December 26, 20241 yr Vijayawada eastern bypasss ki bhusekharana modalettara ? Dhaani final approved DPR layout ekkadundho evaranna unte chepthara? Eastern bipass, gosaala daggara bandar road higyway ni ekkada cross chesthundhi, akkada entha acquire chesthunnaru ani choosthunnanu Edited December 26, 20241 yr by AndhraBullodu
December 27, 20241 yr Author 16 hours ago, AndhraBullodu said: Vijayawada eastern bypasss ki bhusekharana modalettara ? Dhaani final approved DPR layout ekkadundho evaranna unte chepthara? Eastern bipass, gosaala daggara bandar road higyway ni ekkada cross chesthundhi, akkada entha acquire chesthunnaru ani choosthunnanu
March 4, 20251 yr Author Highway : 6 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే ABN , Publish Date - Mar 04 , 2025 | 06:44 AM హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) ఆరు లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఖరారైన డీపీఆర్ కన్సల్టెంట్ సంస్థ అధ్యయనానికి రూ.9.86 కోట్ల ఖర్చు త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం ఆరు నెలల్లో కేంద్రానికి నివేదిక దండు మల్కాపూర్ నుంచి గొల్లపూడి వరకు విస్తరణ హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) ఆరు లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివే దిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ గతేడాది టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్‌లను 2025 జనవరి 20న తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఆరు నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌హెచ్-65 రోడ్డును హైదరాబాద్ అవతల.. అంటే దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.
March 12, 20251 yr Author రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణం: మంత్రి కోమటిరెడ్డి రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. By Andhra Pradesh News TeamUpdated : 11 Mar 2025 16:17 IST Ee Font size 1 min read దిల్లీ: రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డు, హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంగారెడ్డి - భువనగిరి - చౌటుప్పల్ వరకు ఆర్‌ఆర్‌ఆర్ టెండర్ల పక్రియ పూర్తయింది. దాదాపు 95శాతం భూ సేకరణ కూడా పూర్తయింది. రూ.వెయ్యి కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేశారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతున్నందున.. గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. 62 కి.మీ మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు’’ అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
April 20, 20251 yr Author గొల్లపూడిలో క్లోవర్ లీఫ్ ABN , Publish Date - Apr 20 , 2025 | 12:34 AM 16, 6వ నెంబర్ జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట గొల్లపూడిలో ‘క్లోవర్ లీఫ్’ జంక్షన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట క్లోవర్ లీఫ్ లేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ సర్వే తెలియజేయడంతో అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ 6 వరసల విస్తరణకు డీపీఆర్ గొల్లపూడి వద్ద క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదన ఇంతకుముందు రింగ్ జంక్షన్ ఏర్పాటు చేయాలని సర్వే తెరపైకి క్లోవర్ లీఫ్ రావడంతో గొల్లపూడి ట్రాఫిక్‌కు రిలీఫ్ (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65ను ఆరు వరసలుగా విస్తరించటానికి డీపీఆర్ రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో.. గొల్లపూడిలో విజయవాడ వెస్ట్ బైపాస్ అనుసంధానం అయ్యేచోట క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రింగ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని ఎన్‌హెచ్ అధికారులు ఇంతకుముందే నిర్ణయించారు. ఈ రింగ్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై కన్సల్టెంట్‌ను కూడా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్-విజయవాడ 6 వరసల విస్తరణకు సంబంధించి డీపీఆర్ రూపకల్పన జరుగుతుండటంతో క్లోవర్ లీఫ్ ప్రతిపాదన ముందుకొచ్చింది. రింగ్ పోయె.. క్లోవర్ లీఫ్ వచ్చే.. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు.. చిన్న అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్-16 నుంచి మర్లపాలెం, గన్నవరం, కొండపావులూరు, నున్న, జక్కంపూడి, గొల్లపూడి అవుటర్ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెం మీదుగా కాజ చేరుకుని అక్కడ ఎన్‌హెచ్-16కు అనుసంధానమవుతుంది. ఇది గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్-65ను క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఎన్‌హెచ్-65పై ఆర్‌వోబీ వెళ్తుంది. ఇక్కడ గతంలో జరిగిన తప్పిదం కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విశాఖపట్నం, ఏలూరు నుంచి చిన అవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్‌వోబీ పక్క నుంచి కిందకు దిగి.. గొల్లపూడి వెళ్లి అక్కడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర టర్నింగ్ తీసుకుని ఎన్‌హెచ్-65 మీదుగా ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి కాజ, విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చే వాహనాలన్నీ విజయవాడ వెళ్లాలంటే గొల్లపూడి ఆర్‌వోబీ పక్క నుంచి దిగి ఇబ్రహీంపట్నం రింగ్‌కు వెళ్లి ఎన్‌హెచ్-65 మీదుగా వెనక్కి రావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొద్దికాలం కిందట ఎన్‌హెచ్ అధికారులు గొల్లపూడి జంక్షన్ వద్ద ఒక రింగ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రింగ్ జంక్షన్ కోసం కన్సల్టెంట్‌తో సర్వే చేయించారు. దీనివల్ల గొల్లపూడి దగ్గర బైపాస్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు కానీ, దిగువన ఉన్న ఎన్‌హెచ్-65పై రాకపోకలు సాగించే వాహనాలు బైపాస్ ఎక్కాలన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాహనాలు కూడా ఇటు గొల్లపూడి సెంటర్, అటు ఇబ్రహీంపట్నం వెళ్లకుండానే రింగ్ జంక్షన్ మీదుగా అక్కడిక క్కడే ఎటు కావాలన్నా వెళ్లే వీలుంటుంది. ఈ రింగ్ జంక్షన్‌కు పెద్దగా భూ సేకరణ కూడా అవసరం లేదని ఎన్‌హెచ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రింగ్ జంక్షన్ పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదనేది నిపుణుల మాట. కనీసం సగం క్లోపర్ లీఫ్ జంక్షన్ అయినా ఏర్పాటు చేయాల్సిందేనని వారు ప్రతిపాదిస్తున్నారు. అయితే, దీనికి కూడా భూసేకరణ తప్పదని ఎన్‌హెచ్ వర్గాలు భావించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నాయి. కాగా, అనూహ్యంగా సగం క్లోవర్ లీఫ్ జంక్షన్ ప్రతిపాదన పక్కకుపోయి పూర్తిస్థాయి క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను ఏర్పాటుచేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్‌హెచ్-65 ఆరు వరసల ప్రతిపాదన నేపథ్యంలో.. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ వరకు ఎన్‌హెచ్- 65ను ఆరు వరసలుగా విస్తరించాలని నిర్ణయించటమే కారణం. డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ కూడా వేగంగా శ్రీకారం చుట్టడంతో క్లోవర్ లీఫ్ జంక్షన్ అంశంపై ఎన్‌హెచ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెండు భారీ జాతీయ రహదారులు అనుసంధానమయ్యేచోట, అందునా ఆరు వరసలుగా క్రాస్ అవుతున్న దగ్గర కచ్చితంగా క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయకపోతే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజధానికి సమీపంలో ఇలాంటి ట్రాఫిక్ తలనొప్పులు మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో 6 వరసల విస్తరణ డీపీఆర్‌లో క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఈ జంక్షన్ ఏర్పాటు చేయాల్సి వస్తే భూ సేకరణ తప్పదు. గొల్లపూడిలో అత్యంత ఖరీదైన భూములను సేకరించాల్సి ఉంటుంది. Updated Date - Apr 20 , 2025 | 12:34 AM Tags #Telugu News
May 20, 20251 yr Author గ్రీన్‌ఫీల్డ్ హైవేకు.. భూసేకరణ వేగవంతం విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి భూసేకరణ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 30 కి.మీ పొడవులో హైవే పనులు జరగనున్నాయి. By Andhra Pradesh Dist. DeskPublished : 20 May 2025 05:45 IST Ee Font size 2 min read జిల్లాలో 30 కి.మీ రహదారి ఈనాడు, అమరావతి విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి భూసేకరణ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 30 కి.మీ పొడవులో హైవే పనులు జరగనున్నాయి. దీనికోసం మొత్తం 329.30 ఎకరాల భూసేకరణ చేపట్టాలనేది ప్రతిపాదన. ఇప్పటికే 243.67 ఎకరాలు అధికారులు సేకరించారు. మరో 85.63 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అధికంగా ఉండడంతో వాటి సేకరణ ప్రక్రియను పూర్తి చేసి మిగిలిన ప్రైవేటు పట్టా భూములపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు మూడు ప్యాకేజీల్లో చేపడుతుండగా.. ఇప్పటికే రెండు ప్రారంభమైపోయాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా మూడో ప్యాకేజీ పనులు ప్రస్తుతం ఆరంభించాల్సి ఉంది. దీని కోసం మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే పనులు ఆరంభమవుతాయి. ఇప్పటికే పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. ఖమ్మం జిల్లాలోని రెమిడిచర్ల నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజ్ 03 గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు గంపలగూడెం మండలంలోని తునికిపాడు వద్ద ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. 273.73ఎకరాల ప్రైవేటు భూములు.. మొత్తం 329.30ఎకరాల భూములు 30 కి.మీ రహదారి కోసం అవసరం. వీటిలో 273.73 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములున్నాయి. వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం మరో 30.6 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఇవికాకుండా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ 22.83 ఎకరాలు సేకరించాలి. మొత్తంగా 85.63 ఎకరాల సేకరణ పూర్తిచేస్తే.. గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు మార్గం సుగమం అయిపోతుంది. జిల్లాలో మూడు మండలాల్లో .. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,86,125చ.మీ. భూసేకరణ చేపడుతున్నారు. దీనిలో గంపలగూడెంలోని తునికపాడులో 36,704.98చ.మీ. సేకరిస్తున్నారు. ఆ తర్వాత.. జి.కొండూరు పరిధిలోని సున్నంపాడు, దుగ్గిరాలపాడు, గడ్డమనుగు, మునగపాడు, కొండూరు, పేత్రంపాడు, గంగినేనిపాలెం, తెలదేవరపాడు, చెరువుమాధవరం, పినపాక, కవులూరు మీదుగా విజయవాడ రూరల్ మండలంలోకి జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. ఈ గ్రామాలన్నింటిలోనూ భూసేకరణ జరుగుతోంది. విజయవాడ గ్రామీణ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా వచ్చి నగర శివారులోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్‌కు ఈ రోడ్డును కలుపుతారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ భూసేకరణ చేపడుతున్నారు. ఇప్పటికే తీవ్ర జాప్యం.. విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఖమ్మం నుంచి చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధికి మరింత ఊతం ఏర్పడుతుంది. ఖమ్మం-విజయవాడ మధ్య ప్యాకేజీ 01లో వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లె వరకు 25 కి.మీ, ప్యాకేజీ 02లో బ్రాహ్మణచర్ల నుంచి రెమిడిచర్ల వరకూ 28 కి.మీ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించాక.. రెమిడిచర్ల నుంచి జక్కంపూడి వరకూ చేపట్టాల్సిన ప్యాకేజ్ 03 పనులే చాలా జాప్యం జరిగాయి. భూసేకరణ ఆలస్యంగా జరగడంతో పనులు ఆరంభం కాలేదు. మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తి చేయలంటూ కలెక్టర్ లక్ష్మీశ తాజాగా అధికారులను ఆదేశించారు.
Create an account or sign in to comment