Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పెరిగిన రేట్లు రాష్ట్రమే భరించింది
20-03-2018 02:50:27
 
  • పోలవరం పనులపై కేంద్రమంత్రి మేఘ్వాల్‌
న్యూఢిల్లీ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ చెప్పారు. సిమెంట్‌, స్టీలు, ఇంధనం, కూలీలు, యంత్రాలు, ఇతర ఉపకరణాలకు మూడేళ్లలో రూ. 331.35కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
 
ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కూలీలు, యంత్రాలు, ఇతర ఉపకరణాల విషయంలో 2013 ఏప్రిల్‌ 1నుంచి రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిందని, అందుకు వీలుగా రెండు జీవోలు జారీ చేసిందని చెప్పారు. పనులను 22 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరు ఏజెన్సీలకు అప్పజెప్పారని తెలిపారు.వారికి ఒప్పందం ప్రకారం కుదిరిన రేట్లు, ఈపీసీ కాంట్రాక్టు షరతుల ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని, అయితే పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు.
Link to comment
Share on other sites

పోలవరం వేగాన్ని పెంచండి
20-03-2018 02:38:34
 
636571103130870909.jpg
  • అవినీతికి తావులేకుండా చూడండి
  • అధికారులకు చంద్రబాబు ఆదేశం
అమరావతి/పోలవరం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు రాం రాం చెప్పిన నేపథ్యంలో తొలిసారిగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షలో జల వనరులశాఖ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కర్తవ్య బోధ చేశారు. పోలవరం పనుల్లో మరింత అప్రమత్తత అవసరమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం సచివాలయంలో వర్చువల్‌ రివ్యూ చేశారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సూపరింటెండింగ్‌ ఇంజనీరు రమేశ్‌బాబుతో సీఎం మాట్లాడుతూ.. ఎక్కడా ఏచిన్న పొరపాటు చోటు చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇదే సమయంలో పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని 25 కెమెరాలనూ ఫైబర్‌ గ్రిడ్‌కు అనుసంధానించాలన్నారు. నెలాఖరులోగా లక్ష క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాలని, 2019 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
 
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నిర్మాణ పనుల ప్రగతి 54.4ు ఉందని వివరించారు. కుడి ప్రధాన కాలువ పనులు 91ు పూర్తయ్యాయని, ఎడమ ప్రధాన కాలువ పనులు 59.6ు దాకా జరిగాయని, హెడ్‌వర్క్స్‌ పనులు 41.2ు పూర్తయ్యాయని వివరించారు. మట్టి పనులు 70ు మేర పూర్తయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ 1,427 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను 10.49 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర జరిగిందన్నారు.
 
ప్రాధాన్య ప్రాజెక్టుల వేగాన్ని పెంచాలి: సీఎం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక, గోరకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు, ఔకు టన్నెల్‌, పులికనుమ ఎత్తిపోతల, కృష్ణానదిపై పెదపాలెం, వీఎల్‌ ఎంసీ మీద చినసన ఎత్తిపోతల పథకాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
 
లైవ్‌లో పరిశీలన
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనుల తీరును కెమేరాల ద్వారా లైవ్‌లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. నవయుగ కంపెనీ ఎండీ శ్రీధర్‌, ప్రాజెక్టు ఎస్‌ ఈ రమే్‌షబాబు ప్రాజెక్టు వద్ద పనితీరును వివరించారు.
Link to comment
Share on other sites

పోలవరానికి రూ.1400 కోట్లు మంజూరు
20-03-2018 21:40:33
 
636571788321491376.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత మిగిలిన రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రెండు విడతల్లో రూ.వెయ్యి కోట్లు చొప్పున నిధులు విడుదల చేయడం జరిగింది.
Link to comment
Share on other sites

సొంత ఖర్చుతోనే పోలవరం హెడ్‌వర్క్స్‌!
21-03-2018 01:24:40
 
636571922794146505.jpg
  • ముఖ్యమంత్రి నిర్ణయం
  • కేంద్రం నుంచి తర్వాత రీయింబర్స్‌ కోరదాం
  • గడువులోగా ప్రాజెక్టు పూర్తే లక్ష్యం
  • కొత్త డీపీఆర్‌పై మళ్లీ కేంద్రం కొర్రీ
  • 1400 కోట్ల మంజూరుకు కేంద్రం ఓకే
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి కేంద్రప్రభుత్వం నిధుల విడుదలలో దాగుడుమూతలు ఆడుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం నిధులిచ్చినా.. ఇవ్వకున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పనులను అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రాజెక్టు ప్రధాన పనులకు (హెడ్‌వర్క్స్‌).. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా సొంతంగానే ఖర్చు చేయాలని నిశ్చయించారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.9,995 కోట్లను ఇందుకు సంపూర్ణంగా వినియోగించనున్నారు. ఆ తర్వాత కేంద్రం నుంచి వాటిని రీయింబర్స్‌ చేయించుకోవాలని భావిస్తున్నారు.
 
 
ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం మరింత పెంచాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ను.. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టిన నవయుగ సంస్థను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. కాగా.. ప్రాజెక్టు వ్యయం అంచనాలను సవరిస్తూ రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై కేంద్రం మళ్లీ కొర్రీ వేస్తున్నట్లు తెలిసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగాక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. కేంద్రమే 2018 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక.. తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడం మినహా.. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రతి పనిలోనూ ఏదో అడ్డంకిని కేంద్రం సృష్టిస్తూనే ఉంది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యాం పనులు మరో వారంలో మొదలవుతాయనగా.. నాటి కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ వాటిని ఆపేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు నివేదిక ఇచ్చేదాకా ఆ పనులు చేయొద్దనిన్నారు. 2 నెలలకు ఆ నివేదిక వచ్చింది. దాని అభిప్రాయాలను కేంద్ర జలసంఘం తోసిపుచ్చింది. కాఫర్‌ డ్యాంకు ఓకే చెప్పింది.
 
 
అలాగే ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ పనులు వేగంగా చేయలేకపోతుండడంతో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను వేరే సంస్థకు అప్పగించడానికి రాష్ట్రం టెండర్లు పిలిస్తే అమర్జిత్‌సింగ్‌ వాటినీ ఆపేశారు. అదేవిధంగా పునరావాసం విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా కొర్రీలు కొనసాగుతున్నాయి. 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.58,319 కోట్లకు పెరిగింది. ఇందులో ఒక్క భూసేకరణ, పునరావాసానికి కోసం చెల్లించాల్సిన మొత్త మే రూ.33,000 కోట్లు. అయితే.. పాత అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నుంచి గానీ, కేంద్రం నుంచి గానీ ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కావడం లేదు. పునరావాస ఖర్చు విషయంలోనే ఎటూ చెప్పడం లేదు.
 
 
రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా లెక్కలు చెబుతున్నా.. పదే పదే అవే కొర్రీలు వేస్తోంది. ఒకవైపు ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన గడువు 2018 వచ్చేయడం.. గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉన్నా ట్రాన్‌స్ట్రాయ్‌ పనులు చేయలేకపోవడం.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీటు పనులు కొత్త కాంట్రాక్టరుకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం టెండర్లు పిలిస్తే కేంద్రం అడ్డుకోవడంతో నాలుగు నెలల విలువైన కాలం పూర్తయింది. చివరకు నవయుగకు పనులు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే నిధుల విడుదల నత్తనడకన సాగుతోంది. ఇంకోవైపు అంచనాల పెంపుదలకు కేం ద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు కనీసం రెండు నెలలైనా పడుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ చెబుతోంది.
Link to comment
Share on other sites

పోలవరంపై రంధ్రాన్వేషణ!
21-03-2018 01:10:02
 
636571914012892450.jpg
  • పనులు, నిధుల వ్యయంపై పీఎంవో ఆరా
  • ఒప్పందాలు, నిర్ణయాలపై పరిశీలన
  • కేంద్ర జలవనరుల కార్యదర్శితో మంతనాలు
  • అవకతవకలుంటే చెప్పాలని ఆదేశం
  • ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకేనా?
న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే ఆ ఘనత మొత్తం ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ భావిస్తోందా? జాతీయ హోదా ఇచ్చిన ఆ ప్రాజెక్టుకు ‘కొత్త’ అడ్డంకులు సృష్టించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయా? ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని.. ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్రం మొండిచేయి చూపిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటును స్తంభింపజేస్తూ.. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి.. ఎన్డీఏ నుంచి కూడా వైదొలగి.. ఏకంగా అవిశ్వాస తీర్మానమే ప్రతిపాదించింది. దీంతో టీడీపీని, చంద్రబాబును రాజకీయంగా ఇబ్బందుల పాల్జేసేలా పావులు కదులుతున్నట్లు సమాచారం.
 
 
అందులో భాగంగా ఢిల్లీ పెద్దలు పోలవరంపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరు, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర జలవనరుల శాఖ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాలు, నిధుల వ్యయంపై ఆరా తీయడంతోపాటు... ‘ఏవైనా అవకతవకలు ఉంటే చెప్పండి’ అని నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలిసింది. పోలవరంపై ఏదో రకంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేయాలన్నదే పీఎంవో ఉద్దేశంగా కనిపిస్తోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
 
 
ముఖ్యంగా ఈ ప్రాజెక్టుపై చొరవ కనబరుస్తున్న కేంద్ర జలవనరులు, రోడ్డు, రవాణా, నౌకాయాన శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి జలవనరుల శాఖను తప్పించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో, రాష్ట్ర అధికారులతో గడ్కరీ నేరుగా సమావేశాలు జరిపి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించారు. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే వారి పునరావాసం విషయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.
 
ఇది మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి అసంతృప్తి కలిగించినట్లు వార్తలొచ్చాయి. గడ్కరీ ఇలాంటి హామీ ఎందుకిచ్చారు? పోలవరం విషయం లో ఆయనకు ఎందుకంత ఆసక్తి? చంద్రబాబుతో ఎందుకు సానుకూలంగా వ్యవహరించారు? మొదలైన అంశాలపై పీఎంవో ఆరా తీసినట్లు సమాచారం. పోలవరం పునరావాస ఖర్చు భరించడంపై ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని ప్రశ్నించినప్పుడు... ఆయన సమాధానం దాటవేసిన సంగతి తెలిసిందే!
Link to comment
Share on other sites

Guest Urban Legend

#UturnModiUncle 

malli debba kottadu state ni 

ఏపీకి కేంద్రం మరో షాక్.. రెండు రోజుల్లో మాట మార్చేసింది! 
 

ఢిల్లీ: ఏపీకి కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు మొదట అనుమతించింది. రెండ్రోజుల్లోనే కేంద్రం మాట తప్పింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి... రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. విభజన చట్టంలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ, వామపక్షాలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కేంద్రం పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత పెట్టడంతో పుండుమీద కారం చల్లినట్టయింది.

polavaram-fff.jpg

Link to comment
Share on other sites

పీపీఏ అక్కర్లేదు!!
23-03-2018 02:24:53
 
636573686933047827.jpg
  • పర్యవేక్షక బాధ్యత రాష్ట్రమే చూస్తోంది
  • వేగంగా పోలవరం స్పిల్‌వే పనులు
  • నవయుగ సంస్థ చేపట్టాక జోరు
  • పీఎంకేఎస్ వై పోర్టల్‌లో ప్రాజెక్టు పురోగతి
  • కేంద్రానికి మసూద్‌ కమిటీ నివేదిక
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఎలాంటి పనీ లేదని.. అసలా సంస్థే అక్కర్లేదని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఇక దానికెలాంటి పనీ లేకుండా పోయిందని తెలిపింది. మోదీ ప్రభుత్వంతో టీడీపీ మైత్రీబంధాన్ని తెంచుకున్న దరిమిలా పోలవరం ప్రాజెక్టు భవితపై విభిన్న ప్రచారాలు చోటు చేసుకుంటున్న సమయంలో కేంద్ర జల వనరుల శాఖ ఎస్‌.మసూద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ ఈ మేరకు నివేదిక ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీ ఈ నెల 15 నుంచి 17 దాకా రాష్ట్రంలో పర్యటించింది. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. అనంతరం నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది. ఇందులో పోలవరం పనుల తీరును ప్రశంసించింది.
 
స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల బాధ్యతలను నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ చేపట్టాక వేగం పెరిగిందని కితాబిచ్చింది. ‘ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపడుతోంది. ప్రస్తుత తరుణంలో పీపీఏ పాత్ర ఏమిటో స్పష్టత లేదు. అందుచేత దీని పాత్రను సమీక్షించాలి. పునర్నిర్వచించాలి. పోలవరం ప్రగతి సమాచారాన్ని ప్రధానమంత్రి కిసాన్‌ సంచాయి యోజన (పీకేఎ్‌సవై) వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయాలి. ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం కోసం విస్తృత ప్రచారం చేయాలి’ అని సూచించింది.
 
ఇంకా ఏమన్నదంటే.. 
 
డయాఫ్రమ్‌వాల్‌..
74 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పనుల్లో థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ అవసరం.
 
 
కాఫర్‌ డ్యాం..
నిర్మాణం మెథడాలజీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయినా గ్రౌటింగ్‌ పనులు మొదలయ్యాయి. 2019 మార్చి నాటికి కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయితే గోదావరి జలాల మళ్లింపు ప్రారంభమవుతుంది. కాంక్రీట్‌ బెంచింగ్‌ ప్లాంట్‌ పనుల్లోనూ పురోగతి కనిపిస్తోంది.
 
 
రేడియల్‌ గేట్లు ..
రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకు సంబంధించి మెటీరియల్‌ సమీకరించారు. గేట్లకు పెయింటింగ్‌ వేసేముందు శాండ్‌ బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉంది.
 
 
హెడ్‌వర్క్స్‌/స్పిల్‌వే పనులు
నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌.. హెడ్‌వర్క్స్‌లో అంతర్భాగమైన స్పిల్‌వే పనుల బాధ్యత తీసుకున్నాక వేగం పెరిగింది. 2017 నవంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ పనులు చాలా మందకొడిగా సాగాయి. ఈ నెల రెండో వారం నుంచి రోజుకు 3000 క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. రోజుకు 6000 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీటు వేయాలన్నది భారీ లక్ష్యమే. ఇది నెరవేరాలంటే.. రోజువారీ పర్యవేక్షణ అవసరం.
 
 
సహాయ, పునరావాసం, భూసేకరణ..
ప్రాజెక్టు కోసం అదనంగా 16621.71 ఎకరాలను సేకరించాల్సి ఉంది. సహాయ పునరావాస కార్యక్రమాలు 2019 నాటికి పూర్తి కావాలి. పైడిపాకలో నిర్మించిన సహాయ పునరావాస కాలనీని పరిశీలించాం. లబ్ధిదారులతో మాట్లాడాం. వారు సంతృప్తిచెందారు.
 
 
ఐకానిక్‌ బ్రిడ్జి..
ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణానికి సామగ్రిని సరఫరా చేసేందుకు స్పిల్‌ చానల్‌ మీదుగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం తలపెట్టింది. ఇది భవిష్యత్‌లో ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వారధిగా ఉపకరిస్తుంది. టూరిజం అభివృద్ధికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి డిజైన్లు ఖరారు దశలో ఉన్నాయి. స్పిల్‌ చానల్‌ కాంక్రీటు పనులకు అంతరాయం లేకుండా దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. డ్యాం డిజైన్‌ సమీక్ష ప్యానెల్‌ (డీడీఆర్‌పీ)కి ఈ ప్రతిపాదనలు పంపాలి.
 
పోలవరాన్ని సందర్శించిన కమిటీలో మసూద్‌తో పాటు పీపీఏ సీఈవో ఎస్‌.కె.హాల్దర్‌, పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, సీడబ్ల్యూసీ జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్‌ జీఎల్‌ బన్సల్‌, సీఈ రంగారెడ్డి, శాస్త్రవేత్త ఆర్‌.చిత్ర, అనిల్‌ జైన్‌, కన్వీనర్‌ అనిల్‌ జైన్‌, రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ రమేశ్‌ బాబు, పోలేశ్వరరావు, శ్రీనివాస్‌ యాదవ్‌, ఎం.నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

మసూద్‌ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు
23-03-2018 11:57:49
 
636574030957577166.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరం పనులు, పునరావాసంపై మసూద్‌ కమిటీని కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా... పోలవరంపై మసూద్‌ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

మసూద్‌ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు
23-03-2018 11:57:49
 
636574030957577166.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరం పనులు, పునరావాసంపై మసూద్‌ కమిటీని కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా... పోలవరంపై మసూద్‌ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

పోలవరం పనులపై మసూద్‌ కమిటీ నివేదిక
23-03-2018 11:52:39
 
636574027591958919.jpg
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మసూద్ కమిటీ నివేదిక పూర్తయింది. పోలవరం పనులు, పునరావాసంపై.. కేంద్ర జలవనరులశాఖ మసూద్‌ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌పై మసూద్‌ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్‌ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది.
Link to comment
Share on other sites

పోలవరంలో అంతా భేష్‌
24-03-2018 02:22:27
 
  • కాంక్రీటు పనుల్లో వేగం.. నాణ్యతా బాగుబాగు.. మసూద్‌ కమిటీ కితాబు
  • వాప్కోస్ తో థర్డ్‌ పార్టీ తనిఖీకి సూచన
  •  కేంద్రం నుంచి రాష్ట్రానికి చేరిన నివేదిక
  •  సీఎం కార్యాలయంలో అందజేత
  • మంత్రులు, ఎమ్మెల్యేలకూ పంపిణీ
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతా సవ్యంగానే జరుగుతోందని కేంద్ర జలసంఘం చైర్మన్‌ ఎస్‌.మసూద్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. పనులు, నాణ్యత, పునరావాసంపై ఈయన ఆధ్వర్యంలో కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీని నియమించిన సంగతి.. ఆ కమిటీ సభ్యులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పోలవరంలో పర్యటించిన విషయం తెలిసిందే. సదరు కమిటీ తన నివేదికను కేంద్ర జలవనరుల కమిషనర్‌కు అందజేసింది. కేంద్రం దానిని రాష్ట్ర జలవనరుల శాఖకు పంపగా.. ఆ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో శుక్రవారం నివేదించింది. నివేదిక ప్రతులను రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, మీడి యా ప్రతినిధులకూ పంపిణీ చేసింది. మసూద్‌ కమిటీ తన నివేదికలో పోలవరం పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది.
 
పనుల్లో వేగం పెరిగిందని.. నాణ్యతా ప్రమాణాలూ బాగున్నాయని కితాబిచ్చింది. థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోస్‌ ద్వారా చేయించాక మరింత స్పష్టత వస్తుందని పేర్కొంది. మసూద్‌ తన నివేదికలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు బాగున్నాయని పేర్కొనడం రాష్ట్ర జల వనరుల శాఖకు అమిత సంతోషాన్నిచ్చింది.
 
నివేదికలో ఏముందంటే..
‘ప్రాజెక్టు ప్రధాన పనుల్లో అత్యంత కీలకమైన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీటు పనులు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొత్త కాంట్రాక్టు సంస్థ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి అప్పగించే ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నవయుగ రంగంలోకి దిగాక పనుల్లో వేగం పెరిగింది. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు ఇప్పటిదాకా రోజుకు 1700 క్యూబిక్‌ మీటర్ల మేర జరిగితే.. నవయుగ వచ్చాక 3000 క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణంలో భాగంగా చేపట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ పనులు 74 శాతం మేర పూర్తయ్యాయి. ఈ పనుల్లో థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ ఉంటే బాగుంటుంది.
 
కాఫర్‌ డ్యాం నిర్మాణం 2019 మార్చి నాటికి పూర్తవుతుంది. టన్నెల్‌ ద్వారా కుడి ప్రధాన కాలువను అనుసంధానం చేసే పనులు సమాంతరంగా చేపట్టాలి. పోలవరం నిర్మాణం పూర్తయితే ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మసూద్‌ కమిటీ పేర్కొంది. 540 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపింది.
Link to comment
Share on other sites

పోలవరం...రాకెట్‌ వేగం!
25-03-2018 03:37:26
 
  • శరవేగంగా సాగుతున్న స్పిల్‌వే నిర్మాణం
  • పుంజుకున్న కాంక్రీట్‌ పనులు
  • 74శాతం పూర్తయిన డయాఫ్రమ్‌ వాల్‌
  • గేట్లకోసం లూబ్రికేటింగ్‌ బుష్‌ల దిగుమతి
ఏలూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు రాకెట్‌ వేగం తో దూసుకుపోతున్నాయి. స్పిల్‌వే, డయాఫ్రమ్‌ వాల్‌, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులన్నీ ఇప్పుడు జోరందుకున్నాయి. నవయుగ కంపెనీకి అప్పగించిన నాటినుంచి స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు కూడా వేగవంతమయ్యాయి. రోజుకు 4 వేల క్యూబిక్‌ మీటర్లకు పైబడి కాంక్రీట్‌ వర్క్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదేవేగం కొనసాగితే ఈ వేసవి సీజన్‌లోనే పనుల్లో రికార్డు పురోగతి నమోదయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆయా విభాగాల్లో పురోగతి ఇదీ..
 
స్పిల్‌వేలో శరవేగం
ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే అత్యంత కీలకం. ఈ పనులను పూర్తి చేసేందుకు మొదటినుంచి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి 6లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. ఇంకా మిగిలిన 10.39లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని శరవేంగా పూర్తి చేయడం కోసం ఇప్పటికే ఉన్న యంత్రాలకు తోడు మరిన్నింటిని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటివరకూ రోజుకు 3వేల నుంచి 3,200 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. వీటిని 4వేల క్యూబిక్‌ మీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీ దీనిని ఒక సవాల్‌గా తీసుకుంది.
 
పుంజుకున్న ఎర్త్‌వర్క్‌
చాలాకాలం పాటు స్పిల్‌ చానల్‌ పనులు మందకొడిగా సాగినా ఆ తరువాత పుంజుకున్నాయి. స్పిల్‌వేకు దిగువున నిర్మించే స్పిల్‌ చానల్‌ నిర్మాణానికి 6.5కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4.74కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేశారు. మిగిలిన 1.75కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పురోగతిలో ఉంది. ఇక అప్రోచ్‌ చానల్‌ నిర్మాణానికి వీలుగా కోటి 31లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ జరగాల్సి ఉండగా 30లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఒకవైపు ఎగువన ఎర్త్‌వర్క్‌లన్నీ చురుగ్గా సాగుతుండగా ఈ విషయంలో మాత్రం కొంత మందకొడితనం కనిపిస్తోంది. దీనిపై ఇటీవల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
 
కాఫర్‌ డ్యామ్‌లలో పనుల జోరు
దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో భాగంగా 1,487 మీటర్లలో జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 1,098 మీటర్లు పూర్తికాగా, మరో 319మీటర్ల పని చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి వైపున నీటి ప్రవాహం కొనసాగడంతో ఈ పనులు సాధ్యం కాలేదు. ఇటీవలే ఈ ప్రవాహాన్ని మళ్లించి, పూర్తిగా మట్టికట్ట వేశారు. ఈ సీజన్‌లోనే పెండింగ్‌ పని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను రెండు నెలల క్రితమే సీఎం ప్రారంభించారు. ఈ స్వల్ప వ్యవధిలోనే 2,050 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌కు గాను ఇప్పటికి 525 మీటర్ల పని పూర్తి చేశారు. మరో 1,525 మీటర్లలో పని జరగాల్సి ఉంది. స్పిల్‌వే ఎగువన అమర్చాల్సిన 48 రేడియల్‌ గేట్ల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. అయితే వీటిని అమర్చేందుకు సెల్ఫ్‌ లూబ్రికేట్‌ బుష్‌లు అవసరం. మొత్తం 96బుష్‌లకు గాను జపాన్‌ నుంచి ఇప్పటికే 16 ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాయి. మిగిలిన 80 బుష్‌ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చారు. ఇవి వస్తేనే గేట్ల అమరికకు వీలు ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
 
పోలవరం చరిత్రాత్మకం: నితిన్‌ గడ్కరీ
 ఏపీలో నిర్మిస్తున్న పోలవరం చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని, దీనికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణాది రాష్ట్రాల వార్షిక సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో పుష్కలమైన నదులు ఉన్నా సమగ్రంగా నీటిని వాడుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. పోలవరం బ్యాక్‌వాటర్‌ను కృష్ణానదికి అనుసంధానం చేయడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు నీటి సౌలభ్యం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో మహరాష్ట్ర సరిహద్దున కాళేశ్వరం వద్ద ఇంద్రావతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. 99 ప్రాజెక్టుల నిర్మాణాలకు లక్ష కోట్లు ఖర్చుచేయనున్నట్టు చెప్పారు.
 
డయాఫ్రమ్‌ వాల్‌... మే చివరికి పూర్తి
ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక అంశమైన డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని 1,427 మీటర్లుగా నిర్ణయించారు. ఇప్పటిదాకా 1,050 మీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. మిగిలిన 378మీటర్ల నిర్మాణాన్ని మే నెలఖారు నాటికి పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ నెల నుంచే అత్యధికంగా శ్రమించాలని భావిస్తున్నారు. ఇంజనీర్ల అంచనా ప్రకారం 74 శాతం పనులు దాదాపు పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

9 minutes ago, Jeevgorantla said:
పోలవరం బ్యాక్‌వాటర్‌ను కృష్ణానదికి అనుసంధానం చేయడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు నీటి సౌలభ్యం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో మహరాష్ట్ర సరిహద్దున కాళేశ్వరం వద్ద ఇంద్రావతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. 99 ప్రాజెక్టుల నిర్మాణాలకు లక్ష కోట్లు ఖర్చుచేయనున్నట్టు చెప్పారు.

abbah...chaala ideas unnayi. polavaram nundi Telangana ki Water istharu anta. evadayya veediki advisor. :roflmao::roflmao:

Link to comment
Share on other sites

పోలవరం...రాకెట్‌ వేగం!
25-03-2018 03:37:26
 
  • శరవేగంగా సాగుతున్న స్పిల్‌వే నిర్మాణం
  • పుంజుకున్న కాంక్రీట్‌ పనులు
  • 74శాతం పూర్తయిన డయాఫ్రమ్‌ వాల్‌
  • గేట్లకోసం లూబ్రికేటింగ్‌ బుష్‌ల దిగుమతి
ఏలూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు రాకెట్‌ వేగం తో దూసుకుపోతున్నాయి. స్పిల్‌వే, డయాఫ్రమ్‌ వాల్‌, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులన్నీ ఇప్పుడు జోరందుకున్నాయి. నవయుగ కంపెనీకి అప్పగించిన నాటినుంచి స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు కూడా వేగవంతమయ్యాయి. రోజుకు 4 వేల క్యూబిక్‌ మీటర్లకు పైబడి కాంక్రీట్‌ వర్క్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదేవేగం కొనసాగితే ఈ వేసవి సీజన్‌లోనే పనుల్లో రికార్డు పురోగతి నమోదయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆయా విభాగాల్లో పురోగతి ఇదీ..
 
స్పిల్‌వేలో శరవేగం
ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే అత్యంత కీలకం. ఈ పనులను పూర్తి చేసేందుకు మొదటినుంచి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి 6లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. ఇంకా మిగిలిన 10.39లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని శరవేంగా పూర్తి చేయడం కోసం ఇప్పటికే ఉన్న యంత్రాలకు తోడు మరిన్నింటిని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటివరకూ రోజుకు 3వేల నుంచి 3,200 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. వీటిని 4వేల క్యూబిక్‌ మీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీ దీనిని ఒక సవాల్‌గా తీసుకుంది.
 
పుంజుకున్న ఎర్త్‌వర్క్‌
చాలాకాలం పాటు స్పిల్‌ చానల్‌ పనులు మందకొడిగా సాగినా ఆ తరువాత పుంజుకున్నాయి. స్పిల్‌వేకు దిగువున నిర్మించే స్పిల్‌ చానల్‌ నిర్మాణానికి 6.5కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4.74కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేశారు. మిగిలిన 1.75కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పురోగతిలో ఉంది. ఇక అప్రోచ్‌ చానల్‌ నిర్మాణానికి వీలుగా కోటి 31లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ జరగాల్సి ఉండగా 30లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఒకవైపు ఎగువన ఎర్త్‌వర్క్‌లన్నీ చురుగ్గా సాగుతుండగా ఈ విషయంలో మాత్రం కొంత మందకొడితనం కనిపిస్తోంది. దీనిపై ఇటీవల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
 
కాఫర్‌ డ్యామ్‌లలో పనుల జోరు
దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో భాగంగా 1,487 మీటర్లలో జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 1,098 మీటర్లు పూర్తికాగా, మరో 319మీటర్ల పని చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి వైపున నీటి ప్రవాహం కొనసాగడంతో ఈ పనులు సాధ్యం కాలేదు. ఇటీవలే ఈ ప్రవాహాన్ని మళ్లించి, పూర్తిగా మట్టికట్ట వేశారు. ఈ సీజన్‌లోనే పెండింగ్‌ పని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను రెండు నెలల క్రితమే సీఎం ప్రారంభించారు. ఈ స్వల్ప వ్యవధిలోనే 2,050 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌కు గాను ఇప్పటికి 525 మీటర్ల పని పూర్తి చేశారు. మరో 1,525 మీటర్లలో పని జరగాల్సి ఉంది. స్పిల్‌వే ఎగువన అమర్చాల్సిన 48 రేడియల్‌ గేట్ల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. అయితే వీటిని అమర్చేందుకు సెల్ఫ్‌ లూబ్రికేట్‌ బుష్‌లు అవసరం. మొత్తం 96బుష్‌లకు గాను జపాన్‌ నుంచి ఇప్పటికే 16 ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాయి. మిగిలిన 80 బుష్‌ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చారు. ఇవి వస్తేనే గేట్ల అమరికకు వీలు ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
 
పోలవరం చరిత్రాత్మకం: నితిన్‌ గడ్కరీ
 ఏపీలో నిర్మిస్తున్న పోలవరం చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని, దీనికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణాది రాష్ట్రాల వార్షిక సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో పుష్కలమైన నదులు ఉన్నా సమగ్రంగా నీటిని వాడుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. పోలవరం బ్యాక్‌వాటర్‌ను కృష్ణానదికి అనుసంధానం చేయడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు నీటి సౌలభ్యం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో మహరాష్ట్ర సరిహద్దున కాళేశ్వరం వద్ద ఇంద్రావతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. 99 ప్రాజెక్టుల నిర్మాణాలకు లక్ష కోట్లు ఖర్చుచేయనున్నట్టు చెప్పారు.
 
డయాఫ్రమ్‌ వాల్‌... మే చివరికి పూర్తి
ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక అంశమైన డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని 1,427 మీటర్లుగా నిర్ణయించారు. ఇప్పటిదాకా 1,050 మీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. మిగిలిన 378మీటర్ల నిర్మాణాన్ని మే నెలఖారు నాటికి పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ నెల నుంచే అత్యధికంగా శ్రమించాలని భావిస్తున్నారు. ఇంజనీర్ల అంచనా ప్రకారం 74 శాతం పనులు దాదాపు పూర్తయ్యాయి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...