Jump to content

Kia in Anantapur !

Recommended Posts

కియా’ పనులు చకచకా!

636343848114167381.jpg
  • శరవేగంగా భూముల చదును
  • 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తి లక్ష్యం
  • 20 వేల మందికి ఉపాధి
  • పనుల్ని స్వయంగా పరిశీలిస్తున్న సీఎం
  • అధికారులు, కంపెనీ ప్రత్యేక శ్రద్ధ
 
అనంతపురం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. పరిశ్రమకు కేటాయించిన భూముల్లో చదును, విద్యుత్‌ కోసం 220కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టారు. సేకరించిన భూముల్లో ఉన్న సెల్‌టవర్లు, విద్యుత్‌ టవర్లు, ఇతర కట్టడాలు తొలగించే పనులు మొదలుపెట్టబోతున్నారు. వంకలు, వాగులను మళ్లించడానికి జలవనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కియా ప్రతినిధులు తమకు తాత్కాలిక కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. రూ.174 కోట్లతో భూమి చదును పనులు సాగుతుండగా.. పరిశ్రమ చూట్టు ఆరున్న కిలోమీటర్ల కెనాల్‌ పనులు, గొల్లపల్లి నుంచి పరిశ్రమ దాకా ప్రత్యేక పైపులైన్‌ పనులు చేపట్టాల్సి ఉంది. జూలై నెలాఖరుకు భూమి చదును పనులు పూర్తి చేసి ఆగస్టు నుంచి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కియా ప్రతినిధులు తెలిపారు. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పనుల వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కియా ప్రతినిధులతో, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. భూముల అప్పగింత, పనుల తీరుపై వారితో మాట్లాడుతున్నారు. కైజాలా యూప్‌ ద్వారా పరిశ్రమ పనులను సమీక్షించాలని ఆదేశించారు. డ్రోన్‌ కెమెరాతో తాను కూడా కియా పనులను పరిశీలిస్తానన్నారు. దీంతో జిల్లా అధికారులు, కంపెనీ ప్రతినిధులు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కియా ప్రతినిధులు లీ, రియో, కిమ్‌, యాంటెక్‌ తదితరులతోపాటు కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అమ్మవారిపల్లిలో పరిశ్రమ భూమి చదును పనులను పరిశీలించారు. ఈ పరిశ్రమలో 4 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 7 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తారు. పరోక్షంగా మరో 11 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సమాచారం.
గట్టి పోటీ ఉన్నా అనంతకు తీసుకొచ్చిన సీఎం
దక్షిణకొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ 15వ ప్లాంటు కోసం దేశంలోని పలు రాష్ర్టాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు గట్టిగా పోటీపడ్డాయి. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆ పరిశ్రమను అనంతపురం జిల్లాకు వచ్చేలా చేశారు. పెనుకొండ మండలంలో పరిశ్రమకు అవసరమైన భూమిని అధికారులు కేటాయించారు. అమ్మవారిపల్లి, ఎర్రమంచి, పరిసర భూముల్లో 599 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. ఇందులో 535 ఎకరాలు కియా పరిశ్రమకు అప్పగించగా.. మిగిలిన భూమిని రోడ్డు, ఇతర మౌలిక వసతులకు ఉపయోగించేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ భూమిని చదునుచేసే కార్యక్రమాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపట్టింది. హంద్రీ-నీవా పథకంలో భాగమైన గొల్లపల్లి రిజర్వాయరు నుంచి పరిశ్రమకు నీరందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పైపులైన్‌ వేయాల్సి ఉందని జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌ నాయక్‌ తెలిపారు. కియా పరిశ్రమ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు. ఇందుకు రూ.125 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, ఆలోపు తాత్కాలికంగా రూ.3 కోట్ల ఖర్చుతో నీటిని అందిస్తామని చెప్పారు. తాగునీరు, రోడ్డు, విద్యుత్‌ సరఫరా తదితర పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది పూర్తయితే కరువు జిల్లాకు వరమవుతుందని అంటున్నారు.
 
9HOME.jpg
Link to comment
Share on other sites

  • Replies 900
  • Created
  • Last Reply
  • 2 weeks later...

Hope by 2019 (March/April) KIA will be fully operational before expected date.

TDP should get 2-3 more such Big Industries to backward Anantapur District. 2014 lo castism ki against gaa TDP ki Vote chesaru Anantapur people.

Chittoor ki CBN entha chesthunna chivariki evariki vote vesthaaro choodali. Main ministries anni Chittoor ke ee sari. CBN, Lokesh, Amarnath Reddy.

Link to comment
Share on other sites

కొరియా కార్ల కంపెనీ కియామోటార్స్‌కు భూమి కేటాయింపు
21-07-2017 16:44:55
 
అనంతపురం: కొరియా కార్ల కంపెనీ కియామోటార్స్‌కు భూమి కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. అనంత జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమంచి, గుడిపల్లిలో
587.84 ఎకరాలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు జరగనుంది. కియామోటార్స్ 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
 
కాగా 2019 ద్వితీయార్దానికల్లా ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. భారతీయ మార్కెట్ అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, ఎస్‌యూవీ తరహా కార్ల తయారు చేయనున్నారు.
Link to comment
Share on other sites

కియో’ ఏర్పాటులో మరో కీలక అడుగు
21brk-kia119a.jpg అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ కొరియా కార్ల తయారీ సంస్థ కియోమోటర్స్‌ పరిశ్రమ నెలకొల్పేందుకు మరో కీలక అడుగు పడింది. కియోమోటర్స్‌కు 587.84 ఎకరాల భూమి అప్పగిస్తూఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనగొండ మండలం, ఎర్రమంచి, గుడిపల్లిలో భూమి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక కియో కార్ల పరిశ్రమను తమ వద్ద నెలకోల్పేలా పలు రాష్ట్రాలు తీవ్రంగా యత్నించాయి. అయితే సంస్థ ఏపీలో పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చిన సంగతి తెలిసిందే. ఏటా 3లక్షల కార్లు తయారీ సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది.

Link to comment
Share on other sites

Today, Kia OFFICIALLY launched INDIA website and also inviting dealership partners.....eedu chala fast ga unnadu....

jobs kuda start chestunadu.. Kia is betting all-in unlike the US&German companies that made conservative effort to launch in India

Anantapur charitra marabotundi deenito...e page chudandi...

mana leader(photos pettaru) mana Anantapur(plant details pettaru) international ga marchesaru e project tho....

http://www.kia-motors.in/web/html/india/IndiaPlant.jsp

Also Kia international informed AP govt about plans of building township quarters near the plant on the hill area next to plant in Anantapur.....

brahmi-dance.gif

Super

Lets crush everyone  giphy.gif  :no1:

Link to comment
Share on other sites

Ilaanti pedda Industries 2019 lopu district ki okati testhe people will remember CBN forever.

Anantapur ki KIA Motors okate kaakunda inko 2-3 big industries tevali water problem solve chesi.

Anantapur people voted differently than whole Rayalaseema, They Voted for development & experience of leader. Anantapur ki entha chesina takkuve.

Next CBN should concentrate on Godavari Districts mainly West Godavari & give them what they deserve for their 100% support to TDP.

Godaari .. :no1: ... Pattiseema, Polavaram..

Link to comment
Share on other sites

అమెరికా ‘కియా’..అనంతకు!

అక్కడి ప్లాంటు నమూనాలోనే ఇక్కడ ఏర్పాటు

పరిశీలనకు త్వరలో యుఎస్‌కు అధికారుల బృందం

నంద్యాల ఉప ఎన్నిక తరువాతే భూమిపూజ

29ap-main12a.jpg

ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ‘కియా’ కార్ల కంపెనీ రూపురేఖలు ఎలా ఉండనున్నాయో స్పష్టమైంది. అమెరికాలో ఆ సంస్థకున్న ప్లాంటు నమూనాలోనే ఇక్కడ ప్లాంటును నిర్మించనుంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘కియా మోటార్స్‌’ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్‌ నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం పెనుకొండ మండలం ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద 587 ఎకరాల భూమిని కేటాయించింది. భూమి అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సంస్థ రూ.13వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా..పరోక్షంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. సియోల్‌ తరువాత ఆ సంస్థకు 2200 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆకర్షణీయమైన ప్లాంటు ఉత్తర అమెరికాలోని జార్జియాలో ఉంది. 2010 ఫిబ్రవరి 26న ఈ ప్లాంటును ప్రారంభించింది. పదివేల మంది ఈ ప్లాంటులో పనిచేస్తున్నారు. ఇప్పుడు అచ్చం అమెరికాలో నిర్మించిన ప్లాంటు నమూనాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో నిర్మిస్తామని కియా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో జార్జియాలో ఉన్న ప్లాంటును పరిశీలించడం కోసం పరిశ్రమలశాఖకు చెందిన అధికారుల బృందం త్వరలోనే అమెరికాకు వెళ్లనుంది.

ఉపఎన్నిక తరువాతే..: కియా పరిశ్రమ భూమి పూజను నంద్యాల ఉప ఎన్నికలు ముగిసిన తరువాత నిర్వహించనున్నారు. వాస్తవానికి ఆగస్టులో ఈ పరిశ్రమకు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం, అటు కియా సంస్థ సన్నాహాలు చేసుకుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో ఆమేరకు వాయిదా పడింది.

అనుబంధ పరిశ్రమలు రాక: కియా పరిశ్రమకు అనుబంధంగా 150 పరిశ్రమలు రానున్నాయి. వీటికి సంబంధించి ఆసంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఈ అనుబంధ పరిశ్రమలన్నీ దక్షిణ కొరియాకు చెందినవే రానున్నట్లు సమాచారం. వాటికి మరో 200 ఎకరాల స్థలం అవసరమవుతుందని భావిస్తున్నారు. ఏపీఐఐసీ ఇప్పటికే ఈ స్థలాన్ని తన వద్ద సిద్ధంగా ఉంచుకుంది.

Link to comment
Share on other sites

కియా మోటార్స్ అనంతపురం ప్లాంట్లో జాబ్ ఓపెనింగ్స్

రిజిస్ట్రేషన్ ఉచితం:-
చేయాలిసినదల్లా మీ resume ని అప్లోడ్ చేయడమే..
వారి అవసరాలకు తగ్గ వారిని ఎంచుకుంటారు..
ఉచితం కాబట్టి అందరూ ప్రయత్నించండి..

ఈ కింద ఉన్న లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అవగలరు...

http://www.kia-motor...dia/Careers.jsp

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...