Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon


AnnaGaru

Recommended Posts

CBN will be remembered for this project master planning&completion...Not just solving guntur&Prakasam problems, he showed way for KA&Tamilnadu water issue......

 

Think for a movement, If Modi had proposed this same project and taken up it would have been become National wonder.....But perverted mind made him to choose wrong way....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

it will be wonder if gets completed and comes to reality.Hope it happens ASAP. NSP RMC farmers are in deep plight from so many years,and CBN will be remembered for long time and putting NTR's name is perfect for this project.

BTW small doubt..how water flow to back from nakarikallu to till macherla. is there any mechanism

Link to comment
Share on other sites

11 minutes ago, kishbab said:

it will be wonder if gets completed and comes to reality.Hope it happens ASAP. NSP RMC farmers are in deep plight from so many years,and CBN will be remembered for long time and putting NTR's name is perfect for this project.

BTW small doubt..how water flow to back from nakarikallu to till macherla. is there any mechanism

Phase-1 Nakerekallu lo drop and flow down..Nakerekallu nunchi Macherla ki malli lift kavali(20 meters lift)....

Right now buggavagu water reserve chestaru till Nakirekallu once phase-1 is complete

Link to comment
Share on other sites

గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన సీఎం
26-11-2018 13:30:18
 
636788358196528014.jpg
గుంటూరు: గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టారు. తొలి దశ పనులకు నకరికల్లు వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తెనపల్లి, రాజుపాలెం బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
Link to comment
Share on other sites

మహా సంగమం
27-11-2018 01:50:09
 
636788802109350785.jpg
  • వంశధార నుంచి పెన్నా వరకు 5 నదుల్నీ కలుపుతాం
  • కరువును శాశ్వతంగా తరిమేస్తాం
  • పట్టిసీమతో తొలి సంధాన ఫలాలు
  • రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం
  • వచ్చే డిసెంబరుకు పోలవరం పూర్తి: సీఎం
  • గోదావరి-పెన్నా తొలి దశకు శ్రీకారం
  • నకరికల్లు వద్ద శంకుస్థాపన
  • వచ్చే ఖరీ్‌ఫకే నీరు ఇస్తామని హామీ
  • 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు... సేద్యపు కుంటలు, చెక్‌డ్యాంలు, చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల ద్వారా నీటి లభ్యత పెంచాం. దీని ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతం వృద్ధి సాధించాం. గుజరాత్‌, మహారాష్ట్ర కంటే ఇక్కడే ఎక్కువగా ఉద్యానవన పంటల సాగు జరుగుతోంది! పులివెందులలో ఎప్పుడూ టీడీపీ గెలవలేదు. అయినా ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతున్నాం. కుప్పం కంటే పులివెందులకే ముందు నీళ్లు ఇస్తామని చెప్పి ఆచరణలో చేసి చూపించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే!
- చంద్రబాబు
 
గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధానమైన ఐదు నదుల మహాసంగమం సాధించి తీరుతాం. నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్‌లో కరువును శాశ్వతంగా తరిమేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం సాధ్యమా అని ప్రశ్నించిన వాళ్లకు పట్టిసీమతో జవాబు చెప్పామన్నారు. అప్పుడే గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ఆలోచన వచ్చిందని తెలిపారు. గోదావరి - పెన్నా అనుసంధానం తొలి దశ ప్రాజెక్టుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లులో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పైలాన్‌ని ఆవిష్కరించి ఎద్దులబండిపై ఊరేగింపుగా సభావేదిక వద్దకు చేరుకొన్నారు.
 
అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని దేశం గౌరవించిన రోజునే గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. తొలి దశలో భాగంగా ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా జలాలను నాగార్జున సాగర్‌ కుడికాలువకు తరలిస్తామని చెప్పారు. ‘‘విభజన అనంతరం ఆదాయం తగ్గిపోయింది. కరువుతో రాయలసీమ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి ఎద్దడి. మరోవైపు... తుఫాన్లు! ఇన్ని కష్టాల నుంచి ఎలా బయటపడతామోనని అంతా ఆవేదన చెందారు. ఆ సందర్భంలోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం’’ అని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా నదికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. దీంతో గోదావరి - పెన్నా సంగమం సాధ్యమేననే నమ్మకంతో అడుగు ముందుకు వేశామని తెలిపారు.
 
సకల సంధానం...
ఐదు ప్రధాన నదులతోపాటు... శ్రీకాకుళం జిల్లాలో బహుదా మొదలుకొని స్వర్ణముఖి వరకు 35 ఉపనదులను కూడా అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా గోదావరి నుంచి 2,500 టీఎంసీల నీరు సముద్రంలో కలిశాయి. అందులో కనీసం 500 టీఎంసీల నీటిని తెచ్చుకొన్నా కరువు లేకుండా చేసుకోవచ్చు. గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశ ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో చేపడుతున్నాం. దీని వలన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది’’ అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 3,541 ఎకరాల భూమి అవసరమని... భూసేకరణకు సహకరించాలని కోరారు. మంచి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎంతో బృహత్తరమైన ఈ ప్రాజెక్టుపై శంకుస్థాపనకు ముందే చంద్రబాబు సమీక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
 
‘‘సంవత్సరం, రెండేళ్లు అంటే కుదరదు. ఎన్ని నెలల్లో చేస్తారో చెప్పండి. గరిష్ఠంగా ఆరు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు. భూసేకరణపై కలెక్టర్‌ కోన శశిధర్‌తో, వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేస్తామని మేఘా ఇంజనీరింగ్‌ ప్రతినిధి సుబ్బయ్య, ఆర్‌వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన రఘుతోనూ హామీ ఇప్పించారు. ఖరీఫ్‌ నాటికి గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టుకు తీసుకొస్తామని వారు చెప్పారు. వారిద్దరికీ సీఎం పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. ‘ఇప్పుడు బొకేలిస్తున్నాను. పని చేయకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాను’ అని నవ్వుతూ హెచ్చరించారు.
 
2019 డిసెంబరు నాటికి పూర్తిగా పోలవరం
‘‘పోలవరం ప్రాజెక్టు 61 శాతం పూర్తి అయింది. మే నెలాఖరుకు కాఫర్‌ డ్యాం, గేట్లు పెట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి ప్రాజెక్టు పనులు మొత్తం పూర్తి చేసే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో కేంద్రం ఇంకా 3,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. పనులు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కొనసాగిస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి ప్రస్తుతం ఉన్న కాలువ సామర్థ్యం సరిపోదని... ఉన్నది విస్తరించడమా, కొత్త కాలువ నిర్మించడమా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే వైకుంఠపురం, బొల్లాపల్లిలో రిజర్వాయర్లు నిర్మించి గోదావరి జలాలను సాగర్‌ డ్యాంలోకి ఎత్తిపోసే స్థితికి వస్తామని ఉద్ఘాటించారు.
 
ఇందుకు రూ. 90 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. మరో 62 సాగునీటి ప్రాజెక్టులను రూ.60 వేల కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘‘నీళ్లిస్తే మీరు సంతోషంగా ఉండి టీడీపీని శాశ్వతంగా ఆదరిస్తారన్న భయంతో విపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడటం, కోర్టుల్లో కేసులు వేయడం వంటివి చేస్తున్నాయి. ఎవరెంతమంది అడ్డుపడినా ముందుకే పోతాం. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు పైనా సర్వే చేస్తున్నామని చెప్పారు. ‘‘కుప్పంలో నా పని తీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుంటున్నాం. తప్పులేవైనా ఉంటే దిద్దుకుంటున్నాం. ఎవరో ఒక చిన్ననాయకుడు తప్పు చేశాడని పార్టీని నిందించవద్దు’’ అని సీఎం కోరారు.
 
అమరావతితో ఉద్యోగాలు
అమరావతి నగరం కచ్చితంగా ప్రపంచంలోని ఐదు మేటి నగరాల్లో ఒకటిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్‌మీడియా సమ్మిట్‌, వాటర్‌ ఫార్ములా వన్‌ రేస్‌, ఎయిర్‌షోలు నిర్వహించామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని, ఇక్కడి యువతకు కోకొల్లలుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అభివృద్ధి విషయంలో చూపుతున్న చొరవను చందబ్రాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, నక్కా ఆనందబాబు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

మహా సంగమం 
నదుల అనుసంధానంతో  కరవు రహిత రాష్ట్రం 
మే నాటికి సాగర్‌ కాలువకు గోదావరి నీరు 
  నాగార్జునసాగర్‌కు గోదావరి  మళ్లించి తెలంగాణకు నీరు 
తెరాస ఓడితేనే తెలంగాణ అభివృద్ధి 
చంద్రబాబు వ్యాఖ్యలు 
  పెన్నా-గోదావరి కలయిక తొలిదశ పనుల పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 
ఈనాడు - గుంటూరు 
26ap-main1a.jpg
వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించే మహాసంగమానికి శ్రీకారం చుట్టామని, ఇది పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బహుదా నది నుంచి స్వర్ణముఖి వరకు రాష్ట్రంలో 35 నదులను అనుసంధానించి సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద సోమవారం రూ.6020 కోట్లతో చేపడుతున్న గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడే పేరేచర్ల- కొండమోడు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడానికి రూ.736 కోట్ల పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నకరికల్లులో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పెన్నా-గోదావరి అనుసంధానం కోసం రేయింబవళ్లు పనిచేసి మే నెలకు సాగర్‌ కాలువలకు నీరందించాలని ముఖ్యమంత్రి లక్ష్యం విధించారు. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, గుత్తేదారు సంస్థల ప్రతినిధులను వేదికపైకి పిలిచి ఐదు నెలల్లో పూర్తి చేసేందుకు హామీ తీసుకున్నారు. భూసేకరణకు రైతులు సహకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో సాగర్‌ కాలువలకు మొదటి పంటకు నీరిచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీతోపాటు కరవు జిల్లాల్లో పెట్టుబడి రాయితీ అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సాగర్‌ నుంచి తెలంగాణకు నీళ్లు 
‘పెన్నా-గోదావరి అనుసంధానంలో భాగంగా బొల్లాపల్లి వద్ద జలాశయాన్ని నిర్మిస్తాం. ఇక్కడినుంచి గోదావరి నీరు నాగార్జునసాగర్‌కు తీసుకెళితే భవిష్యత్తులో తెలంగాణకు కూడా నీళ్లివ్వొచ్చు. ఆరోజు కేంద్రం ఆమోదయోగ్యమైన విభజన చేయాలని నేను సూచిస్తే ఆంధ్రాకు అన్యాయం చేశారు. అప్పట్లో తెరాస కూడా విభజన హామీలతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పింది. సోనియాగాంధీ అప్పటి హామీని నెరవేర్చడానికి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ పెట్టమని తెదేపా తరఫున కోరాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘తెలుగు జాతికి న్యాయం చేయమంటే మెచ్యురిటీ లేదంటారు. నేను వైకాపా ఉచ్చులో పడ్డానంటున్నారు. భాజపానే అవినీతి ఉచ్చులో పడింది. మీ పరపతి పోగొట్టుకున్నారు. మీ రాజకీయం కోసం అవినీతిపరులను కాపాడుతున్నారని గట్టిగా చెప్పిన వ్యక్తిని నేను’ అని పేర్కొన్నారు. ‘దేశం కోసం పనిచేస్తూ మోదీకి భయపడాల్సిన పని లేదు. కేసీఆర్‌ను అంతకుముందే లెక్కపెట్టుకోవడం లేదు’ అని వివరించారు.

26ap-main1c.jpg
విడిపోయినా కలిసుందామంటే తిడతారు 
‘హైదరాబాద్‌ అభివృద్ధి చెందితే తెలుగు జాతికి ఉపయోగపడుతుందని ప్రపంచమంతా తిరిగి అభివృద్ధి చేశా. కేసీఆర్‌ నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కాదు. నిన్న, మొన్న అంతకుముందు కూడా తిట్టారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కలిసి ఉండాలని నేనంటే మీరెవరు చెప్పడానికి అని ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు. తెదేపా ఇలాంటి నాయకులకు రాజకీయ జీవితమిచ్చింది. ఇప్పుడు తిడుతుంటే బాధ వేయదా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. తెలంగాణలో భాజపాకు వైకాపా, తెరాసకు పవన్‌కల్యాణ్‌ మద్దతిస్తారు. కర్ణాటకలో భాజపాకు వైకాపా మద్దతిచ్చింది. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే తెరాస ఓడిపోవాలి. ప్రజాకూటమి గెలిచినప్పుడే న్యాయం జరుగుతుంది. హైదరాబాద్‌ను తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేస్తే అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో రూ.40వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. అమరావతి మనందరికీ గర్వకారణంగా ఉండాలి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన స్ఫూర్తితో అంతకంటే మిన్నగా అభివృద్ధి చేస్తా. హైదరాబాద్‌ కూడా అభివృద్ధి చెందాలి. మనుషులు చనిపోతాం కానీ మన పనులు శాశ్వతంగా ఉంటాయ’ని ముఖ్యమంత్రి అన్నారు.

నిలదీస్తే కేసులు... 
‘కేంద్రాన్ని నిలదీసినందుకు కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిపై కేసులు పెట్టారు. హోదా, హామీలపై మన ఎంపీలు పోరాడితే ఈడీ, ఐటీ కేసులు పెట్టారు. నాలుగేళ్లు భాజపాతో కలిసి ఉన్నప్పుడు కనిపించని అవినీతి విభేదించాక ఇప్పుడు కనిపిస్తోంది. భాజపా వాళ్లపై చాలా అవినీతి ఆరోపణలున్నాయి. వారిని కాపాడుతూ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు.  లాలూప్రసాద్‌ యాదవ్‌పై తప్పుడు కేసులు పెట్టమని ప్రధాని కార్యాలయం ఒత్తిడి తెచ్చిందని సీబీఐ స్పష్టంగా చెబుతోంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని నేను చెప్పలేదు. రాజకీయ కక్షతో భయభ్రాంతులను చేయడం మంచిది కాదు. ఎన్డీయే ఉంటే దేశంలో చాలా సమస్యలొస్తాయి. ప్రజాస్వామ్యం ఉండదు. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌కు నివాళులర్పించి ఆ స్ఫూర్తిని అమలు చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నాయకత్వ లోపాలుంటే సరిచేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో నిలుపుతామని వివరించారు. కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు. సభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఊహకు కూడా అందని పెన్నా- గోదావరి అనుసంధానంతో పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లా సస్యశామలమవుతుందని అన్నారు. సభలో మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, పుల్లారావు, శిద్దా రాఘవరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జలవనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.


మట్టి వాసన తెలిసినవారు 
26ap-main1b.jpg
సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నదుల అనుసంధానం అద్భుత కల అని, దాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి అపర భగీరథుడని నకరికల్లు మండలం కండ్లగుంట ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.స్నేహకుమారి వివరించింది. నకరికల్లు వేదికపై ఆమె ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు అందరినీ అలరించింది. ముఖ్యమంత్రి మట్టివాసన తెలిసినవారని, విపత్తులను ఓడించినవారని ప్రశంసించింది. తన వయసు 14 ఏళ్లని, నాలుగేళ్లలో 18 ఏళ్లు నిండి ఓటుహక్కు వస్తుందని, అప్పటివరకు దిశానిర్దేశం చేయాలన్న ఆమె విన్నపంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అక్కున చేర్చుకుని ముచ్చటించారు. తాను టీచర్‌ కావాలని, మరో పది మందికి విద్యాబుద్ధులు నేర్పుతానని బాలిక వివరించింది. పిల్లలందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటున్న ఈ రోజుల్లో చిన్నారి ఆశయం ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

నదుల అనుసంధానం.. అపూర్వ ఘట్టం
27-11-2018 08:02:24
 
636789025456525904.jpg
  • గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో తొలి అడుగు
  • మొదటి దశ పనులకు నకరికల్లులో సీఎం శంకుస్థాపన
  • అనుసంధానం చరిత్రలో నిలిచిపోతుంది..
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నరసరావుపేట/నకరికల్లు: గోదావరి జలాలతో సాగర్‌ ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుఉ అన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని, ఈ రోజు చరిత్రలో మిగిలిపోతుందని చెప్పా రు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు నకరికల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైలాన్‌ను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా ఈ ఐదు నదులను అనుసందానం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ మహా సంగమంలో భాగంగానే గోదావరి - పెన్నా నదుల అనుసంధానాన్ని చేపట్టామన్నారు. తొలి దశలో నాగార్జున సాగర్‌ కుడి కాలువకు గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. ఐదు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సాగర్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామన్నారు. పథకం పనులు చేపట్టేందుకు నిధులు సిద్దంగా ఉన్నాయని, టెండర్లు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. గోదావరి జలాల ఎత్తి పోతల పథకం నిర్మాణానికి 3500 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.
 
anwer.jpgరైతులు సహకరిస్తే వెను వెంటనే పథకం పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మెగా, ఆర్‌వీఆర్‌ సంస్థల ప్రతినిధులు చేత ఐదు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ తీసుకున్నారు. గోదావరి జలాలను తరలించేందుకు హరిశ్చంద్రాపురంతో పాటు ఐదుచోట్ల లిప్ట్‌లను నిర్మిస్తామన్నారు. నాలుగేళ్ళుగా నాగార్జునసాగర్‌ ఆయకట్టులో నీటి సంక్షోభం నెలకుందని చెప్పారు. జలాల తరలింపు పథకం ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లబిస్తుందన్నారు. రెండో దశలో సోమశిల వరకు గోదావరి నీటిని తీసుకు వెళ్ళటం జరుగుతుందన్నారు. బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడినుంచి నాగార్జున సాగర్‌కు నీటిని తరలించే అవ కాశం ఉంటుందన్నారు. మే నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందని చెప్పారు. వీటిలో 17 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 26 ప్రాజెక్టు పను లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు.వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు రూ.1,400 కోట్లతో తాగునీటి సరఫరాకు ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. కొండమోడు నుంచి గుంటూరు వరకు రూ.750 కోట్లతో ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. తనతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధుల పని తీరు కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. తనపై కూడా అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని, తప్పులు ఉంటే తాను సరిది ద్దుకుంటున్నానని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు.
 
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కులం, మతం, ప్రాంతాల వారీగా ఓట్లు వేయటం సరైంది కాదని చెప్పారు. కష్టపడి పని చేస్తున్నాం, ఏదో ఒక చోట అధి కారి, ఒక ప్రజా ప్రతినిధి సరైన రీతిలో స్పందించకపోతే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటం సరికాదన్నారు. సభలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, శిద్ధా రాఘవరావు, ఎంపీ రాయపాటి సాంబ శివరావు, కలెక్టర్‌ కోన శశిధర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతి యాజ్‌, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, గొట్టిపాటి రవి కుమార్‌, శ్రావణ్‌ కుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, ఎంఎల్‌సీలు కరణం బాలరామకృష్ణమూర్తి, డాక్టర్‌ రామకృష్ణ, జెడ్పీ చైర్మన్‌ జానీమూన్‌, దివ్యాందుల సంస్థ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎఫెక్స్‌ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, సాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ గుంటుపల్లి వీర భుజంగరాయలు, డాక్టర్‌ కోడెల శివరామ్‌, రాయపాటి రంగారావు, జియాఉద్దీన్‌, నీటి పారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీరు ఆర్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌ఈ పురుషోత్తం గంగరాజు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
అపరభగీరధుడు సీఎం చంద్రబాబు
rfgadfva.jpgభగీరధుడు గురించి పురాణాల్లో విన్నాం. ఎవ్వరూ చూడలేదు. ఈ రోజు గోదావరి - పెన్నా నదుల అనుసందానం చేస్తున్న సీఎం చంద్రబాబు అపరభగీరధుడు. ఈ నదుల అనుసంధానం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యం. నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా విజయవంతంగా చేసి చూపించిన నేత చంద్రబాబు. చంద్రబాబు గోదావరి - పెన్నా నధుల తొలి దశ పథకానికి శంకు స్థాపన చేయటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం.
- స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు
ప్రతి ఎకరాకు సాగునీరు..
bwdqw.jpgనాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి కాపాడుతాం. గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన ఘనత చంద్రబాబు నాయుడిదే. 9.61లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.. ముఖ్యమంత్రికి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. గోదావరి జలాల రాకతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగింది. మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతులకోసం నదుల అనుసంధానం చేపట్టాం.
- దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర మంత్
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...