Jump to content

Kia in Anantapur !

Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
తొలిరోజు చంద్రబాబు దక్షిణకొరియా పర్యటనలో ..
04-12-2017 19:25:30
 
636480123314866117.jpg
 
సియోల్‌: తొలిరోజు సీఎం చంద్రబాబు దక్షిణకొరియా పర్యటనలో కియా అనుబంధ పరిశ్రమల పెట్టుబడులు ఖరారు చేసుకున్నారు. ఏపీలో 4,995.20 కోట్ల పెట్టుబడులు కియా అనుబంధ సంస్థలు పెట్టనున్నారు. కియా అనుబంధ సంస్థల ద్వారా 7,171 ఉద్యోగాలు రానున్నాయి. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో.. లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకున్నారు. ఏపీ ఈడిబీ ఒప్పందం విలువ రూ.3000 కోట్లు.
Link to comment
Share on other sites

కొరియా పథం
రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో  ‘కొరియా నగరం’
మూడు దశల్లో రూ.10వేల కోట్ల పెట్టుబడి
తొలిరోజు కుదిరిన రెండు ఒప్పందాలు
అనంత, అమరావతిల్లో ‘లొట్టె’ పెట్టుబడులు
దక్షిణకొరియాలో పలుసంస్థలతో చంద్రబాబు భేటీ
ఈనాడు - అమరావతి
4ap-main4a.jpg

వ్యాంధ్రలో పెట్టుబడులకు దక్షిణకొరియాకు చెందిన పలు పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయి. మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించడానికి సియోల్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ దేశ అధికారులు, పలు పరిశ్రమలు ఘనస్వాగతం పలికాయి. పలు సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తొలిరోజు రెండు ఒప్పందాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటవనున్న కొరియా నగరం, కియాకు-విక్రేత సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రికి, రాష్ట్ర అధికారుల బృందానికి కియా కార్ల ప్రత్యేకతను సంస్థ అధికారులు వివరించారు. సోమవారం జరిగిన ప్రత్యేక విందులో కియా సీఈఓ హ్యూంగ్‌ కీన్‌ లీ, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు గ్యూన్‌ కిమ్‌ తదితరులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణకొరియా రెండో రాజధానిగా భావించి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నారు. మీకు ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తవని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కొరియా ప్రాథమిక విద్యా వ్యవస్థపై తమ ప్రభుత్వం అధ్యయనం చేయదలిచిందన్నారు. కీన్‌ లీ మాట్లాడుతూ తమ సంస్థ విద్యుత్తు వాహనాల తయారీ కూడా ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఒక్కసారి ఛార్జి చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు తయారు చేశామని, దాన్ని సామర్థ్యం 200 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. అమరావతిలో విద్యుత్తు వాహనాలను వినియోగించనున్నామని, తమకు సహకరించాలని సీఎం కోరారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్‌. అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమలశాఖ  ప్రతినిధి ప్రీతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

4ap-main4b.jpg

తొలి రోజు
కొరియా నగరం: అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. తొలిదశలో 700 ఎకరాలు సేకరిస్తారు. మూడుదశల్లో మొత్తం రూ.10వేల కోట్ల పెట్టుబడులకు 37 కొరియా సంస్థలు ముందుకొచ్చాయి. పారిశ్రామిక నగరం, టౌన్‌షిప్‌, నక్షత్రాల హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్‌కోర్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ప్రాథమికంగా 9వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. మూడుదశలయ్యేటప్పటికి 40 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో పలు కొరియా సంస్థలు అంగీకార పత్రాల (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)పై సంతకాలు చేశాయి. ఇక్కడ కనీసం వంద కొరియా సంస్థలు వస్తాయని అంచనా.
కియా విక్రేత సంస్థలు: కియాకు చెందిన 17 విక్రేత పరిశ్రమలు, ఏపీఐఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థలు ఇక్కడ రూ.4,995 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 7,171 మందికి ఉపాధి లభించనుంది.
లొట్టె: 1.80 లక్షల మంది ఉద్యోగులున్న ఈ సంస్థ అతిపెద్దదైన వాటిల్లో 8వది. చాక్లెట్‌ తదితర రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చంద్రబాబుతో లొట్టె సీఈఓ వాంగ్‌ కాగ్‌ జు భేటీ అయ్యారు. అనంతపురం, అమరావతిలో హోటళ్లు, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

4ap-main4c.jpg

దాసన్‌: దాసన్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ నామ్‌ మెయిన్‌తో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి ఏపీ ఫైబర్‌నెట్‌పై ప్రదర్శన ఇచ్చారు.  ఫిబ్రవరిలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. భారత్‌లో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది.
జుసంగ్‌: ఇంధన రంగ ఉత్పత్తుల్లో ప్రసిద్ధ సంస్థ. సీఎంతో సీఈఓ వాంగ్‌ చుల్‌ జు భేటీ అయ్యారు. 2022కల్లా భారత్‌లో 100 గిగావాట్‌ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 3.4 గిగావాట్‌ల కేంద్రాలు భారత్‌లో ఉన్నాయి. నవశకం ఎల్‌ఈడీ బల్బుల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు వాంగ్‌ తెలపగా...ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
ఐరిటెక్‌: ఐరిస్‌ ఆధారిత సొల్యూషన్స్‌ సంస్థ సీఈఓ కిమ్‌ డెహోన్‌తో భేటీ. ఇప్పటికే రాష్ట్రంలో కలసి పనిచేస్తున్న ఐరిటెక్‌. ఈ నెల 10 తర్వాత రాష్ట్రానికి వస్తానన్న కిమ్‌ డెహోన్‌. ఏపీ ప్రభుత్వం అమలు చేయదలచిన భూదార్‌ను సీఎం వివరించారు.
పోస్కోదేవూ: భారత్‌లో ఎల్‌ఎన్జీ వాల్వ్‌ చెయిన్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు జుసీబో వెల్లడి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వివరించిన సీఎం.
హ్యోసంగ్‌: నైలాన్‌ పాలిస్టర్‌ రంగంలో అనుభవమున్న ఈ సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆంధ్రాకు వస్తే ఏ రాష్ట్రం ఇవ్వలేనంత రాయితీలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
కోకమ్‌: ఎనర్జీ స్టోరేజీలో ప్రసిద్ధ సంస్థ. జీవితకాలం పనిచేసే అత్యాధునిక బ్యాటరీల తయారీపై పరిశోధనలు చేస్తున్నట్లు చంద్రబాబుకు ఆ సంస్థ సీఈఓ జేజే హాంగ్‌ వివరించారు. భారత్‌తో తమకు అనుబంధం ఉందని, కొరియా భాషలో పది శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని వెల్లడించారు.
హెనోల్స్‌ కెమికల్స్‌: ఆంధ్రాలో నీటిశుద్ది పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గెనెబోక్‌ కిమ్‌ ఆసక్తి. స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే పెయింట్‌ను కూడా తయారు చేసే ఈ సంస్థను విశాఖ భాగస్వామ్య సదస్సుకు సీఎం ఆహ్వానించారు. గ్రాన్‌ సియోల్‌ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.

Link to comment
Share on other sites

ఏపీకి వస్తాం..!
05-12-2017 03:04:52
 
636480398928560360.jpg
  • 8 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం
  • దక్షిణ కొరియా సంస్థల అంగీకారం
  • సీఎం పర్యటన తొలిరోజే పెట్టుబడుల వెల్లువ
  • 37 సంస్థలతో ఏపీఈడీబీ ఒప్పందాలు
  • ఈ సంస్థల పెట్టుబడి విలువ 3 వేల కోట్లు
  • ‘కియ’ పెట్టుబడి మరో రూ.5 వేల కోట్లు
  • అనంతలో బీటీఎన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ
  • లొట్టే, కోకమ్‌, దాసన్‌ సంస్థలతో సీఎం భేటీ
  • ‘కియ’ స్ఫూర్తిగా పెట్టుబడులు పెట్టండి
  • కొరియా పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
 
‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రండి. మీకు అవసరమైన అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తాం.
ఈ విషయంలో మీ దేశానికే చెందిన ‘కియ’ మోటార్స్‌ మీకు స్ఫూర్తి కావాలి.’ - ముఖ్యమంత్రి చంద్రబాబు
 
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ కొరియా పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. మూడు రోజుల పర్యటన కోసం దక్షిణ కొరియాకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజే సుమారు రూ.8 వేల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించడంలో విజయవంతమయ్యారు. 37 కొరియా సంస్థలు ఏపీలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ)తో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ టు ఇన్వె్‌స్టమెంట్‌(ఎల్‌వోఐ)పై సంతకాలు చేశాయి. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 7171 ఉద్యోగాలు రానున్నాయి. వీటితోపాటు కియ అనుబంధ సంస్థలు అన్నీ కలిపి రాష్ట్రంలో రూ.4995.20 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. సోమవారం ఉదయం కియ మోటార్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సీఎం బృందం సందర్శించింది. అనంతరం కియ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రండి. ఈ విషయంలో మీ దేశానికే చెందిన ‘కియ’ మోటార్స్‌ మీకు స్ఫూర్తి కావాలి’ అని పేర్కొన్నారు. కియా మోటార్స్‌ ప్రాజెక్టు పట్ల తాము ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలో కొరియా టౌన్‌షిప్‌ నిర్మించడానికీ ఆసక్తితో ఉన్నామన్నారు. ఏపీ, దక్షిణ కొరియా నడు మ అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. ఏపీ లో తమ పెట్టుబడులపై కియ అనుబంధ సంస్థ లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.
 
ఈ సంస్థల ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని వివరించాయి. అనంతపురం జిల్లాలో కియ మోటార్స్‌ సంస్థకు కేటాయించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఏపీఐఐసీ అధికారులు వివరించారు.
 
దక్షిణ కొరియాలో కియ అనుబంధ సంస్థలను ఒకేసారి కలుసుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కియ ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. అనేక అవరోధాలను, ప్రతికూలతలను అధిగమించి దక్షిణ కొరి యా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు ప్రశంసించారు. ఇక్కడి పరిశ్రమలతోనూ బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నామన్నారు.
 
ఏపీలో ఎలాంటి వ్యాపార అవరోధాలూ తలెత్తబోవని హామీ ఇచ్చారు. ఏపీలో మౌలిక వసతులకు కొదవ లేదని, శాంతిభద్రతలు సమస్య లేదని, ఎటువంటి కార్మిక అశాంతి లేని వాతావరణం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని కియ అనుబంధ సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కియ అనుబంధ సంస్థల ప్రతినిధులు కోరిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
 
పలు దిగ్గజ సంస్థలతో భేటీ
హేన్సోల్‌ కెమికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టెఫాని, జనరల్‌ మేనేజర్‌ గెనెబోక్‌ కిమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్‌ఫోన్‌లో వాడే పె యింట్ల తయారీలో హేన్సోల్‌ పేరొందింది. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సీఎం వీరిని కోరారు. అనంతరం గ్రాన్‌ సియోల్‌(జీఎస్‌) ఇంజనీరింగ్‌ అండ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ ఫోరెస్టు లిమ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు టె జిన్‌కిమ్‌, హూన్‌ హాంగ్‌ హూ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లిమ్‌చాంగ్‌ మిన్‌తో సీఎం భేటీ అయ్యారు.
 
క్రీడారంగంలో విశేషానుభవం ఉన్న ఈ సంస్థకు అథ్లెటిక్స్‌కు శిక్షణ ఇచ్చే స్టేడియం నిర్మాణాల్లో పేరుంది. అమరావతి క్రీడా నగరంలో పాలుపంచుకోవాలని వీరిని సీఎం ఆహ్వానించారు. దాసన్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్‌ చైర్మన్‌ నామ్‌ మొయిన్‌ వూతో ముఖాముఖి చర్చలు జరిపారు.
 
సాఫ్ట్‌వేర్‌, ఐవోటీ, ఈఎంసీ ఇంజనీరింగ్‌, ఆటో పార్ట్స్‌ సెక్టార్లలో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌గా ఉన్న దాసన్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఇప్పటికే రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌తో కలసి పనిచేస్తోంది. భారీ పెట్టుడులతో రాష్ట్రానికి రావాలని దాసన్‌ను సీఎం ఆహ్వానించారు. జుసంగ్‌ టెక్నాలజీ సంస్థ సీఈవో వాన్గ్‌ చుల్‌ జుతోనూ సీఎం భేటీ అయ్యారు. లైటింగ్‌ ఎక్విప్ మెంట్‌, సోలార్‌ సెల్స్‌, ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన సాంకేతికతలో జుసంగ్‌ టెక్నాలజీ సంస్థ పేరొందింది.
 
2022 కల్లా భారత్‌లో 100 గిగా వాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పేందుకు యోచిస్తున్నామని జుసంగ్‌ సీఈవో పేర్కొనగా ఏపీలో ఈ యూనిట్‌ నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరారు. ఐరిటెక్‌ కంపెనీ సీఈవో కిమ్‌ డెహూన్‌తో సీఎం ముఖాముఖీ చర్చలు జరిపారు. ఐరిస్‌ ఆధారిత బయోమెట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌లో ఐరిటెక్‌ పేరొందింది. ఇప్పటికే ఐరిటెక్‌ కంపెనీ ఏపీ సర్కార్‌తో కలిసి పనిచేస్తోంది.
 
లొట్టే, కోకమ్‌ సీఈవోలతో భేటీ
కియ అనుబంధ సంస్థలతో సమావేశం అనంతరం లొట్టే కన్ఫెక్షనరీ సీఈవో వాంగ్‌ కాగ్‌జు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లిమ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. లొట్టేతో కలిసి పనిచేసేందుకు సంయుక్త బృందం ఏర్పాటుకు నిర్ణయించారు. అనంతరం చంద్రబాబుతో కోకమ్‌ గ్రూపు సీఈవో జేజే హాంగ్‌ భేటీ అయ్యా రు. లిథియం పాలిమర్‌ బ్యాటరీస్‌ తయారీలో కోకమ్‌ గ్రూపు పేరొందింది.
 
కియా పరిశ్రమ భూమి చదును పనులు పూర్తి 
atp-gen6a.jpg

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కియా కార్ల తయారీ పరిశ్రమ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పరిశ్రమ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో 600 ఎకరాల భూమిని కేటాయించి.. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ సంస్థతో భూమి చదును పనులు చేయిస్తున్న విషయం విధితమే. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన 600 ఎకరాల్లో ప్రధాన పరిశ్రమ నిర్మాణం కోసం 535 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలో కాలువలు, అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉంది. మొత్తం భూమిని ఐదు దశల్లో భూమి చదును చేసేలా ఎల్‌అండ్‌టీ జూన్‌ 2017లో పనులు ప్రారంభించింది. ప్రధాన పరిశ్రమ కోసం కేటాయించిన 535 ఎకరాల్లో ఇప్పటికే వంద శాతం భూమి చదును పనులు పూర్తయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. నెల నుంచి పలుచోట్ల ప్రధాన పరిశ్రమ నిర్మాణం కోసం కియా నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పరిశ్రమ నిర్మాణ పనులు మొదలవటంతో గుట్టలాగా ఉన్న ఆ ప్రాంతం విశాలంగా మారింది. పరిశ్రమకు సంబంధించి పెయింట్‌షాప్‌, బాడీషాప్‌, ప్రెస్‌షాప్‌, ఇంజన్‌షాప్‌, టూల్‌షాప్‌, అని వివిధ రకాలుగా విభజించి ప్రధాన పరిశ్రమ ఏర్పాటుకోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం సర్వీసురోడ్డు, కాలువ పనులకు సంబందించిన పనులు నిర్వహించాల్సి ఉంది.

అందరి సమన్వయంతోనే.. 
నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయటం సంతోషంగా ఉంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయటంతోనే పనులు వేగంగా నిర్వహించగలిగాం. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయటంతో ఏపీఐఐసీకి గుర్తింపు దక్కింది. ఎల్‌అండ్‌టీ సంస్థతో 24గంటలు పని చేయించటంతోనే పూర్తయింది. ప్రస్తుతం ప్రధాన పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సర్వీసు రోడ్డు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి, కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి చేస్తాం.

- హరిధర్‌రావు, ఏపీఐఐసీ, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌
Link to comment
Share on other sites

కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంది : బాబు
05-12-2017 14:08:37
 
636480797188323211.jpg
బుసాన్‌: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుసాన్‌లో బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని చెప్పారు. ఏపీలో ఎప్పుడూ పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, ఏపీకి సీఎన్‌బీసీ 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం వచ్చిందని బాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిందని, మూడేళ్లలో 26 పురస్కారాలను గెలుచుకున్నామని ఆయన పేర్కొన్నారు. ‘కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంద’ని అన్నారు. ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజీని ఇస్తున్నట్లు చెబుతూ... రాష్ట్రంలో కొలువుదీరుతున్న పరిశ్రమల గురించి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
 
ఏపీలో 14 ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఏపీ రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసిందని, వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి సాధించామని, తాము స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా ఏపీని అభివృద్ధి చేయాలని ముందుచూపుతో కృషి చేస్తున్నామని అన్నారు. 80 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏపీకి ఇసుజు, కియా, హీరో, భారత్ బెంజ్ పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాధారిత, ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తున్నాయని, గుడ్లు, పండ్లు, ఉద్యాన ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్నామని, వస్త్ర పరిశ్రమ, మొబైల్ పరిశ్రమలు కూడా పెద్దఎత్తున వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఫాక్స్‌కాన్, ఎంఐ, జియోనీ తదితర సంస్థలు వచ్చాయని, సంక్షోభంలో తమ ప్రయాణాన్ని ఆరంభించామని, ఏపీలో గొప్ప వనరులు ఉన్నాయని, అనేక అంశాలలో సానుకూలతలు కొరియా కష్టాలను ఎదుర్కొందని, అనూహ్యంగా అభివృద్ధి సాధించిందని, నవ్యాంధ్ర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
Link to comment
Share on other sites

kudos to Govt Officers !! 

"అందరి సమన్వయంతోనే.. 
నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయటం సంతోషంగా ఉంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయటంతోనే పనులు వేగంగా నిర్వహించగలిగాం. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయటంతో ఏపీఐఐసీకి గుర్తింపు దక్కింది. ఎల్‌అండ్‌టీ సంస్థతో 24గంటలు పని చేయించటంతోనే పూర్తయింది. ప్రస్తుతం ప్రధాన పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 
ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సర్వీసు రోడ్డు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి, కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి చేస్తాం. - హరిధర్‌రావు, ఏపీఐఐసీ, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ "

Link to comment
Share on other sites

13 minutes ago, AnnaGaru said:

bro,eroju evaro cbn korea tour lo chebutunnaru bro. kia vallu A  land ni chusi  chadunu cheyytaniki min 9 months - 1year padutundi anukunnaru anta, mana vallu 3 months lo chesi ichharu anta.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి కొరియా పెట్టుబడులు..!
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా మూడు రోజులపాటు దక్షిణ కొరియాలో చేసిన పర్యటన విజయవంతమైందని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపామని, విమానం దిగిన 45 నిమిషాలకే మొదటి సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు. ‘‘దక్షిణ కొరియా ప్రస్తుతం చైనాలో పెట్టుబడులకు ఆసక్తిగా లేదు. ప్రత్యామ్నాయ మార్కెట్‌ల వైపు చేస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ని రెండో ఇల్లుగా చేసుకోమని వారికి సూచించాను. అనంతపురం కేంద్రంగా చేసుకుని... కియా టౌన్‌షిప్‌లో పెట్టుబడులు పెట్టాలని, ఫుడ్‌ప్రాసెసింగ్‌, విద్య, ఆక్వా, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపాం’’ అని చంద్రబాబు వెల్లడించారు. కియా మోటార్స్‌ రాష్ట్రంలో ఆటోమొబైల్‌ పరిశ్రమలకు ఊపు వచ్చిందన్నారు. రూ.5 వేల కోట్లతో కియాకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకి 37 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపారు. ఈ కంపెనీలు అనంతపురంలో కొరియా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తాయన్నారు. తమిళనాడు వంటి చోట్ల ఉన్న కొరియా కంపెనీలు కూడా అనంతపురం వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయని, మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం కొరియాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కియా మోటార్స్‌ సంస్థ అధ్యక్షుడు హాన్‌ వూ పార్క్‌, బూసన్‌లోని భారత ప్రభుత్వ గౌరవ కాన్సుల్‌గా పనిచేస్తున్న జియాంగ్‌ డియోక్‌-మిన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా గుర్తిస్తామని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

On 12/5/2017 at 7:26 AM, AnnaGaru said:

kudos to Govt Officers !! 

"అందరి సమన్వయంతోనే.. 
నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయటం సంతోషంగా ఉంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయటంతోనే పనులు వేగంగా నిర్వహించగలిగాం. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయటంతో ఏపీఐఐసీకి గుర్తింపు దక్కింది. ఎల్‌అండ్‌టీ సంస్థతో 24గంటలు పని చేయించటంతోనే పూర్తయింది. ప్రస్తుతం ప్రధాన పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 
ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సర్వీసు రోడ్డు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి, కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి చేస్తాం. - హరిధర్‌రావు, ఏపీఐఐసీ, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ "

kudos to Govt Officers!!!

Link to comment
Share on other sites

కియా కారొచ్చిందోచ్‌!
14-12-2017 03:03:24
 
636488174087979278.jpg
దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా సొరెంటో కారు అనంతపురం వచ్చింది. పెనుకొండ వద్ద నిర్మాణం చేపడుతున్న కియా మోటర్‌ పరిశ్రమకు త్వరలో ఆ కంపెనీ చైర్మన్‌ రానున్నారు. ఆయన కోసం ఈ కారును ముందస్తుగా దిగుమతి చేసి అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతీయ రవాణశాఖ కార్యాలయంలో బుధవారం రిజిస్ర్టేషన్‌ చేయించినట్లు ఆర్టీఓ మల్లికార్జున తెలిపారు. కియా మోటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ పేరు మీద సొరెంటో మోడల్‌ రూ. 34.50 లక్షలు కాగా, సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌, రోడ్‌ ట్యాక్స్‌లు రూ. 4.83 లక్షలు, రూ. 7500 రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించినట్లు చెప్పారు. ఈ కారుకు ఏపీ 02 బీపీ 2454 నంబర్‌ను కేటాయించినట్లు రవాణ శాఖ అధికారులు తెలిపారు.
 
-హిందూపురం
Link to comment
Share on other sites

  • 2 weeks later...
6 minutes ago, DiehardNTRfan said:

KIA is totally going to change the complexion of  Anantapur district and bordering areas of Karnataka ..the work and the progress that is going on has to be seen to be believed...just mind boggling 

saho CBN 

I hope this is just the beginning... On both Agriculture side and Industry side, 2017 will remain as one of the most significant year in the history of Anantapur district. At the same time locals should also start investing locally instead of going to other cities like Bangalore/Hyderabad/Amaravati.

Link to comment
Share on other sites

It seems KIA SORANTO is the vehicle to be mfg in Andhra plant based on circumstantial points

/*****************

2016-Kia-Sorento-01.jpg

The latest generation of Kia's flagship 7-seat SUV, the Sorento, has been seen doing the rounds in Andhra Pradesh.

However, unlike other Kia models which are meant for export markets and have been previously seen on our roads bearing international plates, the particular test mule has been spotted with registration belonging to Kia Motors India.

The Sorento SUV was also showcased at the dealer roadshows which Kia had organised last year in August. This could be a part of Kia's India plans but has not been confirmed yet.

The Sorento is a full-size SUV, and rivals the likes of Hyundai Santa Fe and the Skoda Kodiaq globally. Under the bonnet, it gets a 2.2-litre petrol which belts out 188bhp and also a 2.0-litre diesel which belts out 185bhp. There is a third variant which is a 2.2-litre diesel and churns out 200bhp, all mated to an eight-speed automatic gearbox which made its debut on the facelift revealed at the 2017 Franfurt Motor show. Other variants of the gearbox are a six-speed manual and a six speed auto. There is also a four-wheel drive version.

Kia has made an investment over Rs 7,000 crore at its new 536-acre facility in Anantapur, Andhra Pradesh. Production at this facility can churn out 3,00,000 units annually and is slated to commence in the second half of 2019.

Link to comment
Share on other sites

37 minutes ago, AnnaGaru said:

It seems KIA SORANTO is the vehicle to be mfg in Andhra plant based on circumstantial points

/*****************

2016-Kia-Sorento-01.jpg

The latest generation of Kia's flagship 7-seat SUV, the Sorento, has been seen doing the rounds in Andhra Pradesh.

However, unlike other Kia models which are meant for export markets and have been previously seen on our roads bearing international plates, the particular test mule has been spotted with registration belonging to Kia Motors India.

The Sorento SUV was also showcased at the dealer roadshows which Kia had organised last year in August. This could be a part of Kia's India plans but has not been confirmed yet.

The Sorento is a full-size SUV, and rivals the likes of Hyundai Santa Fe and the Skoda Kodiaq globally. Under the bonnet, it gets a 2.2-litre petrol which belts out 188bhp and also a 2.0-litre diesel which belts out 185bhp. There is a third variant which is a 2.2-litre diesel and churns out 200bhp, all mated to an eight-speed automatic gearbox which made its debut on the facelift revealed at the 2017 Franfurt Motor show. Other variants of the gearbox are a six-speed manual and a six speed auto. There is also a four-wheel drive version.

Kia has made an investment over Rs 7,000 crore at its new 536-acre facility in Anantapur, Andhra Pradesh. Production at this facility can churn out 3,00,000 units annually and is slated to commence in the second half of 2019.

దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా సొరెంటో కారు అనంతపురం వచ్చింది. పెనుకొండ వద్ద నిర్మాణం చేపడుతున్న కియా మోటర్‌ పరిశ్రమకు త్వరలో ఆ కంపెనీ చైర్మన్‌ రానున్నారు. ఆయన కోసం ఈ కారును ముందస్తుగా దిగుమతి చేసి అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతీయ రవాణశాఖ కార్యాలయంలో బుధవారం రిజిస్ర్టేషన్‌ చేయించినట్లు ఆర్టీఓ మల్లికార్జున తెలిపారు. కియా మోటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ పేరు మీద సొరెంటో మోడల్‌ రూ. 34.50 లక్షలు కాగా, సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌, రోడ్‌ ట్యాక్స్‌లు రూ. 4.83 లక్షలు, రూ. 7500 రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించినట్లు చెప్పారు. ఈ కారుకు ఏపీ 02 బీపీ 2454 నంబర్‌ను కేటాయించినట్లు రవాణ శాఖ అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

 కల్చర్‌
07-01-2018 03:34:29

అనంతలో ‘కియ’ కార్ల మహిమ..
కొరియా భాషలో కనిపిస్తున్న బోర్డులు
ఏమిటీ... చైనా భాష! ఇంతకీ మనం ఎక్కడున్నాం? పొరపాటున బోర్డర్‌ దాటి చైనాలోగానీ అడుగుపెట్టలేదు కదా!... అని ఆశ్చర్యపోకండి! ముందుగా చెప్పొచ్చేదేమిటంటే... ఇది కొరియా భాష! ఇది... అచ్చంగా ఆంధ్ర ప్రదేశే. అందునా... అనంతపురం జిల్లా! అనంతపురంతోపాటు జిల్లాలోని పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఇలా కొరియా భాషలో స్వాగతం పలికే బోర్డులు ఇప్పుడు అనేకం కనిపిస్తాయి.
 
ఇదంతా... ‘కియ’ కార్ల కంపెనీ మహిమ! ఆంధప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతిలో మేలిమలుపైన ‘కియ’ రాకతో అనంతపురంలో సరికొత్త సందడి మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ కార్ల ప్లాంటు ఏర్పాటవుతున్న పెనుకొండ ప్రాంతంలో కొరియా సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కియ పరిశ్రమ ప్రాంగణంలో నాలుగు కంపెనీలు పనులు చేస్తున్నాయి. వాటిలో 50 మంది దాకా కొరియన్లు పని చేస్తున్నారు. హ్యుండయ్‌ కార్ల పరిశ్రమకు చెందిన మరో 50 మందికిపైగా ఉన్నతస్థాయి అధికారులు కూడా ఉన్నారు. పని చేసే చోటు నుంచి బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు గంట వ్యవధిలో, తమ నివాసానికి 20 నిమిషాల్లో చేరుకునేందుకు వీరు ప్రాధాన్యమిస్తున్నారు.
 
కియ కోసం వచ్చిన కొరియన్లతోపాటు ఇక్కడ పనులు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లు, ఇంజనీర్ల రాకతో ఇక్కడ ఇళ్లకోసం డిమాండ్‌ భారీగా పెరిగింది. కియ ప్లాంటుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం అద్దె నెలకు రూ.40 వేలకు చేరుకుంది. పెనుకొండతోపాటు... 44వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టణాల్లో నివాసం ఉండడానికి కొరియన్‌ సిబ్బంది మొగ్గు చూపుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కొన్ని అపార్ట్‌మెంట్లలోనూ, వ్యక్తిగత ఇళ్లముందూ కొరియా భాషలో ఫ్లెక్సీలు వెలిశాయి.

బోల్తాపడిన చిరు కాంట్రాక్టర్‌..
కియ పరిశ్రమకు సమీపంలో పేరేసంద్రం అనే గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్నసైజు కాంట్రాక్టర్‌ కియ ఉద్యోగికి దగ్గరయ్యాడు. తమకోసం 90 అద్దె గదులు ఏర్పాటు చేయాలంటూ ఆ ఉద్యోగి రూ.30 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. ‘మంచి చాన్స్‌’ దొరికిందనుకుంటూ ఆ కాంట్రాక్టరు సుమారు రూ.4 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టి అపార్ట్‌మెంట్‌ నిర్మించాడు. అందులోని ఓ ఇంటిలో కొరియా ఉద్యోగి చేరాడు. కానీ... అద్దె ఎక్కువగా ఉందంటూ తాను ఖాళీ చేయడమేకాకుండా, తాను అడిగిన 90 గదులూ వద్దని స్పష్టం చేశాడు. దీంతో ఆ చిరు కాంట్రాక్టర్‌ బోరుమంటున్నాడు.
 
కమీషన్లతో కళకళ
పెనుకొండ, అనంతపురం ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం అద్దె మహా అంటే రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకూ ఉంటుంది. అదే ధరతో హైవేకు ఆనుకుని ఉన్న ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లపై మధ్యవర్తులు దృష్టి సారించారు. వారి నుంచి ఇళ్లు అద్దెకు తీసుకుని మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితితో అగ్రిమెంటు రాసుకుంటున్నారు. అదే ఇళ్లను కొరియన్లకు రూ.30వేల నుంచి 40 వేలతో అద్దెకు ఇస్తున్నారు. కొరియన్లతో మాట్లాడేందుకు తమకు భాష రాకపోవడంతో... ఇందుకు అనువాదకుల సేవకులు ఉపయోగించుకుంటున్నారు. కొందరు బెంగళూరు నుంచి కూడా వచ్చి మరీ ‘అనువాద’ పనులు చేస్తున్నారు. కొరియన్లకు అద్దె ఇంటిని కుదిర్చితే... మధ్యవర్తులే వీరికి రూ.20వేల దాకా కమీషన్‌ చెల్లిస్తున్నారు.
 
స్పానిష్‌ టు కొరియన్‌
స్పెయిన్‌కు చెందిన మ్యాంచూ ఫెర్రర్‌ అనంతపురం కేంద్రంగా ‘ఆర్డీటీ’ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ అవసరాల రీత్యా చాలామందికి స్పానిష్‌ నేర్పిస్తున్నారు. ఆర్డీటీ సంస్థలోనే స్పెయిన్‌ భాష నేర్పే ప్రొఫెషనల్‌ స్కూల్‌ ఉంది. దీనికి ఎస్కే యూనివర్సిటీ గుర్తింపునిచ్చింది. దీని ద్వారా ఇప్పటివరకూ నాలుగువేల మంది స్పెయిన్‌ భాష నేర్చుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కియ ప్రభావంతో కొరియన్‌ భాష నేర్పించే సంస్థలూ ఆవిర్భవించే అవకాశముందని స్థానిక విద్యావేత్తలు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

కియాలో మొదలైన ఉద్యోగాల సందడి... వేగంగా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులు...

kia-13012081-1.jpg
share.png

కియా కార్ల పరిశ్రమకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి సమీపాన కియా కార్ల పరిశ్రమ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కియాలో ఉద్యోగ నియామకాల విషయమై కియా ఎండీ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఇటీవలే మాట్లాడిన విషయం విదితమే. దీంతో నియామకాలకు చర్యలు చేపడుతున్నట్లు అర్థమవుతోంది. ఉద్యోగుల ఎంపిక అనంతరం వారికి కంపెనీ అవసరాలనుగుణంగా శిక్షణ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఆ దిశగా దుద్దేబండ సమీపాన ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కియా ఉద్యోగాలు కోసం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు http://www.kia-motor...dia/Careers.jsp

kia-13012081-2.jpg

అలాగే పెనుకొండలో నిన్నమొన్నటి దాకా భోజనం చేద్దామంటే మంచి హోటల్ కనిపించేది కాదు. ఇప్పుడు ఏకంగా విదేశీ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఒక ట్రెండు కాదు... పట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. అంతా కియా మహిమ... దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా తన ప్లాంట్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేస్తుండటంతో పెనుకొండ ముఖ చిత్రం మారిపోతోంది... దక్షిణ కొరియాకు చెందిన 150 మంది వివిధ పనులు చేపట్టేందుకు పెనుకొండ వచ్చారు. కియాకు అనుబంధంగా కొటాక్, హుందయ్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. వీరి కోసం పెనుకొండలో పలు కొరియన్ రెస్టారంట్లు వెలుస్తున్నాయి.

kia-13012081-3.jpg

యాహూన్, కన్గమ్ ఇప్పటికే వండి వారుస్తున్నాయి. మరో నాలుగు రెస్టారంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. బెంగుళూరులో ఉన్న కొరియన్ రెస్టారంట్ల నిర్వాహకులు పెనుకొండలో బ్రాంచ్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ రెసారెంట్లలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు అందుబాటులో ఉంచారు. కొరియన్ వంటకాలు రూ.350 ప్రారంభం నుంచి రూ.1550 దాకా ధరలు పెట్టారు. కొరియన్ రైస్ రూ.350, బీఫ్ రూ.600 నుంచి రూ.900 వరకు, సూప్, చికెన్, నూడుల్స్ కొరియన్ నూడుల్స్ వీటికి తోడూ 9 రకాల చేపలు వండుతున్నారు. ఆహారానికి ఒక్కో కొరియన్ రోజుకు సగటున రూ.వెయ్యి పైనే ఖర్చు చేస్తున్నాడు. అనంతపురం, బెంగళూరు, పుట్టపర్తి ప్రాంతాల్లో ఉంటున్న కొంతమంది కొరియన్లకు రోజువారీగా వాహనాల్లో ఆహారాన్ని పార్మిల్ పంపుతున్నారు.

Link to comment
Share on other sites

Kia Mexico plant construction started in 2014 October and production started in May 2016.  It took around 18 months to bring the car out. Kia AP is also of the same scale and hoping it will bring car out faster than Mexico plant.

https://www.newswire.ca/news-releases/kia-officially-opens-mexico-production-facility-592665201.html

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...