Jump to content

ప్రధాని మోదీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం


Recommended Posts

ప్రధాని మోదీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
10-05-2019 16:11:58
 
636931018312412437.jpg
న్యూఢిల్లీ: భారత సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్’ సంచలన కథనం ప్రచురించింది. ‘‘భారతదేశ ప్రధాన విభజనకారి’’ అన్న శీర్షికతో మోదీ క్యారికేచర్‌ను కవర్‌పేజీపై ముద్రించింది. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా?’’ అని రచయిత అతిష్ తషీర్ ప్రశ్నించారు. ‘‘జనాకర్షక దిశగా పతనమైన గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంటే అది భారతదేశమే...’’ అంటూ ఈ కథనం ప్రారంభమవుతుంది. టర్కీ, బ్రెజిల్, బ్రిటన్, అమెరికా తదితర ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా భారత్‌లో ఈ జనాకర్షక రాజకీయం ముసురుకుంటున్నదని రచయిత పేర్కొన్నారు.
 
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లౌకికవాదాన్ని, ‘‘మోదీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ‘‘ఉద్రిక్తత’’తో పోల్చుతూ ఈ కథనం సాగింది. దీంతో పాటు వందలాది మందిని బలిగొన్న గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్‌లో గుర్తుచేశారు. బీజేపీ హిందూత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని రచయిత ప్రముఖంగా పేర్కొన్నారు. ‘‘2014 ఎన్నికల తర్వాత  స్వతంత్ర భారత రాష్ట్రాల ప్రాధమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనారిటీ స్థానం సహా దేశంలో అనేక వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మకాలు ఏర్పాడ్డాయి’’ అంటూ మోదీపై టైమ్ మ్యాగజైన్ విమర్శలు గుప్పించింది.
 
‘‘2014 ఎన్నికల తర్వాత స్వతంత్ర భారత ప్రధాన లక్ష్యాలైన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిని చాలామంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారు...’’ అంటూ టైమ్ కథనం పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోదీ ‘‘అల్లరి మూకలకు స్నేహితుడిగా మారారంటూ’’ రచయిత విమర్శించారు. గోహత్యలపైనా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని కూడా టైమ్ మ్యాగజైన్ ప్రశ్నించింది. కాగా ఈ మ్యాగజైన్ మోదీని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. 2012లో ఇదే మ్యాగజైన్ ప్రచురించిన ఓ కథనంలో... మోదీని వివాదాస్పద, ఒత్సాహిక, తెలివైన రాజకీయ నాయకుడిగా పేర్కొంది. కాగా తాజా కథనం ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త ఆయుధంగా మారింది.  ‘‘మీ గురించి అందరూ నిజం తెలుసుకోవాలి...’’ అంటూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ మోదీకి ట్వీట్ చేసింది. 
Link to comment
Share on other sites

Pani Leni journalists enno Rasta untaru...no one gives a damn....moreover secularism is not majority people being forced to give up their beliefs and customs....ledu ante 10 Mandi pillalni Lani cycle shop lo petti tax kadtunna govt emi cheyyatledu ane jungle galaki ee jungle gade correct .....

Link to comment
Share on other sites

మన దురదృష్ఠం కొద్దీ ఈ టైమ్ మ్యాగజైన్ వ్రాసిన దాన్ని పొగడాల్సి వస్తుంది కానీ, లేకపోతే వీళ్ళేమంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు కాదు. మన దేశంలో ఒకవైపేమో మైనారిటీలని, క్రిస్టియన్స్ ని వెనకేసుకొస్తూ చేసే పార్టీలు కొన్ని, మరో వైపేమో హిందూ ధర్మాన్ని మేమే పరిరక్షిస్తున్నామంటూ బాకా ఊదుతూ ఓట్లు దండుకునే పార్టీలు కొన్ని. అంతే కానీ, అసలు కులమతాల ఊసుల్లేకుండా మనిషిని మనిషిగా చూస్తూ వాళ్ళకి కావలసిన మౌలిక అవసరాలని తీరుస్తాము, మాకు ఓటెయ్యండి అని అడిగే పార్టీలు కానరావటం లేదు. ఫలానా పార్టీ అన్యాయం చేసిందని ఇంకో పార్టీకి ఓటు వెయ్యటం, తిరిగి ఆ పార్టీ కూడా ఏమీ చెయ్యకపోతే తిరిగి పాత పార్టీకే ఓటు వేసి గెలిపించి మనమేదో వాళ్ళకి బుద్ధి చెప్పామని అనుకోవటం విచారకరం. ఏ పార్టీ గెలిచినా రాజకీయ నాయకుల జీవితాలు సజావుగా జరుగుతున్నాయి, కానీ పార్టీనే నమ్ముకున్న సాధారణ కార్యకర్తల కుటుంబాలు చితికిపోతున్నాయి. 

ఇప్పుడు కొత్త పోకడలు ఏంటంటే, ఎంత అభివృద్ధి చేసినా సంక్షేమ పధకాలు లేకుండా ప్రజలు ఓటెయ్యరు అని. అలా అని సంక్షేమ పధకాలు వల్ల మాత్రమే గెలుస్తారా అంటే దానికీ సమాధానం లేదు. ప్రజల్లో వచ్చిన వింత పోకడ ఏంటంటే, ప్రతి ఒక్కరూ నాకేం వచ్చింది అని అడిగే వారే, తాత్కాలిక సదుపాయాలకు మురిసేవారే. 

మరో వైపు, ప్రభుత్వాలు తెచ్చే అప్పు తిరిగి మన మీదే పడుతుందనే కొంచెం ఆలోచన కూడా లేకుండా, ‘మీ చావు మీరు పడండి, మాకు పప్పు బెల్లాలు పంచితే చాలు’ అని అడిగే వారే ఎక్కువయ్యారు. ఆర్ధిక క్రమశిక్షణ ఉన్న రాష్ఠ్రాలు, ప్రభుత్వాలు ఎన్ని. పుట్టబోయే తరాలని కూడా అప్పుల ఊబిలోకి నెట్టే ఈ ధోరణులు జాతికి శ్రేయస్కరం కాదు. సామాన్య జనం లోనూ పెరిగిపోతున్న ఈ ఆర్ధిక విచ్చలవిడితనం చూస్తుంటే బాధేస్తుంది. ఒకప్పుడు మనకొచ్చే వంద రూపాయల ఆదాయంలో ముందు 20 రూపాయలు దాచుకుని మిగిలిన 80 రూపాయల గురించి ఆలోచించేవారు ఏ పనుల మీద ఖర్చు పెట్టాలో అని. ఇప్పుడు అలా కాదు, మరో మూడు నెలల్లో వచ్చే బోనస్ మీద ఆధారపడి, ఇప్పటి నుంచే ఖర్చు చేస్తున్నారు. పాశ్ఛాత్య దేశాలను అనుసరిస్తూ పెంచుకుంటున్న ఈ ఆర్ధిక విశృంఖలత మనల్ని జీవితాంతం చేసే పనికి కట్టు బానిసను చేస్తుందని ఎవరూ ఆలోచించటం లేదు. 

ఒకప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేసుకునేవారు. ఇప్పుడు ఆ లెక్కే మారిపోయింది. డబ్బు ఎక్కువ ఉన్న వాడికన్నా అంతంతమాత్రం ఉన్న వాళ్ళు చేసే ఆడంబరాలు చూసి జాలి పడటం తప్ప ఏం చెయ్యలేని పరిస్థితి. 

మరో వైపు, సామాజిక బాధ్యత మరిచి మనుషుల అంగ వైకల్యం మీద, సాత్విక గుణం మీద కామెడీ చేస్తూ దాన్నే హాస్యం అని చెప్పే సినిమాలు ఒక వైపు. వాళ్ళని అనుసరిస్తూ అనుకరించే అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. మనిషి మనిషితో మాట్లాడటం లేదు, అంతా ఫేస్ బుక్, వాట్సప్ లలో డిస్కషన్సే. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే, ఎదుటి వారి అభిప్రాయాలని అంగీకరించకపోతే వాళ్ళేం అనుకుంటారోనన్న ఫీలింగ్. అదే సోషల్ మీడియాలో ఐతే మనం అనుకున్న చెత్తంతా మనిష్ఠం వచ్చినట్టు వెళ్ళగక్కవచ్చు. ఒకప్పుడు సమాజంలో ఆరోగ్యకరమైన వాదనలు జరిగేవి. అంటే ఉదాహరణకి నాకు కాఫీ నచ్చకపోతే నేను నా స్నేహితుడితో చెప్పేవాడిని నాకు కాఫీ ఎందుకు నచ్చదో, వాడేమో వాడికి ఎందుకు నచ్చుతుందో. చివరికి ఎవరు అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సరదాగా సంభాషణ ముగిసేది. అదే ఇప్పుడైతే, నేను కాఫీ మంచిది కాదన్నానని వాడు నాతో మాటలు కట్ చేసి వాట్సప్ లో కాఫీ తాగటం వలన కలిగే మంచి గురించి రీసెర్చ్ ఆర్టికల్స్, పేపర్ కటింగ్ లు పోస్ట్ చేస్తుంటాడు. ఉదాహరణకే చెప్పాను, ఇది నిజం కాదు. 

మరో అత్యంత ఆందోళనకరమైన పోకడ ఏంటంటే, కులమతాల పరంగా సమాజం విడిపోవటం. పాత రోజుల్లో లేదని కాదు, కానీ సోషల్ మీడియా లేకపోవటం వలన, ఇంతగా జన బాహుళ్యంలోనికి వ్యాపించలేదు. 

చిట్టచివరిగా చెప్పాల్సింది, మేధావుల మౌనం మరియు మానసిక ధౌర్భల్యత గురించి. ఒకప్పుడు సామాన్య ప్రజానీకం ఎలా అనుకున్నా, మేధావులు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తపరిచేవారు. తద్వారా మనుషుల ప్రవర్తనావళి మీద తెలియకుండానే ఎంతో కొంత ప్రభావం చూపేవారు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోల్స్ కి భయపడి కానీ, మనమొక్కరమే ఎందుకు బయటపడాలనే నిర్లిప్త భావన వలన కానీ, వాళ్ళంతా మౌనం వహిస్తున్నారు. దాని వలన కుహనా మేధావులు, తామే మేధావులమన్న ముసుగేసుకుని తమ ఎజెండాను ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. దీని వలన, భవిష్యత్తు తరాల ఆలోచనాభావాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. 

 

Link to comment
Share on other sites

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీడియా చేసే రాజకీయ వ్యభిచారం గురించి. మనిషికి మెదడే లేనట్లు, ఆలోచించటం రాదన్నట్లు. ఇదీ వార్త, అర్ధం చేసుకునే విషయం పాఠకుల మీద, వీక్షకుల మీద ఆధారపడి ఉంటుందన్న సామాన్య సూత్రం మర్చిపోయి, మీరు ఈ వార్తని ఇలాగే ఆలోచించి అర్ధం చేసుకోవాలనే వింత పోకడ వలన, వార్తల్లో ఉన్న విశ్వసనీయత తగ్గిపోయి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియటం లేదు. మంచిని అమాయకత్వంగా, నిస్సహాయకత్వంగా, చెడుని తెలివైనదిగా, ధైర్యవంతమైనదిగా చిత్రించి ప్రచారం చేసే మీడియాను చూసి అసహ్యమేస్తుంది. 

Link to comment
Share on other sites

2 minutes ago, Rajakeeyam said:

ekkadaa? word search didn't find that term reyy:comfort:

Was referring to these metaphorically :comfort:

He can fairly be accused of fanning flames of hostility toward India’s Muslim population of up to 200 million

a dangerous escalation by one nuclear-armed power against another.

Link to comment
Share on other sites

11 minutes ago, Rajakeeyam said:

DPQOnbIU8AAoUOb?format=jpg&name=900x900

🤗

So you agree that TIME wrote correctly as you feel MMS is a puppet! 

Or 

do you agree that MMS is great as TIME is trying to malign him using some useless sick writer?

 

 clarity undhaa?

Link to comment
Share on other sites

2 minutes ago, krantionline29 said:

Was referring to these metaphorically :comfort:

He can fairly be accused of fanning flames of hostility toward India’s Muslim population of up to 200 million

a dangerous escalation by one nuclear-armed power against another.

youtube videos heading laga undhi, antha easy ga dorikipoka 😁

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

So you agree that TIME wrote correctly as you feel MMS is a puppet! 

Or 

do you agree that MMS is great as TIME is trying to malign him using some useless sick writer?

 

 clarity undhaa?

Nv ilanti tough questions veste cover drive lu padav 

Konchem customise chesi easy ga adugu

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

So you agree that TIME wrote correctly as you feel MMS is a puppet! 

Or 

do you agree that MMS is great as TIME is trying to malign him using some useless sick writer?

 clarity undhaa?

yes full clarity we base our judgement based on author :smug:

Link to comment
Share on other sites

4 hours ago, Rajakeeyam said:

yes full clarity we base our judgement based on author :smug:

Base your judgment on what he had written not on his origin. If his father is anti-Indian, can you say with same heart any other articles written by him on India are also anti-Indian no matter what they say or does this apply only to Modi?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...