sonykongara Posted August 23, 2017 Author Share Posted August 23, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 23, 2017 Author Share Posted August 23, 2017 నేరుగా సోమశిలకు.. అట్నుంచి రాజంపేటకు అక్కడి నుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరికి ఎగువ నుంచి కృష్ణా జలాలు రావడం లేదు అందుకే ఈ కొత్త ఆలోచన: ముఖ్యమంత్రి సర్వేల్లో నిర్మొహమాటంగా వాస్తవాలే చెప్పాలి ప్రజలు మొహమాటపడితే తప్పులు దిద్దుకోలేం నంద్యాలలో మాకు 20 వేల మెజారిటీ: సీఎం రియల్ పాలన.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అవినీతి అంతం.. దాంతో ప్రజల్లో ఆనందం హిజ్రాలకూ పింఛన్లు ఇస్తాం.. ఇళ్లు కట్టిస్తాం అనాథలకు, వృద్ధులకూ ప్రత్యేక హోమ్‌లు పెరుగుతున్న ఉన్మాదానికి అడ్డుకట్ట వేయాలి మీడియా సమావేశంలో చంద్రబాబు పిలుపు అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సీమ గొంతు తడిపేందుకు గోదావరిని జలాలను రప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎగువ నుంచి కృష్ణా జలాలు రాకపోవడంతో కొత్త ఆలోచన చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి నీటిని నేరుగా సోమశిల రిజర్వాయరుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నామని చెప్పారు. ‘మధ్యలో బొల్లాపల్లి రిజర్వాయర్ వంటి నిర్మాణాలను ప్రస్తుతం పక్కన పెడుతున్నాం. గోదావరి నీటిని నేరుగా సోమశిల తీసుకెళ్లి.. అక్కడి నుంచి రాజంపేట మీదుగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కృష్ణానదిలో వచ్చే నీటిని దామాషా పద్ధతిలో దిగువ రాష్ట్రాలకు కూడా పంచితే తప్ప.. కనీసం మంచినీళ్లు దొరకవని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తున్నామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వద్దని ప్రతిపక్షాలు విమర్శించాయని, కానీ దానిని పూర్తిచేయడం వల్లే ఇప్పుడు ఇక్కడ మంచినీళ్లు తాగగలగుతున్నామని చెప్పారు. ఆనాడు విమర్శించినవారిని ఇప్పుడెవరైనా నిలదీస్తున్నారా అని ప్రశ్నించారు. తాము చేస్తున్న సర్వేల్లో ప్రజలు వాస్తవాలు చెప్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు మొహమాట పడితే వాస్తవాలు తెలియవు. సమస్య ఏమిటో నిర్భయంగా చెబితేనే వాటిని పరిష్కరించగలుగుతాం. నన్ను సంతోషపెట్టాలని అబద్ధాలు చెప్పవద్దు. మా తప్పులు చెబితే సరిచేసుకుంటాం. నా వరకూ నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. మా క్యాడర్‌కు కూడా కొన్ని ఆశలున్నా దాని వల్ల ప్రజలకు ఇబ్బంది రాకుండా పనిచేస్తున్నాం. పింఛను ఎవరికి ఇవ్వాలో మా వాళ్లను అడిగి ఇవ్వం. నిజమైన అర్హులకే ఇస్తాం. దానిని మా పార్టీ వారు ఘనంగా చెప్పుకోవాలి. మా యంత్రాంగం బాగున్నచోట మంచి ఫలితాలు వస్తున్నాయి. లేనిచోట ఆ ఫలితాలు రావడం లేదు‘ అని ఆయన పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి 20 వేలకు పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తానెప్పుడూ జోస్యాలు చెప్పనని, అనధికారికంగా అడిగారు కాబట్టి చెబుతున్నానని విలేకరులతో అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి చేసే పౌర సన్మానానికి పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ పిలుస్తున్నామని, వారితోపాటు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఈ నెలలో ఎన్నికల వల్ల జలసిరికి హారతి కార్యక్రమాన్ని సెప్టెంబరు 5 నుంచి... ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని సెప్టెంబరు 10 నుంచి మొదలుపెడుతున్నామన్నారు. పిల్లలకు ఇవే నేర్పుదామా? ‘మనం ఏం మాట్లాడితే మన పిల్లలు అవే నేర్చుకుంటారు. ముఖ్యమంత్రినని కూడా చూడకుండా చంపుతాను... నరుకుతాను... కాలుస్తాను... బట్టలూడదీస్తానని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు. ఇదేనా సంస్కారం? మనం మన పిల్లలకు నేర్పేది ఇదేనా? చర్చ పెరగకూడదనే నేను సహనంతో భరిస్తున్నాను. రాష్ట్రాధినేతను నన్నే ఇన్ని మాటలు అంటున్నారు. నేను అందరికీ రక్షణ ఇవ్వాలి. నాకే రక్షణ లేకపోతే నేను మిగిలిన వారికి ఏం ఇవ్వగలను? ఎవరి సభ్యత... సంస్కారం ఏమిటో అందరూ ఆలోచించాలి‘ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో ఒక వ్యక్తి ఉన్మాదం పెరిగిపోయి తాను ప్రేమించిన అమ్మాయిని, ఆ అమ్మాయి తమ్ముడిని పెట్రోల్ పోసి తగలబెట్టాడని, వారేం పాపం చేశారని ప్రశ్నించారు. ‘చివరకు ఆ ఉన్మాది కూడా రైలు కింద పడి చనిపోయాడు. విచక్షణ కోల్పోవడం వల్లే వచ్చే సమస్యలివి. ఇలాంటివారు రాజకీయ నేతలైతే సమాజం పరిస్థితేమిటి? నాకూ చాలా తలనొప్పులు ఉన్నాయి. విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. అయినా ఓపికతో పని చేసుకుంటూ వస్తున్నా. వర్షపాతం 30 శాతం లోటు ఉన్నా తాగునీటికి ఇబ్బంది రాకుండా చూశాం. ఆర్థికంగా అనేక కష్టాలున్నా 24 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. ఏ గ్రామం చూసినా సిమెంటు రోడ్లు కొట్టొచ్చేలా వేస్తున్నాం. రోడ్లపై గుంతలు చాలా వరకూ తగ్గించాం. నగరాలు, పట్టణాల్లో ప్రతి దీపం వెలిగేలా చేస్తున్నాం. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సమస్య పరిష్కారమయ్యాక దానిపై మన దృష్టి పడదు. కానీ దానిని పరిష్కరించడానికి ఎన్ని తిప్పలు పడ్డామో మాకు మాత్రమే తెలుస్తుంది. ఎన్ని ఒత్తిళ్లకు గురైనా మేం సహనం కోల్పోవడం లేదు. బయట కూర్చున్నవారు మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఆ మాటలను పత్రికలు పతాక శీర్షికల్లో పెడుతున్నాయి. ఇది న్యాయమా అన్నది నా ప్రశ్న‘ అని ఆయన అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి, వైఎస్ జగన్ ఒకప్పుడు యువతకు... సమాజానికి ఆకర్షణీయ నమూనాలుగా కనిపించారని, వారిలా కోట్లు గడించాలని చాలా మంది తపించారని. కానీ అదెక్కువ కాలం నిలబడలేదన్నారు. ‘కొన్ని సందర్భాల్లో అవినీతి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దానిపై పోరాడాలి. ప్రజలకు దాని వల్ల ఎంత నొప్పి కలుగుతుందో చెప్పాలి. ఆ పోరాటంలో భాగంగానే మేం రకరకాల సంస్కరణలు, ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో దెయ్యాలు పింఛన్లు తీసుకునేవి. ఒకే ఇంట్లో ఐదుగురికి పింఛన్లు వచ్చేవి. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా అటువంటి తప్పులకు అవకాశం లేకుండా చేశాం. అవినీతి ఒక జబ్బు. అంత తొందరగా పోదు. గట్టి చర్యలు, టెక్నాలజీ వినియోగం దీనిపై పోరాటంలో ఒక భాగం’ అని ఆయన చెప్పారు. తనపై కోపంతో పేదలను కూడా కష్టాలపాలు చేస్తున్నారని, ఉపాధి హామీ నిధులపై వైసీపీ నేతల ఫిర్యాదులతో కేంద్రం నుంచి ఆ నిధుల విడుదల ఆలస్యమైందని ధ్వజమెత్తారు. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted August 23, 2017 Share Posted August 23, 2017 How many years it will take? Godavari-Penna river linkage ki loan techhukolema to start it immd.? Link to comment Share on other sites More sharing options...
swas Posted August 23, 2017 Share Posted August 23, 2017 It will be good news canals start chesthe it will benefit to rayalaseema memu vastene this will complete ani chepthe voting one sided ga padutundi mainly nellore because it will be 1st one to get benefited Link to comment Share on other sites More sharing options...
rk09 Posted September 1, 2017 Share Posted September 1, 2017 నేరుగా మళ్లింపు! జలాశయం లేకుండా సోమశిలకు నీటి తరలింపు యోచన గోదావరి-పెన్నా అనుసంధానానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఈ నెలలోనే లైడార్ సర్వే ఈనాడు - అమరావతి గోదావరి, పెన్నా అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించాలని ఆయన భావిస్తున్నారు. ఇంతకుముందు సిద్ధం చేసిన ప్రతిపాదన నేపథ్యంలోనే... ఖర్చు తగ్గించి నీళ్లు మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై మరింత అధ్యయనం చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే తొలిదశలో జలాశయం నిర్మాణాన్ని మినహాయించి నేరుగా ఎత్తిపోతల ద్వారా సోమశిలకు నీరు మళ్లించేలా పథకానికి తిరిగి రూపకల్పన చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటికీ కటకటలాడే పరిస్థితి. ఇంతవరకు శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి చుక్క నీరు వచ్చింది లేదు. ఆలమట్టి జలాశయం నిండినా అక్కడి నీరు అక్కడే వాడేస్తున్నారు. రోజుకు 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీల వరకు కర్ణాటకలోనే వినియోగించుకుంటున్నారని అధికారులు లెక్కలు తేల్చారు. ఎగువ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టుల వల్ల దిగువకు కృష్ణా నీరే రావడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలు వెలవెలలాడుతున్నాయి. తుంగభద్రలోకి వస్తున్న ప్రవాహమూ అంతంతమాత్రమే. సెప్టెంబర్ వచ్చినా కృష్ణా నీళ్లు రాని పరిస్థితి. ఈ నెల కూడా ఇలాగే ఉంటే తాగునీటి అవసరాలు తీర్చడమూ గగనమవుతుంది. మరోవైపు గోదావరిలో బుధవారం వరకు 600 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. తాజా పరిస్థితులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక గోదావరి, పెన్నా అనుసంధానాన్ని ఆలస్యం చేయడం సరికాదనే అభిప్రాయంలో ముఖ్యమంత్రి ఉన్నారు. దశలవారీగా దీన్ని పట్టాలకు ఎక్కించడమే రాష్ట్రానికి శ్రేయస్కరంగా భావించి కసరత్తును వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుపై రాబోయే 10 రోజుల్లో సీఎం వద్ద ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. పాత ప్రణాళికలో మార్పులపై కసరత్తు * పాత ప్రణాళిక ప్రకారం గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించి గోదావరి నుంచి పెన్నా మళ్లింపు ద్వారా 320 టీఎంసీలు వినియోగించుకోవాలనేది యోచన. కొత్త ప్రణాళికలో బొల్లాపల్లి జలాశయం నిర్మాణాన్ని వాయిదా వేయనున్నారు. జలాశయం నిర్మాణం తాత్కాలికంగా పక్కన పెడితే ప్రాజెక్టు వ్యయం బాగా తగ్గించవచ్చనేది అంచనా. ఒక్క బొల్లాపల్లి జలాశయానికే 22 వేల ఎకరాల పట్టాభూమి, 17 వేల ఎకరాల అటవీభూమి అవసరం అవుతుంది. తొలిదశలో దీన్ని మినహాయించడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. * జలాశయం లేకపోవడం వల్ల ఎన్ని టీఎంసీల వినియోగానికి ఆస్కారం ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. దాదాపు కాలువ ఎలైన్‌మెంట్‌లో పెద్ద మార్పు ఉండదు. బొల్లాపల్లి జలాశయానికి తీసుకువెళ్లకుండా... అక్కడ మరో ఎత్తిపోతలను ఏర్పాటు చేసి నేరుగా సోమశిలకు మళ్లించనున్నారు. గోదావరి నుంచి బొల్లాపల్లి వరకు 317 కిలోమీటర్ల మేర కాలువ ద్వారా నీరు మళ్లించాలి. అక్కడి నుంచి సోమశిలకు 375 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీరు చేర్చే అవకాశం ఉంది. జలాశయంలో నిల్వ లేకుండా ఇంతదూరం నీటిని తీసుకువెళ్లడం వల్ల వచ్చే ఇబ్బందులను అధికారులు పరిశీలిస్తున్నారు. లైడార్ సర్వే... ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఈ నెలలోనే వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వే చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లైడార్ సర్వే ఆపమని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ సూచించింది. తిరిగి అనుమతుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నెలలోనే లైడార్ సర్వే పూర్తి చేయనున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో ఈ సర్వే చేపడతారు. మూడు రోజుల వ్యవధిలోనే సర్వే మొత్తం పూర్తవుతుంది. ఆ సర్వే ద్వారా వాస్తవ ఎలైన్‌మెంట్‌తో ప్రాజెక్టు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 1, 2017 Author Share Posted September 1, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 1, 2017 Author Share Posted September 1, 2017 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted September 1, 2017 Share Posted September 1, 2017 Do this in phases, try to finish first phase before 2019 elections. It may be a small target, but it will create some confidence among public living in those areas which will be benefited Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 3, 2017 Author Share Posted September 3, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 3, 2017 Author Share Posted September 3, 2017 గోదావరిలో 50 రోజులే వరద జలాలు! జలాశయం లేకుండా 100 టీఎంసీలు మళ్లింపు సాధ్యమే దీర్ఘకాలంలోనైనా జలాశయాలు ఏర్పాటుతోనే ఫలాలు నిపుణుల ప్రతిపాదనల్లో తెరపైకి వస్తున్న కీలకాంశాలు ఈనాడు - అమరావతి గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో కీలకాంశాలు అనేకం తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జలాశయం లేకుండానే నీళ్లు సోమశిలకు మళ్లించేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్న నేపథ్యంలో.. పాతికేళ్ల సగటును లెక్కలోకి తీసుకుంటే గోదావరిలో సగటున 3,089 టీఎంసీలు సముద్రంలో వృథాగా పోతున్నట్లు తేల్చారు. గోదావరి పెన్నా అనుసంధానంతో 400 టీఎంసీలు దిగువకు తీసుకువెళ్లాలనేది యోచన. ఇందుకోసం ఇప్పటికే వ్యాప్కోస్ ప్రాథమికంగా నాలుగు ప్రతిపాదనలు రూపొందించింది. జలవనరులశాఖ మరో నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఆధ్వర్యంలో దీర్ఘకాలం పనిచేసిన కంభంపాటి పాపారావు గతంలోనే ఈ అనుసంధానంపై మరో ప్రతిపాదన సిద్ధంచేసి ప్రభుత్వానికి ఇచ్చారు. పాపారావు ప్రతిపాదనల్లోని ప్రధానాంశాలు.. * జలాశయం పశ్చిమగోదావరి జిల్లాలోనే జల్లేరుకు ఎగువన నిర్మించాలి. దీనివల్ల కాలువల సామర్థ్యం ఎక్కువగా ఉండక్కర్లేదు. ఎక్కువ రోజులు నీటిని మళ్లించుకుని భారీగా నీటిని సరఫరా చేసుకోవచ్చు. * పోలవరం ఎగువ నుంచి కాలువ కృష్ణానది వరకు కొనసాగి, ఆ నదిని దాటాక నాగార్జునసాగర్ కుడి కాలువ ఎగువ నుంచి జలాలను తీసుకువెళ్లేలా ప్రతిపాదించారు. సాగర్ కుడి కాలువలో గుంటూరు బ్రాంచి కాలువ ఆఫ్‌టేక్ వద్ద కుడి కాలువను దాటి సోమశిల వరకు నేరుగా ప్రయాణిస్తుంది. * దీనివల్ల సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 132టీఎంసీల నీటిని గోదావరి నుంచే ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. సాగర్ రెండో దశలో 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదన ఉంది. ఆ మేరకు శ్రీశైలంలో 132టీఎంసీలు మినహాయించుకుని సీమ అవసరాలకు వళ్లించవచ్చని యోచన. * గోదావరి, కృష్ణా డెల్టాల్లో డ్రైనేజి సమస్యకు కారణమవుతున్న మెట్ట ప్రాంత వరద నీటిని ఈ కాలువలోకి మళ్లించేలా ఆలోచన ఉంది. దీనివల్ల డెల్టా సమస్య పరిష్కారమవుతుంది. మెట్ట నుంచి వచ్చే జలాలు సద్వినియోగం చేసే వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. కొవ్వాడ, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు, బురదకాలువ, గుండ్లకమ్మ తదితర వాగుల ద్వారా వచ్చే మెట్టప్రాంత వరద జలాలను ఇందులోకి మళ్లించే యోచనచేశారు. * ప్రభుత్వ తాజా ఆలోచనపై ఈనాడు కంభంపాటి పాపారావును సంప్రదించగా తొలిదశలో జలాశయం లేకుండా గోదావరి నుంచి నీటిని ఎత్తిపోస్తూ సోమశిల వరకు 100 టీఎంసీలకు పైగా మళ్లించవచ్చని అభిప్రాయపడ్డారు. * జలవనరులశాఖ తాజా ప్రతిపాదనలో గుంటూరు జిల్లాలో బొల్లాపల్లి జలాశయానికి ప్రతిపాదించారు. జల్లేరు ఎగువన కట్టల నిర్మాణంతో అక్కడ సహజంగానే జలాశయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 50 రోజులే వరదజలాలు!: గోదావరిలో వరద 100 నుంచి 150 రోజులు ఉంటుందని లెక్కలు చెబుతున్నా అది వాస్తవం కాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. గోదావరిలో 10వేల క్యూసెక్కులు దాటి వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నది 50 రోజులేనని వారు లెక్కలు కడుతున్నారు. లక్ష క్యూసెక్కులకు మించి వరద వెళ్లిపోతున్నది 24 నుంచి 26 రోజులేనని చెబుతున్నారు. ఈ కారణంగా రోజుకు 8టీఎంసీల చొప్పున నీళ్లు మళ్లించేందుకున్న ఆస్కారం తక్కువని కొందరి వాదన. రోజుకు 8 టీఎంసీలు అందుబాటులో ఉండేది 25 నుంచి 26 రోజులేనని లెక్కకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో పాటు ఎగువన తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ 72,000 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్న విషయమూ లెక్కలోకి తీసుకోవాలని పాపారావు ‘ఈనాడు’తో అన్నారు. కేవలం అనుసంధానిస్తే సరిపోదని- జలాశయాలు నిర్మించి నీటిని నిల్వ చేసుకుంటేనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగని తొలిదశలో జలాశయం లేకుండా వరద జలాలను పెన్నాకు మళ్లించాలనే ప్రభుత్వ ఆలోచన తప్పేమీ కాదన్నారు. తర్వాతైనా జలాశయాల నిర్మాణం అవసరమేనన్న విషయం గుర్తించాలని చెబుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
swas Posted September 3, 2017 Share Posted September 3, 2017 గోదావరిలో 50 రోజులే వరద జలాలు! జలాశయం లేకుండా 100 టీఎంసీలు మళ్లింపు సాధ్యమే దీర్ఘకాలంలోనైనా జలాశయాలు ఏర్పాటుతోనే ఫలాలు నిపుణుల ప్రతిపాదనల్లో తెరపైకి వస్తున్న కీలకాంశాలు ఈనాడు - అమరావతి గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో కీలకాంశాలు అనేకం తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జలాశయం లేకుండానే నీళ్లు సోమశిలకు మళ్లించేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్న నేపథ్యంలో.. పాతికేళ్ల సగటును లెక్కలోకి తీసుకుంటే గోదావరిలో సగటున 3,089 టీఎంసీలు సముద్రంలో వృథాగా పోతున్నట్లు తేల్చారు. గోదావరి పెన్నా అనుసంధానంతో 400 టీఎంసీలు దిగువకు తీసుకువెళ్లాలనేది యోచన. ఇందుకోసం ఇప్పటికే వ్యాప్కోస్ ప్రాథమికంగా నాలుగు ప్రతిపాదనలు రూపొందించింది. జలవనరులశాఖ మరో నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఆధ్వర్యంలో దీర్ఘకాలం పనిచేసిన కంభంపాటి పాపారావు గతంలోనే ఈ అనుసంధానంపై మరో ప్రతిపాదన సిద్ధంచేసి ప్రభుత్వానికి ఇచ్చారు. పాపారావు ప్రతిపాదనల్లోని ప్రధానాంశాలు.. * జలాశయం పశ్చిమగోదావరి జిల్లాలోనే జల్లేరుకు ఎగువన నిర్మించాలి. దీనివల్ల కాలువల సామర్థ్యం ఎక్కువగా ఉండక్కర్లేదు. ఎక్కువ రోజులు నీటిని మళ్లించుకుని భారీగా నీటిని సరఫరా చేసుకోవచ్చు. * పోలవరం ఎగువ నుంచి కాలువ కృష్ణానది వరకు కొనసాగి, ఆ నదిని దాటాక నాగార్జునసాగర్ కుడి కాలువ ఎగువ నుంచి జలాలను తీసుకువెళ్లేలా ప్రతిపాదించారు. సాగర్ కుడి కాలువలో గుంటూరు బ్రాంచి కాలువ ఆఫ్‌టేక్ వద్ద కుడి కాలువను దాటి సోమశిల వరకు నేరుగా ప్రయాణిస్తుంది. * దీనివల్ల సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 132టీఎంసీల నీటిని గోదావరి నుంచే ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. సాగర్ రెండో దశలో 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదన ఉంది. ఆ మేరకు శ్రీశైలంలో 132టీఎంసీలు మినహాయించుకుని సీమ అవసరాలకు వళ్లించవచ్చని యోచన. * గోదావరి, కృష్ణా డెల్టాల్లో డ్రైనేజి సమస్యకు కారణమవుతున్న మెట్ట ప్రాంత వరద నీటిని ఈ కాలువలోకి మళ్లించేలా ఆలోచన ఉంది. దీనివల్ల డెల్టా సమస్య పరిష్కారమవుతుంది. మెట్ట నుంచి వచ్చే జలాలు సద్వినియోగం చేసే వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. కొవ్వాడ, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు, బురదకాలువ, గుండ్లకమ్మ తదితర వాగుల ద్వారా వచ్చే మెట్టప్రాంత వరద జలాలను ఇందులోకి మళ్లించే యోచనచేశారు. * ప్రభుత్వ తాజా ఆలోచనపై ఈనాడు కంభంపాటి పాపారావును సంప్రదించగా తొలిదశలో జలాశయం లేకుండా గోదావరి నుంచి నీటిని ఎత్తిపోస్తూ సోమశిల వరకు 100 టీఎంసీలకు పైగా మళ్లించవచ్చని అభిప్రాయపడ్డారు. * జలవనరులశాఖ తాజా ప్రతిపాదనలో గుంటూరు జిల్లాలో బొల్లాపల్లి జలాశయానికి ప్రతిపాదించారు. జల్లేరు ఎగువన కట్టల నిర్మాణంతో అక్కడ సహజంగానే జలాశయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 50 రోజులే వరదజలాలు!: గోదావరిలో వరద 100 నుంచి 150 రోజులు ఉంటుందని లెక్కలు చెబుతున్నా అది వాస్తవం కాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. గోదావరిలో 10వేల క్యూసెక్కులు దాటి వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నది 50 రోజులేనని వారు లెక్కలు కడుతున్నారు. లక్ష క్యూసెక్కులకు మించి వరద వెళ్లిపోతున్నది 24 నుంచి 26 రోజులేనని చెబుతున్నారు. ఈ కారణంగా రోజుకు 8టీఎంసీల చొప్పున నీళ్లు మళ్లించేందుకున్న ఆస్కారం తక్కువని కొందరి వాదన. రోజుకు 8 టీఎంసీలు అందుబాటులో ఉండేది 25 నుంచి 26 రోజులేనని లెక్కకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో పాటు ఎగువన తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ 72,000 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్న విషయమూ లెక్కలోకి తీసుకోవాలని పాపారావు ‘ఈనాడు’తో అన్నారు. కేవలం అనుసంధానిస్తే సరిపోదని- జలాశయాలు నిర్మించి నీటిని నిల్వ చేసుకుంటేనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగని తొలిదశలో జలాశయం లేకుండా వరద జలాలను పెన్నాకు మళ్లించాలనే ప్రభుత్వ ఆలోచన తప్పేమీ కాదన్నారు. తర్వాతైనా జలాశయాల నిర్మాణం అవసరమేనన్న విషయం గుర్తించాలని చెబుతున్నారు. Use buckingham canal also which passes through nellore already una dani reverse pumping cheyali somasila down lo oka check dam kattali and buckingham canal water ni andiloki divert cheyali Link to comment Share on other sites More sharing options...
rk09 Posted September 4, 2017 Share Posted September 4, 2017 Currently bucking ham canal ends near Pedaganjam in Ongole district. And capacity is less than 1/4 th of starting point. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 5, 2017 Author Share Posted September 5, 2017 సీమకు జలసిరి! రిజర్వాయర్ లేకుండానే పెన్నకు గోదారమ్మ ముఖ్యమంత్రి ఆదేశంపై కసరత్తు పరిశీలనలో నాలుగు ప్రతిపాదనలు 320/100/150/200 టీఎంసీల తరలింపుపై అధికారుల పరిశీలన వ్యాప్కోస్‌కు డీపీఆర్ బాధ్యతలు ఈఎన్‌సీ, నిపుణులతో ఆ సంస్థ భేటీ అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి-కృష్ణా నదులను.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా.. గోదావరి-ఏలేరును ఏకం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే తరహాలో గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసే బృహత్తర కార్యక్రమంపై దృష్టి సారించింది. వరదనీటిని దిగువకు వదలకుండా కర్ణాటక పరిమితిని మించి నిల్వ చేస్తున్న దరిమిలా.. ఏటికేడాది రాష్ట్రంలో కృష్ణా జలాల లభ్యత తగ్గిపోతోంది. ఇంకోవైపు గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తికాగానే.. గోదావరి జలాలను పెన్నా నదికి తరలించే భారీ కసరత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గతిని మార్చేసే పోలవరాన్ని 2018, 19కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. కరువు పీడిత ప్రాంతాలకు సుస్థిర సాగు నీటిని అందించే గోదావరి-పెన్నా అనుసంధాన పథకానికి మొత్తం నాలుగు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక.. గోదావరి జలాలను పెన్నా నదిలోకి పంపేందుకు వీలుగా బొల్లాపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయరును నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. కానీ ఈ రిజర్వాయరు నిర్మాణం లేకుండానే.. గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. లక్ష్య సాధన మేరకు పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తయితే.. కొత్త పథకాలను చేపట్టే వీలు కలుగుతుంది. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా పోలవరం నుంచి వైకుంఠపురం, బొల్లాపల్లి మీదుగా సోమశిల తరలించాలన్నది లక్ష్యం. పోలవరం జలాశయం నుంచి మూడో కాల్వను తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. సుమారు 270 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా గుంటూరు జిల్లా వైకుంఠపురం వరకు.. అక్కడి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయరుకు తరలిస్తారు. ఇక్కడ రిజర్వాయరు అవసరం లేకుండానే నేరుగా సోమశిలకు, వెలిగొండకు నీటిని తరలించాలన్నది సీఎం ఆదేశం. ఇప్పటికే ఈ పథకం అంచనాలతో సహా.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించింది. సోమవారం ఆ సంస్థ అధికారులు.. జల వనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, నిపుణులు రెహమాన్ తదితరులతో సమావేశమయ్యారు. నాలుగు ప్రతిపాదనలపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయుంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 320 టీఎంసీలను పోలవరం నుంచి తరలించాలంటే రూ.80,257 కోట్లు, వంద టీఎంసీలైతే రూ.32,407 కోట్లు, 150 టీఎంసీలైతే 40,089 కోట్లు, 200 టీఎంసీలు తరలించాలంటే రూ.48,066 కోట్లు వ్యయం కావచ్చని అంచనా వేశారు. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 5, 2017 Share Posted September 5, 2017 Malli kothha canal endhuku from Polavaram? Can't they use existing polavaram/pattiseema right canal by increasing width, Ibrahimpatnam sangamam nunchi inko canal to vaikuntapuram->Bollapalli->Veligonda & Somasila Kothha canal from Polavaram ante chaala time taking for land acquistion & expenses wise. Link to comment Share on other sites More sharing options...
swas Posted September 5, 2017 Share Posted September 5, 2017 Malli kothha canal endhuku from Polavaram? Can't they use existing polavaram/pattiseema right canal by increasing width, Ibrahimpatnam sangamam nunchi inko canal to vaikuntapuram->Bollapalli->Veligonda & Somasila Kothha canal from Polavaram ante chaala time taking for land acquistion & expenses wise. May be adi central project inka not yet completed inka money ravali canal vi dani touch chesthe bjp will do disco as we need to consrtuct flyovers are also not yet completed Inko canal ayithene better flood canal anochu dani valla no state can ask us Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 5, 2017 Author Share Posted September 5, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 6, 2017 Author Share Posted September 6, 2017 రెండు దశల్లో ‘గోదావరి-పెన్నా’ తొలి దశలో రిజర్వాయరు లేకుండానే జలాలు కాలువలు, ఎత్తిపోతలతో నీరివ్వొచ్చు సీఎంకు అధికారుల వివరణ సమగ్ర వివరాలతో 13న సమావేశం అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గోదావరి జలాలను అందించే గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకేసారి చేపడితే లక్ష కోట్ల రూపాయల దాకా వ్యయం అవుతుందని.. ఇంత భారాన్ని ప్రభుత్వం మోయలేదని చెప్పారు. అందుకే... రెండు దశల్లో దీనిని చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. గోదావరి- పెన్నా అనుసంధానంతో 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చునని సీఎం తెలిపారు. సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా జలవనరుల శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సమీక్షలో అధికారులు 4 ప్రతిపాదనలు అందించారు. ‘‘తొలిదశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరును నిర్మించకుండానే పోలవరం నుంచి ప్రత్యేక కాలువ ద్వారా 700 కిలోమీటర్ల వరకు గోదావరి జలాలను తరలించవచ్చు. ఇందుకు వైకుంఠపురం సమీపంలో కృష్ణానదిపై అక్విడెక్టు, కాలువలు, టన్నెల్, 4 చోట్ల ఎత్తిపోతల వంటి నిర్మాణాలు అవసరమవుతాయి. రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించవచ్చు’’ అని తెలిపారు. ఈ పథకం వల్ల కృష్ణా డెల్టా కుడికాలువ ఆయకట్టు రైతులతో సహా.. ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామికావసరాలకు నీరందించవచ్చని వివరించారు. వృథాగా సముద్రంలో కలిసి గోదావరి వరద నీటితో ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరుతో సహా.. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడాదంతా తాగునీటికి ఇబ్బంది ఉండదని చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా .. ఈ గోదావరి జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా సీమకు అందివ్వొచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలతో ఈనెల 13న మరోసారి సమగ్రంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ లైడార్ సర్వే రిపోర్టుతోపాటు, నాలుగు ప్రతిపాదనలతో కూడి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు సమర్పిస్తారు. Link to comment Share on other sites More sharing options...
swas Posted September 6, 2017 Share Posted September 6, 2017 రెండు దశల్లో ‘గోదావరి-పెన్నా’ తొలి దశలో రిజర్వాయరు లేకుండానే జలాలు కాలువలు, ఎత్తిపోతలతో నీరివ్వొచ్చు సీఎంకు అధికారుల వివరణ సమగ్ర వివరాలతో 13న సమావేశం అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గోదావరి జలాలను అందించే గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకేసారి చేపడితే లక్ష కోట్ల రూపాయల దాకా వ్యయం అవుతుందని.. ఇంత భారాన్ని ప్రభుత్వం మోయలేదని చెప్పారు. అందుకే... రెండు దశల్లో దీనిని చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. గోదావరి- పెన్నా అనుసంధానంతో 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చునని సీఎం తెలిపారు. సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా జలవనరుల శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సమీక్షలో అధికారులు 4 ప్రతిపాదనలు అందించారు. ‘‘తొలిదశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరును నిర్మించకుండానే పోలవరం నుంచి ప్రత్యేక కాలువ ద్వారా 700 కిలోమీటర్ల వరకు గోదావరి జలాలను తరలించవచ్చు. ఇందుకు వైకుంఠపురం సమీపంలో కృష్ణానదిపై అక్విడెక్టు, కాలువలు, టన్నెల్, 4 చోట్ల ఎత్తిపోతల వంటి నిర్మాణాలు అవసరమవుతాయి. రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించవచ్చు’’ అని తెలిపారు. ఈ పథకం వల్ల కృష్ణా డెల్టా కుడికాలువ ఆయకట్టు రైతులతో సహా.. ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామికావసరాలకు నీరందించవచ్చని వివరించారు. వృథాగా సముద్రంలో కలిసి గోదావరి వరద నీటితో ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరుతో సహా.. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడాదంతా తాగునీటికి ఇబ్బంది ఉండదని చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా .. ఈ గోదావరి జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా సీమకు అందివ్వొచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలతో ఈనెల 13న మరోసారి సమగ్రంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ లైడార్ సర్వే రిపోర్టుతోపాటు, నాలుగు ప్రతిపాదనలతో కూడి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు సమర్పిస్తారు. 2 ways try chesthe better 1. buckingham canal 2. New canals buckingham canal already undi dani extend chestunaru use that in middle oka pumping station petti try cheyandi elago it passes through nellore oka sari chudandi already una way tho low cost tho pampochu water ni inka 2nd option canals tavadam and pumping ki it takes time in the mean while try the 1st route appudu telustundi Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 6, 2017 Author Share Posted September 6, 2017 Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 6, 2017 Share Posted September 6, 2017 Ippudu malli polavaram ki tenders pilisthe inkaa delay avvada? 2018 lo complete chestham ani oka 100 times cheppi vuntaaru CM & Irrigation minister. Now how it can be completed, at least for storing 60 TMC complete avuthunda by Nov-2018? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 18, 2017 Author Share Posted September 18, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 21, 2017 Author Share Posted September 21, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26, 2017 Author Share Posted September 26, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 26, 2017 Author Share Posted September 26, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 27, 2017 Author Share Posted September 27, 2017 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted November 14, 2017 Share Posted November 14, 2017 http://www.thehindu.com/todays-paper/ap-looking-at-another-riverlinking-project/article17444799.ece see the above link for detail picture about godavari penna link from thehindu Link to comment Share on other sites More sharing options...
RKumar Posted November 14, 2017 Share Posted November 14, 2017 Mundu NS Right canal farmers ki pattiseema water ela supply cheyyochho choodochhu kada, Penna ki linking ante it will take lot of time. Ippatlo start ayye project kaadu probably next term CBN vasthe start avuthundi. APDevFreak 1 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted November 21, 2017 Share Posted November 21, 2017 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted November 21, 2017 Share Posted November 21, 2017 hello friends, when i observed andhrajyothy articles on this topic(godavari penna) , i felt that they are looking for sensation not content. they write articles with half knowledge. if you want clear picture with full content follow eenadu. it is my opinion , you can judge yourself by reading the articles of both papers. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 21, 2017 Author Share Posted November 21, 2017 I నదుల అనుసంధానంపై నివేదిక కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలం ఆయనతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఎగువ కాఫర్ డ్యాంపైనా త్వరలోనే స్పష్టత ఈనాడు - అమరావతి గోదావరి నుంచి పెన్నాకు... ఆ తర్వాత అటు తమిళనాడులోని పాలార్‌కు నీటిని తీసుకువెళ్లేందుకు... ఆపై కావేరి వరకు నదులను అనుసంధానం చేసే ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని, ఈ మేరకు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మహానది నుంచి కూడా నీటిని మనం గోదావరికి తీసుకురావాల్సి ఉందని, అక్కడ మిగులు జలాలు ఉన్నాయని అధికారులు చెప్పగా... తనకు ఆ సంగతి తెలుసన్నారు. తొలుత గోదావరి నీటిని తమిళనాడు వరకు మళ్లించే అంశంపై దృష్టి సారిద్దామని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేద్దామని పేర్కొన్నారు. కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టు సాకారం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీతో తాను ఫోన్లో మాట్లాడానని, పోలవరం ప్రాజెక్టుతో సహా అనేక అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. పోలవరం పునరావాసం ఖర్చు కూడా కేంద్రమే ఇస్తుందన్నారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణంపై కూడా సానుకూలంగానే ఉన్నారన్నారు. అక్కడ ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నట్లుందని, ఎన్‌హెచ్‌పీసీ బృందం విషయంలో కూడా అధికారులు అనుశీలన చేయాలని, వారు వచ్చి వెళ్లి పరిశీలన జరిపిన తర్వాత ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి అనుమతి రావచ్చని అభిప్రాయపడ్డారు. పోలవరం టెండర్లు డిసెంబర్ 15కల్లా ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు. తక్షణమే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్లాట్‌ఫాం పనులు పూర్తి చేసి ‘కెల్లర్ సంస్థకు అప్పచెప్పాలని చెప్పారు. పోలవరంపై సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు జి.సాయిప్రసాద్, శశిభూషణ్‌కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, ఏవీ రాజమౌళి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చెప్పింది చేయకుండా ఎందుకీ ప్రగతి నివేదికలు తాను చెప్పిన దాంట్లో కొంతైనా అమలు చేయకుండా ఎందుకీ ప్రగతి నివేదికలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించుకోవడం లేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల వల్ల పంట నష్టం, తెగుళ్లు సోకిన వైనాన్ని ప్రస్తావించారు. నీరు ప్రగతి, వ్యవసాయ, ఉద్యానవనాలపై సోమవారం సమీక్ష, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జలాశయాల్లో నీళ్లు ఎన్ని ఉన్నాయో పరిశీలించి తక్షణమే రబీ, వచ్చే ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రబీకి ఎంత నీరు ఇవ్వగలం, ఖరీఫ్ మాటేమిటో తేల్చాలన్నారు. రబీలో కూడా పంటలకు సూక్ష్మపోషకాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కర్నూలులో కొన్ని చోట్ల కరవు, ప్రకాశంలో తెగుళ్లు, శ్రీకాకుళంలో భారీ వర్షాల వల్ల పంట నష్టం జరగడం బాధాకరమన్నారు. కర్నూలులోని రెయిన్‌గన్ విధానం అమలు చేస్తే ఉపశమనం కలిగేదని చెప్పారు. త్వరితంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలి ‘తమ తమ నియోజకవర్గాల్లో వివిధ శాఖల పనితీరు, ప్రగతిపై శాసనసభ్యులు సమీక్షించాలని, నిత్యం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద ఇళ్లు పూర్తి చేయించే బాధ్యతను తీసుకోవాలన్నారు. కైజాలా యాప్‌కు బిల్‌గేట్స్ నుంచి ప్రశంసలు లభించాయని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సహకరించేందుకు మిలిందా బిల్‌గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చినందున ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పంట రుణాల మంజూరు వేగవంతం చేయాలన్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now