Jump to content

AP Chief Minister Relief Fund


Recommended Posts

  • 1 month later...
నేడు జ్ఞానసాయికి కాలేయ మార్పిడి ఆపరేషన్
 
636060776615581632.jpg
తిరుపతి: కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయికి నేడు ఆపరేషన్ జరుగనుంది. చిన్నారికి ఆపరేషన్ చేయించే స్థోమత తమకు లేదని మెర్సీడెత్‌కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం చిన్నారి ఆపరేషన్‌ బాధ్యతను తీసుకుంది. ఆపరేషన్‌ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్వయంగా సీఎం చంద్రబాబు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు చిన్నారి జ్ఞానసాయికి వైద్యులు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నారు.
 
చిన్నారికి తండ్రి రమనప్ప కాలేయాన్ని మార్చనున్నారు. రమనప్ప బరువు అధికంగా ఉన్నందున ఆయనను కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బరువు తగ్గిన అనంతరం ఈరోజు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో రమన్నప్పకు ఆపరేషన్ చేస్తున్నారు. 14మంది వైద్యులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. రమనప్ప నుంచి కాలేయాన్ని తీసి దాన్ని ఆయన కుమార్తె జ్ఞానసాయికి పెట్టనున్నారు. ఆపరేషన్‌ నేపథ్యంలో నిన్న చిన్నారి తల్లి, తండ్రి, పెదనానన్నతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆపరేషన్ సవ్యంగా సాగుతుందని చెప్పారు.
Link to comment
Share on other sites

 

నేడు జ్ఞానసాయికి కాలేయ మార్పిడి ఆపరేషన్

 

 

636060776615581632.jpg

 

తిరుపతి: కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయికి నేడు ఆపరేషన్ జరుగనుంది. చిన్నారికి ఆపరేషన్ చేయించే స్థోమత తమకు లేదని మెర్సీడెత్‌కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం చిన్నారి ఆపరేషన్‌ బాధ్యతను తీసుకుంది. ఆపరేషన్‌ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్వయంగా సీఎం చంద్రబాబు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు చిన్నారి జ్ఞానసాయికి వైద్యులు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నారు.

 

చిన్నారికి తండ్రి రమనప్ప కాలేయాన్ని మార్చనున్నారు. రమనప్ప బరువు అధికంగా ఉన్నందున ఆయనను కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బరువు తగ్గిన అనంతరం ఈరోజు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో రమన్నప్పకు ఆపరేషన్ చేస్తున్నారు. 14మంది వైద్యులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. రమనప్ప నుంచి కాలేయాన్ని తీసి దాన్ని ఆయన కుమార్తె జ్ఞానసాయికి పెట్టనున్నారు. ఆపరేషన్‌ నేపథ్యంలో నిన్న చిన్నారి తల్లి, తండ్రి, పెదనానన్నతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆపరేషన్ సవ్యంగా సాగుతుందని చెప్పారు.

Ah papa valla father and that little one, iddaru chakkaga kolukoni.... Post operation issues emi lekunda happy ga undali
Link to comment
Share on other sites

 ప్రభుత్వం తరఫునే పాపకు ఆపరేషన్ సహా తర్వాత అయ్యే మందుల ఖర్చునూ భరిస్తామని ఆయన అప్పట్లోనే ప్రకటించి.. ఇటు పాపకి - అటు ఆమె తల్లిదండ్రులు ప్రాణాలు పోశారు. ఇచ్చిన హామీ మేరకు పాపకు వైద్యం చేయించే బాధ్యతను ఆయన ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు - అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 9 గంటలకు జ్ఞానసాయికి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఇక్కడ.. హృదయాన్ని కదిలించే మరో సంఘటన కూడా ఉంది. కూతురుకు అవసరమైన కాలేయాన్ని.. ఆమె తండ్రే దానం చేశారు. మొత్తం 14 మంది వైద్యులు దాదాపు 9 గంటలపాటు శ్రమించి  ఆపరేషన్ పూర్తి చేశారు.

 ప్రస్తుతం తండ్రీ కూతుళ్ల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రి చైర్మన రవీంద్రనాథ్ - వైద్య నిపుణుడు మహ్మద్ రేలాలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రకటించారు. పాపతో పాటు రమణప్ప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పాప జీవితాంతం మందులు వాడాల్సి ఉందన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం గతంలోనే హామీ ఇచ్చారు. పాపకు అవసరమయ్యే మందులను ప్రభుత్వమే సమకూరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

recently heard about my colleague fried's mother suffering from liver cancer which costs approx 40 lakhs and liver to be transplanted. Asked him to try contacting Telanagana cmo and Basavatarakam cancer hospital

ayyo papam kakaothe Basavatarakam cancer hospital lo avi cheyyaleru anukunta bro,Global hospital, Asian Institute of Gastroenterology chestharu anukunta.

Link to comment
Share on other sites

కోలుకున్న జ్ఞానసాయి
 
  • జనరల్‌ వార్డుకు తరలింపు
  • మరో పది రోజుల్లో డిశ్చార్జ్‌
చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాలేయ వ్యాధితో బాధపడుతూ గ్లోబల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన 9 నెలల చిన్నారి జ్ఞానసాయి త్వరత్వరగా కోలుకుంటోంది. ఆమెను, ఆమెకు కాలేయం దానం చేసిన తండ్రి రమణప్పను వైద్యులు గురువారం జనరల్‌ వార్డుకు తరలించారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయి వైద్యం కోసం తమ తాహతుకు మించి ఖర్చు చేసిన రమణప్ప దంపతులు తమ బిడ్డ కారుణ్య మృతికి అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమెకు సాయం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సాయంతో గ్లోబల్‌ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. జ్ఞానసాయి తండ్రి రమణప్ప కాలేయంలో 25 శాతం తీసి ఆమెకు అమర్చారు. శస్త్ర చికిత్స అనంతరం వారిద్దరినీ ఐసీయూలో పెట్టారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కోలుకోవడంతో గురువారం జనరల్‌ వార్డుకు మార్చారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, మరో పది రోజుల్లో డిశ్చార్జ్‌ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

Watch the heart-rendering journey of 9-month-old Gnana Sai and her parents who battled all odds to earn a new lease of life with liver transplantation. The sequence of events unfold from the beleaguered couple approaching the local court requesting Euthanasia (mercy killing) for Gnana Sai to CBN’s intervention leading to the successful liver transplantation surgery that saved the child from certain death.

Link to comment
Share on other sites

  • 1 month later...
 
636117429007374068.jpg
  • తిరుపతి ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంలో జ్ఞానసాయి తొలి జన్మదిన వేడుకలు 
తిరుపతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కాలేయవ్యాధితో బాధపడుతూ మృత్యుముఖానికి వెళ్లిన చిన్నారి జ్ఞానసాయికి అక్షరంతో ఆయువు పోసిన ‘ఆంధ్రజ్యోతి’కి ఆ పాప తల్లిదండ్రులు హృద్యంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిందిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఒడిలోనే పాప తొలి జన్మదిన వేడుకలు జరిపారు. ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది సమక్షంలో.. పాపతో కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే చేశారు.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన జల్లా రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేది. ఆ వ్యాధికి చికిత్స చేయించే స్థోమత ఆ చిన్నారి తల్లిదండ్రులకు లేకపోవడంతో కారుణ్యమరణానికి తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించారు. దీనిపై ‘ఆంధజ్యోతి-ఏబీఎన్‌’లో వార్తాకథనాలు రావడంతో స్పందించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున జ్ఞానసాయికి శస్త్ర చికిత్స చేయిస్తామని ప్రకటించారు. స్వయంగా జ్ఞానసాయి తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో భరోసా నింపారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన దేశ విదేశాల్లోని ఎందరో మానవతామూర్తులు ఆ పాపను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, తంబళ్లపల్లె శాసనసభ్యుడు శంకర్‌ ఆ చిన్నారిని చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. జ్ఞానసాయికి తండ్రి రమణప్ప కాలేయం సరిపోలడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. సోమవారం తొలి పుట్టినరోజు కావడంతో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుపతి ‘ఆంధ్రజ్యోతి’ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ‘ఆంధ్రజ్యోతి’లో తమ బిడ్డ దయనీయ కథనం ప్రచురితమైన కొన్ని గంటల నుంచే తమను కమ్ముకున్న చీకట్లు మాయవడం మొదలయ్యాయని సరస్వతి, రమణప్ప అన్నారు.
Link to comment
Share on other sites

నేడు చెన్నై ఆస్పత్రి నుంచి చిన్నారి జ్ఞానసాయి డిశ్చార్జ్
 
636123930247423635.jpg
చెన్నై: కాలేయ వ్యాధితో బాధపడి ఏపీ ప్రభుత్వ సాయంతో శస్త్రచికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న చిన్నారి జ్ఞానసాయి ఈరోజు ఇవాళ చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానుంది. జ్ఞానసాయిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు టీడీపీ నేత శ్రీరాములు నాయుడును ఏపీ ప్రభుత్వం చెన్నైకి పంపించింది. ఇప్పటికే చిన్నారి ఆరోగ్యంపై సీఎం కార్యదర్శి గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులతోనూ మాట్లాడారు. చిన్నారికి కాలేయం ఇచ్చిన తండ్రి ఆరోగ్యం కూడా బాగుందని ఈ సందర్బంగా చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.
 
కాలేయ వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారికి మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ చిన్నారి తల్లిదండ్రులు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ ఉందతాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు జ్ఞానసాయి వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు చిన్నారి జ్ఞానసాయి వైద్యం కోసం రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది.
Link to comment
Share on other sites

జ్ఞానసాయికి సంపూర్ణ ఆరోగ్యం
 
636124397634403752.jpg
  •  సొంతూరుకి పయనం.. 
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో స్పందించిన సీఎం 
చెన్నై, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలై, కాలేయమార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న చిత్తూరు జిల్లా చిన్నారి జ్ఞానసాయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. పూర్తిస్థాయిలో కోలుకున్న ఆమె బుధవారం తన తల్లిదండ్రులు సరస్వతి, రమణప్పలతో కలిసి సొంతూరుకి చేరుకోనుంది. ఏపీ టీడీపీ మీడియా ప్రతినిధి శ్రీరాములునాయుడు హైదరాబాద్‌ నుండి వచ్చి, జ్ఞానసాయిని, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. వారు స్వగ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. జ్ఞానసాయి చికిత్సకి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వ్యయమైందని, ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే చెల్లించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జ్ఞానసాయి కోలుకున్నా జీవితాంతం మందులు వాడాల్సి వుంటుందని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు విలువైనమందులు వాడా ల్సి వుంటుంది. కాగా జ్ఞానసాయికి కాలేయ దానం చేసిన ఆమె తండ్రి రమణప్ప కూడా కోలుకున్నారు. రమణప్ప-సరస్వతి దంపతులు కాలేయ వ్యాధితో బాధపడుతున్న తమ 8 నెలల పసిబిడ్డ జ్ఞానసాయికి ఆపరేషన చేయించే స్థోమత లేకపోవడంతో... కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ఈ ఏడాది జూనలో చిత్తూరులో స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ‘ఏబీఎన-ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేసిన కథనాలతో స్పందించిన చంద్రబాబు ప్రభుత్వమే జ్ఞానసాయి ఆపరేషనకి అవసరమైన ఖర్చులు భరిస్తుందని ప్రకటించారు. చిన్నారికి వైద్యం చేసేందుకు గ్లోబల్‌ ఆసుపత్రి ముందుకొచ్చింది. జూలైలో జ్ఞానసాయిని చెన్నై పెరుంబాక్కంలోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తండ్రి రమణప్ప కాలేయ దానం చేయడంతో ఆగస్టు 6వ తేదీన చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
 
చంద్రబాబుకు కృతజ్ఞతలు: రమణప్ప, సరస్వతి
తమ బిడ్డను రక్షించేందుకు చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి జ్ఞానసాయి తల్లిదండ్రులు సరస్వతి, రమణప్ప కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ‘సీఎం చంద్రబాబు ఎంతో సాయం చేశారు. మా కృతజ్ఞతలు. చెన్నైకి పుట్టెడు దుఃఖంతో వచ్చాం. ఇప్పుడు పట్టరాని సంతోషంతో వెళ్తున్నాం’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

  • 8 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...