Jump to content

Kia in Anantapur !


Recommended Posts

కియ’ ఖాయం
 

  • 27న ప్రభుత్వంతో ఒప్పందం!
  • ‘అనంత’లో 599.38 ఎకరాలు సేకరణ
  • సంస్థ ప్రతినిధుల కీలక చర్చలు
అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): హ్యుండయ్‌ కార్లను తయారీ సంస్థ ‘కియ’ నవ్యాంధ్రలో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. అనంతపురం జిల్లా పెనుకొండలో కియ ప్లాంటు ఏర్పాటు కానుంది. దీనిపై ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరే అవకాశముంది. నవ్యాంధ్రకు ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ‌ని రప్పించేందుకు పరిశ్రమల శాఖ అధికారులు మొదటి నుంచీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి హీరోను రప్పించారు. ఇప్పుడు... ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని మరీ ప్రపంచ స్థాయి ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ‘కియ’ను కూడా ఆకర్షించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌తో కియ ప్రతినిధులు భేటీ అయ్యారు. పెనుకొండలో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుపై సమీక్షించారు. కియ కోసం పెనుకొండలో ఇప్పటికే 599.38 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు పరిశ్రమల శాఖ సన్నద్ధమైంది. కియ రాకతో వెనుకబడిన అనంతపురం జిల్లాలోని 5000 మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఎఫ్‌ఐపీబీ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. కియ రాష్ట్రంలో 10వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశముందని తెలిసింది.
Link to comment
Share on other sites

  • Replies 900
  • Created
  • Last Reply

Make in India to get a boost as Kia Motors plans to invest 10,000 crores

India Infoline News Service | Mumbai | April 17, 2017 10:46 IST

Soth Korea’s second largest car manufacturer following Hyundai Motor Company, Kia Motors may infuse as much as Rs. 10,000 crore as the biggest foreign direct investment in India, with its parent company, Hyundai Motors choosing Andhra Pradesh as its investment destination.

 
A+ a- 0
1455637442-9954.png
Soth Korea’s second largest car manufacturer following Hyundai Motor Company, Kia Motors may infuse as much as Rs. 10,000 crore as the biggest foreign direct investment in India, with its parent company, Hyundai Motors choosing Andhra Pradesh as its investment destination.
 
“A unit of South Korea’s biggest carmaker has chosen Penukonda in Anantapur district in southern Andhra Pradesh, which is starting the process of buying land for the factory", reported a leading business daily.
 
The automobile giant will invest in two phases in Andhra Pradesh with a cumulative investment of $1.6 billion, or Rs 10,300 crore, with the first phase of investment amounting to about Rs 6,000 crore.
 
Kia’s decision of investment on the plant comes as a part of India’s growing eminence as a manufacturing hub with centre’s Make-in-India initiative, making the country an investment destination. 

Disclaimer: The contents herein is specifically prepared by ‘Dalal Street Investment Journal’, and is for your information & personal consumption only. India Infoline Limited or Dalal Street Investment Journal do not guarantee the accuracy, correctness, completeness or reliability of information contained herein and shall not be held responsible.

Link to comment
Share on other sites

inka official ga Korean Embassy confirmed Today

Anantapur vasula ki industrial ga idoka malupu...

 

 

https://twitter.com/IndiainROK/status/854488735131475968

 

India in ROK‏Verified account
@IndiainROK

Follow
More
Welcome to #MakeInIndia KIA motors! Hyundai group's Kia to invest $1.6bn in 2 phases to build 2 car factories in Andhra. Total cap 600k cars

Link to comment
Share on other sites

రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం
 
అమరావతి: రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్ల కంపెనీ 'కియా' సంస్థ ముందుకొచ్చింది.
అనంతపురం జిల్లాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని కియా కంపెనీ ఏర్పాటు చేయనుంది. రేపు ఉదయం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకోనున్నారు.
Link to comment
Share on other sites

 

రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం

 

అమరావతి: రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్ల కంపెనీ 'కియా' సంస్థ ముందుకొచ్చింది.
అనంతపురం జిల్లాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని కియా కంపెనీ ఏర్పాటు చేయనుంది. రేపు ఉదయం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకోనున్నారు.

 

:super:

Link to comment
Share on other sites

Anantapur Zilla... Care of Rafa Nadal's Academy & Kia Motors...

Kia is offical sponsorer of Rafa Nadal :P

 

 

Nadal has been sponsored by Kia Motors since 2006. He has appeared in advertising campaigns for Kia as a global ambassador for the company. In May 2008, Kia released a claymation viral ad featuring Nadal in a tennis match with an alien. In May 2015, Nadal extended his partnership with Kia for another five years.

 

mavoditho ads eyinchandi inka  :terrific:  :terrific:

Link to comment
Share on other sites

నేడే ‘కియ’కు శ్రీకారం!
 
636288557875596849.jpg
  • సీఎం సమక్షంలో ఒప్పందం..
  • ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
  • ‘అనంత’లో కియ మోటార్స్‌ ప్లాంటు..
  • ఏటా 3 లక్షల హ్యుండయ్‌ కార్ల ఉత్పత్తి
  • 599 ఎకరాలు.. రూ.12,910 కోట్ల పెట్టుబడి.. 11వేల మందికి ఉపాధి
  • 2019 జూన్‌కి ఉత్పత్తి.. కియకు అల్ట్రా మెగా ఇండస్ట్రీ హోదా ఇచ్చిన ఏపీ
అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక అడుగు పడనుంది. మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం జరగనుంది. ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ ‘కియ’ మోటార్స్‌ రాష్ట్రంలో కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో గురువారం ఉదయం 10.30 గంటలకు దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై కియ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేయనున్నారు. హ్యుండయ్‌ కార్ల తయారీలో ప్రముఖ స్థానం వహించే కియ మోటార్స్‌ సుమారు రూ.12,910 కోట్లతో అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 599 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటులో 11 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగే కార్యక్రమంలో ఇరుపక్షాల నడుమ ప్లాంటు ఏర్పాటుపై అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌. అమర్నాథరెడ్డితో సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. భారీ స్థాయిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో వెనుకబడిన జిల్లా అయిన అనంతరపురంలో ప్లాంటును ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ‘కియ’ మోటార్స్‌కు అలా్ట్ర మెగా ఇండసీ్ట్రకి ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో 2019 జూన్‌ నాటికి ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేయనున్నారు. 2019 అక్టోబరు నాటికి పూర్తిస్థాయిలో హ్యుండయ్‌ కార్లను ఉత్పత్తి చేయాలని ఏపీ సర్కార్‌ షరతు విధించింది.
 

కరువు అనంతలో ఉపాధి వెల్లువ

అనంతపురంలోని ఎర్రమంచిలో ఏర్పాటు చేయనున్న కియ ప్లాంటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఎర్రమంచి ప్లాంటులో 4 వేల మందికి శాశ్వతంగా.. 7వేల మందికి తాత్కాలికంగా ఉపాధి కల్పిస్తారు. ప్రతియేటా 3 లక్షల కార్లు తయారు చేయాలన్నది లక్ష్యం. వీటిలో 2.7 లక్షల కార్లను స్థానికంగా.. 30వేల కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారు.
 

సీఎం చొరవతో రాష్ట్రానికి..

ప్రతిష్ఠాత్మక కియ మోటార్స్‌ సంస్థ రాష్ట్రంలో ప్లాంటును ఏర్పాటు చేయడం వెనుక సీఎం చంద్రబాబు చొరవ ఎంతో ఉంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం ఆ దిశగా అధికారులను కార్యోన్ముఖులను చేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్‌ ఇండసీ్ట్రస్‌ ద్వారా ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయన్నది సీఎం వ్యూహం. అందులో భాగంగా ఆటోమొబైల్‌ ఇండసీ్ట్ర్‌సను రాష్ట్రానికి తీసుకురావాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నవ్యాంధ్ర ఏర్పడి నాటి నుంచి ఇప్పటిదాకా హ్యుండయ్‌ కార్ల కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శులు ఎస్‌.ఎస్‌. రావత, సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ కృషి చేస్తూ వచ్చారు. సీఎంతో పలు దఫాలుగా భేటీ అయిన కియ ప్రతినిధులు ఆయన దార్శనికతను గుర్తించి, ఇతర రాష్ట్రాల్లో కన్నా ఏపీలో తమ ప్లాంటు ఏర్పాటుకు మొగ్గుచూపారు. దీంతో ఏపీలో కియ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తమిళనాడులో హ్యుండయ్‌ కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసిన తర్వాతే అక్కడికి ఆటోమొబైల్‌ కంపెనీలు క్యూ కట్టాయన్న సెంటిమెంటు ఉంది. ఇప్పుడు అదే సెంటిమెంటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
 

కియకు ప్రపంచంలో 5వ స్థానం
దక్షిణ కొరియా సియోల్‌కు చెందిన కియ మోటార్స్‌ కంపెనీ 1944లో ఏర్పాటైంది. వాహన తయారీరంగంలో కియ మోటార్స్‌ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. దక్షిణ కొరియాలో రెండో అతిపెద్ద ఆటోమొబైల్‌ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ప్రతియేటా సుమారు 35 లక్షల కార్లను ఉత్పిత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థ కలిగి ఉంది. ఈ సంస్థలో 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కియ మోటార్స్‌కి హ్యుండయ్‌ మోటార్స్‌ మాతృసంస్థగా ఉంది. కియ సంస్థ ప్లాంట్లలో ఆటోమొబైల్స్‌, హైబ్రిడ్‌ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఎలకా్ట్రనిక్‌ వెహికల్స్‌, ప్యాసింజరు కార్లు, రిక్రియేషన్‌ వాహనాలు తయారవుతున్నాయి. కియ సంస్థకు అనుబంధంగా కియ మోటార్స్‌ అమెరికా, కియ మోటార్స్‌ యూరోప్‌, కియ మోటార్‌ మెక్సికో ఉన్నాయి. ఈ సంస్థకు ఐదు దేశాల్లో 14 మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...