Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి
 
635965595008404550.jpg
  • 3,96,579 మంది విమాన ప్రయాణం
  • గతేడాది కంటే 1,62,962 మంది పెరుగుదల
ప్రయాణికులలో 70 శాతం, విమానాల్లో 40శాతం వృధ్ధి నవ్యాంధ్రప్రదేశకు తలమానికంగా.. అంతర్జాతీయ స్థాయి హంగులు అందుకోబోతున్న విజయవాడ విమానాశ్రయం రికార్డు సాధించింది. ఈ ఏడాది గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 3,96,579 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ సాధించని విధంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమరావతి రాజధాని ప్రధాన బెజవాడ ఎయిర్‌పోర్టు వృద్ధిని సాధించటం విశేషం. దేశంలోని ర్యాపిడ్‌ ఎయిర్‌పోర్టులలో గన్నవరంలోని బెజవాడ ఎయిర్‌పోర్టు పతాక స్థాయిలో ఉందనటానికి నిదర్శనంగా 2015-16 ఆర్థిక సంవత్సరపు లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.
 విజయవాడ :
రాజధాని ఎయిర్‌పోర్టుకు సరికొత్త కళ వచ్చింది. అమరావతి రాజధానికి గన్నవరంలోని విజయవాడ ఎయిర్‌పోర్టు తలమానికంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విజయవాడ ఎయిర్‌పోర్టు సాధిస్తున్న ఫలితాలు చూస్తే.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రజ్యోతి సేకరించిన వివరాలలో విజయవాడ ఎయిర్‌పోర్టు గణనీయమైన వృద్ధిని చాటుకుంది. విమాన రాకపోకలు, ముఖ్యంగా ప్రయాణీకుల రాకపోకల్లో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించటం జరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,96,579 మంది ప్రయాణికులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో 2,33,617 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. కిందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 1,62,962 మంది ప్రయాణీకులు అదనంగా విమాన ప్రయాణాలు చేశారు.
కిందటేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 70 శాతం మేర ప్రయాణీకులలో వృద్ధి కనిపించటం గమనార్హం. ఇది నిజంగా శుభ సూచికం. దేశంలోని ఓ చిన్న ఎయిర్‌పోర్టు ఇంత వృద్ధి రేటును సాధించటం సామాన్యమైన విషయం కాదు. కిందటేడాది 19 శాతం మాత్రమే వృద్ధి సాధించటం గమనార్హం. ఒక్కసారి గత ఐదేళ్ళుగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల శాతాన్ని పరిశీలిస్తే.. 2010-11లో 77,131 మంది, 2011-12 లో 1,57,531 మంది, 2012-13లో 1,69,624, 2013-14 లో 1,95,714 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
విమానాల జోష్‌
దాదాపుగా అర దశాబ్దకాలం కిందట 2010-11 ఆర్థిక సంవత్సరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరణ జరిగాయి. అప్పట్లో కింగ్‌పిషర్‌ ఎయిర్‌లైన్స ఒక్కటే నడిచేది. ఆ తర్వాత దక్కన ఎయిర్‌వేస్‌లు హైదారాబాద్‌, విశాఖపట్నంలకు తిరిగాయి. ఆ తర్వాత జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు విమానాలను నడిపాయి. వీటి తర్వాత ఎయిర్‌ ఇండియా హైదరాబాద్‌ కనెక్టివిటీతో ఢిల్లీకి విమానం నడుపుతోంది. తర్వాత ఎయిర్‌ కోస్తా కూడా షెడ్యూల్స్‌ను నడుపుతోంది. ప్రస్తుతం మొత్తంగా 21 ఫ్లైట్‌ షెడ్యూల్స్‌ ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా ఢిల్లీకి అదనంగా డైరెక్ట్‌ ఫ్టైట్‌ ఉదయం సమయంలో నడుపుతోంది. తాజాగా సాయంత్రం కూడా మరో ఫ్లైట్‌ను నడుపుతోంది. ఎయిర్‌ ఇండియా బెంగళూరుకు కూడా మరో సర్వీసును నడుపుతోంది. విశాఖకు కూడా ఉదయం సమయంలో ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసును నడుపుతోంది. ఎయిర్‌ కోస్తా ఉదయం సమయంలో బెంగళూరుకు సర్వీసును నడుపుతోంది. స్పైస్‌ జెట్‌ సంస్థ హైదరాబాద్‌తో పాటు చెన్నైకు కూడా విమాన సర్వీసులు నడుపుతోంది. ఈ సర్వీసులతో పాటు చిత్తూరు, కడపలకు విమాన సర్వీసులు నడపటానికి టర్బో మెగాజెట్‌ సంసిద్ధంగా ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా మరికొన్ని ప్రాంతాలకు సర్వీసులు నడుపుతోంది. తాజాగా ఎయిర్‌ పెగాసెస్‌ విమానయాన సంస్థ జూలై నుంచి విజయవాడకు ఆపరేషన్స ప్రారంభించబోతోంది. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. సింగపూర్‌కు విజయవాడ నుంచి సర్వీసు నడపటానికి ఆదేశి ఎయిర్‌లైన్స ఆసక్తి చూపిస్తోంది. ఎయిర్‌ ఏషియా, గల్ఫ్‌ విమానయాన సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

విమానాల ఆపరేషన్
2015-16 ఆర్థిక సంవత్సరంలో విమానాల మూవ్‌మెంట్స్‌ 7596 ట్రిప్స్‌గా నమోదు అయ్యాయి. విమానాల మూవ్‌మెంట్స్‌లో 41 శాతం వృద్ధి సాధించటం విశేషం. కిందటి ఆర్థిక సంవత్సరం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5386 మూవ్‌మెంట్స్‌ జరిగాయి. 14 శాతం వృద్ధి సాధించటం జరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 2797 మూవ్‌మెంట్స్‌ , 2011-12లో 4372 మూవ్‌మెంట్స్‌ (56 ు వృద్ధి), 2012-13లో 3979 (-9), 2013 -14లో 4733 (19ు) మేర విమానాల మూవ్‌మెంట్స్‌ జరిగాయి.

 

Link to comment
Share on other sites

సింగపూర్‌కు విజయవాడ నుంచి సర్వీసు నడపటానికి ఆదేశి ఎయిర్‌లైన్స ఆసక్తి చూపిస్తోంది. ఎయిర్‌ ఏషియా, గల్ఫ్‌ విమానయాన సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

 

Super.

Link to comment
Share on other sites

Guest Urban Legend

may be maxiumun 1 or 2 yrs ante...

 

2 yrs

runway extension ki first ah lands pool cheyyali ...adhey big headache aipoyindhi

Link to comment
Share on other sites

గన్నవరం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ సేవలు విజయవాడ :ఎయిర్‌ఇండియా ప్రారంభించే అంతర్జాతీయ సర్వీసులతో గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ కస్టమ్స్‌ కమిషనర్‌ ఎస్‌.ఖాదర్‌రెహమాన పేర్కొన్నారు. సోమవారం ఆటోనగర్‌లోని కస్టమ్స్‌ రాష్ట్ర కార్యాలయంలో ఎయిర్‌ఇండియా స్టేషన మేనేజర్‌ ఎమ్‌.రామసుబ్రమణయనకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెహమాన మాట్లాడుతూ, నూతన రాజధానికి అనుగుణంగా మరిన్ని నూతన సర్వీసులను ఎయిర్‌ ఇండియా సంస్థ ప్రవేశపెట్టాలని కోరారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు వేదికగా మారనున్న గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల పర్యవేక్షణ పెరగనున్నదన్నారు. 
కస్టమ్స్‌, ఎయిర్‌ఇండియా పరస్పర సహకారం, సమన్వయం ప్రయోజనకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎయిర్‌ ఇండియా స్టేషన మేనేజర్‌ ఎమ్‌.రామసుబ్రమణియన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతిలో ఎయిర్‌ ఇండియా మరిన్ని నూతన సేవలు విస్తరింపచేయటానికి సిద్ధంగా ఉందన్నారు. కస్టమ్స్‌ కమిషనర్‌ ద్వారా సత్కార గౌరవాన్ని పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ వివేక్‌గుప్తా మాట్లాడుతూ రామ సుబ్రమణియన మంచి పనిసామర్ధ్యం ఉన్న అధికారి అని కొనియాడారు.
ఈ సందర్భంగా నవ్యాంధ్రలో అంతర్జాతీయంగా నూతన సేవలు అందించటానికి విశేషంగా కృషి చేస్తున్న ఎయిర్‌ ఇండియా స్టేషన మేనేజర్‌ రామసుబ్రమణియనను కస్టమ్స్‌ కమిషనర్‌ రెహమాన దుశ్మాలువా, జ్ఞాపికతో సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కస్టమ్స్‌ సూపరింటెండెంట్లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, మద్దూరి శ్రీనివాస్‌, రమణారావు, షేక్‌ మస్తాన, మిక్కిలినేని శ్రీనివాసు, సామ్రాజ్యం, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

delhi 1st anukunta with nearly 5 crores passengers per year

 

Maharastra airports lo top 10 lo 3 airports unayi

2. mumabai

9.pune

10. Goa

22. Nagpur

46. Aurangabad

 

top 50 lo 5 airports wow asalu.

 

vizag is in 19th position and vijayawada last year 47th undi and hyd 6th

Link to comment
Share on other sites

రాజధాని కేంద్రంగా... ఎయిరిండియా మహా ప్లాన్
 
635968238920461443.jpg
  • విజయవాడ నుంచి దేశ వ్యాప్తంగా సర్వీసులు
  • ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖలకు సర్వీసులు
  • ఢిల్లీకి ఎయిర్‌బస్‌ శ్రేణి విమానాలు
  • ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్న ప్రతినిధులు

విజయవాడ విమానాశ్రయం నుంచి దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ మహా ప్లాన రూపొందించుకుంటోంది. గన్నవరం నుంచి విస్తృత స్థాయిలో విమాన సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌ ఇండియా నూతన రాష్ట్ర రాజధానిని టార్గెట్‌ చేసుకుంటోంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలకు విమానాలను నడపాలన్న ఆలోచనతో ఎయిర్‌ ఇండియా అధ్యయనం చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

విజయవాడ విమానాశ్రయం నుంచి దేశవ్యాప్తంగా ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ మహా ప్లాన రూపొందించుకుంటోంది. గన్నవరం నుంచి విస్తృత స్థాయిలో విమాన సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌ ఇండియా నూతన రాష్ట్ర రాజధానిని టార్గెట్‌ చేసుకుంటోంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలకు విమానాలను నడపాలన్న ఆలోచనలో ఎయిర్‌ ఇండియా అధ్యయనం చేస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇప్పటికే ఎయిర్‌ ఇండియా ఆరు షెడ్యూల్స్‌ను నడుపుతోంది. నడిపే షెడ్యూల్స్‌ అన్నీ భారీ శ్రేణివే కావటం గమనార్హం. నాలుగు ఎయిర్‌ బస్‌ శ్రేణి విమానాలను ఎయిర్‌ ఇండియా నడుపుతోంది.
 
 
ఎయిర్‌బస్‌ - 319, ఎయిర్‌బస్‌ - 320 విమానాలు రెండేసి చొప్పున నడుపుతోంది. మిగిలినవన్నీ ఏటీఆర్‌ విమానాలను నడుపుతోంది. ఢిల్లీకి నడిపే విమానాలన్నింటినీ ఎయిర్‌ బస్‌ శ్రేణి విమానాలనే నడుపుతోంది. గన్నవరం నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా విమానాలను నడుపుతోంది. ఢిల్లీకి ఉదయం సమయంలో డైరెక్టుగా ఫ్లైట్‌ను నడుపుతోంది. సాయంత్రం హైదరాబాద్‌కు లింక్‌ అవుతూ ఢిల్లీకి నడిచేలా విమానాన్ని నడుపుతోంది. ఈ క్రమంలో అమరావతి రాజధానిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సేవలను విస్తరించాలన్న ఆలోచనను ఎయిర్‌ ఇండియా చేసింది. ఇందులో భాగంగా ఈ సంస్థ విమాన ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటోంది. ఈ అధ్యయనంలో భాగంగానే రాత్రి సమయంలో కూడా ఢిల్లీకి డైరెక్టుగా మరో సర్వీసును ప్రవేశపెట్టగలిగింది. ఈ సర్వీసు కూడా సత్ఫలితాలను ఇస్తోంది.
 
 
ఇక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరే ఈ సర్వీసు ఢిల్లీకి వెళ్ళే సరికి రాత్రి 11 గంటలు అవుతోంది. ఢిల్లీలో ఒక రోజు ఉండి పనులు చూసుకు వచ్చే వారికి, విదేశీ ప్రయాణికులకు ఇది సౌలభ్యంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రతి రోజూ రాత్రి 1.30 నుంచి తెల్లవారుజాము వరకు అమెరికా, ఆస్ర్టేలియా, ఆఫ్రికా, గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే విమానాలు అందుబాటులో ఉంటాయి. కోస్తా జిల్లాల నుంచి దాదాపు 20 లక్షలకు పైగా ఎనఆర్‌ఐలు ఉన్నారని అంచనా. వీరికి తోడు విదేశీ పర్యాటకులు, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.
 
 
వీరంతా విదేశాలకు వెళ్లే విమానాలు బయలుదేరే సమయాని కంటే రెండు గంటలు ముందుగానే అక్కడికి చేరేవిధంగా ఎయర్‌ ఇండియా రాత్రి సర్వీసులను నడుపుతోంది. ఈ సర్వీసుతో పాటు ఈ సంస్థ బెంగళూరుకు, విశాఖకు ప్రవేశపెట్టిన సర్వీసులు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్‌ ఇండియా ఉత్తర భారత దేశంలోని ముంబాయి, జైపూర్‌, కోచి తదితర ప్రాంతాలకు కూడా విమానాలు నడిపేందుకు అధ్యయనం చేస్తోంది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచే విమానాలు నడిచే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...