sonykongara Posted July 6, 2024 Posted July 6, 2024 (edited) Edited July 6, 2024 by sonykongara Nandamurian 1
NTR ANNA Posted July 6, 2024 Posted July 6, 2024 ivvi emo gani.. first local state highways and local roads medha concentrate cheyyandi.. Jahan vodi povadaniki one of the main reasons roads...
Yaswanth526 Posted July 6, 2024 Posted July 6, 2024 (edited) 29 minutes ago, NTR ANNA said: ivvi emo gani.. first local state highways and local roads medha concentrate cheyyandi.. Jahan vodi povadaniki one of the main reasons roads... Local roads ki state funds kaavali Jeethale ivvaleni situation present so target central projects oka 2-3 years ki emanna better ithe revenue appudu vesthaaru local roads Rural panchayat roads minister unnadu ga konni sanction avuthaayi Edited July 6, 2024 by Yaswanth526 narens 1
sonykongara Posted July 6, 2024 Author Posted July 6, 2024 Amaravati: అమరావతి ఓఆర్‌ఆర్‌కు పచ్చజెండా రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. Updated : 06 Jul 2024 09:49 IST రూ.20-25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం అమరావతి - హైదరాబాద్ మధ్య ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే 60-70 కి.మీ. మేర తగ్గనున్న దూరం ముప్పవరం-అమరావతి మధ్య 90 కి.మీ. రహదారికి ప్రతిపాదన రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) సహా కీలక ప్రాజెక్టులున్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించిన, ఖూనీ చేసిన ప్రాజెక్టులు, విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి.. ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే..! ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి దిల్లీ పర్యటనలోనే... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా.. 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ... మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్‌ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే... రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే.. పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. జగన్ ఉరి వేసిన ఓఆర్‌ఆర్‌కి మళ్లీ ఊపిరి..! అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. అమరావతిపై కక్షతో ఓఆర్‌ఆర్‌నీ అటకెక్కించారు. అమరావతికి ఓఆర్‌ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. తొలి దిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్‌ఆర్‌పై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం. ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కి.మీ. పొడవున, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు. 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు రూ.17,761.49 కోట్లు, అసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు. ఆరున్నరేళ్ల క్రితానికీ ఇప్పటికీ... ద్రవ్యోల్బణం పెరిగినందున ఓఆర్‌ఆర్ నిర్మాణ వ్యయం కూడా రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. భూసేకరణకయ్యే ఖర్చు కూడా కలిపితే అది రూ.25 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. సులభంగా రాయలసీమ నుంచి అమరావతికి అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య 393 కి.మీ.తో తలపెట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేని జగన్ ప్రభుత్వం అనేక మార్పులు చేసి.. చివరకు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌లో కలిసేలా పరిమితం చేసింది. ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి, పనులు కూడా అప్పగించడంతో... చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కి.మీ. మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దాని వల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ఎన్‌హెచ్-544 ఎఫ్ అనే సంఖ్యనూ కేటాయించింది. భూసేకరణకు ప్రక్రియ మొదలు పెట్టి... పెగ్‌మార్కింగ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా... చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో కలిపేలా మార్పులు చేసింది. దాని ప్రకారం డీపీఆర్‌లు సిద్ధమయ్యాక దాన్నీ పక్కనపెట్టింది. ఆ తర్వాత వైఎస్సార్ జిల్లా మీదుగా కోడూరు-ముప్పవరం మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులో బెంగళూరు-హైదరాబాద్ హైవేపై కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై.. ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 344 కి.మీ. ఆ రహదారికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు. ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే..ముప్పవరం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకొని వెళ్లాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం... ముప్పవరం నుంచి అమరావతి వరకు 90కి.మీ. రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు. తూర్పు బైపాస్‌తో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. విజయవాడ తూర్పు బైపాస్ రహదారిని సుమారు 49 కి.మీ. మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) నిర్మించాలనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం మొదలవలేదు. విజయవాడకు పశ్చిమం వైపున చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు వరకు 47.8 కి.మీ. ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్‌ఆర్ ప్రతిపాదనను ఉపసంహరించుకొని... విజయవాడ తూర్పు బైపాస్ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది. అమరావతి ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్ ప్రాజెక్టుల్ని పూర్తిగా అటకెక్కించిన జగన్ ప్రభుత్వం అప్పట్లో విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. విజయవాడ చుట్టుపక్కల లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయిస్తే... విజయవాడ తూర్పుబైపాస్ రహదారి భూసేకరణకయ్యే వ్యయాన్ని కూడా భరించేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ భూమిని కేటాయించడంలో జగన్ ప్రభుత్వం విఫలమవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చొరవ చూపడంతో ఆ ప్రాజెక్టు పరుగులు పెట్టే అవకాశం ఉంది. అమరావతి-హైదరాబాద్ మధ్య 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఎక్స్‌ప్రెస్‌వే విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270.7 కి.మీ. పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి-హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం రూ.వేల కోట్ల వ్యయంతో 20కి పైగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే హామీ విభజన చట్టంలోనూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి-హైదరాబాద్ మధ్య 201-220 కి.మీ. పొడవున ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే... ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి-హైదరాబాద్ మధ్య దూరం 60-70 కి.మీ. వరకూ తగ్గుతుంది.
sonykongara Posted July 6, 2024 Author Posted July 6, 2024 మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది.
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 3 hours ago, NTR ANNA said: ivvi emo gani.. first local state highways and local roads medha concentrate cheyyandi.. Jahan vodi povadaniki one of the main reasons roads... 1 year patudi , total 8000kms roads eyyali.. it requires 10k crores.. will be done in 2 phases NTR ANNA 1
surapaneni1 Posted July 6, 2024 Posted July 6, 2024 4 hours ago, NTR ANNA said: ivvi emo gani.. first local state highways and local roads medha concentrate cheyyandi.. Jahan vodi povadaniki one of the main reasons roads... Hmm. Ivi aite central government istundi.. they get back through toll changes.. Stste government mundu old pending bills clear cheyyadaniki oka 2 yrs pattuddi.. NTR ANNA 1
ravindras Posted July 6, 2024 Posted July 6, 2024 42 minutes ago, surapaneni1 said: Hmm. Ivi aite central government istundi.. they get back through toll changes.. Stste government mundu old pending bills clear cheyyadaniki oka 2 yrs pattuddi.. state government roads ni toll ki iche chance vundhaa? highways ki gps toll pedathaamantunnaaru. appudu toll gate avasaram vundadhu. state government meedha burden vundadhu.
AndhraBullodu Posted July 6, 2024 Posted July 6, 2024 @Raaz@NBK Anna, aa western bypass tho amaravathi master plan emanna cheduthundha ? Amaravathi master plan madyalo nundi velthundhiga aa western bypass ? kaani, aaa western bypass ki master plan lo, chaala sthalam vadilesaaru anukunta kadha ? dhaani valla aemi ibbandhi undademoga western bypass ki master plan valla ?
Raaz@NBK Posted July 7, 2024 Posted July 7, 2024 5 hours ago, AndhraBullodu said: @Raaz@NBK Anna, aa western bypass tho amaravathi master plan emanna cheduthundha ? Amaravathi master plan madyalo nundi velthundhiga aa western bypass ? kaani, aaa western bypass ki master plan lo, chaala sthalam vadilesaaru anukunta kadha ? dhaani valla aemi ibbandhi undademoga western bypass ki master plan valla ? Western bypass is as per CRDA master plan ee.. No problem.. AndhraBullodu 1
Siddhugwotham Posted July 7, 2024 Posted July 7, 2024 Lucky to have Nitin saab in key portfolio in NDA.... Uma Bharathi kooda vunte baagundedi... Ranky@Tarak 1
narens Posted July 7, 2024 Posted July 7, 2024 1 hour ago, Siddhugwotham said: Lucky to have Nitin saab in key portfolio in NDA..... +~~
sonykongara Posted July 7, 2024 Author Posted July 7, 2024 Amaravati ORR: ఓఆర్‌ఆర్‌తో ‘అభివృద్ధి పరుగులు’ అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. Updated : 07 Jul 2024 08:41 IST రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించేలా ప్రణాళికలు అమరావతి మెగాసిటీగా మారేందుకు చోదకశక్తి ఈనాడు - అమరావతి: అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్‌ఆర్ వరకు భూములు బంగారమవుతాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది. ఓఆర్‌ఆర్‌కు వెలుపలా కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెదేపా ప్రభుత్వం 217 చ.కి.మీ.ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక ‘గ్రోత్ సెంటర్’గా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్‌ఆర్. జనాభా పెరిగి, ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి, దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్‌ఆర్‌లు నిర్మించారు. అమరావతి ఓఆర్‌ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి, ఓఆర్‌ఆర్‌కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్‌గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది. 2018 జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్‌ఆర్ ముఖ్యాంశాలివీ... ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్డీయే పరిధిలో 189 కి.మీ.ల పొడవున నిర్మాణం. 150 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.17,761.49 కోట్లు. అవసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు. అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ(మోర్త్) అంగీకారం తెలిపింది. ఏడోదశ రింగ్‌రోడ్ల అభివృద్ధి కింద మంజూరుచేసింది. ‘అవుటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ’ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి-65పై కంచికచర్ల వద్ద ఓఆర్‌ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16ను కలుస్తుంది. అక్కడినుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్-65లో... అక్కడినుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16ను కలుస్తుంది. ఓఆర్‌ఆర్‌లో భాగంగా రెండుచోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు. నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణాజిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది అప్పట్లో ప్రతిపాదన. వాటితో పాటు ఓఆర్‌ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కడతారు. ఓఆర్‌ఆర్‌కు పూర్తిగా లోపల ఉన్న, ఓఆర్‌ఆర్ వెళుతున్న మండలాలు: 40 ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 87 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా... రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు, దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి పక్కపక్కనే ఉన్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే.. రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్‌ఆర్‌కు వెలుపల, సమీపంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి.... అవన్నీ ప్రత్యేక ‘డెవలప్‌మెంట్ నోడ్స్’గా వృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్‌ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. అమరావతికి రాకపోకలు తేలికవుతాయి. ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే... విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దూరం ఎక్కువవుతుంది. ఓఆర్‌ఆర్ నిర్మిస్తే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డుమార్గంలో వచ్చేవారూ నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు (హింటర్‌ల్యాండ్) ఈ పోర్టులు దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి పోర్టులకు ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లడం తేలికవుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్‌ఆర్ నుంచి వెళ్లడం తేలిక. విశాఖ-హైదరాబాద్ ట్రాఫిక్... విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఓఆర్‌ఆర్ మీదుగా సాగుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్లో... గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్‌గా, మైలవరం, ఆగిరిపల్లి, పెదఅవుటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచర్ల, అమరావతి(పాత), కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన ఉంది.
Yaswanth526 Posted July 7, 2024 Posted July 7, 2024 1 hour ago, sonykongara said: Amaravati ORR: ఓఆర్‌ఆర్‌తో ‘అభివృద్ధి పరుగులు’ అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. Updated : 07 Jul 2024 08:41 IST రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించేలా ప్రణాళికలు అమరావతి మెగాసిటీగా మారేందుకు చోదకశక్తి ఈనాడు - అమరావతి: అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్‌ఆర్ వరకు భూములు బంగారమవుతాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది. ఓఆర్‌ఆర్‌కు వెలుపలా కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెదేపా ప్రభుత్వం 217 చ.కి.మీ.ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక ‘గ్రోత్ సెంటర్’గా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్‌ఆర్. జనాభా పెరిగి, ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి, దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్‌ఆర్‌లు నిర్మించారు. అమరావతి ఓఆర్‌ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి, ఓఆర్‌ఆర్‌కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్‌గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది. 2018 జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్‌ఆర్ ముఖ్యాంశాలివీ... ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్డీయే పరిధిలో 189 కి.మీ.ల పొడవున నిర్మాణం. 150 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా, ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.17,761.49 కోట్లు. అవసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు. అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ(మోర్త్) అంగీకారం తెలిపింది. ఏడోదశ రింగ్‌రోడ్ల అభివృద్ధి కింద మంజూరుచేసింది. ‘అవుటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ’ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి-65పై కంచికచర్ల వద్ద ఓఆర్‌ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16ను కలుస్తుంది. అక్కడినుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్-65లో... అక్కడినుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16ను కలుస్తుంది. ఓఆర్‌ఆర్‌లో భాగంగా రెండుచోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు. నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణాజిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది అప్పట్లో ప్రతిపాదన. వాటితో పాటు ఓఆర్‌ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కడతారు. ఓఆర్‌ఆర్‌కు పూర్తిగా లోపల ఉన్న, ఓఆర్‌ఆర్ వెళుతున్న మండలాలు: 40 ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 87 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా... రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు, దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి పక్కపక్కనే ఉన్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే.. రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్‌ఆర్‌కు వెలుపల, సమీపంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి.... అవన్నీ ప్రత్యేక ‘డెవలప్‌మెంట్ నోడ్స్’గా వృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్‌ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. అమరావతికి రాకపోకలు తేలికవుతాయి. ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే... విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దూరం ఎక్కువవుతుంది. ఓఆర్‌ఆర్ నిర్మిస్తే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డుమార్గంలో వచ్చేవారూ నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు (హింటర్‌ల్యాండ్) ఈ పోర్టులు దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి పోర్టులకు ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లడం తేలికవుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్‌ఆర్ నుంచి వెళ్లడం తేలిక. విశాఖ-హైదరాబాద్ ట్రాఫిక్... విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఓఆర్‌ఆర్ మీదుగా సాగుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్లో... గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్‌గా, మైలవరం, ఆగిరిపల్లి, పెదఅవుటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచర్ల, అమరావతి(పాత), కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన ఉంది.
MVS Posted July 8, 2024 Posted July 8, 2024 ఈ జగన్ గాడు అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ని అనంతపూర్ నుంచి కాకుండా పులివెందుల నుంచి తీసుకుని పోయి మ ఊరి లో నుంచి వెళుతుంది అనుకున్న రోడ్డు నీ హైవే 16 లో కలిపేసాడు
sonykongara Posted July 8, 2024 Author Posted July 8, 2024 3 hours ago, MVS said: ఈ జగన్ గాడు అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ని అనంతపూర్ నుంచి కాకుండా పులివెందుల నుంచి తీసుకుని పోయి మ ఊరి లో నుంచి వెళుతుంది అనుకున్న రోడ్డు నీ హైవే 16 లో కలిపేసాడు avunu, CBN plan antha gabbu chesadu , industrial corridor plan chesadu ah road venta, jaffa gadu nasanm chesadu,
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now