Jump to content

Godavari- krishna-pennar rivers interlink study


Recommended Posts

పల్నాడుకు గోదారమ్మ
 
636254822817860745.jpg
  • భారీ రిజర్వాయర్‌ కడతాం
  • గోదావరి జలాలను అందులో నింపుతాం
  • అక్కడి నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీరందిస్తాం
  • పెన్షన్లు, రేషన్‌, ఇళ్లపై అభిప్రాయ సేకరణ
  • ప్రజల అభిప్రాయం మేరకు అధికారులపై చర్యలు
  • టీడీపీ కార్యకర్తలూ.. అవినీతి జరక్కుండా చూడండి
  • మీరే అవినీతికి పాల్పడితే.. వదిలి పెట్టను
  • గుంటూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు
గుంటూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతిని నిర్మించడం నాకు భగవంతుడు కల్పించిన తొలి అవకాశమైతే రెండోది పోలవరం. మన జీవితాల్లో వెలుగులు నింపే ప్రాజెక్టు పోలవరం. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను రికార్డు సమయంలో అనుసంధానం చేశాం. 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ఎడమ కాల్వ నుంచి విశాఖపట్టణంకు, కుడి ప్రధాన కాలువ నుంచి గుంటూరు, ప్రకాశం వరకు గోదావరి జలాలను తీసుకొస్తాం. ఆ తర్వాత పెన్నాకు అనుసంధానం చేస్తాం. పల్నాడులో భారీ రిజర్వాయర్‌ నిర్మించి దాని ద్వారా సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.
 
  
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Swarna bro, meeru annadi nijam avutundi....mana state govt chala wise ga plan chestunaru water vishyam matram...

 

Guntur channel extend chesi Gundlakamma ki water istaru meeru cheppinattu...

 

 

C9ivzuWXgAAUB7Z.jpg

 

@AnnaGaru, this is through Buckingham/Kommamuru canal not through Guntur channel. Probably guntur channel capacity (expandable) is not good enough. It is unlikely to get 1000-3000 cusecs at present tail end of Guntur Channel.

 

Even through buckingham canal, they are talking about just 10 TMC transfer. It is quick and cheap plan to transfer some water to Prakasam but can not be called a replacement for 400 TMC plan.

Link to comment
Share on other sites

లైడార్‌ సర్వేకు ఏర్పాట్లు

రక్షణ శాఖ నుంచి అనుమతికి ప్రయత్నాలు

విజయవాడలోనే వ్యాప్కోస్‌ కార్యాలయం

ప్రాజెక్టులు త్వరగా కొలిక్కి తీసుకువచ్చే యోచన

ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులశాఖకు చెందిన మూడు ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌(వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌) నిమగ్నమైంది. గోదావరి-పెన్నా అనుసంధానం, ప్రకాశం బ్యారేజికి ఎగువన అమరావతి వద్ద అక్విడక్టు నిర్మాణం, కృష్ణా-పెన్నా అనుసంధానంపై వీరు పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు. గోదావరి-పెన్నా అనుసంధానం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రబద్ధంగా నిర్ణయించింది. దీనిపై జలవనరులశాఖ ప్రాథమిక కసరత్తు పూర్తిచేయగా లైడార్‌ సర్వే చేసి రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయమూ తెలిసిందే. లైడార్‌ సర్వేకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర రక్షణశాఖకు లేఖ రాశారు. వ్యాప్కోస్‌ కేంద్ర ప్రభుత్వ అనుబంధంగా పని చేసే సంస్థ. రక్షణశాఖ నుంచి అనుమతి తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మే నెలలోనే లైడార్‌ సర్వే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతుంది. దీని వల్ల సూక్ష్మస్థాయి అంశాలతో సహా పరిశీలన పూర్తి చేస్తారు. ఆపై పక్కా ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రధాన ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేసేలా వ్యాప్కోస్‌ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. మాచవరం సమీపంలో ఒక ప్రయివేటు భవనాన్ని ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురుకావడం, తరచు విజయవాడ వచ్చి సమావేశాల్లో పాల్గొనవలసి రావడం, క్షేత్రస్థాయిలోనూ పనుల్లో నిమగ్నం కావాల్సిఉండటంతో వ్యాప్కోస్‌ ఇక ఇక్కడే కార్యాలయం ఏర్పాటు చేయబోతోంది. గోదావరి-పెన్నా అనుసంధానంపై జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు ఆలస్యం కావడానికి వ్యాప్కోస్‌ ప్రతినిదులు హైదరాబాద్‌లో ఉండటమే కారణమనే విమర్శ ఉంది.

గోదావరి-పెన్నా అనుసంధానంతో దాదాపు 320 టీఎంసీల నీటిని మళ్లించాలనేది ఆలోచన. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఈ లోపు ప్రకాశం బ్యారేజి కొమ్మమూరు కాలువ ద్వారా 10 టీఎంసీల వరకు నీటిని గుండ్లకమ్మకు, అక్కడి నుంచి సంగం బ్యారేజికి తరలించేలా మరో పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోంది. ఇది వ్యాప్కోస్‌ చేపడుతోంది. గోదావరి-పెన్నా అనుసంధానం రెండు దశలుగా చేపట్టే అవకాశం ఉంది. తొలి దశలో గోదావరి నుంచి నీటిని కృష్ణా నదిని దాటించి బొల్లాపల్లి జలాశయం వరకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తే...

గోదావరి-పెన్నా ప్రాజెక్టుకు నిధుల సమీకరణ పెద్ద సవాల్‌తో కూడిన అంశమే. ఇతర రాష్ట్రాలకు దీని వల్ల ప్రయోజనం కల్పించేలా రూపుదిద్దగలిగితే జాతీయస్థాయిలో నిధుల సమీకరణకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం అధికారిక వర్గాల్లో ఉంది. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ఈ ఏడాది చివరికల్లా టెండర్ల ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువన అమరావతికి దిగువన వైకుంఠపురం వద్ద బ్యారేజి పనులు ఈ ఏడాదే చేపట్టేలా కసరత్తు సాగిస్తున్నారు.

Link to comment
Share on other sites

yes

Then where do we get that kind of money on our own? Multiple states ki benefit vundi cost share chesukunte, central government might also contribute. Vere vallaki 10-15% (i mean minor share) ivvalsi vastundani manaki vupayoga pade 85% ni waste chesu kovatam enduku?

Link to comment
Share on other sites

  • 1 month later...
2500 కోట్లతో గోదావరి-పెన్నా అనుసంధానం
 
 
  •  వాప్కోస్‌ నివేదిక వచ్చాక పూర్తి పథకానికి రూపకల్పన
అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంలో దేశంలోనే ముందంజలో ఉన్న ఏపీ.. ఇప్పుడు గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలోనూ ముందడుగు వేసేందుకు సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘వాప్కోస్‌’.. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్‌) ఇవ్వడంలో తాత్సారం చేస్తుండడంతో రూ.2500 కోట్ల అంచనాతో కూడిన ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరి నది నుంచి 400 టీఎంసీల నీటిని పెన్నా నదికి మళ్లించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికి గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదిపై నిర్మించే వైకుంఠ పురం జలాశయానికి నీటిని తరలించి.. అక్కడి నుంచి గుండ్లకమ్మ జలాశయానికి, అనంతరం చిన్నిపాడు జలాశయానికి, తర్వాత సోమశిల జలాశయానికి నీటిని చేర్చడం ద్వారా అనుసంధాన కార్యక్రమం చేపట్టాలని వాప్కోస్‌ పేర్కొంది. ఇందుకోసం మధ్యలో 360 టీఎంసీల భారీ జలాశయాన్ని కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాలంటే లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కాగా, ఇంతభారీ ఖర్చు కాకుండా తక్కువ వ్యయం అయ్యేలా డీపీఆర్‌ ఇవ్వాలని వాప్కోస్ను సీఎం ఆదేశించారు. కానీ నివేదిక ఇవ్వడంలో వాప్కోస్‌ ఆలస్యం చేస్తుండడంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రాష్ట్ర జల వనరుల శాఖ సిద్ధం చేసింది.
Link to comment
Share on other sites

  • 1 month later...

గోదావరి పెన్నా సంధానానికి సర్వే

కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు

సర్వే నిర్వహణకు వ్యాప్కోస్‌ కసరత్తు

అనంతరం పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక

ఈనాడు - అమరావతి

గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా లైడార్‌ సర్వేకు కేంద్ర రక్షణశాఖ నుంచి అనుమతులు లభించాయి. ఈ సర్వే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి వరద జలాలను 320 టీఎంసీలకు పైగా పెన్నాకు మళ్లించేందుకు, మధ్యలో బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించేందుకు దాదాపు 700 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకానికి ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధమైంది. ఎక్కడి నుంచి నీటిని ఎక్కడికి ఎలా మళ్లించాలనే విషయంలో వ్యాప్కోస్‌తో పాటు, జలవనరులశాఖ హైడ్రాలజీ విభాగం, జలవనరులశాఖ నిపుణులు కలిసి కూర్చుని ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర జలవనరులశాఖ ఈ బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పచెప్పింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. డ్రోన్ల సాయంతో, సాంకేతికంగాను పూర్తి స్థాయిలో పరిశోధించి ప్రాథమిక ప్రణాళికకు తగ్గట్టుగా అక్కడ భూభౌతిక పరిస్థితులు ఉన్నాయా? లేవా? అన్నది నిర్ధారించుకుని ఆ సమాచారం ఆధారంగా పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తారు. ఈ లైడార్‌ సర్వేకు రక్షణశాఖ అనుమతులు ఇవ్వడంతో దాదాపు మూడు వారాల నుంచి వ్యాప్కోస్‌ బృందం ఇదే పనిలో నిమగ్నమయింది. ఎక్కడ ఏ ఎత్తు నుంచి సర్వే చేయాలి? వాతావరణ పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి? ఎన్ని రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయగలమనే విషయాలపై క్షేత్రస్థాయి కసరత్తు సాగిస్తోంది.

రెండు నెలల్లో అనుకున్నా ఆలస్యం అయ్యింది

మార్చి నెలలో గోదావరి పెన్నా అనుసంధానంపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వ్యాప్కోస్‌ రూపొందించిన నాలుగు ప్రతిపాదనలు, జలవనరులశాఖ హైడ్రాలజీ విభాగం రూపొందించిన మరో ప్రతిపాదనను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిలోని అంశాలను మేళవించి ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ఆయన సూచించగా లైడార్‌ సర్వేకు అనుమతులు కోరారు. అప్పట్లో రెండు నెలల్లోనే ఇది పూర్తి చేయాలనుకున్నా కొంత ఆలస్యమయింది.

లైడార్‌ సర్వేతో పోల్చి చూసి..

ఇప్పుడు సాంకేతికంగా లైడార్‌ సర్వేతో పై ప్రణాళికలోని లెక్కలు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయి? ఏయే అంశాల్లో మార్పులు చేయాలి? ప్రాథమిక ఆలోచన ప్రకారం ప్రాజెక్టు చేపట్టడం సాధ్యమా? కాదా? అన్నది తేలుస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇది ఎలా చేపట్టాలో నిర్ణయించనున్నారు. సీఎం ఈమధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ గోదావరి-పెన్నా అనుసంధానం మూడు దశల్లో చేపట్టవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు రూ.80వేలకోట్లకు పైగా వ్యయమయ్యేలా ఉందని చెప్పారు. ఇది మరో పోలవరం ప్రాజెక్టు వంటిదని వ్యాఖ్యానించారు.

స్థూలంగా ఇదీ ప్రణాళిక * గోదావరి వరద కాలంలో నీటిని ఎత్తిపోస్తూ కృష్ణా నదిని దాటించి అక్కడి నుంచి ఆరుదశల్లో నీటిని ఎత్తిపోస్తూ బొల్లాపల్లి అటవీ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లాలి. అక్కడ పెద్ద జలాశయం నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల జలాశయానికి నీటిని తీసుకువెళ్లవచ్చనేది ప్రాథమిక ప్రణాళిక.

* గోదావరి వద్ద 45.00(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్ల నుంచి 72(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్లకు తొలుత నీటిని ఎత్తిపోస్తారు.

* అక్కడి నుంచి 0.8 కిలోమీటర్ల మేర టన్నెల్‌ ద్వారా నీటిని తీసుకువెళ్లి కాలువలో పోస్తారు. దాదాపు 220.305 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి కృష్ణా నది వరకు ఆ నీటిని గ్రావిటీ ద్వారా తీసుకువస్తారు.

* కృష్ణా నదిలో ఆ నీటిని కలపకుండా నదిపై 3.67 కిలోమీటర్ల మేర అక్విడక్టును నిర్మించి 34.50(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్లకు నీటిని తీసుకొస్తారు. అక్కడి నుంచి ఆరుదశల్లో నీటిని ఎత్తిపోస్తూ కాలువ ద్వారా బొల్లాపల్లి జలాశయానికి నీటిని తీసుకువెళ్తారు. అక్కడ 220(సముద్ర మట్టానికి ఎగువన) మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు.

* అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా 375 కిలోమీటర్ల మేర ప్రయాణించి సోమశిలకు నీటిని చేరుస్తారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...