Jump to content

RRR is on beast mode


Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏడో లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుభరోసా సాయాన్ని అందించాలని కోరారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రైతులు వైకాపాకు అండగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.13,500 ఇవ్వాలన్నారు. కేంద్ర సాయంతో కలిపి మొత్తం రూ.19,500 రైతులకు అందించాలని కోరారు.

Link to comment
Share on other sites

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఎనిమిదో లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు, పేదలందరికీ ఇళ్ల అంశాన్ని ప్రస్తావించారు. 

‘‘పేదలందరికీ ఇళ్లు హామీతో ప్రజల నుంచి వైకాపాకు మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీల్లో ఇంత వరకు మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి’’ అని రఘురామ కోరారు.

Link to comment
Share on other sites

ఎన్నికల్లో వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ సీఎం జగన్‌కు ఆయన తొమ్మిదో లేఖ రాశారు. నిషేధం కంటే మద్యపాన ప్రోత్సాహం ఎక్కువగా ఉందని రఘురామ ఆక్షేపించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 16 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. మద్యపానం నిషేధిస్తారని మహిళలు వైకాపాకు ఓటేశారని.. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. వైకాపా ఎన్నికల హామీలపై ‘నవ హామీలు- వైఫల్యాలు’ పేరుతో ఆయన మొత్తం 9 లేఖలు వరుసగా రాశారు.

Link to comment
Share on other sites

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై ఆయన కుమారుడు భరత్‌, తెదేపా ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. దీనిపై సమగ్ర వివరాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర వివరాలు పంపాలని నోటీసులు పంపింది. 

Link to comment
Share on other sites

Raghurama: 15 రోజుల్లో వివరాలివ్వండి 

కేంద్రహోంశాఖ కార్యదర్శికి లోక్‌సభ స్పీకర్‌ ఆదేశం

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై ఆయన కుమారుడు భరత్‌, తెదేపా ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 

అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. దీనిపై సమగ్ర వివరాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర వివరాలు పంపాలని నోటీసులు పంపింది. 

Link to comment
Share on other sites

ఢిల్లీ: బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈనెల 25న జరగనున్న పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తనపై జరిగిన దాడి అంశాన్ని చర్చించాలని రఘురామ కోరారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ జరిగిన దాడిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రఘురామ అభ్యర్థనపై భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదుల కమిటీలో భూపేంద్ర యాదవ్ చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదుల కమిటీలో రఘురామకృష్ణరాజు సభ్యుడుగా ఉన్నారు.

Link to comment
Share on other sites

Raghurama: అశోక్‌పై వ్యాఖ్య‌లను అదుపు చేయాలి: ర‌ఘురామ‌ - https://www.eenadu.net/politics/latestnews/mp-raghurama-letter-to-cm-jagan/0500/121124207

 Raghurama: అశోక్‌పై వ్యాఖ్య‌లను అదుపు చేయాలి: ర‌ఘురామ‌
సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ లేఖ‌.

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్టు ఛైర్మ‌న్‌ అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై అనుచిత వ్యాఖ్య‌లు స‌రికాద‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. మాన్సాస్ ట్ర‌స్టుపై హైకోర్టు ఇటీవ‌ల‌ ఉత్త‌ర్వులిచ్చింద‌న్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశార‌ని పేర్కొన్నారు. అశోక్‌పై విజయ‌సాయిరెడ్డి సహా అనేక మంది అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. ఆయ‌న‌పై వైకాపా నేత‌లు ఇలా వ్యాఖ్య‌లు చేయ‌కుండా అదుపు చేయాల‌ని లేఖ‌లో జ‌గ‌న్‌ను ఎంపీ కోరారు.

Link to comment
Share on other sites

Raghurama: అమ‌రావ‌తిపై నిర్ణ‌యం పెద్ద‌రికం కాదు: ర‌ఘురామ‌
న‌వ‌ప్ర‌భుత్వ క‌ర్తవ్యాలు పేరుతో జ‌గ‌న్‌కు ఎంపీ లేఖ‌.

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్నార‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇప్ప‌టికే న‌వ‌హ‌మీలు- వైఫ‌ల్యాల పేరుతో సీఎంకు తొమ్మిది లేఖ‌లు రాసిన ఎంపీ.. న‌వ ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యాలు పేరుతో మ‌రో 9 లేఖ‌లు రాస్తాన‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆయ‌న ఇవాళ రాసిన లేఖ‌లో అమ‌రావ‌తిని కొన‌సాగించే విష‌యంపై ప్ర‌స్తావించారు. 
పాద‌యాత్ర‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమ‌రావ‌తిపై జ‌గ‌న్ హామీ ఇచ్చార‌న్నారు. క‌నీసం 30 వేల ఎక‌రాల్లో రాజ‌ధాని ఉండాల‌ని సూచించార‌ని చెప్పారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక నిర్ణ‌యం మార్చ‌డం పెద్ద‌రికం కాద‌ని ర‌ఘురామ అన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును దుర్వినియోగం చేయొద్ద‌ని కోరారు. మూడు రాజ‌ధానుల‌పై సీఎం నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింద‌ని ఎంపీ లేఖ‌లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

13 minutes ago, Nfan from 1982 said:

Himsa Jalaga ki 😃😃

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదే...  RRR suspende cheste poyedi.... ippudu chirigi chaatavuthundi.. 

Link to comment
Share on other sites

Raghurama: జగనన్న క్యాంటీన్లు తెరవాలి
ఏపీ సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ.

నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కోరారు.

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అని దాదాపు అన్ని పవిత్ర గ్రంధాలలో చెబుతుంటారు. ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం అందించడం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతో అవసరమైనది. ఈ లేఖ ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అన్నదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మిన్న అనే నానుడి కూడా మనం చిన్నతనం లోనే నేర్చుకున్నాం. అన్నదానం ద్వారా మంచి పేరు రావడమే కాకుండా మీరు ‘దైవదూత’ అనేది కూడా జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. అందుకని.. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నాను

Link to comment
Share on other sites

చట్టబద్ధమైన పోస్టులో వయస్సు సడలింపుతో నియమించడం తగదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు నవ కర్తవ్యాల పేరుతో రఘురామ ఈ మేరకు ఐదో లేఖ రాశారు. ఏపీ పోలీస్‌ కంప్లెయింట్స్‌ అథారిటీ(పీసీఏ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ వి.కనగరాజు నియామకాన్ని రఘురామ తప్పుబట్టారు. 65 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే పదవికి అర్హులని తన లేఖలో పేర్కొన్నారు. జస్టిస్‌ కనగరాజును నియమించేందుకు ప్రణాళిక ప్రకారమే నిబంధనలు సవరించారన్నారు. 2020 ఏప్రిల్‌లో ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజును నియమించారన్న రఘురామ.. నెలలోపే నియామక ఆదేశాలను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

Link to comment
Share on other sites

జూన్ 24, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్
విషయం: ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ – సుప్రీంకోర్టు అభిప్రాయం
ముఖ్యమంత్రి గారూ,
మీకు కావాల్సింది లభించనప్పుడు మీకు లభించేదాన్నే అనుభవం అంటారు. ఈ నానుడి మన ప్రభుత్వానికి చక్కగా అతికినట్లు సరిపోతుంది. మీ ఆలోచనలకు అందని విషయాలను ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు గుర్తు చేస్తున్నందున ఈ విషయం నేను ప్రస్తావించక తప్పదు. 12వ తరగతి పరీక్షలను జులై చివరి వారంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించాలనే మీ మంకుపట్టుపై తాజాగా సుప్రీంకోర్టు ఉతికిఆరేయడం చూసినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కనిపించింది. 
12వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురువారం నాడు తాజాగా సుప్రీంకోర్టు నిశితంగా పరిశీలించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అసలు అఫిడవిట్ దాఖలు చేయడంలోనే రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించలేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. తరగతి గదికి 15 మంది విద్యార్ధులనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తామని, కోవిడ్ రక్షణ ప్రోటోకాల్ ను తూచా తప్పకుండా పాటిస్తామని అఫిడవిట్ లో చెప్పడంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన అంశం.
రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్కో గదికి 15 మంది విద్యార్ధులతో పరీక్ష నిర్వహించాలంటే కనీసం 35000 పరీక్షా గదులు ఉండాలని సుప్రీంకోర్టు లెక్కవేసింది. ఇలా ఇంత భారీ సంఖ్యలో తరగతి గదులు ఉన్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కరోనా మూడో దశ ప్రారంభమౌతుందని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉన్న ఈ స్థితిలో జులై చివరి వారంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అదీ కాకుండా దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ అతి భయకరంగా విజృంభిస్తున్న వేళ ఇది. అంతే కాకుండా కరోనా కేసులు, సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా ఉందనేది ప్రజల అభిప్రాయం కూడా. 
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి చేస్తున్నది. తాత్కాలిక షెడ్యూలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పై కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్యార్ధులను ఇంత అస్థిరత్వంలో ఉంచడం మంచిది కాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 15 రోజుల ముందు కచ్చితమైన షెడ్యూల్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాలూ పరీక్షలను వాయిదా వేశాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అలా ఎందుకు చేయలేకపోయిందని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇలా మీరు చేయడానికి కారణం ఏమిటంటే మిమ్మల్ని మీరు ఈ దేశంలోనే ప్రత్యేకం మైన వ్యక్తిగా చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. గతంలో మీరు కరోనా వ్యాధి గురించి చెప్పిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు చూస్తే కరోనా పట్ల, ప్రస్తుత సమస్య పట్ల మీరు ఎంత అవగాహనతో ఉన్నారో, మీ మానసిక స్థితి ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది. మీరే నూతన మార్గదర్శి కావాలని మీరే అన్ని కీర్తి ప్రతిష్టలు కొట్టేయాలని విద్యార్ధుల జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్నారని మేము భావించాల్సి వస్తున్నది కూడా ఇందుకే. 
మన ప్రభుత్వం ఇంత మంకుపట్టు ఎందుకు పట్టిందో మాకు అర్ధం కావడం లేదు. లక్షలాది మంది విద్యార్ధుల జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నారో కూడా అసలు అర్ధమే కావడం లేదు.
మన రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహించకపోతే…. మిగిలిన అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షలు పెట్టేస్తే…. మిగిలిన అన్ని రాష్ట్రాల విద్యార్ధులకు సీట్లు వచ్చేసి మన రాష్ట్ర విద్యార్ధులకు తీరని అన్యాయం జరుగుతుందని పాపం మీరు ఎంతో ఆవేదన చెందుతున్నట్లుగా ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మీరు ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉన్నారు కూడా. విద్యార్ధుల భవిష్యత్తుపై మీరు చూపిస్తున్న ఆందోళన ఇప్పుడు వారి జీవితానికే శాపం అయ్యేలా ఉందని కూడా ప్రజలు తాజాగా అనుకుంటున్నారు.
తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఏమిటంటే కరోనా కారణంగా ఏ ఒక్క విద్యార్ధికి హాని జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించడం. ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగితే మీరు (ప్రభుత్వం) పూర్తి బాధ్యులని విద్యార్ధులు, తల్లిదండ్రులు వారి కుటుంబాలు చివరికి టీచర్లు కూడా భావిస్తున్నారు. మీకు ఎంత మంకుపట్టు ఉన్నా పొరబాటు జరిగితే దాన్ని మీరు సరిదిద్దలేరు.
అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తమకు చెబితే తప్ప, తాము సంతృప్తి చెందితే తప్ప పరీక్షల నిర్వహణకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. రేపు మధ్యాహ్నం ఈ కేసును మళ్లీ విచారిస్తామని, ఈ లోపు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తుది అభిప్రాయం కనుక్కోమని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 
కనీసం….. కనీసం ఇప్పటికైనా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా మీరు తక్షణమే ప్రకటించండి. తద్వారా మీ గౌరవానికే భంగం కలగకుండా ఉంటుందని మీ శ్రేయోభిలాషిగా మీకు సలహా ఇస్తున్నాను.
విద్యార్ధులను కరోనా రహిత పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి మన వద్ద సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవన్నది నిజం. కరోనా మూడో దశ అత్యంత తీవ్ర స్థితికి వచ్చేస్తే జులై ఆఖరు నాటికి అనుసరించాల్సిన ‘‘అత్యవసర ప్రణాళిక’’ కూడా మన వద్ద సిద్ధంగా లేదు. 
ఇలాంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే దేశంలోని 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి (మిగిలిన రాష్ట్రాలలో పరీక్షలు ఇప్పటికే పూర్తి అయ్యాయి) మన ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిలో విజ్ఞతతో ఎందుకు ఆలోచించడం లేదో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా మీరు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఒక మంచి నాయకుడిలా ముందుకు రండి. విద్యార్ధుల, వారి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రాణాలను కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకుని పరీక్షలను రద్దు చేయండి.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

Link to comment
Share on other sites

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ , మూల్యాంకనం సాథ్యం కాదు కాబట్టి పరీక్షలు రద్దు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...