Jump to content

Godavari- krishna-pennar rivers interlink study

Recommended Posts

చెన్నైకి పోలవరం జలాలు
21-11-2017 01:00:53

    సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చంద్రబాబుకు గడ్కరీ సూచన
    సర్వేకు సిద్ధమైన రాష్ట్రప్రభుత్వం
    వాప్కోస్‌కే ఈ బాధ్యతా అప్పగింత

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధాన ప్రక్రియలో మరో ఘట్టం.. గోదావరి జలాలను పోలవరం నుంచి పెన్నా నది ద్వారా తమిళనాడుకు.. పెన్నా ద్వారా పంపేందుకు ఆస్కారం ఉందేమో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ ఆలోచనకు పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత నెలలో నాగపూర్‌లో గడ్కరీని సీఎం కలిసిన సంగతి తెలిసిందే. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలోకి పంపుతూ నదుల అనుసంధానానికి కార్యరూపం ఇచ్చామని చంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.
 
ఇప్పుడు గోదావరి- పెన్నా నదుల అనుసంధానానికి కూడా సిద్ధమవుతున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ సర్వేను చేపడుతోందని తెలిపారు. గోదావరి - పెన్నా అనుసంధాన ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల దాకా ఖర్చవుతుందన్నది అంచనాగా పేర్కొన్నారు. నదుల అనుసంధానం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమైనందున గోదావరి-పెన్నా అనుసంధాన పథకానికి కేంద్ర జల వనరులశాఖ నిధులివ్వాలని గడ్కరీని కోరారు.
 
దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. పోలవరం ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు గోదావరి జలాలను తీసుకెళ్లే అవకాశం ఉందేమో పరిశీలించాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో పోలవరం నుంచి పెన్నా నదికి.. అక్కడి నుంచి తమిళనాడుకు గోదావరి జలాల తరలింపుపై వాప్కోస్‌ ద్వారానే సర్వే చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదే విషయాన్ని సోమవారం నాటి పోలవరం ప్రాజెక్టు సమీక్షలో ఆయన వెల్లడించారు.
 
వచ్చే వారం సమీక్షకు ప్రాథమిక అంచనాలతో రావాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా.. ప్రస్తుతం శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఏపీ మంచినీరు సరఫరా చేస్తోంది. పోలవరం-పెన్నా-తమిళనాడు పథకం అమల్లోకి వస్తే.. చెన్నైకి కృష్ణా జలాలను తరలించాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మహానది-గోదావరి అనుసంధానంపై కేంద్రం ఒక నిర్ణయానికి రాకుండానే.. పోలవరం-పెన్నా-తమిళనాడు పథకానికి ఆమోద ముద్ర వేస్తుందా అనేది సందేహమేనని జల వనరులశాఖ ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి.

Link to post
Share on other sites
 • Replies 321
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Mundu NS Right canal farmers ki pattiseema water ela supply cheyyochho choodochhu kada, Penna ki linking ante it will take lot of time. Ippatlo start ayye project kaadu probably next term CBN vasthe s

ippudunna paristhithullo center mida depend avvatam waste - state ye ela gola, mana intra state irrigation projects ni oka dariloki thesthe (stabilize without dependencies) manchidi. asalu Nov-de

Somebody in central govt quite rattled by AP's intent to link pola-penna  Godavari-penna link must be 100% in AP territory. Zero leverage to T

Posted Images

‘జల రవాణా’ పటిష్టతకు కమిటీ
21-11-2017 01:01:24

    దేశ, విదేశాల్లోని వ్యవస్థలపై అధ్యయనం

కృష్ణా నదిలో పడవ ప్రమాదం నేపథ్యంలో.. రాష్ట్రంలో అంతర్గత జల రవాణా వ్యవస్థను గాడిలో పెట్డడంతో పాటు, ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అంతర్గత జల రవాణాను ప్రోత్సహించాలంటే పటిష్ట వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జల వనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థ బలోపేతానికి అవసరమైన చర్యలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కె.దుర్గా ప్రసాద్‌, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీరు వైఎస్‌ సుధాకర్‌లతో కమిటీని నియమిస్తూ సోమవారం జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ కమిటీ 3 నెలల్లో జాతీయ, అంతర్జాతీయ జల రవాణా వ్యవస్థలను అధ్యయనం చేసి, అందులో అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సూచనలు చేయాలి. ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, వాటర్‌ స్పోర్ట్స్‌ను కూడా ప్రోత్సహించేలా ఉత్తమ విధానం రూపొందించాలి. రిజిస్ట్రేషన్‌, లైసెన్సింగ్‌, రెగ్యులేషన్‌, భద్రత తదితర అంశాలపై సూచనలు చేయాలి.

Link to post
Share on other sites

తమిళనాడుకు గోదావరి
24-11-2017 00:55:45

    సోమశిల ద్వారా కావేరీతో అనుసంధానం
    90 శాతం ఖర్చు కేంద్రానిదే!
    త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
    చెన్నైలో ప్రకటించిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ

చెన్నై, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి నీళ్లు తమిళనాడుకు తీసుకెళ్తామని చెప్పారు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ఇందుకోసం గోదావరిని కావేరీ నదితో అనుసంధానిస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గురువారం చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ... తమిళనాడులాంటి దక్షిణాది రాష్ట్రాలు అధికంగా రుతుపవనాలపై ఆధారపడ్డాయని, వర్షాలు కురవకపోతే సాగు, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రతి యేడాది గోదావరి నుంచి సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతోందన్నారు.
 
దీనిపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం ఈ నీటిని దక్షిణాది రాష్ట్రాలకు తరలించే బృహత్తర పథకాన్ని చేపట్టనుందన్నారు. ఈ పథకంలో గోదావరి నీటిని కృష్ణ -పెన్నా నదుల మీదుగా కావేరికి తరలిస్తామని తెలిపారు. ఈ పథకం తొలివిడతలో భాగంగా గోదావరి నుంచి 300 టీఎంసీల నీటిని పోలవరం డ్యాం మీదుగా నాగార్జునసాగర్‌ డ్యాంకు, అక్కడి నుంచి కృష్ణా నదికి తరలిస్తామన్నారు. అనంతరం సోమశిల- పెన్నానది మీదుగా కావేరి నదికి తరలిస్తామన్నారు. ఈ పథకం అమలైతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అదనంగా 100 టీఎంసీల నీటిని పొందే అవకాశముందన్నారు. రెండవ దశలో ఇంద్రావతి నది నీటిని నాగార్జుసాగర్‌ డ్యాంకు, అక్కడి నుంచి సోమశిల మీదుగా కావేరి నదికి (కర్ణాటకతో అనుసంధానం కాకుండా) తరలిస్తామన్నారు.
 
నీటి తరలింపు కోసం స్టీలు పైపులు, కెనాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకానికి 90 శాతం నిధులను కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి సూచనలు, సలహాలతో పథకానికి తుదిరూపం ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. చెన్నై వచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. రోడ్డురవాణా, జలవనరుల శాఖ అభివృద్ధి పనులను వారు సమీక్షించారు.

Link to post
Share on other sites
 • 3 weeks later...
On 11/24/2017 at 7:39 AM, sonykongara said:

I guess it is to capture the vaccuume due to Jaya’s demise - nothing is going to happen - eee bokkalo Gadidakaari gaadu maatlaadithey 7 lakhs crores projects handle chesthunnaa antaadu - vaati % of completion and targeted dates to complete them yeppudannaa cheppaadaa Guj ki bullet train ki ye budget lo petti yenni rojulu discuss chesi approve chesaarooo cheppa manandi - thoo eeelluuu eella Kuhana jaatheeya vaadulu

Link to post
Share on other sites

Ee interlinking ki time spend cheyyadam waste unless Babu Garu is alergitic to family time - antha gaa kaavaali antey let them do the work - if anything is going to happen then Babu will chip in and help in land pooling etc etc ... polavaram nethiki ethukoni paduthunna maatalu chaalu

Link to post
Share on other sites
మహాసంగమానికి ముందడుగు..
పూర్తయిన గోదావరి - పెన్నా వ్యాప్కోస్‌ లైడార్‌ సర్వే
మూడ్రోజుల్లో సమగ్ర భౌగోళిక సమాచారం అందుబాటులోకి
వివిధ ప్రత్యామ్నాయాలతో నివేదికలు
22న ముఖ్యమంత్రికి నివేదన
ఈనాడు - అమరావతి

గోదావరి - పెన్నా మహా అనుసంధానానికి ముందడుగు పడుతోంది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 23న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ ప్రతిపాదనలు తయారు చేయడంతో పాటు గోదావరి వరద జలాలను కావేరి వరకు తీసుకెళ్లడానికి ఉన్న అవకాశాలపైనా నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలిస్తారు. ఆయన సూచించిన మార్పులతో తిరిగి 23న కేంద్ర మంత్రి గడ్కరీకి పూర్తి స్థాయి ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సయితం నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యం, కేంద్ర మంత్రి గడ్కరీ సయితం గోదావరి నుంచి పెన్నార్‌ పాలార్‌, గ్రాండ్‌  ఆనకట్ట నుంచి కావేరి వరకు అనుసంధానానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో తక్షణం రంగంలోకి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి... జలవనరులశాఖ అధికారులు, వ్యాప్కోస్‌ ప్రతినిధులతో ఈ అంశంపై రెండు గంటలపాటు చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ దీనిపై ఇప్పటికే ప్రాథమికంగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వర్షాకాలానికి ముందే గోదావరి నుంచి కృష్ణా వరకు ఉన్న పరిస్థితులపై లైడార్‌ సర్వే పూర్తి చేసింది. ఆ తర్వాత కేంద్ర రక్షణశాఖ కొంతకాలం సర్వేను నిలుపుదల చేయమనడంతో మధ్యలో ఆగింది. ఆ తర్వాత తిరిగి కృష్ణా నది నుంచి పెన్నా వరకు సర్వే పూర్తి చేసింది. ప్రస్తుతం భూభౌతిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం, కాంటూర్లు, లెవిల్స్‌ వంటివన్నీ మరో 3 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సమాచారం ఆధారంగా సాఫ్ట్‌ ప్రతులతో వివిధ ప్రత్యామ్నాయాలు రూపొందించుకుని ఒక సమగ్ర అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

* ముందు అందుబాటులో ఉన్న కాలువలు, జలాశయాలను వినియోగించుకుంటూ ఎత్తిపోతలు ఏర్పాటు చేసి ఎంతవరకు పెన్నాకు నీటిని తరలించవచ్చో ఆలోచించాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటినే వినియోగించుకుని తొలిదశలో ఖర్చు తగ్గేలా ఫలితం వచ్చేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. గోదావరి పెన్నా సంగమం పూర్తయితే రాష్ట్రంలో 1500 టీఎంసీల నిల్వకు అవకాశం ఉందన్నారు.

* వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి రూ.3278 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు చెప్పారు. మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయవచ్చన్నారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యాప్కోస్‌ ప్రతినిధులు సమర్పించిన వివరాలు ఇవీ...
కాలువల పొడవు:  701 కి.మీ.
అంచనా వ్యయం:  రూ.80వేల కోట్లు
జలాల మళ్లింపు:   320 టీఎంసీలు
విద్యుత్తు:         3625 మెగావాట్లు అవసరం
భూసేకరణ:       32వేల ఎకరాలు
అటవీభూమి:      7 వేల ఎకరాలు
రెండు సొరంగాలు, బొల్లాపల్లి జలాశయం

Link to post
Share on other sites

@swarnandhra  it is better to ignore the andhrajyothy in this forum .  andhrajyothy always look for sensation . that paper is suitable politicial analysis, highlighting useless issues. even tv9, ntv, tv5,sakshi also like that. their main focus is to grab attention, getting trp ratings. in the current days etv/eendadu will give complete picture without any twists or turns. it is better to wait till eenadu give article with complete details. 

Link to post
Share on other sites
12 minutes ago, ravindras said:

yup

Link to post
Share on other sites
మహా యజ్ఞంపై మెలిక
19-12-2017 02:14:55
 
 • నదీ సంధానంపై కేంద్రం కొత్త ప్రతిపాదన
 • కాళేశ్వరం నుంచి కావేరీ వరకు ‘సంగమం’
 • స్టాక్‌ పాయింట్‌గా నాగార్జున సాగర్‌
 • కాళేశ్వరం చేర్చడంపై ఏపీ అభ్యంతరాలు
 • గోదావరి- కావేరీపై సీఎం సానుకూలత
 • రాష్ట్రానికి వచ్చిన తమిళనాడు అధికారులు
 • నేడు సంధానంపై చర్చలు
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల మహా సంగమ ప్రాజెక్టుపై కేంద్రం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో గోదావరి జలాలను పెన్నా నది వరకు తీసుకెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన కాగా... దీనిని కావేరీ వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. తాజాగా... తెలంగాణలోని కాళేశ్వరాన్ని కూడా జతచేర్చి... అక్కడి నుంచి కావేరీ వరకు మహా సంగమం ప్రాజెక్టు చేపట్టాలంటూ కొత్త మెలిక పెట్టింది.
 
గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమం అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానం కిందకు రాదని, తమిళనాడునూ కలుపుకోవాలన్నది తొలి ప్రతిపాదన. రూ.90 వేల కోట్ల దాకా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులను మంజూరు చేసే అవకాశం ఉన్నందున రాష్ట్రం సుముఖత తెలిపింది. అయితే, తాజాగా కాళేశ్వరాన్ని కూడా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగు నీటిని అందిస్తున్నందున కావేరీ దాకా గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకువెళ్లడంపై దృష్టి సారించి డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో కేంద్రం మరో మెలిక పెట్టింది.
 
తెలంగాణనూ కలుపుకోండి
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు, సాగర్‌ నుంచి సోమశిలకు, సోమశిల నుంచి కావేరీకి నదుల అనుసంధానం చేయాలంటూ తాజాగా గడ్కరీ ప్రతిపాదించారు. గోదావరి (కాళేశ్వరం), కృష్ణా (నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరీ నదులను అనుసంధానం చేయడం ద్వారా 100 టీఎంసీల నీటిని బదలాయించేలా కార్యచరణను సిద్ధం చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సాగర్‌లోకి పంపి నిల్వ చేసిన వెంటనే కృష్ణా జలాలపై వాటాను కోల్పోతామని ఏపీ జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లోని వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు.
 
తమిళనాడు అధికారుల రాక
గోదావరి - పెన్నా - కావేరీ అనుసంధాన ప్రక్రియపై ఏపీ అధికారులతో చర్చించేందుకు తమిళనాడు జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఓ బృందం సోమవారం విజయవాడకు వచ్చింది. ఈ బృందం మంగళవారం రాష్ట్ర జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌తో సమావేశమై కావేరీ దాకా గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుపై సమీక్షించనుంది. ఈ చర్చలలో పురోగతి ఉంటే భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు ఏపీ - తమిళనాడు మధ్య జరిగే వీలుందని అధికార వర్గాలు వివరించాయి.
Link to post
Share on other sites

Mundu , ee kinda vatiki every season lo time ki oka sari ayina water vatchetatlu choosthe - ade padi velu. Tarvatha, link lu gurinchi alochincha vatchu

- Sagar RMC

- Sagar LMC - tail end in Krishna dt ( Chintalapudi lift)

- Veligonda

Link to post
Share on other sites
8 minutes ago, rk09 said:

Mundu , ee kinda vatiki every season lo time ki oka sari ayina water vatchetatlu choosthe - ade padi velu. Tarvatha, link lu gurinchi alochincha vatchu

- Sagar RMC

- Sagar LMC - tail end in Krishna dt ( Chintalapudi lift)

- Veligonda

pushpams debba vesaru already adi saramsam.....CBN plan was to give NSP RIGHT water at the earliest and then finish 200 TMC reservoir parallel.....

Edited by AnnaGaru
Link to post
Share on other sites
2 minutes ago, AnnaGaru said:

pushpams debba vesaru already adi saramsam.....CBN plan was to give NSP RIGHT water at the earliest and then finish 200 TMC reservoir parallel.....

ippudunna paristhithullo center mida depend avvatam waste - state ye ela gola, mana intra state irrigation projects ni oka dariloki thesthe (stabilize without dependencies) manchidi.

asalu Nov-dec lone driking water, gaddi kosam ante too  much (especially palnadu area this year)

Link to post
Share on other sites
1 hour ago, AbbaiG said:

Somebody in central govt quite rattled by AP's intent to link pola-penna :mellow:

Godavari-penna link must be 100% in AP territory. Zero leverage to T

for that state have to bear entire funding. problem in ap is even with deficit budget we have to spend lot of money on welfare, capital construction, caste based corporations, unemployment benefit,amaravathi outer ring road, rythu runamafi,dwakra mafi, unviable metro rail for vijayawada and visakhapatnam cities, raising(doubling) salaries to government employees. our state government have to please all sections of people and ever increasing demands. 

Link to post
Share on other sites

అనుసంధానంపై అత్యున్నత భేటీ 

జనవరిలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం! 

గోదావరి-కావేరి అనుసంధాన తాజా ప్రతిపాదనపై చర్చ 

నాలుగు రాష్ట్రాల అభిప్రాయం కోరిన జాతీయ జల అభివృద్ధి సంస్థ 

ఈనాడు, అమరావతి: గోదావరి వరద నీటిని తమిళనాడులోని కావేరి నదికి అనుసంధానించేందుకు వీలుగా జాతీయ జల అభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన తాజా ప్రతిపాదనపై చర్చించేందుకు కేంద్రం జనవరిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనుంది.ఈ ప్రతిపాదనను జాతీయ ప్రాజెక్టుగా పట్టాలు ఎక్కించేందుకు ఆసక్తి చూపుతున్న కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. జాతీయ జల అభివృద్ధి సంస్థ అధికారులు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ప్రతిపాదన పూర్తి పాఠాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ పంపుతోంది. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలిపాక ఈ ప్రాజెక్టుపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దిల్లీకి పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తారు.

* తెలంగాణలోని ఖమ్మం జిల్లా  అకినేపల్లి వద్ద 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. అక్కడినుంచి నాగార్జునసాగర్‌, సోమశిల, పాలార్‌, కావేరి వరకు ఈ అనుసంధానం ఉంటుంది. 

* కాళేశ్వరం దిగువన 500 టీఎంసీలకుపైగా వరద జలాలు అందుబాటులో ఉన్నాయని లెక్కిస్తూ ఇందులోని 247 టీఎంసీలు ఈ ప్రతిపాదనలో వివిధ రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం ఉంది. 

* ఇందులో తెలంగాణ 102 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ 55 టీఎంసీలు, తమిళనాడు 90 టీఎంసీలు వినియోగించుకునేందుకు వీలుంటుంది. 140 వరద రోజుల్లోనే ఈ నీటిని తీసుకోవాలనేది ఆలోచన. 

* అకినేపల్లి బ్యారేజి నుంచి నాగార్జునసాగర్‌ జలాశయం వరకు మూడు చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతా వాలు(గ్రావిటీ) ద్వారానే నీటిని మళ్లించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనపైనా కసరత్తు 

పోలవరం పూర్తయ్యాక అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 360 టీఎంసీల నీటిని పెన్నాకు తరలించే ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ నీటిని కావేరికి తరలించేందుకు వీలుగా సమగ్ర ప్రతిపాదనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

* జాతీయ జల అభివృద్ధి సంస్థ అనుసంధాన ప్రతిపాదనల్లో మహానది నుంచి గోదావరి-పెన్నా-పాలార్‌- కావేరి అనుసంధానమే కీలకం. ప్రస్తుతం ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 75శాతం విశ్వసనీయ జలాలు వాడుకునేలా తాజా ప్రతిపాదనను జల అభివృద్ధి సంస్థ ముందుకు తెచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా మేరకు నీటిని వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఇక్కడ నీటి లభ్యత ఉండదు. మహానది నుంచి గోదావరికి నీటి మళ్లింపు అంశం తేలి అది చేపట్టేలోపు తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చిందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో పాత ప్రతిపాదనే ప్రాణాధారమైనందున ఆ కసరత్తు యథాతథంగా కొనసాగుతుందని, బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించుకుంటే అంతర్గత అనుసంధానమూ రాష్ట్రానికి మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Ee eenadu Vaadu naakadam lo maree intha digajaari poyyaadaa - sontha praanthaaniki jarigey nastam kastam ento koodaa raayaali gaa - aa Akineypalli plan valana ayye cost and who bears it aney daani meda raaya ledu

and more over upfront TG will demand 102 TMC and AP only gets 55 and TN gets 90 TMC - ikkadey telisi pothundi why and who stirred up this plan and who influenced this idea from central water board side. I pray god Babu Garu will stand tall and straight and put our states interest first. 

Link to post
Share on other sites
1 hour ago, DVSDev said:

Dramoji sachipoyi chaala days ayyindhi.....daridrapu L koduku

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×
×
 • Create New...