Jump to content

Recommended Posts

 • Replies 68
 • Created
 • Last Reply

Top Posters In This Topic

మంత్రులకు ముచ్చెమటలు పట్టించిన సీఎం బాబు..!
 
 
636321836641113233.jpg
 • అన్నం తినకుండానే బయటికెళ్లిపోయిన మంత్రులు.!
మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి...అధికారులు హైరానా పడ్డారు. వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. సీనియర్ అధికారులు సైతం బిత్తర పోయారు. అధికారుల పట్ల మమకారం చూపించే చంద్రబాబులో ఎందుకంత కోపం వచ్చింది...పైగా ఆయన ఆగ్రహం సాదా, సీదా అధికారుల పై కాదు...సాక్షాత్తు ఓ ఐపీఎస్ అధికారి పై....సాక్షాత్తు కేబినెట్ లోనే చంద్రబాబు ఆగ్రహం చవిచూసిన మంత్రులు, మారుమాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమైందో..చంద్రబాబుకు ఎందుకంత కోపం వచ్చిందో ఈ స్టోరీలో చూడండి.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులంటే మమకారంగా ఉంటారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు చెప్పిన మాటకు కూడా విలువ ఇస్తారు. గంటల తరబడి వాళ్లతో సమాలోచనలు చేస్తారు. ఇప్పుడు రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల అసల గొడవ అంతా ఇదే. అధికారులతో గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తూ చంద్రబాబు తమకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదని తెలుగుదేశం నేతలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు..అధికారులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వారి పైనే విరుచుకుపడ్డారు. అధికారులకు కూడా రీ కాల్ సౌకర్యం ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించే వరకు సీఎం వెళ్ళారంటే దాని వెనుక ఎంత కథ జరిగిందోనని ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికార వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. పైగా ముఖ్యమంత్రి అంత ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా సాదా, సీదా అధికారి పై కూడా కాదు. సిన్సియర్ అధికారిణిగా పేరున్న ఐపీఎస్ అధికారిణి, రాష్ర్ట హోమ్ సెక్రటరీ అనురాధ పై. ఆమెతో పాటు ఆయన డీజీపీ నండూరి సాంబశివరావు పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ర్టంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అన్ని పట్టణాలను నిఘా నీడలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఫైల్ ను కేబినెట్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. హోం శాఖ ఈ ఫైల్ ను కేబినెట్ కు పంపించాల్సి ఉంటుంది. గత కేబినెట్ లోనే ఈ ప్రతిపాదనను తీసుకురావాలని సీఎం కోరారు. అయితే సాంకేతిక పరమైన సమస్యలున్నాయని, ఫైల్ ను అప్పట్లో నిలిపివేశారు. కానీ గురువారం కేబినెట్ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారమే ఈ ఫైల్ ను కేబినెట్ కు తీసుకురావాలని సీఎంఓ లో ఉండే ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎజెండాలో లేకపోయినప్పటికీ టేబుల్ ఐటమ్ గా పెట్టాలని కూడా సీఎం తన పేషీకి సూచించారు. అయితే ఈ ఫైల్ కోసం సీఎంఓ అధికారులు ఆరా తీశారు. నెల రోజుల పర్యటన కోసం హోం సెక్రటరీ అనురాధ అమెరికా వెళ్ళారు. ఆమె వెళ్లే సమయంలో ఈ ఫైల్ ను లాక్ అండ్ కీలో బీరువాలో పెట్టుకుని వెళ్ళిపోయారని అధికార వర్గాలు సీఎంఓకి సమాచారం అందించాయి.

తీరా గురువారం కేబినెట్ ఏజెండాలో ఈ అంశం లేకపోవటం, టేబుల్ ఐటమ్ గా కూడా తీసుకురాకపోవటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ ఐటమ్స్ జాబితాను చూసి సీసీ టీవీ కెమెరాల గురించి ఆరా తీశారు. ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అధికారులు నీళ్లు నమలటంతో సీఎం మరోసారి గట్టిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్ధాయిలో తాను చెబితే కూడా కేబినెట్ కు తీసుకురారా అని మండిపడ్డారు. సీఎం ఆగ్రహాన్ని చూసిన అధికారులు హోం సెక్రటరీ లేరని, ఫైల్ ఆమె లాక్ అండ్ కీలో ఉంచారని చెప్పటంతో సీఎం ఆగ్రహం రెట్టింపు అయ్యింది. ఒక్కసారిగా మండిపడ్డారు. ఒక అధికారి లేకపోతే వ్యవస్ధ మొత్తం ఆగిపోతుందా అని ఆయన ఉన్నతాధికారుల పై విరుచుకుపడ్డారు. అధికారులకు కూడా రీ కాల్ ఉంటే బాగుంటుందని సూచించారు. టెక్నాలజీ అని తాను పరుగులు తీస్తుంటే అధికారులు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరో వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ కోపం అంతటితో ఆగకుండా పాఠశాలల రేషన్ లైజేషన్ విషయంలో కూడా సీఎం మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. రేషన్ లైజేషన్ పేరిట నాలుగు వేల పాఠశాలలను మూసివేయటం ఏమిటని నిలదీశారు.

ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మీరు ఎందుకు గమనించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. పది మంది పిల్లలు లోపు ఉన్న పాఠశాలలనే మూసివేస్తున్నామని చెప్పగా, ఆ విషయాన్ని ముందే ఎందుకు ప్రజలకు చెప్పి మానసికంగా సిద్ధం చేయలేకపోయారని సీఎం ఆగ్రహంగా ప్రశ్నించారు. కొంత మంది మంత్రులకు శాఖల పై ఇంకా అవగాహన రావడం లేదని, భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి ఉంటే తాను సహించనని చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారు. అటు అధికారులు, ఇటు మంత్రులపై చంద్రబాబు విరుచుకుపడటంతో ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సగం మంది లంచ్ కూడా చేయకుండా బ్రతుకుజీవుడా అంటూ బయటపడిపోయారు. పేషీలకు వచ్చి, భోజనం చేసి, కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటే కానీ సీఎం ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ నుంచి తేరుకోలేకపోయారు.
Link to post
Share on other sites

మీ ఇంటి భద్రతకు మాదీ పూచీ

నిశ్చింతగా యాత్రకు వెళ్లండి..

‘తాళం వేసి ఉన్న ఇళ్లపై పర్యవేక్షణ’

ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలు

అనంతపురంలో విజయవంతమైన ప్రయోగం

ఈనాడు, అమరావతి: కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రానికో, విహార యాత్రకో వెళ్లాలని ఉన్నా.. ఇంటి భద్రత గురించి బెంగ పడుతున్నారా? ఇకపై ఆ భయం అవసరం లేదంటున్నారు పోలీసులు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో మీ వివరాలు, చిరునామా పేర్కొని.. ఫలానా తేదీల మధ్య వూరెళుతున్నామని చెబితే, ఆ సమయంలో మీ ఇంట్లో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ విధానం విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల్లో ఏటా సగటున రూ.120 కోట్ల విలువైన సొత్తు దొంగల పాలవుతోంది. ఈ కొత్త విధానంతో ఈ తరహా నేరాల కట్టడికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

పని చేసే విధానం ఇదీ..

తాళం వేసి ఉన్న ఇళ్లపై పర్యవేక్షణకు అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌ బాబు ప్రత్యేకంగా ‘‘లాక్‌డ్‌ హౌస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’’ అనే యాప్‌ను సిద్ధం చేశారు. జిల్లా పరిధిలోని ప్రజలు ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, తమ పేరు, ఫోన్‌ నెంబరు, చిరునామా నమోదు చేసుకోవాలి. అనంతరం వారి పేరిట ఓ వినియోగ నామం (యూజర్‌ నేమ్‌) సిద్ధమవుతుంది. వీరు ఇంటికి తాళం వేసి దూర ప్రాంత ప్రయాణానికి వెళ్లే ముందు ‘రిక్వస్ట్‌ ఫర్‌ పోలీసు వాచ్‌’ అనే విభాగంలోకి వెళ్లి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకూ పోలీసు నిఘా అవసరమో నమోదు చేయాలి. ఇలా సమాచారం ఇచ్చాక.. పోలీసులు ఆ ఇంటికి నిఘా కెమెరాలు అమర్చి.. సమీప స్టేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానిస్తారు. దొంగలు ఎవరైనా ఆ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేస్తే వెంటనే కంట్రోల్‌ రూం నుంచి సమీపంలోని గస్తీ సిబ్బందికి సమాచారం వెళుతుంది.

Link to post
Share on other sites
 • 2 weeks later...
రాష్ట్రమంతటా నిఘా నీడ
 
 
636336929068423237.jpg
 • 8,876 చోట్ల క్లౌడ్‌ కెమెరాలు
 • రూ.969 కోట్లతో పరికరాలు
 • ‘మ్యాట్రిక్స్‌’కు బాధ్యత
 
అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కిడ్నాప్ లు.. దోపిడీలు.. నడిరోడ్డుపైనే హత్యలు.. అత్యాచారాలు... రౌడీయిజాన్ని నివారించి, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రాన్నంతా సురక్షితమైన నిఘా నీడలోకి చేర్చే కార్యాచరణకు పూనుకొంది. ఈ నెల ఆరోతేదీన డీజీపీ సాంబశివరావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రమంతా 24 గంటలూ నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగా, ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్‌) నేతృత్వంలో క్లౌడ్‌ ఆధారిత ఐపీ సీసీటీవీ సర్వైవలెన్స్‌ సిస్టమ్‌ని ప్రభుత్వం రూ.969 కోట్లతో ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో 23000 కిలోమీటర్ల మేర క్లౌడ్‌ ఆధారిత ఐ
 
పీ సీసీటీవీ సర్వైవల్‌ సిస్టమ్‌ని నెలకొల్పుతారు. దీనికోసం ఏపీ ఫైబర్‌ నెట్‌ నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌(నాక్‌) నియంత్రణతో 2445 పాప్‌ల ద్వారా 8876 కేంద్రాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యతను మెసర్స్‌ మ్యాట్రిక్స్‌ సెక్యూరిటీ అండ్‌ సెర్వైవలెన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కన్సార్షియానికి అప్పగించారు. ఈ వ్యవస్థలో భాగంగా, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 3,800 సీసీ కెమెరాలు సహా... అదనంగా మరో 14,200 కెమెరాలను అమర్చనున్నారు. ఈ కెమెరాలన్నింటినీ ఏపీ ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేస్తారు. రోజంతా నిఘా కెమెరాలలో రికార్డు చేసిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వీలుగా, అమరావతి, విశాఖల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈ నిఘా నేత్రాలన్నీ రాష్ట్రస్థాయి కేంద్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతాయి. క్లౌడ్‌ ఆధారిత సీసీ కెమెరాలు.. 24 గంటలూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలకు వీడియో సహిత సమాచారాన్ని చేరవేస్తాయి కాబట్టి నేరాలకు అడ్డుకట్ట పడుతుంది.
Link to post
Share on other sites
 • 1 month later...
 • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...