Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon


AnnaGaru

Recommended Posts

9 minutes ago, sonykongara said:

land acquisition main problem

if this get completed total krishna basin get saved and historical evidence to blunder of state division with reason of TG 's water stealing by andhra..with out TG andhra gets its own water and slipper slap to those nasty arguments

Link to comment
Share on other sites

Earlier pulichinthala ni krishna water count lo veyaledu, telangana vallu pattu patti denni add cheyincharu krmb lo, daniki substitute ga mana vallu jurala ni add cheyincharu. correct me if I am wrong. repu manam vykuntaapuram kadithe danini kooda krmb loki tesuku raru ani guarantee emi undi? alreay prakasam barrage kooda undi ga krmb board lo and krishna water count ki kooda.

Link to comment
Share on other sites

10 minutes ago, Bollu said:

Earlier pulichinthala ni krishna water count lo veyaledu, telangana vallu pattu patti denni add cheyincharu krmb lo, daniki substitute ga mana vallu jurala ni add cheyincharu. correct me if I am wrong. repu manam vykuntaapuram kadithe danini kooda krmb loki tesuku raru ani guarantee emi undi? alreay prakasam barrage kooda undi ga krmb board lo and krishna water count ki kooda.

Reference for jurala: 

 

Link to comment
Share on other sites

55 minutes ago, sonykongara said:

edi manchidi laga naku anipisthundi

appudu Kaleswaram laga inko rendu barrage lu kattali

instead same canal ni Bellamkonda area ki okati Julakallu division ki inkoti divert chesthe pothundi

But the question is water availability - current situation prakaram at max 4K varaku lift cheyyotchu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
గోదావరి-పెన్నా అనుసంధానానికి పోటీ
రంగంలో మేఘ, నవయుగ- ఆర్వీఆర్‌

ఈనాడు, అమరావతి: గోదావరి, పెన్నా అనుసంధానం తొలిదశ పనులకు సంబంధించి రెండు ప్యాకేజీలుగా టెండర్లు ఆహ్వానించగా రెండు టెండర్లే దాఖలయ్యాయి. బుధవారం జలవనరుల శాఖ అధికారులు టెండర్లు తెరిచారు. రెండు ప్యాకేజీలకు మేఘ ఇంజినీరింగు సంస్థ.. మరో వైపు నవయుగ ఆర్వీఆర్‌ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో మరో టెండరు దాఖలయ్యాయి. ఆయా పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ విధించిన నిబంధనలకు అనుగుణంగా ఏ గుత్తేదారు సంస్థ నిలుస్తుంది, లేదా బరిలో నిల్చిన రెండు సంస్థలూ సాంకేతిక అర్హతలు సాధిస్తాయా అన్నది శనివారం తేలుతుంది. సుమారు రూ.2200 కోట్ల అంచనా విలువతో ఒక ప్యాకేజీ, సుమారు రూ.2600 కోట్ల అంచనాతో మరో ప్యాకేజీ పనులు చేపట్టబోతున్నారు. ఐబీఎం అంచనాలు కూడా ఖరారు కానున్నాయి. సాంకేతిక అర్హతలు తేల్చిన తర్వాత శనివారం నాడే ఆర్థిక బిడ్‌ తెరుస్తారు. ఎవరు తక్కువ మొత్తానికి ఈ పని చేయడానికి ముందుకు వస్తారో వారికి పనులు కేటాయిస్తారు.
గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజికి అదనంగా తీసుకువచ్చి ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా సాగర్‌ కుడి కాలువకు మళ్లించేందుకు ఈ పథకం సంకల్పించారు. దాదాపు 100 రోజుల్లో  73 టీఎంసీల నీటిని సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు. ఇందులో పంపుహౌస్‌లు, వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తూ, కాలువ ద్వారా గ్రావిటీలో నీటిని తీసుకువెళ్తూ నాగార్జునసాగర్‌ కుడి కాలువకు చేరుస్తారు. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి ఈ ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభమవుతుంది.

Link to comment
Share on other sites

మహాసంగమం తొలిదశకు శ్రీకారం
06-10-2018 02:08:27
 
  • నేడు ఫైనాన్సియల్‌ బిడ్ల ఫలితం
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కృష్ణా - పెన్నా నదుల మహా సంగమం తొలిదశకు అడుగులు పడనున్నాయి. ఇప్పటికే .. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రంలో గోదావరి - కృష్ణా నదుల అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే కోవలో, గోదావరి - కృష్ణా - పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలిదశలో హరిశ్చంద్రపురం నుంచి నకిరేకల్లు దాకా పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచింది. దీనికి అంచనా వ్యయం రూ.6,020.15 కోట్లుగా జల వనరుల శాఖ ఖరారు చేసింది. తొలి ఫేజ్‌లో భాగంగా 80వ కిలోమీటరు వద్ద 80వ కిలోమీటరు వద్ద గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం నర్సింగపాడు వద్ద 148.68 మీటర్ల ఎత్తులో మొత్తం 20 పంపులను ఏర్పాటు చేస్తారు. ప్రెజర్‌మెయిన్‌ ద్వారా 10 కిలోమీటర్లు, గ్రావిటీ ద్వారా 56.50 కిలోమీటర్ల మేర జలాలు పారేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం పూర్తయితే..ఎకరాకు అందించే సాగునీటి వ్యయం రూ.62,645 అవుతుందని జల వనరుల శాఖ లెక్కించింది. గోదావరి - పెన్నా తొలిదశను ఫేజ్‌-1, ఫేజ్‌-2గా విభజించారు. ఫేజ్‌-1 పనులకు సంబంధించి రూ.2,100 కోట్లకు .. ఫేజ్‌-2కు సంబంధించి 2,600 కోట్లకు టెండర్లను పిలిచారు. ఈ టెండర్ల టెక్నికల్‌ బిడ్‌ను గత శనివారం ఓపెన్‌ చేశారు. బిడ్‌లు వేసిన నవయుగ, మేఘా సంస్థలు సాంకేతికపరంగా క్వాలిఫై అయ్యాయి. కాగా, శనివారం ఫైనాన్సియల్‌ బిడ్‌లను తెరుస్తారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు ఎవరెవరు దక్కించుకున్నారో ఆ రోజు సాయంత్రం స్పష్టమవుతుంది. ఫైనాన్సియల్‌ బిడ్‌లను ఓపెన్‌ చేసిన వెంటనే .. గోదావరి - పెన్‌ తొలిదశ నిర్మాణ పనుల బాధ్యతలను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు జల వనరుల శాఖ సన్నద్ధమవుతుంది. ఈ పనులు ప్రారంభిస్తే, చకచకా గోదావరి - కృష్ణా - పెన్నా నదుల మహాసంగమానికి అడుగులు పడతాయని జల వనరుల నిపుణులు చెబుతున్నారు.
 
మూడు నదులు- ఐదు దశలు
చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా.. పట్టిసీమ పంపుల సహాయంతో పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా నదిలోకి 7,000 క్యూసెక్కుల గోదావరి జలాలను మళ్లిస్తారు. ఈ జలాలను ప్రకాశం బ్యారేజీకి 21 కిలోమీటర్ల ఎగువన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద ఎత్తిపోస్తారు. దీనిని ఐదు ఎత్తిపోతల ద్వారా 80వ కిలోమీటరు వద్ద నకిరేకల్లు మండలం నర్సింగపాడు వద్ద నాగార్జున సాగర్‌ జవహార్‌ కెనాల్‌లోకి పంపిస్తారు. ఇది తొలి దశ. అనంతర దశల్లో.. ఈ కెనాల్‌ ద్వారా ప్రకాశం జిల్లాలోకి, అక్కడినుంచి నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోకి ఈ జలాలు మళ్లిస్తారు. దీంతో మహాసంగమ ప్రక్రియ పరిపూర్ణమవుతుంది.
Link to comment
Share on other sites

నదుల అనుసంధానంలో మరో ముందడుగు
07-10-2018 08:04:51
 
636744962885750324.jpg
  • గోదావరి - పెన్నా నదుల అనుసంధానం టెండర్ల ఖరారు
  • ఒకే పనిని రెండు ప్యాకేజీలుగా విభజించిన జలవనరుల శాఖ
  • ప్యాకేజ్‌-1ని రూ.2,185 కోట్లకు దక్కించుకొన్న మెగా ఇంజనీరింగ్‌
  • రెండో ప్యాకేజీనిరూ. 2,656 కోట్లకు నవయుగ సంస్థకు ఖరారు
  • త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన
 
గుంటూరు: గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా మొదటిదశ పనులకు జలవనరుల శాఖ టెండర్లు ఖరారు చేసింది. అమరావతి రాజధాని నగరంలోని హరిశ్చంద్రాపురం నుంచి నకరికల్లు మండలంలోని నర్సింగపాడు వరకు నిర్మించనున్న పైపులైన్‌-కమ్‌-గ్రావిటీ ఛానల్‌ పనులకు గత నెలలో పిలిచిన టెండర్లను శనివారం ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేసింది. జలవనరుల శాఖ కోరిన అనుభవం దేశంలో మెగా ఇంజనీరింగ్‌, నవయుగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ సంస్థలకు మాత్రమే ఉండటంతో టెండర్లలో ఆ రెండు కంపెనీలే పాల్గొన్నాయి. దీంతో అధికారులు రెండు సంస్థల ప్రతినిధులతో చర్చించి పనులను విభజించారు. రెండు ప్యాకేజ్‌లుగా చేసి మొదటి దానిని మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు కేటాయించారు. రెండో ప్యాకేజ్‌ పనులను నవయుగ ఇంజనీరింగ్‌కు అప్పగించారు. కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ నుంచి ఆమోదం రాగానే రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
 
గోదావరి జలాలను ఇప్పటికే కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన జలవనరుల శాఖ త్వరలో నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాత పెన్నా నదికి తీసుకెళ్లనుంది. ఫేజ్‌-1లో భాగంగా హరిశ్చంద్రాపురం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజ్‌లో నిల్వ ఉండే వరద నీటిని ఎత్తిపోసి నకరికల్లు మండలంలోని నర్సింగపాడు వద్ద సాగర్‌ కుడికాలువలోకి తరలిస్తారు. మొత్తం ఏడు వేల క్యూసెక్కుల నీటిని ప్రవహింప చేయడం ద్వారా భవిష్యత్తులో సాగర్‌ ఆయకట్టుకు కూడా జూలైలోనే సాగునీరు విడుదల చేసే అవకాశం అందుబాటులోకి వస్తుంది. దీని వలన కుడికాలువ ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు గ్రౌండింగ్‌ జరుగుతుందానని సాగర్‌ రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తోన్నారు.
 
ప్రాజెక్టు ఇలా..
మొత్తం ఐదు దశల్లో హరిశ్చంద్రాపురం నుంచి నర్సింగపాడుకు గోదావరి జలాలను పంపింగ్‌ చేస్తారు. ప్రతీ చోట నాలుగు పంపులు అమర్చుతారు. 10.09 కిలోమీటర్ల పొడవునా పంపింగ్‌ ప్రెజర్‌ మెయిన్‌ పైపులైను, 56.50 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కెనాల్‌ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకి మొత్తం రూ. 6,020.15 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో భూసేకరణకు రూ. 676 కోట్ల నిధులు అవసరమౌతాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వగా జలవనరుల శాఖ అధికారులు టెండర్లు పిలిచి శనివారం సాయంత్రం ఏజెన్సీలను ఖరారు చేశారు. పనులు చేపట్టే రెండు సంస్థలు మంచి అనుభవం గడించినవి.
 
కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఇటీవలే మెగా ఇంజనీరింగ్‌ సంస్థ పూర్తి చేసి ప్రశంసలందుకొన్నది. నవయుగ సంస్థ కూడా పెద్దపెద్ద ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో 0 నుంచి 40వ కిలోమీటర్‌ వరకు పైపులైను, గ్రావిటీ కెనాల్‌, మూడు పంపుహౌస్‌ల నిర్మాణాన్ని మెగా ఇంజనీరింగ్‌కు రూ. 2,185 కోట్లకు కేటాయించారు. 40 నుంచి 66వ కిలోమీటర్‌ వరకు పనులను రెండు పంపుహౌస్‌లతో కలిపి నవయుగ సంస్థకు రూ. 2,656 కోట్లకు కేటాయించారు. టెండర్లు పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారవర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
జలాల అనుసంధానానికి.. మరో అడుగు
03-11-2018 08:36:40
 
636768309986771677.jpg
  • గోదావరి జలాలు సాగర్‌కు తరలించే పథకానికి భూసర్వే పనులు ప్రారంభం
  • ఎత్తిపోతల పథకానికి ఖరారైన టెండర్లు
  • త్వరలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన
  • గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్న గోదావరి జలాలు
  • రూ.6,020 కోట్ల వ్యయంతో పథకం పనులు
అమరావతి రాజధానిలో మరో నీటి ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పట్టిసీమ తరహాలో చేపట్టనున్న గోదావరి జలాలు సాగర్‌కు తరలించే పథకానికి సంబంధించి భూ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. రూ.6,020 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ పథకానికి.. ఇప్పటికే టెండర్ల రరరప్రక్రియ పూర్తయింది. టెండర్లు దక్కించుకున్న మెగా, నవయుగ కంపెనీలు క్షే త్ర స్థాయిలో పనులను ప్రారంభించాయి. అమరావతి మండలం మునుగోడు ప్రాంతంలో సర్వే పనులు చేపట్టాయి. త్వరలో
ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.
 
నరసరావుపేట/అమరావతి: నాగార్జున సాగర్‌ ఆయకట్టులో సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించనుంది. గోదావరి జలాలను కుడి కాలువకు తరలించేందుకు ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇందుకు సంబంధించిన టెండర్లు ప్రక్రియ పూర్తయింది. దీంతో ఒక్కొక్కటిగా ఈ పథకం పనులు వేగవంత మవుతున్నాయి. శుక్రవారం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబందించి భూసేకరణ సర్వే ప్రారంభమైంది. ఈ పథకం నిర్మాణానికి 1,804 ఎకరాలు భూమి అవసరమవుతుంది. మెగా, నవయుగ కంపెనీలు ఈ ఎత్తిపోతల పథకం పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే. రూ.6,020 కోట్ల వ్యయంతో ప్రభుత్వం గోదావరి జిలాలను తరలించి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు పది లక్షల ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అందించనున్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత పనులను వేగవంతం చేస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
 
ఆయకట్టుకు మహర్దశ
నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టులో కొన్నేళ్ళుగా సాగు నీటి సంక్షోభం నెలకొంటుంది. వరుసగా గత మూడేళ్లు ఆయకట్టులో పంటల సాగు కాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించిన తరహాలో సాగర్‌ ఆయకట్టుకు కూడా నూతన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తొలివిడతగా కుడికాలువకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు. ఈ నీటిని హరిశ్చంద్రాపురం ప్రాంతం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌ కుడి కాలువకు తరలిస్తారు. నకరికల్లు మండలంలోని గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ ప్రాంతంలో ప్రధాన కాలువలో గోదావరి జలాలను కలుపుతారు. మొత్తం 20 పంపుల ద్వారా 148.68 మీటర్ల ఎత్తుకు పది కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అమరావతి, పెదకూరపాడు, కోసూరు, బెల్లంకొండ, రాజుపాలెం, నకరికల్లు మండలాల గుండా సాగర్‌ కుడికాలువ వరకు ఎత్తి పోతల పథకాన్ని నిర్మిస్తారు. రోజు ఏడు టీఎంసీల చొప్పున మొత్తం 73 టీఎంసీల నీటిని కుడి కాలువకు తరలించే సామర్థ్యంతో ఎత్తి పోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే సాగర్‌ ఆయకట్టుకు మహర్థశ పట్టినట్టే. రెండు ప్యాకేజీలలో పనులు నిర్వహిస్తారు.
 
పథకం తీరు ఇలా..
33333333.jpgఈ పనులను ప్రధాన కంపెనీలు నవయుగ, మెగా సంస్థలు దక్కిం చుకున్నాయి. హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి అక్కడినుంచి 66.59 కిలో మీటర్ల పొడవున పైపులైన్‌ను నిర్మించి నీటిని తరలిస్తారు. ఐతే 56.50 కిలో మీటర్లు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలించే వీలు ఈ పథకంలో ఉంది. 10.09 కిలోమీటర్లు మోటార్ల ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. 1804 ఎకరాల భూమిని ఈ పథకం నిర్మాణం కోసం సేకరించాల్సి ఉంది. తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతల పథకంకు సంబందించి భూ సర్వే ప్రారంభమైంది. అమరావతి మండలం మునగోడు పరిధిలో బ్రిటీషు కాలంలో ఏర్పాటు చేసిన బేసిక్‌ మార్క్‌ రాయి నుంచి సర్వే సిబ్బంది భూ సర్వేను ప్రారంభించారు. హరిశ్చంద్రాపురం నుంచి లింగాపురం, బయ్యవరం మీదుగా ఈ సర్వే కొనసాగుతోంది. సర్వే పూర్తి చేసి భూసేకరణ వేగ వంతం చేయాలని ప్రభుత్వం అ ధికారులను ఆదేశించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
సాగర్‌ ఆయకట్టుకు
15-11-2018 09:23:21
 
636778706019518688.jpg
  • గోదావరి జలాల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
  • నకరికల్లు వద్ద 21న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
  • గుంటూరు, ప్రకాశంలలో 9.61 లక్షల ఎకరాలకు సాగునీరు
  • గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశ
  • రూ.6020.15 కోట్ల వ్యయంతో పనులు
  • 73 టీఎంసీల నీరు కుడికాలువకు...

నరసరావుపేట: నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు మహర్దశ పట్టనుంది. గోదావరి జలాల ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న శంకుస్థాపన జరగనుంది. ఈ అంశాన్ని నరసరావుపేటలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. నకరికల్లు ఎన్నెస్పీ స్థలం లో సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్థలాన్ని ఆ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ పరిశీలించారు. శంకుస్థాపన శిలాఫలకం నిర్మాణ పనులను నీటి పారు దల శాఖ అధికారులు బుధవారం ప్రారం భించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.
 
నాగార్జునసాగర్‌ కుడికాలువకు గోదావరి జలాలు ఎత్తిపోసే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం రూ.6020.15 కోట్ల వ్యయంతో చేపడుతుంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్త యింది. పనులను నవయుగ, మేగా సంస్థలు దక్కించుకున్నాయి. పథకం నిర్మాణ ప్రాంతంలో ఆయా సంస్థలు భూసర్వే నిర్వహించాయి. భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తు న్నది. ఈ పథకం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌కు ఈ పథకం ద్వారా సాగర్‌ కాలువ ఆయకట్టుకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 
aeefsf.jpgగోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో సాగర్‌ కుడికాలువకు నీటిని తరలిస్తారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 9.61లక్షల ఎకరాల ఆయకట్టుకే కాకుం డా పలు పల్లెల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఎగువన ప్రాజెక్ట్‌లు వచ్చి సాగర్‌కు నీటి చేరిక తగ్గిపోవ డం, జిల్లాలో వర్షాభావం కొనసాగుతుండటంతో విజయ వాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువన 21కిలోమీటర్ల దూరం లోని తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద కృష్ణాన ది నుంచి నకరికల్లు సమీపాన ఉన్న సాగర్‌ కుడికాలువ లోకి నీటిని ఎత్తి పోయించనున్నారు. గోదావరికి వరద ప్రవాహం ఉన్న 120 రోజలు వ్యవధిలో 73 టీఎంసీల నీటిని ఎత్తిపోయించాలని, సాగర్‌లో లభ్యతకు అనుగు ణంగా సకాలంలో సాగు, తాగుకు నీటిని విడుదల చేయా లనేది జలవనరుల శాఖ ప్రణాళిక.
 
కృష్ణానదిపై హరిశ్చంద్రపురం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. ఇక్కడి నుంచి ఐదు దశ ల్లో పథకాలు ఏర్పాటు చేసి మొత్తం 20 పంపు ల ద్వారా 148.68 మీటర్ల ఎత్తుకు 10.09 కిలోమీట ర్ల మేర నీటిని ఎత్తిపోయి స్తారు. ఇందుకు మొత్తం 720 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా అక్కడ నుంచి ఆ నీరు 56.5 కిలో మీటర్ల మేర గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా గుంటూ రు, ప్రకాశం జిల్లాల్లోని 82 మండలాల పరిధిలోని 9.61 లక్షల ఎకరాలకు చేరుతుంది. గుంటూరు జిల్లా అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, రాజుపాలెం, నకరి కల్లు మండలాల మీదుగా కాలువ నిర్మించనుండగా 27 మండలాలతోపాటు ప్రకాశంలోని 53 మండలాల సాగు, తాగు నీటిని వాడుకునేలా పథకం నిర్మాణం జరుగుతుంది.
 
సాగర్‌ కుడికాలువకు కొన్నేళ్లుగా నీటి విడుదల సక్ర మంగా లేక పోవడంతో ఖరీఫ్‌లో సైతం ఆరుతడి పం టలకే ఆయకట్టుదారులు పరిమితమవుతున్నారు. వరిసాగులేక రైతులు సైతం మార్కెట్లో బియ్యం కొను గోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ముందుచూపుతో గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా సాగర్‌ కాలువకు నీటిని మళ్లించనుండటం ఆయకట్టుకు వరం కానుంది. వీలైనంత తొందరగా పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 
పట్టిసీమ-చింతలపూడి పథకాల ద్వారా నీటి తరలింపు
గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. పట్టిసీమ ద్వారా 8400 క్యూ సెక్కులు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. దీనికి సమీపంలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీనిద్వారా 7000 క్యూసెక్కులను పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువను ప్రారంభంలో 18 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో నిర్మిం చారు. దీనికింద కొంతనీటిని ఉపయోగించుకోగా ప్రకాశం బ్యారేజీలోకి చేరే సమయానికి 11500 క్యూసెక్కుల సామ ర్ధ్యంతో ఉంది. బ్యారేజ్‌ బ్యాక్‌వాటర్‌ కలిగి ఉన్న హరిశ్చం ద్రపురం వద్ద నుంచి నీటిని తరలిస్తారు. ప్రస్తుతం 7 వేల క్యూసెక్కులు ఎత్తిపోసి సాగర్‌ కుడికాలువ కింద ఆయ కట్టును స్ధిరీకరిస్తారు.
Link to comment
Share on other sites

In this CBN term there are many achievements I(my personnel choice) would rate this No#1 mainly based on few points only he could foresee

 

 Dummagudam venomous campaign to divide people: CBN showed middle finger to Labbr chapul&dora for stopping Dummagudem tailpond lift to Sagar

Dummagudeam tail lift looked only way to rescue "NSP RIGHT" till state divided as jalayagnam time we did canal without plan and wasted huge money...

KCR showed hid sadism and cancelled Dummagudam  even after CBN proposed to bear 90% of cost major beneficiaries were Khammam&Nalgonda&Mahaboobnagar(saving krishna water for them list pattiseema did)..on top of cancelling 2014 when CBN made multiple requests KCR saw it as CBN mercy plea and emptied sagar just with crooked mind..

Gadkari team wicked plans on Godavari-Penna plans now kicked out

CBN showed there are alternative ways to merge Godavari-Penna instead of 500 meters lift plans to srisailum proposed by a silly fellow acting as Central water advisory :wall:

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...