Jump to content

Recommended Posts

Posted
వారం రోజుల్లోగా గోదావరి-పెన్నా అనుసంధానానికి సంబంధించి టెండర్లు పిలుస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. విజయవాడలోని ఆయన కార్యాలయం వద్ద గురువారం ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం చేసి భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చూడడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
 
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు 13 జిల్లాల నుంచి బస్సుల్లో రైతులను, ప్రజలను తీసుకొచ్చి జరుగుతున్న పనులపై చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భావి తరాలకు ఉపయోగపడే విధంగా చిన్ననీటి వనరులపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. 116 రోజులు జరిగే జలసంరక్షణ పనులకు ప్రజలు, నీటి సంఘాల సభ్యులు, రైతు సంఘాలు ఉద్యమంలాగా కదిలి రావాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఏడాది లోగా తెలుగుగంగ కాలువ పనులు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. అనంతపురం జిల్లాలోని 1000 చెరువులకు వచ్చే ఏడాదిలోగా నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
Posted
గోదావరి-పెన్నా మహా సంగమానికి కదలిక
30-03-2018 03:07:43
 
  •  ప్రకాశం బ్యారేజీ నుంచి పెదగంజాం దాకా
  • అక్కడి నుంచి గుండ్లకమ్మ గుండా సంగం బ్యారేజీకి
  • జలాల తరలింపు డీపీఆర్‌కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి-పెన్నా నదుల మహా సంగమం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా.. గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. అక్కడి నుంచి కొమ్మమూరు కాలువ ద్వారా ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి గుండ్లకమ్మలోకి ఎత్తిపోసి నెల్లూరు సంగం బ్యారేజీకి బదలాయించే పథకానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)కు రాష్ట్ర జల వనరుల శాఖ పచ్చజెండా ఊపిం ది. దీనికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు, పారిశ్రామికావసరాల కోసం గోదావరి మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి పెన్నాకు తీసుకెళ్లే ఈ పథకానికి డీపీఆర్‌ను తయారుచేసిన వాప్కోస్ కు ప్రభుత్వం రూ.5 కోట్లు చెల్లించింది.
Posted
గోదావరి-పెన్నా.. ఎదురుచూపులు
మొదటి దశ తాజా ప్రతిపాదనపై వ్యాప్కోస్‌ను నివేదిక కోరిన జలవనరుల శాఖ
ఏప్రిల్‌కల్లా కొలిక్కి తీసుకురావాలని ప్రణాళిక
ఈనాడు - అమరావతి

లవనరులశాఖ గోదావరి-పెన్నా తొలిదశ పనులను తక్షణమే చేపట్టేందుకు వ్యాప్కోస్‌ నుంచి ప్రాజెక్టు నివేదిక కోసం ఎదురుచూస్తోంది. తొలిదశ ప్రణాళిక మారడంతో ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. గోదావరి నుంచి ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటికి, చింతలపూడి ఎత్తిపోతల నీటిని కూడా కలిపి పోలవరం కుడి కాలువ పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని తీసుకుని ఆ అదనపు నీటిని సాగర్‌ కుడి కాలువకు ఇవ్వాలనేది ప్రణాళిక. ఇదే గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశగా నిర్ణయించారు. రూ.4,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. తొలుత ఆరు లేదా ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని భావించినా ప్రస్తుతం దాన్ని 5 దశలకు కుదించారు.

2,250 ఎకరాల భూమి అవసరం
ఈ తొలి దశకు మొత్తం 2,250 ఎకరాల భూమి అవసరమవుతుందని లెక్కించారు. 64 కట్టడాలు నిర్మించాల్సి ఉంటుంది. 370 మెగావాట్ల విద్యుత్తు సాయంతో నీటిని ఎత్తిపోయాలి. వ్యాప్కోస్‌ వారు మొత్తం గోదావరి-పెన్నా అనసంధానంపై లైడార్‌ సర్వే కూడా పూర్తి చేశారు. తొలిదశలో మార్పులపైనా వారు నివేదిక ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ నెలలోనే దీన్ని కొలిక్కి తీసుకురావాలని జలవనరులశాఖ ఆశిస్తోంది.

ఇదీ మొత్తం ప్రణాళిక...
* పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 8,500 క్యూసెక్కులతో పాటు చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 7,000 క్యూసెక్కులు కలిపి మొత్తం15,500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు.
* ఆ తర్వాత ప్రకాశం బ్యారేజికి ఎగువన 23వ కిలోమీటరు వద్ద ఉన్న హరిశ్చంద్రాపురం గ్రామం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు మళ్లిస్తారు.
* దాదాపు 60 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ 11.50 కిలోమీటర్ల పైపులైను, అయిదు దశల్లో పంపుహౌస్‌లు నిర్మించి నీటిని ఎత్తిపోస్తూ సాగర్‌ కుడి కాలువకు తీసుకువెళ్తారు.
* 120 రోజుల గోదావరి వరద కాలంలో రోజుకు 7,000 క్యూసెక్కుల చొప్పున 73 టీఎంసీలు సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు, తాగునీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు ఇవ్వాలనేది యోచన.

ఎత్తిపోయడం.. పంపులు, పైపులైను, కాలువ, నిర్మాణం ఇలా..
1. హరిశ్చంద్రపురం వద్ద తొలి ఎత్తిపోతకు పంపుహౌస్‌ నిర్మించి +15 మీటర్ల నుంచి +30 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి 2.25 కి.మీ మేర పైపులైనుతో నీటిని తీసుకెళ్తారు. ఆ తర్వాత అమరావతి వరకు దాదాపు 7.75 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వుతారు. నీటిని +30 మీటర్ల నుంచి తిరిగి +28.80 మీటర్లకు తీసుకెళ్తారు.
2. అమరావతి గ్రామ సరిహద్దులో రెండో పంపుహౌస్‌ నిర్మించి +28.80 మీటర్ల నుంచి +40 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తారు. 10వ కిలోమీటరు నుంచి 11.25 కి.మీ వరకు పైపులైను ద్వారా నీటిని మళ్లించి ఆ ఎత్తుకు తీసుకెళ్తారు. తిరిగి క్రోసూరు వరకు దాదాపు 23 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వి ఆ కాలువ సాయంతో  తిరిగి +37 మీటర్లకు నీటిని తీసుకెళ్తారు.
3. క్రోసూరు వద్ద మూడో ఎత్తిపోతల ఏర్పాటు చేస్తారు. 1.750 కిలో మీటర్ల పొడవునా పైపులైనులో నీటిని మళ్లిస్తారు. +60 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్తారు. తిరిగి క్రోసూరు నుంచి హస్సానాబాదు వరకు దాదాపు 10.790 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి నీటిని +59 మీటర్లకు తీసుకెళ్తారు.
4. హస్సానాబాదు వద్ద నాలుగో ఎత్తిపోత నిర్మిస్తారు. దాదాపు 2.31కి.మీ పొడవునా పైపులైను నిర్మించి నీటిని మళ్లించి +100 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి నరసింగపూడు గ్రామ సరిహద్దుల వరకు దాదాపు 18.70 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వి.. నీటిని +98.30 మీటర్లకు తరలిస్తారు.
5. నరసింగపాడు గ్రామం వద్ద అయిదో ఎత్తిపోతల పంపుహౌస్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి 3.90 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించి నీటిని +140 మీటర్లకు తీసుకువెళ్లి సాగర్‌ కుడి కాలువలో పోస్తారు

  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
Posted
సాయమందితే జలఫలం! 
గోదావరి పెన్నా అనుసంధానానికి ప్రభుత్వ రుణ ప్రయత్నం? 
దక్షిణ కొరియా నుంచి తీసుకునే యోచన 
దీంతో పాటు సీఆర్‌డీఏ, గెయిల్‌ ప్రాజెక్టులకూ... 
ఈనాడు - అమరావతి 
17ap-main2a.jpg

గోదావరి పెన్నా అనుసంధానంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి దక్షిణ కొరియా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైన నేపథ్యంలో అటు కేంద్రం సాయం ఆశిస్తోంది. దక్షిణ కొరియా ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులను రుణంగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉండగా ఆ నిధిని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగు పనుల్లో అనుభవం ఉన్న ఆ దేశానికి చెందిన ఓ కంపెనీ కూడా ఈ అంశాల్లో ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆ దేశం నుంచి రుణం పొందేందుకు రాష్ట్రం మొత్తం మూడు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. అమరావతి నగర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు ఒకటి,  కాకినాడ వద్ద గెయిల్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సంయుక్త ప్రాజెక్టుతో పాటు గోదావరి పెన్నా అనుసంధానాన్ని అందులో చేర్చారు. ఈ మూడు ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ కొరియా నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్నారు.ఈడీబీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులకు పెట్టుబడులు సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

83వేల కోట్లతో అనుసంధానం.. 
గోదావరి పెన్నా అనుసంధానానికి దాదాపు రూ.83 వేల కోట్ల అంచనా వ్యయంతో అయిదు దశల్లో చేపట్టాలని వ్యాప్కోస్‌, జలవనరులశాఖ నిపుణులు సంయుక్తంగా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా సిద్ధం చేశారు. ఇంత మొత్తంలో నిధులు ఖర్చు చేయడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వల్లే సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిధుల అన్వేషణకు అనేక మార్గాలను వెతుకుతోంది. మొత్తం 320 టీఎంసీల గోదావరి వరద జలాల మళ్లింపునకు ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. ఇందులో బొల్లాపల్లి వద్ద ఒక జలాశయం ఏర్పాటు చేసి అక్కడ 190 టీఎంసీల వరకు నిల్వ చేసేందుకు ప్రణాళికలో పొందుపరిచారు. కేంద్ర జలవనరులశాఖ కూడా గోదావరిని పెన్నాతో అనుసంధానించే ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ సంధానం ప్రతిపాదించారు. నాగార్జునసాగర్‌ మీదుగా పెన్నాకు గోదావరి జలాలు తరలించే ప్రతిపాదన అది. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. 
పూర్తి స్థాయి

డీపీఆర్‌ అవసరమన్న కొరియా 
దక్షిణ కొరియా నుంచి రుణం సమకూర్చేందుకు ఒక ఇంజినీరింగు కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ప్రతిపాదనలను సంబంధిత అధికారులు ఈమధ్యే దిల్లీ వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. అయితే, పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక అవసరమని వారు కోరారు. డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు రెండేళ్ల కిందటే జలవనరులశాఖ అప్పచెప్పినా అదింకా పూర్తి స్థాయి నివేదిక సమర్పించలేదు. తాజా ప్రయత్నాల నేపథ్యంలో జలవనరులశాఖ అధికారులు వ్యాప్కోస్‌కు త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇది సిద్ధమయితే ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకం అన్నది తేలుతుంది. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ప్రతిపాదిస్తున్న మూడు ప్రాజెక్టుల్లో దేనికి రుణం సమకూరుతుందో ఇంకా చెప్పలేమని జలవనరుల శాఖ స్పష్టం పేర్కొంది.

కేంద్రమంత్రి సయితం ప్రస్తావన 
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీ సయితం గోదావరి పెన్నా అనుసంధానంపై ప్రశ్నించినట్లు తెలిసింది. కేంద్రం ఆర్థిక సాయం చేస్తే తాము ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని.. నదుల అనుసంధానంతో తాము గోదావరి నీటిని ఇతర రాష్ట్రాలకూ ఇవ్వగలమని  కేంద్రమంత్రికి రాష్ట్ర పెద్దలు తెలియజేశారు. ఇప్పటికే ఈ అనుసంధానంలో గోదావరి నుంచి 73 టీఎంసీలు సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు తరలించేందుకు వీలుగా రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు సయితం ఆహ్వానించారు.

  • 2 weeks later...
Posted
ఏపీ సొంత ప్రణాళికతో గోదావరి-కృష్ణా అనుసంధానం 
గోదావరి-కావేరి మహా ఆనకట్టపై డీపీఆర్‌ 
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి 
ఈనాడు - దిల్లీ
హానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వైగై, గుండార్‌ నదుల అనుసంధానానికి కేంద్ర జలవనరుల శాఖ 9 మార్గాలను (లింకులను) గుర్తించినట్లు ఆ శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి-కృష్ణా అనుసంధాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన సొంత ప్రణాళిక ద్వారా అమలు చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానం కోసం గుర్తించిన తొమ్మిది ప్రాజెక్టుల కింద 3 చోట్ల జలాశయాలు నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. భారీ ముంపు తలెత్తుతుందన్న ఉద్దేశంతో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, తెలంగాణలు అంగీకరించడంలేదని వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా గోదావరి-కావేరి మహా ఆనకట్టను ప్రతిపాదించినట్లు తెలిపారు.

2019 డిసెంబరుకు పోలవరం పూర్తి: పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనులు 78%, లైనింగ్‌ పనులు 59% పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం పోలవరం నిర్మాణాన్ని 2019 డిసెంబర్‌కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మూడు నిమ్జ్‌లకే తుది అనుమతులు 
జాతీయ పెట్టుబడులు-తయారీరంగ సముదాయాలు (నిమ్జ్‌) కింద ఇప్పటివరకూ ప్రకాశం (ఏపీ), సంగారెడ్డి (తెలంగాణ), కళింగనగర్‌ (ఒడిశా)కి మాత్రమే తుది అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి సీఆర్‌ చౌదరి లోక్‌సభకు తెలిపారు. మరో 13 నిమ్జ్‌కి సూత్రప్రాయ అనుమతులే ఇచ్చినట్లు చెప్పారు. అందులో ఏపీలోని చిత్తూరు, తెలంగాణలోని హైదరాబాద్‌ ఫార్మా ఉన్నట్లు చెప్పారు.

ప్రసాద్‌ పథకం కింద ఏపీకి రూ.45.44 కోట్లు విడుదల: ఆధ్యాత్మిక స్థలాల అభివృద్ధికి ఉద్దేశించిన ‘ప్రసాద్‌’ పథకం కింద ఏపీకి గత నాలుగేళ్లలో రూ.45.44 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ తెలిపారు. ఇప్పటివరకూ గుంటూరు జిల్లాలోని అమరావతి అభివృద్ధికి రూ.22.69 కోట్లు, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయ అభివృద్ధికి రూ.22.75 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలో రెండోస్థానం ఏపీది 
స్వచ్ఛ విద్యాలయ మిషన్‌ కింద పాఠశాలల్లో అత్యధిక మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో బిహార్‌, రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. బిహార్‌లో 56912, ఏపీలో 49293, తెలంగాణలో 36159 నిర్మించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా లోక్‌సభలో చెప్పారు.

హోమియోపతిపై సమగ్ర బిల్లు 
హోమియోపతి విద్యావ్యవస్థలో నాణ్యతను, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర హోమియోపతి మండలి స్థానంలో ‘బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్ల’ను నియమించడానికి ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ వైద్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సమగ్ర బిల్లుల్ని తీసుకురాబోతోందని మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ చెప్పారు.

Posted
గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో మొదటి అడుగు
31-07-2018 09:31:23
 
636686262842484433.jpg
  • తొలి దశలో హరిశ్చంద్రాపురం నుంచి..
  • నకరికల్లు వరకు నీటి మళ్లింపు
  • 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో పైపులైన్‌..
  • గ్రావిటీ కాలువ నిర్మాణం
  • 73 టీఎంసీల నీటిని తరలించి 9.61 లక్షల ఎకరాల..
  • సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ
  • రూ.6,020 కోట్లకు టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ
  • 18 నెలల్లో పూర్తికి లక్ష్యం
గుంటూరు/అమరావతి: గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా మొదటి దశలో చేపట్ట బోతున్న ప్రాజెక్టు నిర్మాణానికి తొలి అడుగుపడింది. ఇందుకోసం రూ.6,020 కోట్ల నిధులు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు. పట్టిసీమ/పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే గోదావరి వరద నీటిని అమరావతి రాజధాని పరిధిలోని ప్రకాశం బ్యారేజ్‌లో హరిశ్చంద్రాపురం వద్ద నుంచి నకరికల్లు వరకు ఏడు వేల క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈపీసీ పద్ధతిన టెండర్లు స్వీకరించి ఆ తర్వాత అర్హతలను బట్టి ఏజెన్సీని ఖరారు చేస్తారు. మొత్తం 18 నెలల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
 
 
సాగునీటికి కొరత లేకుండా..
రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజక్టుని భావిస్తున్న ప్రభుత్వం దాని ద్వారా ఇప్పటికే గోదావరి - కృష్ణ నదులను తాత్కాలిక పట్టిసీమ పంపుహౌస్‌తో అనుసంధానం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కుడికాలువ నీటిని పెన్నా నదికి తీసుకెళ్లి గోదావరి - పెన్నా నదుల అనుసంధానాన్ని కూడా పూర్తిచేసి రాష్ట్రంలో సాగునీటికి కొరత లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం, కాస్తో, కూస్తో వచ్చిన వరద నీరు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులను దాటి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఆ నీటిని తరలించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని సీఎం చంద్రబాబు బృహత్తరమైన ఆశయానికి నాంది పలికారు.
 
 
ప్రాజెక్టు తీరు ఇలా..
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో నిల్వ అవుతున్న నీరు వద్ద సముద్రమట్టం చూస్తే 15 మీటర్లుగా ఉంది. మరోవైపు నకరికల్లు వద్ద సముద్ర నీటిమట్టం 140 మీటర్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 125 మీటర్ల ఎత్తునకు నీటిని పంపింగ్‌ చేసేందుకు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే సాగర్‌ డ్యాం నుంచి కృష్ణానది నీటి విడుదల కోసం ఆయ కట్టు రైతులు ఎదురు చూడాల్సిన పని లేదు. డెల్టా రైతులతో పాటే జూన్‌, జూలై నెలల్లోనే మాగాణి పంటల సాగు చేపట్టొచ్చు.
 
 
తొలుత హరిశ్చంద్రాపురం వద్ద 7 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయగల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లలో నీరు ప్రవహిస్తుంది. ఆ తర్వాత 56 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ఛానెల్‌ నిర్మిస్తారు. ఐదు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం హరిశ్చంద్రాపురంతో పాటు లింగాపురం, గోరంట్ల, భృగుబండ, నకరికల్లు వద్ద పంపుహౌస్‌లు నిర్మిస్తారు. నాగార్జునసాగర్‌ కుడికాలువ 80వ కిలోమీటర్‌ వద్ద నకరికల్లులో గోదావరి - పెన్నా కాలువని అనుసంధానం చేస్తారు. అక్కడే డెలివరీ సిస్టమ్‌ని నిర్మిస్తారు. ఇలా ఏటా 73 టీఎంసీల గోదా వరి నీటిని నాగార్జునసాగర్‌ కుడికాలువకు తరలించడం ద్వారా 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీ కరిస్తారు. దీంతో సాగర్‌ ఆయకట్టులో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తొలగిపోతాయి.
 
 
ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం..
గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తొలిదశ ప్రాజెక్టు కోసం గత శనివారం టెండర్లు పిలిచాం. ఈపీసీ పద్ధతిన ఏజెన్సీని ఖరారు చేస్తాం. ఇందుకోసం జలవనరుల శాఖ నుంచి పరిపాలన అనుమతి తీసుకోవడం జరిగింది. 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేసి సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నాం. - ఎం.బాబూరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ
  • 6 months later...
  • 3 months later...
Posted

will jagan stop these ongoing projects, even contractors change will delay project for years & court cases extra.

  • 5 years later...
Posted
6 hours ago, sonykongara said:

image.jpeg.685efd608909a4bc5ec9e48511f33e7b.jpeg

Idi ayye panena Bro. Tunnel tovvatamu ante ippude ayye pane kaadu. Waste of time and money emo.if central accept cheste chance vuntundi emo leka pothe waste emo. Study cheya vachhu feasable kaada ani

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...