స్టాక్ మార్కెట్ అంటే నిన్న, మొన్న ఒక్కటే కాదుగా, ఈలోపే మొత్తం ఆస్తులన్నీ హరించుకుపోతున్నట్టు ఫీలవటానికి. కంపెనీలని కొంచెం అడ్జస్ట్ అవ్వనివ్వండి, ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం తెలుసుకోవటానికి. మరీ అంత రెజిలెయెన్స్ లేని మార్కెట్ ఏమీ కాదులే అమెరికన్ మార్కెట్. ఒక్కటి మాత్రం గమనించాలి, ట్రంప్ కి ఓటు వేసేవాళ్ళు ఓటు వేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వెయ్యని వాళ్ళు మాత్రం ‘మేము ముందే చెప్పాం కదా, మొత్తం నాశనం చేస్తాడు అని, ఇప్పుడు అలాగే జరిగింది’ అని గింజేసుకుంటున్నారు. మీడియాలో ఒకవైపు వెర్షనే హైలైట్ అయినంతమాత్రాన అదే నిజమనుకోవటం భ్రమ. అలాగే వాడికి ఓటేసినోళ్ళు కామ్ గా ఉన్నారంటే వాడి మీద వ్యతిరేకత కాదు, ‘మేము చెయ్యాల్సినది మేము చేశాము, ఇక తను చెయ్యాల్సినది తను చేస్తాడులే ఎవరెన్ని అనుకున్నా’ అని అనుకోవటం వలనే. ఈ టాపిక్ అంతటిలో నాకు అంతుబట్టని విషయం ఏంటంటే, మన వస్తువులమీద 52% టారిఫ్ వేస్తున్న దేశం మీద సగం (26%) శాతం టారిఫ్ వెయ్యటంలో ఏం నేరం ఉందా అనేది.