sonykongara Posted May 24, 2018 Author Posted May 24, 2018 తల్లిదండ్రులను కోల్పోయిన ఐదుగురు బాలికలకు అండగా సీఎం24-05-2018 16:20:26 అమరావతి: తల్లిదండ్రులను కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బాలికలు సీఎం చంద్రబాబును కలిశారు. బాలికల పరిస్థితి చూసి సీఎం చలించిపోయారు. ఈ ఐదుగురు బాలికలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కొక్కరి పేరుమీద రూ. 50 వేల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన బాలికల తల్లి క్యాన్సర్‌తో, తండ్రి పాముకాటుతో మృతి చెందారు.
sonykongara Posted June 7, 2018 Author Posted June 7, 2018 చంద్రబాబే మా బిడ్డను బతికించారు’07-06-2018 10:20:50 గుంటూరు: ‘‘మా బిడ్డ బతుకుతుందని మేము అనుకోలేదు.. మాబోటి చిన్నోళ్లకు పెద్ద రోగాలొస్తే చచ్చి పోవాల్సిందేనని అనుకున్నాం.. కానీ మీ రూపంలో(ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు) దేవుడు మమ్మల్ని కరుణించాడు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన రూ.15 లక్షలతో మా పాప ఆపరేషన్ పూర్తయింది. చంద్రబాబే మా బిడ్డను బతికించారు’’ అని పిడుగురాళ్ల పట్టణానికి కురెళ్ల శ్రీను, రాధిక దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీను, రాధికల కుమార్తె రమ్య(8) కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు అంత స్థోమత లేదని శ్రీను దంపతులు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును సంప్రదించారు. బాలిక దుస్థితిని చూసి చలించిన యరపతినేని బాధితులను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి రూ.15 లక్షలు మంజూరు చేయించారు. సీఎం ఆర్థిక సాయంతో రమ్యకు ఆపరేషన్ చేయించారు. రమ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదుటపడింది. బుధవారం పిడుగురాళ్లలోని ఎమ్మెల్యే యరపతినేని కార్యాలయానికి వచ్చిన శ్రీను దంపతులు మర్చిపోలేని సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
sonykongara Posted June 24, 2018 Author Posted June 24, 2018 32 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నా, ఇక మీరే ఆదుకోవాలి సార్ అంటున్న, ఆ తండ్రి వేదనకు, చలించిపోయిన సియం... Super User 24 June 2018 Hits: 85 అరుదైన నరాల బలహీనతతో బాధపడుతున్న రోగి చికిత్సకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు రోగి అజయ్ కుమార్ ను అతని తల్లిదండ్రులు తీసుకొచ్చి కుమారుడి సమస్యను వివరించారు. అజయ్ కుమార్ ను వేధిస్తున్న తీవ్రమైన నరాల రోగ నివారణ ప్రక్రియలో చికిత్సకు అవసరమైన ఖర్చును మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారతను చాటుకున్నారు. అనంతపురం పట్టణంలోని వేణుగోపాల నగర్ కు చెందిన ఎన్నికపాటి శ్రీరాములు కుమారుడు అజయ్ కుమార్ చిన్నవయసులో బ్రైన్ ఫీవర్ మూలంగా తీవ్రమైన నరాల జబ్బున పడ్డాడు. 32 ఏళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, కుడి చేయి మెలితిరిగి ఉండటం, మెడవాపు, బస్సు హారన్ శబ్దానికి నోటి నుంచి నాలుక బయటకు రావడం వంటి పలు ఇబ్బందులతో అజయ్ కుమార్ సతమతమవుతున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. నిద్రలోనూ ఉలిక్కపడి లేస్తూ అరుస్తూ మెలితిరిగి పోతూ శారీరక ఇబ్బందులతో బాధ పడుతున్నాడని వివరించారు. పిండిమర నడుపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న తనకు కుమారుడి చికిత్సకు ఖర్చు తలకుమించిన భారమైందని శ్రీరాములు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాడు. బెంగుళూరులో యాస్తర్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ రవి గోపాల్ వర్మ వద్ద అజయ్ కుమార్ వైద్య చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. విదేశాల ఉంచి తెప్పించి గుండె వద్ద యంత్రాన్ని అమరిస్తే మెలి తిరిగిన చేయి సాఫుగా వస్తుందని క్రమంగా రోగి కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. వైద్యచికిత్సకు రూ.17 లక్షల ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు వద్ద తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. ఇన్నాళ్ళూ పేదరికంలోనూ కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఉన్నంతలో చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. అజయ్ కుమార్ అనారోగ్యం గురించి సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ స్పందించి రూ. 15 లక్షలు మంజూరు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
sonykongara Posted July 4, 2018 Author Posted July 4, 2018 పవన్ మనుషులకు, చంద్రబాబు చేసిన సహాయం చూసారా ? Super User 04 July 2018 Hits: 43 నాలుగేళ్ళు చంద్రబాబు శభాష్ అంటూ, గత మార్చ్ నుంచి ఉన్నట్టు ఉండి, చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే, ఏ ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీరబాబుకు కిడ్నీ అత్యవసర ఆపరేషన్‌కు బడేటి ట్రస్టు ద్వారా రూ.5లక్షల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. మరో రూ.3లక్షలు సీఎం సహాయనిధి నుంచి అందించేందుకు హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వీరబాబు చికిత్సకు రూ.8లక్షలు ఖర్చు అవుతుందని, తమ ట్రస్టు ద్వారా రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ నుంచి మరో రూ.3లక్షలు అందించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... మానవీయ స్పందనలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఎవరైనా వైద్యానికి ఆర్థిక సాయం కోసం వచ్చినప్పుడు వారి పరిస్థితిని ఆరా తీసి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తం అన్నది రాస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో సుమారు 50వేల మందికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందించారు. వైద్య అవసరాలను బట్టి రూ.20వేల నుంచి రూ.20లక్షల పైవరకు సాయం మంజూరు చేశారు. ఇప్పటికి రూ.370కోట్లను అందించారు. గత ప్రభుత్వ హయాంలో 2009నుంచి 2012వరకు నాలుగేళ్లలో సుమారు 26వేల మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.127కోట్లు సహాయం అందింది. అదికూడా... సమైక్యాంధ్రలోని 23 జిల్లాలకు కలిపి. కానీ, ఈ మూడేళ్లలో 13జిల్లాల ఏపీకే 50వేల మందికి రూ.370కోట్ల సాయం చేశారు. గతంతో పోలిస్తే ఇది ఐదారు రెట్ల కంటే ఎక్కువ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడాలి కాబట్టి విమర్శించి చేతులు దులుపుకోవటం కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి... విమర్శలు హేతుబద్ధంగా ఉంటే, అందరికీ ఉపయోగం ఉంటుంది...
sonykongara Posted July 7, 2018 Author Posted July 7, 2018 హృద్రోగ బాలికకు సీఎం 3.5లక్షల సాయం07-07-2018 03:25:06 అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన చిన్నారి జోషికకు ముఖ్యమంత్రి రూ.3.50లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. చిత్తూరు జిల్లా కొత్తపల్లికి మంజుల, అశోక్‌బాబు దంపతులు కుమార్తె జోషికతో శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి సమస్యను విన్నవించగా సీఎం ఆర్థికసాయం ప్రకటించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now