September 14, 20242 yr Author Hyderabad-vijayawada national highway: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ.. గొల్లపూడి వరకు! ఆరు వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది. Updated : 14 Sep 2024 07:05 IST హైదరాబాద్-విజయవాడ రహదారి పనులు మరో 40 కి.మీ. పొడిగింపు కన్సల్టెంట్ల ఎంపికకు ఈ నెల 24 వరకు గడువు ఈనాడు, హైదరాబాద్: ఆరు వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది. తొలుత ఈ రహదారిని హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలనుకున్నా ప్రస్తుతం గొల్లపూడి వరకు పెంచాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. తొలుత దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కిలోమీటర్లకు సవివర నివేదిక (డీపీఆర్) తయారు చేయించాలని ఆదేశాలు జారీచేశారు. తాజాగా గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయించి మరో 40 కిలోమీటర్ల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. దీనికి ఈనెల 24వ తేదీని తుది గడువుగా నిర్ణయిస్తూ తాజాగా టెండర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 17 ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్ స్పాట్స్)ను రూ.325 కోట్లతో చక్కదిద్దే పనులను ఇటీవల జాతీయ రహదారుల సంస్థ చేపట్టింది. ఈ టెండరులో దిద్దుబాటు పనులను మినహాయించినట్లు కేంద్రం ప్రకటించింది. నందిగామ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పనులను కూడా ఈ టెండరు పరిధి నుంచి తొలగించింది. జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఆరు వరుసలకు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు శుక్రవారం ‘ఈనాడు’తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియకు కన్సల్టెంట్ గుత్తేదారు ఎంపిక ప్రక్రియకు వచ్చే నెల చివరి వారం నుంచి అధ్యయనం చేపట్టాలన్నది ఆలోచనగా ఉన్నట్లు వివరించారు.
September 14, 20242 yr Author దేశంలోని కీలక ఎన్‌హెచ్‌లు పరిశీలించండి ‘కొత్తగా నిర్మించనున్న అమరావతి ఔటర్ రింగ్, విశాఖపట్నం-మూలపేట, విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రహదారులతోపాటు, హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌లు) 6/8 లైన్లుగా విస్తరణకు సంబంధించి.. ఆయా అధికారులు అత్యధిక వరుసలతో విస్తరిస్తున్న పలు కీలక ఎన్‌హెచ్‌లను పరిశీలించాక, ఆ మేరకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలి. కొందరు గుత్తేదారులు సక్రమంగా పనులు చేయడంలేదు. వీరి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడొద్దు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.65 వేల కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌ల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ మూడేళ్లలో పూర్తికావాలి. వీటికి అవసరమైన భూసేకరణలో ఇబ్బందుల పరిష్కారానికి సీసీఎల్‌ఏ, అదనపు పీసీసీఎఫ్, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, సీఎంవో కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సేతుబంధన్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఆర్వోబీలకు సంబంధించిన భూసేకరణకు రూ.42 కోట్లు విడుదల చేస్తాం. ఆర్వోబీలు త్వరగా పూర్తికావాలి. లాజిస్టిక్ పార్క్‌లు వేగవంతం చేయాలి విశాఖపట్నం, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లపై దృష్టిపెట్టాలి. విజయవాడలోని లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు వీలుగా సీఆర్‌డీఏ పరిధిలో భూకేటాయింపునకు, ఆ కమిషనర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోండి. 3 వేల కి.మీ. మేర 31 రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలంటూ కేంద్రం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ప్రాధాన్యత క్రమంలో అత్యంత వాహన రద్దీ ఉండే ఐదారు రోడ్లను ఆర్‌అండ్‌బీ మంత్రి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంపిక చేయాలి. మిగిలిన రోడ్లలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు వీలున్నవాటిని పరిశీలించండి’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, ఈఎన్‌సీ నయీముల్లా, సీఈలు రామచంద్ర, శ్రీనివాసరెడ్డి, శేషుకుమార్, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌వో ఆర్కే సింగ్ తదితరులు పాల్గొన్నారు.
October 4, 20241 yr Author కొండమోడు మార్గానికి మహర్దశ కొండమోడు-పేరేచర్ల మార్గం నాలుగు వరుసలుగా విస్తరణకు నిధుల విడుదలకు అడ్డంకిగా మారిన సాంకేతిక అంశాలు పరిష్కారమయ్యాయి. ఈ మార్గం విస్తరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌మాల కింద మంజూరైంది. Published : 04 Oct 2024 04:49 IST మోర్త్ ఆమోదంతో తొలగిన అడ్డంకులు నిధుల విడుదలకు మార్గం సుగమం ఈనాడు-నరసరావుపేట కొండమోడు-పేరేచర్ల మార్గం నాలుగు వరుసలుగా విస్తరణకు నిధుల విడుదలకు అడ్డంకిగా మారిన సాంకేతిక అంశాలు పరిష్కారమయ్యాయి. ఈ మార్గం విస్తరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌మాల కింద మంజూరైంది. గుత్తేదారును ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయినా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో మార్గం విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి భారత్‌మాల కింద ఉన్న రోడ్లను జాతీయ రహదారుల సాధారణ కార్యక్రమం(ఎన్‌హెచ్‌వో) కింద కొనసాగించాలని కోరారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) స్టాండింగ్ పైనాన్స్ కమిటీ 8 రోడ్లకు అంగీకారం తెలిపింది. ఈ జాబితాలో కొండమోడు-పేరేచర్ల మార్గం ఉండటంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. 49.9 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గత ఏడాది ఆగస్టులో రూ.1032.52 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా రాజేంద్రసింగ్ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ మార్గం విస్తరిస్తే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాకపోకలు మరింత సులభమై అభివృద్ధి వేగవంతమవుతుంది. దశాబ్దాల కల.. గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు మార్గాన్ని విస్తరించాలనేది దశాబ్దాల కల. ఈ మార్గం అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారితో కొండమోడు వద్ద అనుసంధానమై తెలంగాణ వెళ్లే వారికి అత్యంత అనుకూలంగా ఉంది. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం వైపు వెళ్లే వారికి కొండమోడు మార్గం కీలకం. ఇంతటి కీలకమైన మార్గాన్ని విస్తరించడానికి ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ మార్గం ప్రాధాన్యం దృష్ట్యా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయ రహదారి(167 ఏజీ)గా కేంద్రం గుర్తించింది. దీనిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించడంతో ఎట్టకేలకు మోక్షం లభించింది. గత వైకాపా ప్రభుత్వంలోనే కేంద్రం నిధులు మంజూరు చేసినా సకాలంలో భూసేకరణ చేయకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ మార్గం ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఆర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్‌రెడ్డి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం సానుకూలంగా స్పందించి నిదుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 నుంచి 10 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండటంతో వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్గం చిన్నదిగా ఉండటంతోపాటు ఎదురుగా నిరంతరంగా వాహనాలు వస్తుండటంతో ఒకదాని వెనుక ఒక వాహనం వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయంతోపాటు విలువైన ఇంధనం వృథా అవుతోంది. ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి నూతన రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుంది. భూసేకరణ ప్రక్రియ పూర్తి పేరేచర్ల నుంచి కొండమోడు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తిచేసి ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డు, పొరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు. నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్ 1.5 మీటర్లు, రెండువైపులా మార్జిన్లు కలిపి 22.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది. గుత్తేదారు ఎంపిక పూర్తయినందున త్వరలోనే పనులు పట్టాలెక్కనున్నాయి.
October 5, 20241 yr Author విజయవాడ తూర్పు బైపాస్‌కు పచ్చజెండా రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టగానే.. విజయవాడకు, రాజధానికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. Updated : 05 Oct 2024 07:25 IST నగరంలో 7 కి.మీ. సూపర్‌స్ట్రక్చర్ వంతెన వార్షిక ప్రణాళికలో చేర్చిన ఎన్‌హెచ్‌ఏఐ ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం వినుకొండ-గుంటూరు, బద్వేలు-నెల్లూరు రోడ్ల విస్తరణకూ చోటు ఈనాడు - అమరావతి రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టగానే.. విజయవాడకు, రాజధానికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కి.మీ. మేర సూపర్‌స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితోపాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చి, వాటికి రూ.12,029 కోట్లను కేంద్రం మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టులకు త్వరగా డీపీఆర్ రూపొందించి, భూసేకరణ పూర్తిచేస్తే.. వెంటనే టెండర్లు పిలిచి, పనులు అప్పగించేందుకు వీలుంటుంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే, అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. మూడు ఎలైన్‌మెంట్లతో తూర్పు బైపాస్ చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైంది. 50 కి.మీ. మేర నిర్మించాలనుకుంటున్న ఈ బైపాస్‌కు రూ.2,716 కోట్లు కేటాయించారు. దీనికోసం సలహా సంస్థ మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధంచేసింది. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, ఈ ప్రాజెక్టు గురించి వివరించనున్నారు. నెలాఖరుకు మూడు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపాలి. వాటిలో ఒకటి ఖరారైతే.. డీపీఆర్ రూపకల్పన, భూసేకరణ చేస్తారు. సూపర్‌స్ట్రక్చర్ డిజైన్‌తో వంతెన ప్రస్తుతం చెన్నై-కోల్‌కతా జాతీయరహదారి విజయవాడ మీదుగా వెళ్తోంది. వాహనరద్దీ కారణంగా మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా నిడమానూరు వరకు.. ప్రస్తుత హైవేపై నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటుకల్పించారు. ఏడు కి.మీ. మేర ఇన్నోవేటివ్ సూపర్‌స్ట్రక్చర్ డిజైన్‌తో ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనికి రూ.669 కోట్లు కేటాయించారు. భూసేకరణ చేయకుండానే, ప్రస్తుతమున్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేసి.. నాలుగు వరుసల వంతెన నిర్మిస్తారు. దీనిపైనా త్వరలో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి భూసేకరణ అవసరం లేకపోవడంతో డీపీఆర్ సిద్ధంచేసి, టెండర్లు పిలిచి, మార్చిలోపు గుత్తేదారుకు పనులు అప్పగించేందుకు వీలుంటుంది. ఈ వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించాలి. ఇందుకూ కొన్ని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వినుకొండ-గుంటూరు హైవే విస్తరణ వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. హైవేను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి రూ.2,360 కోట్లు కేటాయించారు. దీనికి సలహాసంస్థ మూడు ఎలైన్‌మెంట్లను రూపొందించింది. వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108 కి.మీ. మేర నాలుగు వరుసలుగా హైవేను విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,723 కోట్లు కేటాయించారు. నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 24 కి.మీ. మేర నాలుగు వరుసల హైవేకి రూ.1,040 కోట్లు కేటాయించారు. రాజమహేంద్రవరం వద్ద గామన్ జంక్షన్‌లో 2 కి.మీ. ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించారు. కోల్‌కతా-చెన్నై హైవేపై విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొవ్వూరువైపు నేరుగా వెళ్లేందుకు వీలుగా దివాన్‌చెరువు సమీపంలో ఈ వంతెన నిర్మిస్తారు. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్ కూడలి వరకు 13 కి.మీ. నిర్మాణానికి రూ.906 కోట్లు కేటాయించారు. రణస్థలం పట్టణ పరిధిలో రూ.325 కోట్లతో 4 కి.మీ. పనులు చేపట్టనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా కార్ల పరిశ్రమ వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఆర్వోబీ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించారు.
October 9, 20241 yr Author రెండున్నరేళ్లలోపు రహదారుల నిర్మాణం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రూ.55 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం రెండున్నరేళ్ల లోపు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. నేను వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించి భూసేకరణ, ఇతరత్రా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రయత్నిస్తా. విజయవాడలో పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తికానుంది. అది అయిన వెంటనే తూర్పు బైపాస్ ప్రారంభిస్తారు.కుప్పం-హోసూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి, మూలపేట-వైజాగ్‌ల మధ్య కొత్త రహదారులు నిర్మించాలని కోరాం. ఈ రోడ్డు వస్తే మూలపేట వద్ద ఉన్న 9 వేల ఎకరాల ఉప్పుభూములు తీసుకొని ఇండస్ట్రియల్ హబ్‌గా తయారుచేస్తాం. అది శ్రీకాకుళానికి వరం అవుతుంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇప్పుడున్న జాతీయ రహదారిని, విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్డును అనుసంధానం చేయాలని కోరాం. ఇక్కడ మెట్రోరైలు మార్గం కూడా వచ్చే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం 2025 డిసెంబరుకల్లా పూర్తవుతుంది. అక్కడ గత ప్రభుత్వం 500 ఎకరాలు తగ్గించి లేని సమస్యను సృష్టించింది. ఇప్పుడు మేం ఆ భూమి కూడా ఇచ్చి విమానాల మరమ్మతులు, నిర్వహణ కేంద్రం (ఎంఆర్‌ఓ) పెట్టాలని కోరుతున్నాం. దానివల్ల 25 వేల మందికి ఉపాధి కల్పనకు వీలుంటుంది. భోగాపురంలోనే పౌరవిమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి దేశంలో ఈ రంగానికి అవసరమయ్యే మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 33% సీట్లు స్థానికులకు కేటాయించి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే వారికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందని చెప్పాం. హైదరాబాద్ - మచిలీపట్నం పోర్టు హైవే హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం పోర్టును కలిపేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని కోరాం. దీనివల్ల తెలంగాణకు పోర్టు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇప్పుడున్న హైదరాబాద్-విజయవాడ రహదారిని వీలైనన్ని చోట్ల 8 వరసలుగా విస్తరించాలని అడిగాం. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన పన్ను రాయితీలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాం. ఈ రోడ్డు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్‌టీని వదులుకోవడంతోపాటు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు ఇస్తామని హామీ ఇచ్చాం. దానిని మూడేళ్లలోపు పూర్తి చేయాలని గడ్కరీని కోరాం. ఈ రోడ్డుకు రూ.28 వేల కోట్లు అవుతుంది.
October 18, 20241 yr Hyderabad-Sagar-Marcherla-Piduguralla road kuda 4-lane development cheyyali.. it will help both andhra and telangana dry regions a lot along with tourism.. golf course, resorts, sagar backwaters tourism can come up along the way
Create an account or sign in to comment