Jump to content

జ్ఞానసాయి గుర్తుందా మీకు?


Recommended Posts

మెర్సి కిల్లింగ్ నుంచి బయటపడి.. చావుని జయించిన ఈ చిన్నారి గుర్తుందా?
636339022100376840.jpg
ఆంధ్రజ్యోతి: జ్ఞానసాయి గుర్తుందా మీకు? సరిగ్గా ఏడాది క్రితం వార్తలో వ్యక్తిగా నిలిచింది ఆ చిన్నారి. అంతేకాదు.. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న 9నెలల చిన్నారిని బతికించుకునే స్థోమత లేదంటూ అప్పట్లో పాప తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని కోర్టుని కోరారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆ తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి తెలియజేసింది. కేవలం డబ్బు లేకపోవడం ఓ చిన్నారి పాలిట ఎలా శాపమైందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
 
 
ఫలితంగా ఏపీ సీఎం చంద్రబాబు మొదలు.. యంత్రాంగం మొత్తం స్పందించింది. చెన్నై గ్లోబల్ హాస్పిటల్‌లో సుమారు 6నెలల క్రితం జ్ఞానసాయికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత తిరుపతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో జ్ఞానసాయి మొదటి పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆ చిన్నారి కోలుకోవాలని ఎంతో మంది ఆకాంక్షించారు. మీరందించిన సాయంతో పాప హ్యాపీగా.. క్షేమంగా ఉంది చూడండి అంటూ పాపతో ఏబీఎన్ స్టూడియోకు చిత్తూరు నుంచి వచ్చారు.

 

Link to comment
Share on other sites

బీఎన్‌లో కథనాల వల్లే పాపను కాపాడగలిగాం: కామినేని
24-06-2017 10:27:35

 
636338970418285668.jpg
అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాల వల్లే చిన్నారి జ్ఞానసాయిని కాపాడగలిగామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ... జ్ఞానసాయి పరిస్థితిని ఏబీఎన్ వెలుగులోకి తీసుకువచ్చారని, ఇందుకు వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఇలాంటి వాటిని మీడియా వెలుగులోకి తీసుకురావాలన్నారు. అలాగే చిన్నారి జ్ఞానసాయిని కాపాడే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం అని మంత్రి పేర్కొన్నారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...