Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
కియా మోటార్స్‌కు సమన్వయ కమిటీ

ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ‘కియా’ మోటార్స్‌ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం పరంగా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాఋ అధ్యక్షులుగా ఉంటారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథరెడ్డి, పరిశ్రమ ఏర్పాటుతో సంబంధం ఉన్న రెవెన్యూ, పరిశ్రమలు, గనులు, ఏపీఐఐసీ తదితర విభాగాల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కియా మోటార్స్‌ నుంచి ఒక ప్రతినిధి సహా మొత్తం 18 మందితో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కియా కంపెనీ 1.6 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘కియా’ అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా కియా 4 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు, 7 వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనుంది. జూన్‌ నెల నుంచే ప్లాంటు నిర్మాణ పనులు చేయపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రగతిని సమీక్షించడానికి చంద్రబాబు సూచనల మేరకు పరిశ్రమల శాఖ సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది.

Link to comment
Share on other sites

చంద్రబాబును కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు
 
అమరావతి: సీఎం చంద్రబాబును కియా మోటార్స్ ప్రతినిధులు కలిశారు. అనంతపురం జిల్లాలో కియో మోటార్ కార్ల పరిశ్రమకు, భూముల అప్పగింత జూన్ 1 నాటికి పూర్తి కావాలని చంద్రబాబు సూచించారు. 15 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన నీరు, విద్యుత్ సమకూర్చాలన్నారు. త్వరలో ట్రైనింగ్ సెంటర్, టౌన్ షిప్‌ను కియో మోటార్స్ నిర్మించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో కియో మోటార్స్ పేరు నమోదు చేసుకుంది.
Link to comment
Share on other sites

ఏపీలో ‘కియో’ ఏర్పాటుకు కీలక అడుగు!

అమరావతి: ఆంధప్రదేశ్‌లో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రతిష్ఠాత్మక సంస్థ కియో మోటర్స్‌ పనుల పురోగతిపై సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సంస్థ ప్రతినిధులు, అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్ల పరిశ్రమకు అనంతపురం జిల్లాలో భూముల అప్పగింతపై ఆదేశాలిచ్చారు. భూముల అప్పగింత జూన్‌ 1 నాటికి పూర్తికావాలని చెప్పారు. భూమి చదును పనుల కోసం జూన్‌ 1 వరకు గడువు విధించారు. తాత్కాలిక ప్రాతిపదికన నీరు, విద్యుత్‌ 15 రోజుల్లో కియో మోటర్స్‌కు సమకూర్చాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన వేగంగా పూర్తిచేయాలని, పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలస్యం ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కియో మోటర్స్‌ త్వరలో శిక్షణ కేంద్రం, టౌన్‌షిప్‌ను నిర్మించనుంది. మరోవైపు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలో సంస్థ పేరు నమోదైంది.

Link to comment
Share on other sites

జులై చివరి వారంలో ‘కియా’కు కొబ్బరికాయ!

వీలుకాని పక్షంలో ఆగస్టు మొదటి వారం

ఒకటో తేదీకి భూముల అప్పగింత

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అడుగు పెడుతున్న దక్షిణ కొరియా దిగ్గజ కియా కార్ల కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జులై చివరి వారంలో నిర్వహించడానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వీలుకాని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచి వద్ద కియా సంస్థ కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్‌ ఒకటో తేదీకల్లా కియా సంస్థకు భూముల అప్పగింత పూర్తి చేయాలని, భూమి చదును పనులు ఈలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన కియా మోటార్స్‌కు నీరు, విద్యుత్తు సదుపాయాలు కల్పించాలన్నారు. కియా ప్రతినిధులు మాట్లాడుతూ భూమి అప్పగించిన రెండు నెలల్లోపు కంపెనీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఈ కార్ల కంపెనీ కోసం కియా సంస్థ రూ.13వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నాలుగువేల మందికి ప్రత్యక్షంగా, ఏడు వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కమిషనర్‌ సిద్దార్థ జైన్‌, ఏపీఐఐసీ ఎండీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

కియా మోటార్స్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ భేటీ
24-05-2017 18:14:38
అనంతపురం:పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 535 ఎకరాల్లో కొరియా కియా మోటార్స్ ఆధ్వర్యంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుపై కలెక్టరేట్లో కియా మోటార్స్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి. వీరపాండ్యన్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. 13500కోట్లతో కార్ల పరిశ్రమను నిర్వహించబోతున్నట్లు కియా మోటార్స్ ఇంచార్జి ఈశ్వర్ తెలిపారు.సెప్టెంబర్ 2019లోపు ఫ్యాక్టరీ స్థాపించి కార్లను తయారుచేస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ విజయవంతానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం కావాలని ఇంచార్జి ఈశ్వర్ కోరారు. నీరు, విద్యుత్, భూమి, రోడ్స్ తదితర అవసరాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన అధికారులకు వివరించారు. కార్ల పరిశ్రమకు ఏర్పాటుకు పూర్తి సహకారం అందజేస్తామని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ఆ మేరకు జిల్లా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

కార్ల పరిశ్రమకు సహకారం కావాలి

atp-gen5a.jpg

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 535 ఎకరాల్లో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒప్పందం పత్రం తీసుకున్నాం. పరిశ్రమ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకారం కావాలని కంపెనీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌ కోరారు. కియా మోటార్స్‌ కంపెనీ ప్రతినిధుల బృందం బుధవారం జిల్లాకు వచ్చింది. ఉదయం కలెక్టర్‌ వీరపాండియన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తర్వాత కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులకు కార్ల పరిశ్రమపై ఈశ్వర్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. నీరు, విద్యుత్తు సరఫరాతో పాటు రహదారి, వంతెనలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఏడాదిలో పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రూ.13,500 కోట్లతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడం పట్ల కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ఇప్పటికే పరిశ్రమకు భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అన్నివిధాలా తమ సహకారం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జేసీ రమామణి, రెండో జేసీ సయ్యద్‌ఖాజా, పరిశ్రమలశాఖ జీఎం సుదర్శన్‌, ఏపీఐఐసీ జీఎం రఘునాథ్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

రూ.13,500 పెట్టుబడి.. 20వేల మందికి ఉపాధి
 
 
636320990341109520.jpg
అనంతపురం: ప్రతిష్టాత్మక కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు అనంతపురం జిల్లాలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. వేల మందికి ఉఫాధి లభించనుండటంతో జిల్లా అధికారులు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రూ.13వేల 500కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20వేల మందికి ఉపాధి లభించనుంది. కియా కంపెనీ ప్రతినిధులు అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను కలిసి తమకు అవసరమైన మౌలిక వసతుల గురించి చర్చించారు. తాగునీరు, రోడ్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

2019కి కియా కారు!

ఆలోపు పనులన్నీ పూర్తిచేయాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

ఆగస్టు నుంచి నిర్మాణ పనులు

24ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఫిబ్రవరికల్లా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ‘కియా’ కార్ల కంపెనీ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600ఎకరాల విస్తీర్ణంలో ‘కియా’ పరిశ్రమను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఏర్పాట్ల పనులను చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. కియాకు కేటాయించిన స్థలంలో జరుగుతున్న నేల చదును పనులను ఆయన డ్రోన్‌ వీడియోల ద్వారా తిలకించి అధికారులకు సూచనలు చేశారు. జులై నెలాఖరు నాటికి భూమి పనులు పూర్తిచేసి స్థలాన్ని కియాకు అప్పగించాలనుకన్నా, వేగంగా పనులు జరుగుతున్నందున.. జులై 15 నాటికే అవి పూర్తవుతాయని అధికారులు వివరించారు. ఆగస్టు నుంచి కియా సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించవచ్చని తెలిపారు. కియా ప్రతినిధులతో మాట్లాడి ఆ పనులకు సంబంధించి భూమిపూజ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కియా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులన్నీ సకాలంలో అందజేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఆ ప్రాంత అవసరాల దృష్ట్యా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పనులు నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సీఈఓ ఎ.బాబు.. కియా ప్లాంటు పనుల్లో పురోగతిని చంద్రబాబుకు వివరించారు. కియా మోటార్స్‌ కోరినట్లుగా శిక్షణ కేంద్రం, టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం ఒకట్రెండు రోజుల్లో భూమి కేటాయిస్తామని తెలిపారు. కియా పనుల సత్వర పర్యవేక్షణకు వీలుగా ఇంజినీర్లతో ఖైజాలా యాప్‌లో గ్రూపును ఏర్పాటుచేశామన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, అనంతపురం జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

వేగంగా ‘కియ’
 
 
636339557613763089.jpg
  • సత్వర అనుమతులకు సీఎం ఆదేశం
 
అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘కియ’ మోటార్స్‌ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులూ మంజూరు చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో కియ మోటార్స్‌ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురంలో కియకు కేటాయించిన భూముల అప్పగింత ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌తో మాట్లాడారు. కియకు అవసరమైన అన్ని అనుమతులను అనుకున్న సమయాని కన్నా ముందే జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌బాబు.. కియ మోటార్స్‌కు కేటాయించిన భూముల్లో జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకి వివరించారు. కియ మోటార్స్‌ కోరిన విధంగా శిక్షణ కేంద్రం, టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం భూమిని గుర్తించామని బాబు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో కియ మోటార్స్‌కు భూమి కేటాయిస్తామని అన్నారు. కియకు కేటాయించిన భూమిలో జరుగుతున్న పనులను నిరంతరం సమీక్షించేందుకు వీలుగా కైజాలా యాప్‌లో ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...