Guest Urban Legend Posted October 19, 2016 Posted October 19, 2016 http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20161019b_001139014.jpg
sonykongara Posted October 19, 2016 Author Posted October 19, 2016 విజయవాడ ఎయిర్‌పోర్టు అదరహో! ఈ ఏడాది 6,46,593 మంది ప్రయాణిస్తారని అంచనా అదరగొట్టింది! దేశీయ, అంతర్జాతీయ విమానయాన రంగాన్ని నివ్వెర పరిచే ఫలితాలను సాధించి .. విజయవాడ ఎయిర్‌పోర్టు రికార్డు సృష్టించింది. అమరావతి రాజధానికే గర్వకారణంగా నిలిచింది. రాజధాని చెంతనే ఉండటం, పెరిగిన ఆపరేషన్స్ విజయవాడ విమానాశ్రయానికి మంచి ఊపును తెచ్చి పెట్టాయి. 2016 - 17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సర ఫలితాలలో తానేమిటో మరోమారు సత్తా చూపింది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ): గన్నవరం ఎయిర్‌పోర్టు ప్రయాణికుల రాకపోకలు, ఆపరేషన్స్, ఫ్లైట్ మూవ్‌మెంట్స్‌లో ఇలా ప్రతి అంశంలో కూడా సగటున 72 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. కిందటి ఆర్థిక సంవత్సరం (2015 - 16) లో సాధించిన ఫలితాని కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణీకుల రాకపోకలు సాగించటానికి మార్గం సుగమం అవుతోంది. ఈ ఏడాది (2016 - 17) తొలి అర్థ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 3,19,725 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. కిందటి ఆర్థిక సంవత్సరం (2015 - 16)లో మొత్తంగా 4,04,464 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. దీనిని బట్టి చూస్తే ఇంకా ఆరు నెలల సమయం మనకు ఇంకా ఉంది. అంటే కిందటి మొత్తం సంవత్సరం టార్గెట్‌ను కూడా అధిగమించి 6.46,593 మంది ప్రయాణీకులతో రెట్టింపు లక్ష్యానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధానితో మహర్దశ అమరావతి రాజధాని ప్రాంతం చెంతనే ఉండటం కలిసొచ్చింది. నయా రాజధానిలో వ్యాపారం చేయాలనుకునే బిజినెస్ పీపుల్, పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్స్, ఫారిన్ డెలిగేట్ టీమ్స్ భారీ స్థాయిలో రాకపోకలు సాగించటం కూడా ఎయిర్‌పోర్టు వృద్ధి సాధించటానికి దోహద పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక దేశాలు పర్యటించి అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించటం వల్ల ఫారిన్ డెలిగేషన్ టీమ్స్ రాకపోకలు పెరిగాయి. పెరిగిన ఆపరేషన్స్ విమానాశ్రయం నుంచి ఆపరేషన్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కిందటేడాది 15 - 18 మాత్రమే విమానాలు రోజుకు నడిచేవి. ఇప్పుడు వాటి సంఖ్య 25 కు పైగా చేరింది. ముఖ్యంగా కనెక్టివిటీ బాగా పెరిగింది. కిందటి ఏడాది లేని రూట్లలో కూడా ఈ ఏడాది విమానాలు నడుస్తున్నాయి. తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ ప్రాంతాలకు అదనంగా విమానాలు నడుస్తున్నాయి. కిందటి ఏడాది రాత్రిపూట చార్టర్డ్ విమానాలు తప్పితే షెడ్యూల్డ్ విమానాలు నడవలేదు. నైట్ ల్యాండింగ్ సదుపాయం ఉన్నా.. రాత్రిపూట విమానాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. కనెక్టివిటీ పెరిగే విషయంలో విమానాశ్రయ ఉన్నతాధికారుల పాత్రను కూడా ఈ విషయంలో అభినందించాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మదసూదనరావు ఎయిర్‌పోర్టు ఆపరేటర్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఎయిర్ లైన్ ఆపరేటర్స్‌తో చక్కటి సమన్వయాన్ని పెంపొందించుకున్నారు. విమానయాన సంస్థలకు సహకరించేవారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను అంచనా వేస్తే, డిమాండ్ ను పరిశీలిస్తూ వీటికి సంబంధించి ట్రెండ్స్ ఎలా ఉన్నాయో.. విమానయాన సంస్థలకు తెలియపరిచేవారు. దీంతో ఉభయుల నడుమ సమన్వయం పెంపొందటం వల్ల కనెక్టెడ్ ఫ్లైట్స్‌కు మార్గం సుగమం అయింది. రాత్రిపూట విమాన సర్వీసులు నడటం కూడా ప్లస్‌గా మారింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాత్రి 8.30 గంటల సమయంలో వారంలో ఐదు రోజుల పాటు ఢిల్లీకి నేరుగా విమానాలు నడుపుతుంది. ఈ విమానం ఫుల్ అయిపోతోంది. డిమాండ్‌ను గమనించిన ఎయిర్ ఇండియా వింటర్ షెడ్యూల్‌గా వారంలో 7 రోజుల పాటు నడపాలని నిర్ణయించింది. నవంబర్ మాసం నుంచి వారంలో 7 రోజుల పాటు ఈ విమానాన్ని నడపనున్నారు. పాసింజర్ ట్రాఫిక్ ఇలా.. ఏప్రిల్ - సెప్టెంబర్ వరకు ప్రయాణీకుల రాకపోకలు - 3,19,725 కిందటి సంవత్సరం ఇదే సంవత్సరం రాకపోకలు - 1,86,558 వృద్ధి శాతం 71.38 ు ఈ ఏడాది జూలై - సెప్టెంబర్ వరకు రాకపోకలు - 1,69,185 కిందటేడాది ఈ మూడు నెలల కాలంలో రాకపోకలు 94,455 వృద్ధి శాతం 79.12% మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్ (ఏప్రిల్ - సెప్టెంబర్ ) - 5,764 మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్ (2015 ఏప్రిల్ - సెప్టెంబర్ ) - 3,332 కిందటి సంవత్సరంతో పోల్చితే వృద్ధి 72.99% మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్‌మెంట్స్(జూలై - సెప్టెంబర్ ) - 3,057 కిందటి సంవత్సరం మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్స్ మూవ్‌మెంట్స్ (జూలై - సెప్టెంబర్ ) - 1,711 వృద్ధి రేటు 78.67 భవిష్యత్తును నిర్దేశిస్తోంది ఈ ఫలితాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. రాజధాని మన దగ్గరే ఏర్పాటు కావటం వల్ల ఊహించని ఫ్లోటింగ్ పెరిగింది. రద్దీ కనుగుణంగా విమాన రాకపోకలు పెరిగాయి. ప్రయాణీకులు పెరిగారు. విమానాల ట్రిప్పుల సంఖ్య పెరిగింది. తొలి అర్థ సంవత్సరం ఊహించని ఫలితాలను చవిచూశాం. రెండవ అర్థ సంవత్సరం పూర్తయ్యే సమయానికి రికార్డు స్థాయిలో రెట్టింపు సంఖ్యలో ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. విమానాశ్రయ విస్తరణ జరిగితే అంతర్జాతీయ స్థాయికి ఏఏఐ ప్రతిపాదిస్తుంది. త్వరగా భూములు వస్తే.. గొప్ప అడుగుపడినట్టుగా భావించాల్సి ఉంటుంది. - జి.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్
PP SIMHA Posted November 1, 2016 Posted November 1, 2016 raju garu em chesthunnaru...... sarayina parking ledu , taxi service ledhu , kanisam daridapuloo hotels levu , inka run way expansion avaledhu . as of now unnadi 7000 , kanisa security check in ledhu , intenational status e category lo istahru vayaa .. A, B , C classifications untayi ... kanisam gananvarm classification daridapulooki kuda radhu .. enti raju garu ichedi .. lite mundu CBN ni land allot cheyamanadni a tarvatha Raju agrini anochu ..
sonykongara Posted November 1, 2016 Author Posted November 1, 2016 sarayina parking ledu , taxi service ledhu , kanisam daridapuloo hotels levu , inka run way expansion avaledhu . as of now unnadi 7000 , kanisa security check in ledhu , intenational status e category lo istahru vayaa .. A, B , C classifications untayi ... kanisam gananvarm classification daridapulooki kuda radhu .. enti raju garu ichedi .. lite mundu CBN ni land allot cheyamanadni a tarvatha Raju agrini anochu .. janalu land ivvakunda emi allot chesthadu
sonykongara Posted November 4, 2016 Author Posted November 4, 2016 నవ్యాంధ్రకు ఆయువుపట్టయిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ఇక శరవేగంగా జరగనుంది. ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోవడంతో వీలైనంత త్వరగా దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే పనుల్లో వేగం పుంజుకోనుంది. గురువారం విజయవాడలో జరిగిన కీలక సమావేశంలో పనులు వేగంగా జరగాలని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులకు సూచించడంతో పాటు, ఇప్పటివరకు విస్తరణకు అవసరమైన భూసేకరణకు ప్రధాన అడ్డంకిగా మారిన ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై సమీక్షించేందుకు గురువారం సాయంత్రం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బాబు.ఎ, ఎయిర్‌పోర్ü్ట అథారిటీ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు దీనికి హాజరయ్యారు. విమానాశ్రయ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు. రన్‌వేను 2,286 మీటర్ల నుంచి 4,430 మీటర్లకు రెండు దశల్లో విస్తరించేందుకు కార్యాచరణ చేపట్టిన నేపథ్యంలో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా పనులు మరింత వేగవంతం కావాలని మంత్రి దేవినేని ఉమా సూచించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. * ఏలూరు కాల్వ యథాతథం: విమానాశ్రయ విస్తరణకు ఏలూరు కాల్వ ఇప్పటివరకు ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విమానాశ్రయం 536 ఎకాల విస్తీర్ణంలో ఉండగా మరో 1,200 ఎకరాలు సేకరించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఎకరాకు 1450 గజాల చొప్పున భూమి కేటాయించేలా సమీకరణ చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 700 ఎకరాల వరకు సమీకరించారు. మిగతాది ఏలూరు కాల్వ మళ్లింపు అవసరాల కోసం కావడంతో కాల్వ మళ్లింపుని వ్యతిరేకిస్తున్న వారంతా భూ సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనివల్ల అదనపు భూమి సేకరించడంతో పాటు, గన్నవరం మండలంలో పలు గ్రామాలు చీలిపోవడం, వందల నివాసాలు తొలగించాల్సి వస్తున్నందున ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని వీరంతా డిమాండ్ చేస్తూ వచ్చారు. రన్‌వే విస్తరణకు అధికారులు మూడు ప్రతిపాదనలు రూపొందించిన క్రమంలో ఏలూరు కాల్వ మళ్లించకుండా ఉన్న మొదటి ప్రతిపాదనను ఖాయం చేయాలనేది వీరి విజ్ఞప్తిగా ఉంది. అయితే భవిష్యత్తులో ఏలూరు కాల్వ జల రవాణా మార్గంగా మారే అవకాశం ఉన్నందున ఏలూరు కాల్వను మళ్లించడమే మేలని నిపుణులు సూచించడంతో ఇప్పటివరకు ప్రతిష్టంభన నెలకొంది. * నిర్వాసితుల వైపే మొగ్గు: ఏలూరు కాల్వ మళ్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు ముఖ్యమంత్రిని, ఇతర పెద్దల్ని కలిసి కాల్వ మళ్లింపు ప్రతిపాదన్ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలకు సిద్ధమయ్యారు. గన్నవరం నియోజకవర్గంలో వేల ఎకరాల భూ సేకరణ జరిగినా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోగా, ఒక్క ఈ విషయంలోనే సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదనను విరమించుకోవాలని, జలరవాణాకు అవసరమైతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చెపపడంతో ఆ సమావేశంలో ఈ విషయమే ప్రస్తావించినట్లు వంశీమోహన్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దీంతో విమానాశ్రయ విస్తరణకు సంబంధించిన పురోగతి ఇక వేగవంతం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది.
swas Posted November 8, 2016 Posted November 8, 2016 Multi level parking pettandi 5 to 10 times more parking cheyochu
sonykongara Posted November 9, 2016 Author Posted November 9, 2016 సిద్ధమవుతున్న గన్నవరం కొత్త టెర్మినల్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ ఆఖరకు కొత్త టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే, అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి మార్గం సుగుమం అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 137 కోట్లతో, ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. 9520 చదరపు మీటర్ల ఏరియాలో, ప్రీ ఫ్రాబ్రికేటెడ్ విధానంతో, పూర్తీ స్టీల్ అండ్ గ్లాస్ నమూనాతో ఈ టెర్మినల్ సిద్ధమవుతుంది. 500 మంది వరకు ఒకే సారి అకామిడేట్ చెయ్యగల సామర్ధ్యం ఈ టెర్మినల్ కు ఉంది. 16 వరకు చెక్ ఇన్ కౌంటర్లు ఉంటాయి. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ శాఖలు నిడిపే వీలుగా, దీన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. 300 వరకు కార్లు పార్క్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే డిజైన్ కు తగ్గట్టు, టెర్మినల్ కి ఓకే రూపు వచ్చింది. గ్లాస్ ఫిట్టింగ్ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి, ఈ కొత్త టెర్మినల్ కు అవసరమైన రోడ్డు నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలోనే ఇంటీరియర్ పనులు మొదలపెట్టనున్నారు. అమరావతి థీమ్ తో, ఈ ఇంటీరియర్ ఉండబోతుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే, అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి మార్గం సుగుమం అవుతుంది.
Lakshman NTR Posted November 9, 2016 Posted November 9, 2016 సిద్ధమవుతున్న గన్నవరం కొత్త టెర్మినల్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ ఆఖరకు కొత్త టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే, అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి మార్గం సుగుమం అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 137 కోట్లతో, ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. 9520 చదరపు మీటర్ల ఏరియాలో, ప్రీ ఫ్రాబ్రికేటెడ్ విధానంతో, పూర్తీ స్టీల్ అండ్ గ్లాస్ నమూనాతో ఈ టెర్మినల్ సిద్ధమవుతుంది. 500 మంది వరకు ఒకే సారి అకామిడేట్ చెయ్యగల సామర్ధ్యం ఈ టెర్మినల్ కు ఉంది. 16 వరకు చెక్ ఇన్ కౌంటర్లు ఉంటాయి. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ శాఖలు నిడిపే వీలుగా, దీన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. 300 వరకు కార్లు పార్క్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే డిజైన్ కు తగ్గట్టు, టెర్మినల్ కి ఓకే రూపు వచ్చింది. గ్లాస్ ఫిట్టింగ్ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి, ఈ కొత్త టెర్మినల్ కు అవసరమైన రోడ్డు నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలోనే ఇంటీరియర్ పనులు మొదలపెట్టనున్నారు. అమరావతి థీమ్ తో, ఈ ఇంటీరియర్ ఉండబోతుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే, అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి మార్గం సుగుమం అవుతుంది. Super
Anne Posted November 9, 2016 Posted November 9, 2016 mana capital oka rupu vachae varuku traffic koncham avg ganae untadi... mid east ,singarpore china direct flights esate best....
Nfdbno1 Posted November 9, 2016 Posted November 9, 2016 aithe 2nd airport mangalagiri annaru, adi lenatte na?
AnnaGaru Posted November 9, 2016 Posted November 9, 2016 Modi CASH shock debbaki Land pooling ani call cheste egabadi istaru CBN caught that point and getting the plans to front again Today fresh Bandar port pooling ki kuda headache poyinatle e debbatoyearly 50K white money on a 2 lakh registration value land ante "mahaprasadam" ippudu Kummu CBN inka LAND POOLING ki addu ledu. Doosukellu Infra projects meda. Landpooling ichinodiki benefit anthe. This Modi effect will help getting land easily than before for infra projects. http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/996609/67aeeaf2-5448-4a8e-a937-7ad83df305b7 K D No.2 1
swarnandhra Posted November 9, 2016 Posted November 9, 2016 Modi CASH shock debbaki Land pooling ani call cheste egabadi istaru e area lo Airport ki CBN caught that point and getting the plans to front again Today fresh Bandar port pooling ki kuda headache poyinatle e debbato yearly 50K white money on a 2 lakh registration value land ante "mahaprasadam" ippudu Kummu CBN inka LAND POOLING ki addu ledu. Doosukellu Infra projects meda. Land ichinodiki benefit anthe. http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/996609/67aeeaf2-5448-4a8e-a937-7ad83df305b7 meeru gannavaram pooling gurunchi matladutunnaru anukunna. vaallu ivvaru. andhrajyothy article (link) lo chusinaka ardham ayyindi mangalagiri gurinchi ani. inthaki mangalagiri lo airport confirm aa brother?
AnnaGaru Posted November 9, 2016 Posted November 9, 2016 meeru gannavaram pooling gurunchi matladutunnaru anukunna. vaallu ivvaru. andhrajyothy article (link) lo chusinaka ardham ayyindi mangalagiri gurinchi ani. inthaki mangalagiri lo airport confirm aa brother? I am talking about any infra land acquisition overall across state. Because CBN was going smooth illogical demands started cropping all over. Now RE crash will help LAnd pooling for sure. gannavaram lo ichina adi only runway temporary extension ki matrame ani vachindi. There is no scope for Terminal and no.of runway increase without canal diversion. Also finally after agitations they decided to keep canal as is. Look below and you can see keeping canal as is there is not much scope. https://www.google.com/maps/place/16%C2%B031'25.2%22N+80%C2%B047'40.8%22E/@16.52367,80.7924873,842m/data=!3m2!1e3!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d16.52367!4d80.794676
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now