Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Mega Road Projects

Featured Replies

  • Replies 208
  • Views 18.3k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

తెలంగాణకు తీరప్రాంతం లేకపోవటంతో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేయనున్నాం. దీన్ని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టాలి. కీలకమైన హైదరాబాద్‌-కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలుపెట్టాలి. ఇది నిర్మితమైతే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హైదరాబాద్‌-మన్నెగూడ రోడ్డు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులనూ మొదలుపెట్టాలి’ అని కోరారు. 

 

  • Author

ప్రగతిదారులు

ఆరు రాష్ట్రాలకు ఆటంకం లేకుండా ప్రయాణం.. హైదరాబాద్, బెంగళూరుకు 12 వరుసల్లో పరుగులు.. రాజధాని అమరావతి వెళ్లేందుకు రాజమార్గం.

Updated : 12 Jul 2024 12:51 IST
 
 
 
 
 
 

హైవే పనుల వేగవంతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
ఉమ్మడి జిల్లాలో హైవేల నిర్మాణం
వాటి వెంట  పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం
రూ.2,516 కోట్లతోపనులు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

knl-Dkr1107241c.jpg

ఆరు రాష్ట్రాలకు ఆటంకం లేకుండా ప్రయాణం.. హైదరాబాద్, బెంగళూరుకు 12 వరుసల్లో పరుగులు.. రాజధాని అమరావతి వెళ్లేందుకు రాజమార్గం.. కృష్ణానదిపై తీగల వంతెన.. నల్లమలలో జాతీయ రహదారి.. సరకు రవాణా వాహనాలు సాఫీగా వెళ్లేలా సడక్‌లు.. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రూ.2,516 కోట్లతో చేపడుతున్న కొత్త దారులు కర్నూలుకు మణిహారంగా మారనున్నాయి. దీంతో జిల్లా ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో కళకళలాడనుంది.

knl-Dkr1107241a.jpg

మ్మడి కర్నూలు జిల్లాలో 157 కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. కేంద్రం 70 శాతం నిధులు ఇస్తుంది.మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.. ఒక్క రహదారి మినహా మిగిలినవన్నీ ప్రశ్నార్థకంగానే మారాయి. రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారుల వేగవంతానికి చర్యలు చేపట్టింది. జిల్లాకు చెందిన జనార్దన్‌రెడ్డి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖల మంత్రిగా కొనసాగుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రహదారుల అభివృద్ధికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది.


కేంద్ర బిందువుగా ఎన్‌హెచ్‌-40

ఎన్‌హెచ్‌-40 కర్నూలు-కడప జాతీయ రహదారికి 1,353.038 ఎకరాల భూసేకరణ చేసిన విషయం తెలిసిందే. ఈ జాతీయ రహదారి నన్నూరు టోల్‌ప్లాజా, వెంగన్నబావి సమీపంలోని ఎన్‌హెచ్‌-44 రింగ్‌ రోడ్డు, చెన్నై-సూరత్‌ (ఎన్‌హెచ్‌-150 సీ) జాతీయ రహదారులు మూడు రింగ్‌ రోడ్డుతో ముడిపడనున్నాయి. ఈ ప్రాంతంలో అతి పెద్ద రింగ్‌ రోడ్డు ఏర్పాటు కానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య సరకు రవాణా కేంద్రాల అవసరం పెరిగింది. రెండు నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే జాతీయ రహదారి వెంబడి పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 12 వరుసలకు విస్తరిస్తే మరిన్ని భారీ పరిశ్రమలు వచ్చేందుకు వీలు కలుగుతుంది. 


పారిశ్రామికాభివృద్ధికి ఊతం

విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతంపై దృష్టిపెడతారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించారు. ‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓఎంఐహెచ్‌) ప్రాజెక్టుకు తెదేపా హయాంలోనే శ్రీకారం చుట్టారు.

knl-Dkr1107241b.jpg

12 వరుసల్లో ప్రయాణం 

శ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44) కర్నూలు మీదుగా వెళ్తోంది. పంచలింగాల నుంచి కర్నూలు, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి మండలం వరకు 75 కి.మీ విస్తరించి ఉంది. దీన్ని ఆరు వరుసలుగా నిర్మించేందుకు 2009లో 602 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న ఈ రహదారి ఆరు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. సమీ భవిష్యత్తులో 12 వరుసలుగా తీర్చిదిద్దనున్నారు. కేంద్రం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.


ఆరు రాష్ట్రాలకు పరుగులు

జాతీయరహదారి రోడ్డు 450 కి.మీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలను అనుసంధానం చేసే చెన్నై- సూరత్‌ (150 సీ) ఆరు లైన్ల జాతీయ రహదారి కర్నూలు జిల్లా మీదుగా నిర్మిస్తున్నారు. ఆర్కే దుద్యాల, ఎదురూరు, బసాపురం, ఉల్చాల, గోకులపాడు, పెద్దపాడు, దిన్నెదేవరపాడు, పందిపాడు, లక్ష్మీపురంతోపాటు మరో మూడు గ్రామాల పరిధిలో పనులు చేపడుతున్నారు. తుంగభద్ర, హంద్రీ నదుల్లో, కేసీ కాల్వలో వంతెనలు నిర్మిస్తున్నారు. కల్లూరు మండలం పందిపాడు శివారులో ఎన్‌హెచ్‌-44 జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు.


కర్ణాటక- తెలంగాణ వయా మంత్రాలయం

ర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హగరి నుంచి తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడ వరకు ఎన్‌హెచ్‌-167 జాతీయ రహదారి  పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల మీదుగా వెళ్తోంది. నిర్మాణానికి కావాల్సిన 48.40 ఎకరాలు భూసేకరణ చేపట్టారు.


రెండో ముంబయికి బైపాస్‌

రెండో ముంబయి ఆదోని పట్టణం సమీపం పనుంచి బైపాస్‌ రోడ్డు (ఎన్‌హెచ్‌-167)కు శ్రీకారం చుట్టారు. రూ.241.99 కోట్లతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న చేపట్టారు. రూ.140 కోట్లతో భూసేకరణకు వెచ్చించనున్నారు. పనులు వేగవంతం చేయాల్సినవసరం ఉంది. 


రాజధానికి వెళ్లేందుకు రాజమార్గం

నంతపురం నుంచి నంద్యాల జిల్లా మీదుగా అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ హైవే (ఎన్‌హెచ్‌-544 డీ) నిర్మాణం చేపట్టనున్నారు. తాడిపత్రి నుంచి కొలిమిగుండ్ల మండలం బుగ్గ గ్రామ పరిధిలో ప్రారంభమై, అవుకు, బనగానపల్లి, గోస్పాడు, నంద్యాల, మహానంది మీదుగా ప్రకాశం జిల్లాలోకి వెళ్తుంది.


సరకు రవాణాకు బాట

నగానపల్లి, డోన్‌ నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఎక్కువ.. సరకు రవాణా ‘మార్గం’ సుగమం చేసేందుకు ఎన్‌హెచ్‌-340(బీ) రహదారిని నిర్మిస్తున్నారు. ఎన్‌హెచ్‌-40 జాతీయ రహదారి నుంచి సోమయాజులపల్లె, కొమరోలు, బేతంచెర్ల నుంచి డోన్‌ వరకు చేపడుతున్నారు.  53.33 కి.మీ. మేర చేపట్టే పనులు కొనసాగుతున్నాయి.


కృష్ణానదిపై తీగల వంతెన

తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నుంచి సంగమేశ్వరం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మీదుగా నంద్యాలకు 80 కి.మీ. మేర జాతీయ రహదారి విస్తరించనుంది. మొత్తం రూ.776.17 కోట్లతో 62.571 కి.మీ. పనులు చేపట్టనున్నారు. మార్గమధ్యంలో కృష్ణానదిపై తీగల వంతెన నిర్మించనున్నారు. తర్వాత నంద్యాల నుంచి జమ్మలమడుగు వరకు రూ.690 కోట్లతో 62.01 కి.మీ. మేర పనులు చేపట్టనున్నారు.


కేజీ రోడ్డు క్రేజీ

ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,428 కి.మీ

ర్నూలు-గుంటూరు (కేజీ రోడ్డు) మధ్య ఎన్‌హెచ్‌-340 సీ రోడ్డు నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా దోర్నాల వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పరిధిలోని ఎన్‌హెచ్‌-44 నుంచి సఫా ఇంజినీరింగ్‌ కళాశాల, నూతనపల్లె, రుద్రవరం, తాండ్రపాడు, పసుపల, గార్గేయపురం గ్రామాల మీదుగా ఆత్మకూరు పట్టణం వరకు పనులు చేపడుతున్నారు.

మల్లన్న చెంతకు మార్గం

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం, దోర్నాల, కుంట వరకు ఎన్‌హెచ్‌ 765 జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల నుంచి కుంట వరకు రూ.244.83 కోట్లతో 24.20 కి.మీ. మేర పనులు చేపట్టనున్నారు. భూసేకరణకు రూ.51 కోట్లు వెచ్చించనున్నారు. 

  • Author

రూ. 1600 కోట్లతో పెడన-లక్ష్మీపురం జాతీయ రహదారి విస్తరణ

పెడన-లక్ష్మీపురం 216హెచ్‌ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది.

Published : 12 Jul 2024 03:42 IST
 
 
 
 
 
 

త్వరలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
పెడన, న్యూస్‌టుడే

AMR-2A_17.jpg

పెడన-లక్ష్మీపురం 216హెచ్‌ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(మోర్త్‌) రూ.1600 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర హైవే నంబరు 28గా ఉన్న ఈ రోడ్డు 216హెచ్‌ జాతీయ రహదారిగా మార్పుచెందడంతో ఈ మార్గం వెంబడి ఉన్న గ్రామాలకు మహర్దశ పట్టనుంది.

2016లో తెదేపా ప్రభుత్వ హయాంలో పెడన-విస్సన్నపేట మధ్య రెండు లైన్ల నెం.28 రాష్ట్ర హైవేను దాదాపు రూ.500 కోట్లతో ఏర్పాటు చేశారు. దీనిని జాతీయ రహదారిగా అభివృద్ధి పర్చాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఇటీవల సీఎం చంద్రబాబు దిల్లీకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేయగా రాష్ట్రంలోని ఇతర జాతీయ రహదారులతో పాటు 216హెచ్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పోర్టుకు అనుసంధానం

మచిలీపట్నం పోర్టు పూర్తయి భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) రిఫైనరీ మచిలీపట్నంలో వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. వేలసంఖ్యలో యువతకు ఉపాధి కల్గుతుంది. ఇప్పటికే మచిలీపట్నం-విజయవాడ మధ్య రైల్వే డబ్లింగ్‌ పూర్తయి అందుబాటులోకి వచ్చింది. తద్వారా పెడన నుంచి విజయవాడకు గంటన్నరలో రైళ్లు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రహదారుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మచిలీపట్నం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు తక్కువ దూరంలో చేరుకునే పెడన-లక్ష్మీపురం జాతీయ రహదారిని విస్తరిస్తే మచిలీపట్నంకు రాకపోకలు సాగించేందుకు మరింత సరళతరం కానుంది. భూసేకరణ ప్రక్రియలో మొదటిదైన 3ఎ నోటిఫికేషన్‌ విడుదల కాగా రెవెన్యూ అధికారులు ప్రక్రియ మొదలు పెట్టేందుకు అవసరమైన 3డీ ప్రకటన త్వరలో రానుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 180 హెక్టార్ల భూమి సేకరించేందుకు ప్రాథమిక సర్వే ద్వారా నిర్ధరించారు. ప్రస్తుతం ఉన్న రహదారికి రెండు వైపులా 6 మీటర్ల వెడల్పున రహదారి విస్తరణ కానుంది.

120.85 కి.మీ. పొడవు

పెడన తోటమూల జంక్షన్‌ వద్ద 216హెచ్‌ జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. దీని సరిహద్దు నుంచి ఒంగోలు-కత్తిపూడి 216 జాతీయ రహదారి వెళ్తుంది. పెడన నుంచి తెలంగాణ సరిహద్దున ఉన్న లక్ష్మీపురం వరకు 120.85 కి.మీ. నాలుగు లేన్లుగా అభివృద్ధి పరుస్తారు. ఈ మార్గమధ్యంలో పూర్వపు కృష్ణా జిల్లాలోని పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ, బాపులపాడు, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు మండలాలు వస్తాయి.

  • Author

Hyderabad-Bengaluru New Highway: హైదరాబాద్‌-బెంగళూరు కొత్త హైస్పీడ్‌ హైవే!

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది.

Updated : 27 Jul 2024 08:23 IST
 
 
 
 
 
 

508 కి.మీ. మేర ఆరు వరుసల్లో..
గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదన
ప్రస్తుత మార్గానికి ప్రత్యామ్నాయంగా ప్రణాళిక

gh260724main-8a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల హైవే ఉంది. అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047’లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని కేంద్రం రెండేళ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా ఈ మేరకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలన్నది వ్యూహం. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరును కూడా అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకోసం సవివర నివేదిక (డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు - డీపీఆర్‌)ను రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు డీపీఆర్‌ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది.

ఆరు వరుసలుగా..

ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని ఆరు వరుసల్లో నిర్మించాలన్నది ప్రతిపాదన. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆరు వరుసలకే పరిమితమైనట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. అయితే ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మిస్తారా? తొలుత నాలుగు వరుసలు నిర్మించి, తర్వాత మరో రెండు వరుసలను విస్తరిస్తారా? అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డీపీఆర్‌ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు.


120 కి.మీ. వేగంతో ప్రయాణాలు సాగేలా..

హైదరాబాద్‌ - బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించింది. 120 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించింది. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కి.మీ. మేర కారిడార్‌ను రూపొందించాలన్నది నిర్ణయం. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మధ్య 556 కి.మీ. నాలుగు వరుసల మార్గం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కి.మీ.ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నులను అధ్యయనం చేయించింది. హైస్పీడ్‌కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించింది.

 
  • 2 weeks later...
33 minutes ago, AndhraBullodu said:

elections ki kindha comments lo mundhae chesaaru 99% annaruga anna

Comments lo vallu anni elections munde chesamu ani cheputaru anduke gaa maa reds chala ekkuva seats ichharu

17 minutes ago, ravindras said:

paytm comments

 

16 minutes ago, Mobile GOM said:

Comments lo vallu anni elections munde chesamu ani cheputaru anduke gaa maa reds chala ekkuva seats ichharu

couter ivvali anna, elaanti comments ki , aadhaaraalatho kalipi. lepote nijam ae anukuntaaru. 70 rojullo annaru, ante appatiki inka ennikala phalithalu kooda raledhu kadha, nijam ga 70 rojullo vesina, june 4 ki mundhae modalettaru aemo anukunna nenu kooda. mana govt raaka mundhae ani anukunna

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.