ్ లో ఒకప్పుడు ఎక్స్పర్ట్. అదే ఆయనకు విజయ. తీరాలను ఇచ్చింది. ఇప్పుడు అదే సీబీన్ అక్కడే వెనక పడి పోయారు. అక్కడే తిరిగి పోయిన చోట నే వెతుక్కోవాలి. జగన్ కోరక రాని కొయ్యల ఆయనకు అవ్వటం స్వయం కృతమే.

కాని ఇప్పుడు సీబీన్ ఇంకా డిజైన్ టేబుల్ వద్దనే ఉన్నారు. ఆయన త్వరగా కొత్త సోషల్ ఇంజనీరింగ్ తో, కొత్త సీక్రెట్ సాస్ తో, తనకే సాధ్యమయిన రహస్య పేటెంట్ ద్వారా,  ఆయన మల్లీ తిరిగి నూతన జవ సత్వాలతో తిరిగి  వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం లో సువర్ణ అధ్యాయం సీబీన్ చేతిలో సాకార్యం కావాలి ఆయన అభిమానులు గా అందరం కోరుకుందాం. మన ఆశీస్సులు తో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యము గా ఉండాలని దేముని ప్రార్ధిద్దాం  

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం

చదివిన వారు  కనీసం పది మందికి షేర్ కొట్టటం మరచి పోవద్దు

Link to post
Share on other sites

suppose.. per suppose.... tdp power lo ki vachindi anukundam... yem cheyyali??? kahajana is in huge -ve... yedo sachi chedi oka 5 yrs ki CBN revenue generate chesi pedithe, next vachina vallu free ga dabbulu panchutaru.. antega...

 

Link to post
Share on other sites

perfectly summarized.... CBN and lokesh needs personailty development coaches rather for party.

 

And also article lo cheppinattu zipcode caste targetting anedhi highly possible. So step 1 is doing wat they are already doing and building tdp brand on top of it

Edited by Phoenix456
Link to post
Share on other sites
2 hours ago, pavan s said:

suppose.. per suppose.... tdp power lo ki vachindi anukundam... yem cheyyali??? kahajana is in huge -ve... yedo sachi chedi oka 5 yrs ki CBN revenue generate chesi pedithe, next vachina vallu free ga dabbulu panchutaru.. antega...

 

porapatuna CBN 10 years adhikaram lo vundi vunte inka after 10 years revenue koncham strong chesi vodipoyunte ... vere la vundedi scene...

 

Link to post
Share on other sites
34 minutes ago, ChiefMinister said:

porapatuna CBN 10 years adhikaram lo vundi vunte inka after 10 years revenue koncham strong chesi vodipoyunte ... vere la vundedi scene...

 

same - ysr enjoyed that situation to the core... 

Link to post
Share on other sites

At least చలసాని శ్రీనివాస్ లాంటివారిని control చేయగలిగినప్పుడు చూడ్డొచ్చు మిగతావి.

Practically speaking, CBN followers కంటే CBN opponents కి Bright future ఉంటది 😅😅

ఈసారి CBN power లోకి వస్తే, కొత్త వ్యక్తి Opposition leader అయినా కూడా కచ్చితంగా మంచి future ఉంటది. మహానేత or జాతిపిత in the making అన్నట్టు...😁😁

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...