Jump to content

RRR is on beast mode

Recommended Posts

వైకాపా నుంచి బహిష్కరించారా?: రఘురామ.
అమరావతి: వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. సీఐడీ అధికారులు నమోదు చేసిన రాజద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన సీఎం జగన్‌కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలోనూ వివిధ అంశాలపై మీడియా ముఖంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

తాజాగా మరో విషయాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి నా పేరు తొలగించారు. పార్టీ నుంచి వైకాపా అధినేత నన్ను బహిష్కరించారా? నాకు ఎలాంటి స్పష్టత లేదు.. ఎవరైనా చెప్పగలరా?’’ అంటూ రఘురామకృష్ణమరాజు ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. నిన్న వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభ స్పీకర్‌ను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణమరాజును డిస్‌క్వాలిఫై చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.

Link to post
Share on other sites
  • Replies 240
  • Created
  • Last Reply

Raghurama: పొరపాటా?కావాలనేనా?: రఘురామ
పేరు తొలగింపుపై స్పష్టత ఇవ్వండి

వైకాపా అధినేత, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసిన ఎంపీ. 
వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొల‌గించ‌డంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా త‌ర‌ఫున గెలిచిన త‌న పేరును తొలగించ‌డంపై అందులో ప్ర‌స్తావించారు. వైకాపా నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించారా? అని ఎంపీ సందేహం వ్య‌క్తం చేశారు. పొర‌పాటున‌ పేరు తొల‌గించారా? లేక కావాల‌నే చేశారా? అనే విష‌యంపై స్పష్టత ఇవ్వాలని జ‌గ‌న్‌ను కోరారు.

కావాల‌నే త‌న పేరును వైకాపా వెబ్‌సైట్ నుంచి తొల‌గించిన‌ట్ల‌యితే పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన‌ట్లు భావిస్తానని.. 48 గంట‌ల్లో పేరు చేర్చ‌క‌పోతే పార్ల‌మెంట్ సెక్ర‌టేరియ‌ట్ దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో త‌నును తాను స్వతంత్ర అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవాల్సి వ‌స్తుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.

Link to post
Share on other sites

Raghurama: ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ఏదీ?: రఘురామ
సీఎం జగన్‌కు ఎంపీ నాలుగో లేఖ.

ఏపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ మూడు రోజులుగా సీఎం జ‌గ‌న్‌కు లేఖలు రాస్తున్న న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఇవాళ కూడా లేఖ రాశారు. ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల హామీ నెర‌వేర‌లేద‌ని.. ఏటా జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ‌ర్ ఉంటుంద‌ని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌న్నారు. ఉగాదికి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో నిరుద్యోగులు ఎదురు చూశార‌ని చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే ఉద్యోగాల భ‌ర్తీకి వార్షిక క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని ఎంపీ లేఖ‌లో కోరారు.

గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ర‌ఘురామ లేఖ‌లో పేర్కొన్నారు. ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని కోరారు. 18వేల ఉపాధ్యాయ, ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌కుండా వ‌దిలేశార‌ని.. వంద‌ల సంఖ్య‌లో సెక్ర‌టేరియ‌ల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. కోర్టులో కేసుల కార‌ణంగా అంతంత మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని చెప్పారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామ‌ని సీఎం జగన్‌ ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ ఉద్యోగం హామీని ఇప్ప‌టికీ నెరవేర్చ‌లేద‌ని ఎంపీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. అత్య‌వ‌స‌రంగా పరిగణించి వెంట‌నే ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని కోరారు.

Link to post
Share on other sites

Shameless we are we use the most famous name of actors movie RRR on this small stooge of Naidu.

Evodo veedu veedi kosam meeku support istunna eee nandamuri site ni malinamu chestunaru? Shani Devudu viduvadu mimulani, oka vela mee Fox telivallana tappina mee family ni debba thestadu.

Link to post
Share on other sites
51 minutes ago, Govindu said:

Shameless we are we use the most famous name of actors movie RRR on this small stooge of Naidu.

Evodo veedu veedi kosam meeku support istunna eee nandamuri site ni malinamu chestunaru? Shani Devudu viduvadu mimulani, oka vela mee Fox telivallana tappina mee family ni debba thestadu.

Jaffalu kooda meelaga matladaremo . meeko pedda salute. 

meeboti vaaru ooriki okkadunte chalu,  smasanam anedi ekka akkarla ... endukante aa oore smasanam gaa maruddi kada. 

Link to post
Share on other sites
1 hour ago, Govindu said:

Shameless we are we use the most famous name of actors movie RRR on this small stooge of Naidu.

Evodo veedu veedi kosam meeku support istunna eee nandamuri site ni malinamu chestunaru? Shani Devudu viduvadu mimulani, oka vela mee Fox telivallana tappina mee family ni debba thestadu.

ee sapalu enti uncle? family ni debba testhada?

RRR (raghu rama raju) :no1:

RRR(ntr) :no1:

Link to post
Share on other sites

https://m.eenadu.net/politics/latestnews/mp-raghurama-wrote-5th-letter-to-cm-jagan/0500/121120452

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వండి: రఘురామ
సీఎం జగన్‌కు ఎంపీ ఐదో లేఖ.

ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం విడుదల చేయాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు వరుసగా ఐదో లేఖ రాశారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్‌కు రఘురామ లేఖలు రాస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు‌, పెళ్లికానుక..షాదీముబారక్‌, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ అంశాలను ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని వారిని ఆదుకోవాలన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Link to post
Share on other sites

5 minutes ago, rajanani said:

సుప్రీం కోర్టు లో కేసు వాయిదా ఈ రోజే కదా

CBI court. If RRR file counter they will ask Jagan to answer. It will delay 3 months for sure

Link to post
Share on other sites
33 minutes ago, goldenstar said:

CBI court. If RRR file counter they will ask Jagan to answer. It will delay 3 months for sure

జూలై 1st కి వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్‌ కౌంటర్‌పై రఘురామ రిజాయిండర్‌ దాఖలు చేశారు. రిజాయిండర్‌లో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

‘‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు చేశారు. నాకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడం అసంబద్ధం. పిటిషన్‌ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చాయి. నాపై కేవలం ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. ఛార్జ్‌షీట్‌లు కాలేదు. జగన్‌ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. పిటిషన్‌పై విచారణకు.. నా కేసులకు సంబంధం లేదు. నాపై అనర్హత వేటుకు.. ఈ పిటిషన్‌కు సంబంధం లేదు. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారు. అందుకే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించలేదు. ప్రచారం కోసమే పిటిషన్‌ వేశానన్న ఆరోపణలు నిరాధారం. నేను పిటిషన్‌ వేయగానే సీఐడీ నాపై కేసు నమోదు చేసింది. చట్ట విరుద్ధంగా నన్ను అరెస్ట్‌ చేసి వేధించారు.’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో వాదనలకు సమయం ఇవ్వాలని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం జులై 1కి వాయిదా వేసింది.

Link to post
Share on other sites

Raghurama: ‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు’
రిజాయిండర్‌లో పేర్కొన్న ఎంపీ రఘురామ.

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్‌ కౌంటర్‌పై రఘురామ రిజాయిండర్‌ దాఖలు చేశారు. రిజాయిండర్‌లో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు చేశారు. నాకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడం అసంబద్ధం. పిటిషన్‌ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చాయి. నాపై కేవలం ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.. ఛార్జ్‌షీట్‌లు కాలేదు. జగన్‌ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. పిటిషన్‌పై విచారణకు.. నా కేసులకు సంబంధం లేదు. నాపై అనర్హత వేటుకు.. ఈ పిటిషన్‌కు సంబంధం లేదు. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారు. అందుకే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించలేదు. ప్రచారం కోసమే పిటిషన్‌ వేశానన్న ఆరోపణలు నిరాధారం. నేను పిటిషన్‌ వేయగానే సీఐడీ నాపై కేసు నమోదు చేసింది. చట్ట విరుద్ధంగా నన్ను అరెస్ట్‌ చేసి వేధించారు.’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో వాదనలకు సమయం ఇవ్వాలని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం జులై 1కి వాయిదా వేసింది.

Link to post
Share on other sites

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిలు రద్దు చేయడానికి ఆయన ప్రభుత్వం ఇటీవల తనను అరెస్ట్‌ చేసి పెట్టిన చిత్రహింసల ఘటన ఒక్కటి చాలని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు సీబీఐ కోర్టుకు తెలిపారు. తన పిటీషన్‌పై జగన్‌ వేసిన కౌంటర్‌కు ఆయన తరఫు న్యాయవాది ఇవాళ సమాధానం దాఖలు చేశారు. కేసు విచారణను జులై 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జగన్‌ వేసిన పిటీషన్‌కు రాజు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనపై సీబీఐ అధికారులు జరిపిన దాడితో పాటు... తనపై సీఐడీ అధికారుల చిత్రహింసలు.. సదరు ఘటనపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను, ఉత్తర్వుల కాపీలను సీబీఐ కోర్టుకు సమర్పించారు. రాజు ఇచ్చిన 9 పేజీల సమాధానంలో ఇవాళ పలు కొత్త అంశాలను ప్రస్తావించారు. జగన్‌ కేసులో కీలక వ్యక్తులు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకుండా ఎలా పదవులు ఇచ్చి కట్టబెట్టారో ఆయన వివరించారు. ఇందులో మొదటి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావించారు.ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏ7గా ఉన్న సజ్జల దివాకర్‌ రెడ్డి (మృతి చెందారు) సోదరుడే సజ్జల రామకృష్ణా రెడ్డి అని, ఆయన ప్రస్తుతం పోలీస్‌తో సహా ప్రభుత్వ సమావేశాల నిర్వహణ కార్యక్రమాలను ఆయన చూస్తున్నారని రాజు ఆరోపించారు.మోపిదేవి వెంకటరమణ సీబీఐ చార్జిషీటులో ఏ4గా ఉన్నారని..ఆయన ఎన్నికల్లో ఓడిపోయానా మంత్రి పదవి ఇచ్చారని..ఇపుడు అతన్ని రాజ్యసభ సభ్యుడిని చేశారన్నారు. అలాగే ఆయన వాహనాలతో పాటు పోలీస్‌ ఎస్కార్ట్‌ కూడా కల్పించారని రాజు పేర్కొన్నారు.జగన్‌ కేసు చార్జిషీటులో ఏ12గా ఉన్న మురళీధర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించారు.జిల్లా మెజిస్ట్రేట్‌గా ఆయన విశేష అధికారాలు చెలాయిస్తున్నాడన్నారు.సీబీఐ చార్జిషీట్‌లో ఏ3గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించారన్నారు.సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ ఇంటర్‌పోల్‌ వారెంట్ కారణంగా సెర్బియా అరెస్ట్‌ చేస్తే... ఆయనను మన దేశానికి రప్పించడానికి విదేశాంగ మంత్రి వద్దకు ఎంపీలతో జగన్‌ ఓ ప్రతినిధి బృందాన్ని పంపారని అన్నారు.సహ నిందితుడైన అరబిందో ఫార్మా కంపెనీ యజమానికి కాకినాడు ఎస్‌ఈజడ్‌ అప్పగించారన్నారు.
మరో సహనిందితుడైన హెటొరో ఫార్మా కంపెనీ యజమానికి ప్రేమా వెల్‌నెస్‌ రిసార్ట్‌ పేరుతో విశాఖలోని బే పార్క్‌ రిసార్ట్‌ నిర్వహణ అప్పగించారని రాజు ఆరోపించారు.జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక ఆర్థిక లబ్ది చేకూరేలా నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని రాజు పేర్కొన్నారు.ఏపీ హైకోర్టు జడ్జీలపైనా, సుప్రనీం కోర్టు జడ్జీలపై కూడా జగన్మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేయడమేగాక... మీడియాకు విడుదల చేశారన్నారు. సదరు ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టివేసిందని రాజు తన సమాధానంలో పేర్కొన్నారు.ఇక నుంచి అఖిల భార సర్వీసు అధికారుల పనితీరును మదింపు చేసే అధికారం కూడా జగనే దఖలు పర్చుకున్నారని పేర్కొన్నారు. ఇంతకుమునుపు ఆ అధికారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉండేదన్నారు.ఈ జీవో కేవలం అధికారులను బెదిరించడానికే తెచ్చారన్నారు.
ఇవన్నీ జగన్‌ బెయిల్ షరతులను ఉల్లంఘించారనడానికి ఉదాహరణలని రాజు గారు రు పేర్కొన్నారు.

Link to post
Share on other sites
9 minutes ago, Siddhugwotham said:

jasti krishna kishore ni elaa harass chesaado koodaa cheppavalasindhi.

a2 ki rajya sabha ichaadu

Link to post
Share on other sites

Raghurama: ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఇవ్వండి: రఘురామ.

దిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకులకు డీఏ, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే వైకాపా ఎన్నికల హామీల అమలుపై ఐదు లేఖలు రాసిన ఆయన.. తాజాగా డీఏ, పీఆర్సీ అమలు చేయాలని ఆరో లేఖలో కోరారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున వైకాపాకు అండగా నిలిచారని.. వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Link to post
Share on other sites

ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు?

చాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,  రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు గడిచిపోయింది. అదీకాక కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పిలుపు రావడంతో ఈ అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Link to post
Share on other sites
2 hours ago, Siddhugwotham said:

valla internal party matters tho governor ki enti sambandham 🙂 

Link to post
Share on other sites
4 hours ago, Siddhugwotham said:

ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు?

చాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,  రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు గడిచిపోయింది. అదీకాక కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పిలుపు రావడంతో ఈ అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

mundu jagga met amitsha

next jagga met gov

then ys bharathi met gov

now gov going to centre

tomorrow, mosha will play their trick!

Link to post
Share on other sites
1 hour ago, Nfdbno1 said:

mundu jagga met amitsha

next jagga met gov

then ys bharathi met gov

now gov going to centre

tomorrow, mosha will play their trick!

YS Bharathi met Governor along with Jagan kadha. It is for training emo kadha. Anna baaga planning lo unnadu kadha.

Link to post
Share on other sites
25 minutes ago, JAYAM_NANI said:

YS Bharathi met Governor along with Jagan kadha. It is for training emo kadha. Anna baaga planning lo unnadu kadha.

parichayalu penchu kuntunnaru..

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...