Jump to content

Bhooma no more


krish2015

Recommended Posts

Guest Urban Legend

Worst fellow gadu sakshi gadu thu

 

politics lo yedavalu vuntaru kaani e jagan gadi range yedhava never ever in AP politics

Link to comment
Share on other sites

politics lo yedavalu vuntaru kaani e jagan gadi range yedhava never ever in AP politics

 

hmm db lo sarigga choosinattu levule.......

 

bhooma very shocking....monne antunnadu, andari chavula meeda career develop chesukunna....some genetical prob la undi family lo...evaru complete age daka undatla......oo much drinking kooda kavachu...

Link to comment
Share on other sites

Akhila Priya ki Minister isthye baguntundhi 

So that she will overcome this emotional family loss by getting busy in Minister portfolio and also helps her in overcoming the challenges by building self confidence.

Link to comment
Share on other sites

భూమా నాగిరెడ్డి ప్రస్థానం.. ప్రధానిపైనే పోటీకి నిలిపిన టీడీపీ!
 
636249412849606206.jpg
నంద్యాల (కర్నూలు జిల్లా): రాష్ట్ర రాజకీయాల్లో భూమా నాగిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం.. ముక్కుసూటి రాజకీయాలు.. నిర్మొహమాట సమీకరణలు చేయడంలో నాగిరెడ్డి తనకు తానే సాటిగా నిలిచి రాజకీయాల్లో రాణించారు. కర్నూలు జిల్లాలో బలమైన వర్గ నేతగా కొనసాగారు. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని చక్రం తిప్పిన ముఖ్య నాయకుడు భూమా నాగిరెడ్డి. ఆళ్ళగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి, అధిష్టానం వద్ద అత్యంత గుర్తింపుతో ఎంపీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికై హ్యాట్రిక్‌ పార్లమెంటేరియన్‌గా రికార్డు సృష్టించారు. ముక్కుసూటిగా వ్యవహరించే భూమా నాగిరెడ్డి అదే దూకుడుతో రాజకీయాల్లోనూ వర్గ సమీకరణలు చేయడంలో దిట్టగా నేటికీ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి.. 2016 ఫిబ్రవరిలో తిరిగి సొంత గూడు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
 
 
యువకుడిగా రాజకీయం అరంగేట్రం:
చెన్నైలో హోమియోపతి వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఆళ్ళగడ్డ నియోజక వర్గంలో రాజకీయ రంగంలోకి భూమా నాగిరెడ్డి అడుగుపెట్టారు. హోమియోపతి వైద్యవిద్యను మధ్యలో వదిలిపెట్టి 1987లో రుద్రవరం మండలం నర్సాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 1988లో ఆళ్ళగడ్డ మండల అధ్యక్షుడిగా విజయం సాధించారు. 1989 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా వీర శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధి గంగుల ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు. అయితే భూమా వీరశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994 సాధారణ ఎన్నికల్లో కూడా భూమా నాగిరెడ్డి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
 
 
దేశ ప్రధానిపైనే భూమాను నిలబెట్టిన టీడీపీ:
దేశ అత్యున్నత పదవి అయిన ప్రధాన మంత్రి హోదాలో నంద్యాల ఎంపీగా పోటీ చేసిన పీవీ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డిని నిలబెట్టడం అప్పట్లో రాజకీయంగా ఎంతో కలకలం రేపింది. 1991లో దేశ ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు టీడీపీ తరుపున అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో పీవీ నరసింహారావుకు ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌తో 5,80,035 ఓట్లతో ప్రపంచ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అయితే ప్రధాని హోదాలోనే 1996లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు స్థానిక నేతలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డిని అధిష్టానం దేశ ప్రధానిపైనే పోటీకి నిలపడంతో, ప్రధానిపై పోటీ చేసిన పిన్న వయస్కుడిగా భూమా నాగిరెడ్డి అప్పట్లో రాజకీయ సంచలనం రేపారు.
 
ప్రధాని మెజార్టీని తగ్గించిన ఘనత భూమా రికార్డు:
1991లో పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినప్పుడు 5,80,035 మెజార్టీ వచ్చింది. అయితే 1996లో పీవీపై భూమా నాగిరెడ్డి పోటీ చేసిన సమయంలో రికార్డు మెజార్టీ భారీగా తగ్గింది. ఈఎన్నికల్లో పీవీ నరసింహారావు 98,530 మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ప్రధాని మెజార్టీని భారీగా తగ్గించిన నాయకుడిగా భూమా నాగిరెడ్డికి నంద్యాల రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
 
 
హ్యాట్రిక్‌ ఎంపీగా భూమా విజయప్రస్థానం:
1996లో రెండో సారి నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలిచిన ప్రధాని పీవీ నరసింహారావు ఒరిస్సాలోని బరంపురం నియోజక వర్గం నుంచి కూడా గెలుపొందారు. దీంతో బరంపురంను అట్టేపెట్టుకొని నంద్యాలకు పీవీ రాజీనామా చేశారు. దీంతో 1996లోనే ఉప ఎన్నికలు జరిగాయి.టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థిగా అప్పటి కేంద్రమంత్రి, స్థానికేతరుడైన పీవీ రంగయ్యనాయుడును కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో 4,40,142 భారీ మెజార్టీతో భూమా నాగిరెడ్డి విజయం సాధించి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో జరిగిన పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై స్వల్ప మెజార్టీ (4,650)తో రెండోసారి విజయం సాధించారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 72,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు.
 
టీడీపీని వీడి పరాజయాల బాటలో భూమా:
1999 నుంచి 2004 వరకు ఎంపీగా ఉన్న భూమానాగిరెడ్డి 2004లో జరిగిన ఎన్నికల్లో ఆళ్ళగడ్డ శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగిరెడ్డి సతీమణి భూమా శోభానాగిరెడ్డి కూడా ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో 2008లో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరి జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. అయితే ఆళ్ళగడ్డ నియోజక వర్గం నుంచి శోభానాగిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంతో పీఆర్‌పీలోనూ తన మార్క్‌ రాజకీయాలు నడిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, జగన్‌ స్థాపించిన పార్టీ వైసీపీలోకి భూమా చేరడం చకచకా జరిగిపోయాయి.
 
2014లో వైసీపీ నుంచి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపు:
2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన భూమా కుటుంబానికి వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నంద్యాల ఎమ్మెల్యే టికెట్‌ భూమాకు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే టికెట్‌ భూమా శోభానాగిరెడ్డికి, బనగానపల్లె ఎమ్మెల్యే టికెట్‌ భూమా సన్నిహిత బంధువు కాటసాని రామిరెడ్డికి, కర్నూలు వైసీపీ టికెట్‌ భూమా బావ ఎస్‌వీ మోహన్‌రెడ్డికి, శ్రీశైలం టికెట్‌ను భూమా సన్నిహితుడైన బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చారు. పోలింగ్‌ జరగకమునుపే శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా వైసీపీ తరుపునే ఎన్నికయ్యారు.
 
రాజకీయ పరిణామాలతో టీడీపీ గూటికి తిరిగి చేరిన భూమా:
నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డికి తన సతీమణి భూమా శోభానాగిరెడ్డి మరణం తీవ్రంగా కలిచి వేసింది. ఈనేపథ్యంలోనే నంద్యాలలో పట్టు బిగించే ప్రయత్నంలో భాగంగా భూమా నాగిరెడ్డి మున్సిపాలిటీలో జరిగిన గొడవ నేపథ్యంలో ప్రత్యర్థులు వరుస కేసులు బనాయించడం, రౌడీషీట్‌ను కూడా తెరిపించడం అప్పట్లో రాజకీయ కలకలం రేపింది. తదనంతరం జరిగిన పరిణామాలతో కర్నూలు జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గంలో ముఖ్య నేతగా ఉన్న భూమా నాగిరెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంపై చంద్రబాబు నాయుడు నుంచి సంకేతాలు వెల్లడి అయ్యాయి. భూమాను తిరిగి టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన శిల్పా వర్గం ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదు. 2016 ఫిబ్రవరి నెలలో భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియలు తెలుగుదేశంలోకి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరారు. దీంతో రాజకీయాల్లో అరంగేట్రం చేసిన పార్టీలో బలమైన నేతగా ఎదిగి.. చివరికి తెలుగుదేశం పార్టీ నేతగానే భూమా నాగిరెడ్డి హఠాత్మరణం టీడీపీ వర్గాలను శోక సంద్రములో ముంచింది.
 
 
భూమానాగిరెడ్డి పూర్తి వివరాలు :
పూర్తి పేరు : భూమా వీరనాగిరెడ్డి
పుట్టిన తేదీ : 8-1-1964
జన్మించిన ఊరు : నంద్యాల
తండ్రి : భూమా బాలిరెడ్డి
తల్లి : భూమా ఈశ్వరమ్మ
స్వగ్రామం : డబ్ల్యూకొత్తపల్లె, దొర్నిపాడు మండలం
అన్నలు : భూమా వీరప్రతాపరెడ్డి, భూమా వీరశేఖర్‌రెడ్డి,
భూమా వీరభాస్కరరెడ్డి
చెల్లెలు : శ్రీదేవి
పెళ్ళి తేదీ : 9-4-1986
భార్యపేరు : భూమా శోభానాగిరెడ్డి
కుమార్తెలు : భూమా అఖిలప్రియ, భూమా మౌనిక
కుమారుడు : భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి
ఇష్టమైన ఆహారం : చికెన్‌ బిర్యానీ
ఇష్టమైన నాయకులు : ఎన్టీఆర్, వైఎస్సార్
విద్య : హోమియోపతి మెడిసిన్‌ (డిస్‌కంటిన్యూ)
ఇష్టమైన వాహనం : రేంజ్‌రోవర్‌

ఇష్టమైన విదేశీ పర్యటన : టెక్సాస్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...